వ్రాసినది: mohanrazz | 2011/09/15

WHO WILL CRY WHEN YOU DIE by Robin Sharma లో :)

                                   

రాబిన్ శర్మ వ్రాసిన The Monk who sold his ferrari నాకు పెద్దగా నచ్చలేదని ఇంతకు ముందోసారి వ్రాసేను. అయితే WHO WILL CRY WHEN YOU DIE అని ఇంకో పుస్తకం ఉంటుంది ఆయనదే, పాకెట్లో పెట్తుకుందామంటే పెద్దగా- చేతిలో పట్టుకుందామంటే చిన్నగా -అయేలా అంతే అంత ఉంటుందీ పుస్తకం. అది నవల కాదు, కథ కాదు, సెల్ఫ్ హెల్ప్ పేరిట పెద్ద స్పీచిలివ్వడాలూ ఉండవు కానీ ఒక 150 చాప్టర్లు, ఒక్కొక్కటీ ఒక్కొక్క పేజీ ఉంటాయి..ఏవో చిన్న చిన్న మంచి విషయాలు కొన్ని చెబుతూంటాడు..అందులో దాదాపు 85% మనకి తెలిసినవే ఉంటాయి కానీ ఇలాంటి పుస్తకాలు తీసుకున్నపుడు – 99% తెలిసిన విషయాలే ఉన్నా పర్లేదు ఒక్కటి మన బుర్ర ని కొంచెం “స్టిర్” చేసే పాయింటున్నా గిట్టుబాటైనట్టే కదా అని తీసుకుంటూంటాను. ఆ రకంగా చూస్తే ఇది నాకు గిట్టుబాటైన పుస్తకమే!-

 
ఇందులో చెప్పే విషయాలన్నీ చిన్న చిన్న విషయాలే- వారం లో ఐదు అరగంటలైనా జిం కి వెళ్ళు, జీవిత కాలం మొత్తం మీద కనీసం ఒక మొక్కనైనా పెంచి అది రోజూ పెరిగి పెద్దవడాన్ని చూస్తూ ఆస్వాదించు, Be kind to a stranger, నీకేదైనా ఒక సమస్య వచ్చి ఏం చేయాలో తోచకపోతే నీ రోల్ మోడెల్ అయిన మహనీయుడెవరైనా అదే సమస్యలో ఉంటే ఎలా ప్రతిస్పందిస్తాడో ఊహించి నువ్వూ అలానే స్పందించడానికి ట్రై చేయి..ఇలాంటివన్నమాట! మరీ రొటీన్ గా మైక్ పెట్టుకుని చెవిలో పోరినట్టు కాకుండా కొంచెం ఆసక్తికరంగా ఒక్కోసారి కొన్ని పిట్ట కథలతో తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తూ ఉంటాడు. ఈ పుస్తకం లో ‘పాజిటివ్ థింకింగ్’ గురించి చెబుతూ ఒక చిన్న కథ ఉంటుందిలాగే-

ఒక హాస్పిటల్లో ఒక రూం లో ఇద్దరు పేషెంట్స్ బెడ్ మీద  ఉంటారు కదలలేని స్థితి లో. రోజుల తరబడి అలాగే కదలకుండా బెడ్ మీద ఉండటం తో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతూంటారు. జీవితం లో ఇంకా ఎంత కాలం అదే బెడ్ మీద అలాగే ఉండాలో వాళ్ళకే తెలీదు. నిరాసక్త జీవితం గడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళలో ఒకతని బెడ్ ప్రక్కన కిటికీ ఉంటుంది. అతను రోజూ కిటికీలోనుంచి బయటికి చూస్తూ అక్కడ జరుగుతోంది ప్రక్కనతనికి చెప్తూ ఉంటాడు. చిన్న చిన్న పిల్లలు గులాబీ పూలు పట్టుకుని వెళ్తున్నారనీ, బయటంతా పచ్చదనం ఆహ్లాదంగా కనిపిస్తోందనీ, ఒక అబ్బాయి, అమ్మాయి కేరింతలు కొట్టుకుంటూ వెళ్తున్నారనీ – ఇలా అన్నీ వర్ణిస్తూ చెప్తూంటాడు. అయితే ఈ రెండో అతనికి – అరె, ఆ కిటికీ ప్రక్క సీట్ మనకి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అతని మీద జెలసీ పెరుగుతుంది. అది పెరిగీ, పెరిగీ విపరీతంగా పెరిగిపోయి- ఒకరోజు అతని ఆక్సిజన్ సిలిండర్ కి తనవైపునున్న వాల్వ్ ఏదో మూసేసి అతను చనిపోయేలా చేస్తాడు. అతను చనిపోయి బెడ్ ఖాళీ అయ్యాక- నర్సునడిగి ఆ బెడ్ కి తను షిఫ్టవుతాడు. షిఫ్టయ్యాక కిటికీలోనుంచి చూస్తే అవతల ఒక పెద్ద గోడ తప్ప ఇంకేమీ కనబడదు. అంటే ఇంత కాలం అతను ఆ మట్టిగోడనే చూస్తూ కూడా తమ ఇద్దరి జీవితల్లోని నిరాసక్తత పోగొట్టడం కోసం మంచి మంచి సంఘటనలు ఊహించి అవి అక్కడ జరుగుతున్నట్టు తనకి చెప్పేవాడని అర్థమై పశ్చాత్తాపపడతాడు, జీవితం లో పాజిటివ్ థింకింగ్ అలవరచుకుంటాడు.-

