రాజమౌళి సినిమాలన్నిటికీ ఫ్యామిలీ ప్యాక్ కింద విజయేంద్ర ప్రసాద్ (కథ) , కీరవాణి (మ్యూజిక్), రాజమౌళి(డైరెక్షన్) కలిసి పనిచేస్తుంటారు. లేటెస్ట్ గా కాస్ట్యూం డిజైనింగ్ రమారాజమౌళి కూడా జాయిన్ అయినట్టునారు.
కె.విజయేంద్రప్రసాద్ చాలామందికి తెలుసనుకుంటా. సమరసింహారెడ్డి, యువరత్న రాణా, సింహాద్రి (లేటెస్ట్ గా మగధీర) లాంటి సినిమాలకి కథ అందించిన రైటర్. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్టర్ అయిన కొత్త లో అన్నారు – “రాజ మౌళి అంటే ఎవరో కాదు ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కొడుకే” అని. అవునా పర్లేదే అనుకున్నాను..కానీ మరి కె. విజయేంద్రప్రసాద్ కొడుకైతే కె.రాజమౌళి అవ్వాలి కదా ఎస్.ఎస్. రాజమౌళి ఏంటి? అని చిన్న సందేహం వచ్చింది..సర్లే అని వదిలేస్తే..తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ‘M.M’. కీరవాణి ఇంటర్వ్యూ లో చెప్పాడు..’K’. విజయేంద్రప్రసాద్ తన సొంత బాబాయ్ అని..అంటే..’M.M’. కీరవాణి వాళ్ళ నాన్న గారి సొంత తమ్ముడన్నమాట ‘K’. విజయేంద్రప్రసాద్…మరి అప్పుడు ఈయన ‘K’.కీరవాణి అన్నా అవ్వాలి ఆయన ‘M.M’.విజయేంద్రప్రసాద్ అన్నా అవ్వాలి….ఏంటీ ట్విస్ట్ మీద ట్విస్ట్ అనుకుంటే, ఈ లోగా మళ్ళీ ‘M.M.’ శ్రీలేఖ అటుపక్క. ఈమె ఏమో కీరవాణి గారి చెల్లెలు..పోనీలే ఈమె మళ్ళీ మన మెదడుకి మేత వేయకుండా ఎం.ఎం.కీరవాణి చెల్లెలు కాబట్టి ఎం.ఎం.శ్రీలేఖ గానే వచ్చ్చిందని సంతోషించా. ఈ ధర్మ సందేహం 🙂 చాలా రోజులు అలాగే ఉండిపోయింది.
తర్వాతెప్పుడో తెలిసింది..కె.విజయేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారి ఫాదర్ అన్నదమ్ములు. ఆ లెక్కన కీరవాణి గారి ఇనిషియల్ కూడా “కె”. అయితే “మరకతమణి” అనేది కీరవాణి గారి లక్కీ స్టోన్. కాబట్టి పేరు లో దీన్ని కలుపుకుంటే కలిసి వస్తుంది అని ఆయన తన ఇనిషియల్ “ఎం.ఎం” అని పెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీ లో కి వచ్చిన శ్రీలేఖ తాను కీరవాణి చెల్లెలు గా ఇండస్ట్రీ లో కి వచ్చింది కాబట్టి ఆ గుర్తింపు ఆమె కి అవసరం కాబట్టి (ఈమె లక్కీ స్టోన్ “మరకతమణి” కాకపోయినా కూడా) తన పేరు కి ముందు “ఎం.ఎం.” తగిలించుకుంది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ లో కి వచ్చిన రాజమౌళి గారు తనకి కలిసి రావాలని పేరుకి ముందు “ఎస్.ఎస్.” అని పెట్టుకున్నాడట. మరి అది ఈయన లక్కీ స్టోనో, న్యూమరాలజీ యో, గ్రాఫాలజీ యో, ఫెంగ్ షుయి యో మనకి తెలీదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. జనరల్ గా సినిమా వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు కొంచెం ఎక్కువని అంటుంటారు..నిజమే మేస్టారూ..కానీ కొంచెం కాదు కిలోమీటర్ ఎక్కువ!!
కొసమెరుపేమిటంటే- ఈ మధ్య రాజమౌళి గారి వైఫ్ రమ గారు రాజమౌళి సినిమాలన్నిటికి కాస్ట్యూం డిజైనర్ గా చేస్తున్నారు. ఈసారి ఈమె పేరు కూడా టైటిల్స్ లో వస్తుంది అన్నపుడు.. “ఓర్నాయనో ఈమె మళ్ళీ ఏం ట్విస్ట్ ఇస్తుందో” అని చూసా…సేఫ్ సైడ్ – “రమా రాజమౌళి” అని వేసుకుంది టైటిల్స్ లో ఇనిషియల్ ఏమీ లేకుండా 🙂 !!!!
Additional information: Keeravaani’s wife and rajamouli’s wife are own sisters. Dialogue writer Rathnam is also part of this family pack.
—Yahoo
By: yahoo on 2009/07/04
at 2:19 సా.
హ హ హ. భలే వారండీ మీరు, సినిమా బాంధవ్యాల్లో రీజనింగులెతుకుతున్నారు. అన్నట్టు రమారాజమౌళిగారి పేరు ఇంతకు ముందే తెరకెక్కినట్టు గుర్తు, సమర్పకురాలిగానో అలాంటిదేదో.
By: కొత్తపాళీ on 2009/07/04
at 4:23 సా.
ఇన్ని చుట్టరికాలు తీరిగ్గా ఎలా ఆలోచించగలిగారు అసలు మీరు? ఇవన్నీ రోజూ చూసే విషయాలే అయినా మీరు రాశాక “అవును, పాయింటే” అనబుద్ధేస్తోంది. భలే ఉంది మీ టపా!
By: సుజాత on 2009/07/04
at 7:33 సా.
forgot kalyani malik?
By: sriram velamuri on 2009/07/04
at 8:26 సా.
మగధీర ఆడియో రిలీజ్ ఫంక్షనులో MM gaaru SS gaarini తన స్వంత తమ్ముడు అని చెప్పినప్పటి నుంచి ఉన్న సందేహాలను మీరు తీర్చేశారు, Thanks.
By: nuvvusetty brothers on 2009/07/09
at 7:50 సా.
Abbo baagane kanipettaru ee perla golani…nenu cine industry ilanti pichi centiments ekkuv ani..
By: Reddy Prasad on 2009/07/09
at 9:05 సా.
ఈ పేకేజీలో ఇంకోకాయన కూడా వుంటారు.ఆయన పేరు గుర్తులేదు కానీ అమృతం టీవీ సీరియల్లో మంచి కామెండీ చేసేవారు.ఆయన మాటలు రాస్తారట రాజమౌళి సినిమాకి.
రమా రాజమౌళి చత్రపతి సినిమా నుండీ పేరు వేయించుకుంటున్నారు.
By: radhika on 2009/07/09
at 10:29 సా.
baagundi blog………………nice………….
By: vinay chakravarthi on 2009/07/15
at 9:45 ఉద.
paina comments rasina vaalla meeda ottu(tamaasaki), ee samasya tho nenu na room mates chala kaalam ga satamatamoutunnam, yedo choostunte mee blog, andulo samayapooranam kanipinchindi, thanx, mammalni sandigdha bandha vimuktulni chesaru, kaasta aa “SS” katha kuda vipparanukondi, mee meeda ottu, mee runam marchiponu, inko comment roopam lo teerchukuntanu
By: sunnygadu on 2009/07/23
at 8:00 సా.
సన్నీ..నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, ఏదో ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి ఆ SS కమామీషు చెప్పకపోతాడా అని. ఇప్పటిదాకా అయితే ఎక్కడా చెప్పినట్టు జాడ లేదు నాకు తెలిసినంత వరకు. అతను చెప్పేంతవరకూ మనకీ సస్పెన్స్ థ్రిల్లర్ తప్పదు.. 😀
By: mohanrazz on 2009/07/23
at 8:12 సా.
maroka samasya, MM sri lekha peru mani mekhala srilekha, deeni bhavamemi mohana, na neyyamu cheppina pidapa telisinadi, V Vijayendra prasad anta kada, veeri janakudu kadu chaandasuni vale unnaru.
satya sodhanalo,
sunny gadu
By: sunnygadu on 2009/07/23
at 11:43 సా.
సన్నీ..నేనూ చూసాను – వి. విజయేంద్రప్రసాదే! అయినా, MM, SS, కానప్పుడు వి అయితే ఏంటి, కె అయితే ఏంటి అని వదిలేసా. శ్రీలేఖ పేరు మణిమేకల నా? ఇదింకో రకం స్టోనా? ఏమో. ఇంకో విషయం ..మొన్ననే ఆడియో ఫంక్షన్ లో కీరవాణి చెప్పాడు. మగధీర సినిమా లో రాజులకాలం ఫ్లాష్ బ్యాక్ లో రాం చరణ్ పేరు “కాలభైరవ” అట. అది కీరవాణి కొడుకు పేరు అట. ఏంటో వీళ్ళ పేర్లు అన్నీ కొంచెం వెరైటీ గా ఉన్నాయి.
By: mohanrazz on 2009/07/24
at 10:23 ఉద.
ఓ చోట చదివేనో, లేక ఇంటర్వ్యూ లో విన్నానో: వారింటి పేరు “కోడూరి” వారు. ఎస్ ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి. కోడూరి అని రాసుకోవడం, సౌకర్యార్థం కేవలం మినహాయించేరట. కీరవాణి ముందు పేరు మరకత మణి అయితే, శ్రీలేఖ ముందు పేరు “మణి మేఖల” ట! మిగతాది చర్విత చరణమే!
By: శ్రీనివాస్ on 2012/12/20
at 9:05 సా.
వీళ్ళంతా కోడూరి వారు. కీరవాణి గారికి తమిళం లో పేరు సూట్ కావడం లేదని ఒక దర్శకుడు మరకతమణి తగిలించారు. అలాగే రాజమౌళి కి శ్రీశైలశ్రీ పేరు లో భాగమే కానీ ఇంటి పేరు కాదు. శ్రీలేఖ కి తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ (నిర్మాత) మణిమేఖలే అని తగిలించారు ట. ఇవన్నీ స్వయంగా శ్రీలేఖ చెప్పిన ముచ్చట్లే.
http://www.abnandhrajyothy.com/mm-srilekha-open-heart-with-rk.html
By: bkrmaadhav on 2012/12/21
at 10:04 సా.
yeah…thanks for the link 🙂 but this post was written and posted way back in July-2009 when there was not much info on this…and recently Sreelekha clarified all this 🙂
By: mohanrazz on 2012/12/22
at 10:16 ఉద.