 
మంచి కథ. బాగుంది. అయితే అప్పట్లో ఫ్రెండ్స్ అంతా- బ్యాచిలర్స్ ఒక రూం లో ఉన్నపుడు – ఎలా ఉంటుందంటే – ఎవరైనా ఒకటి చెబితే ప్రక్కనున్న వాళ్ళు అది నచ్చినా నచ్చకపోయినా ఏదో సెటైర్ వేస్తుంటారు. సీరియస్ గా ఏదో సెటైర్ వేసేద్దాం అన్న ఉద్దేశ్యం ఉండకపోయినా జస్ట్ సరదాకి అన్నమాట. మరి, ఏ సెటైరూ వేయకుండా ఒకరు చెప్పింది ఒకరు వింటూ ఉంటే డిస్కషన్స్ ఎట్టా జరుగుతాయి, టైం పాస్ ఎట్టా అవుతుంది 🙂 ? ఈ కథ చదివిన రూం మేట్ కి బాగా నచ్చి, ప్రక్కనున్న అతనికి చెప్తే అతనన్నాడు 🙂 – –

“దీన్ని బట్టి నాకొకటి అర్థమయింది గురూ- అందుకే అలా ఎగస్ట్రా లు చేసి మరీ ప్రక్కనున్న వాణ్ణి ఆనందింపచేద్దాం అని ఎప్పుడూ ట్రై చేయకూడదు…మర్యాదగా అక్కడ గోడ ఉందని ఉన్నదున్నట్టు చెప్పిఉంటే ఇట్టా జరిగేది కాదు గా….మనకి కిటికీ లేకపోయినా ప్రాబ్లెం లేదులే అని ఆడికో శాటిస్‌ఫాక్షన్ ఉండేది…రోజు కో కొత్త స్క్రిప్ట్ తయారు చేసి ఆడికి చెప్పే బాధ ఈడికి తప్పేది….ఆడి బాధలు ఈడు ఈడి బాధలు ఆడూ వింటూ అట్టా కాలం గడిపేసే వాళ్ళు- ఇప్పుడు చూడు అనవసరంగా ఆడి జెలసీ ని రెచ్చగొడితే పరిస్థితి ఇట్టా తయారయింది..కాబట్టి ఎప్పుడూ అలా ఎగస్ట్రాలు చేయకూడదు అనేది ఈ కథలో నీతి…ఏటంటావ్ 😀  ??” ఇంకేటంటాడు- “మీరు మారరు రా” అని వదిలేశాడు.-


స్పందనలు

  1. hahhahah nice comment by ur ur friend………

    • ఎయ్య్య్ వినయ్ చక్రి నువ్వు మళ్లీ తెలుగు లో రాస్తున్న్నావ్ కామెంట్ లు ఇదేం బాలేదు దారికి వచవు అనుకుంటే బంతి పోస్ట్ కి తెలుగావ్ 🙂

  2. పాపం నిజమే చెప్పినట్టునాడు…

  3. //ఏ సెటైరూ వేయకుండా ఒకరు చెప్పింది ఒకరు వింటూ ఉంటే డిస్కషన్స్ ఎట్టా జరుగుతాయి, టైం పాస్ ఎట్టా అవుతుంది.
    అవును. పూర్తిగా ఏకీభవించను. కొన్నిసార్లు అవతలి వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలి. రెండిటి మధ్య సమన్వయం మేలు. 🙂
    // ఉన్నదున్నట్టు చెప్పిఉంటే ఇట్టా జరిగేది కాదు గా….
    ఇక్కడ మీ స్నేహితుని అభిప్రాయం సరైనదిగానే తోస్తుంది.

    • రెండిటి మధ్య సమన్వయం మేలు. >>> perfect 🙂

  4. హ హ హ …
    ఈ స్టొరీ లో అంతగా చూడాలనుకుంటే వాడే ఆ బెడ్ దగ్గరకి వెళ్లి చూడోచుగా..ఆక్సిజన్ తో చంపేసేవాడు ఆ మాత్రం తల పైకి ఎత్తలేడా? వాడేమైనా సీతయ్యా? 🙂

    సౌమ్యా! మధ్యాహ్నం 1.00 టైం

    • నాకు పని పాట లేదనుకున్నావా?
      అయినా నువ్వు అడిగినప్పుడు రాయను, నాకు నచ్చినప్పుడు రాస్తా 😀

  5. మీకు నచ్చిన ఆ కథను నేను మనసు కిటికీ పేరుతో ఈ మధ్యనే నా బ్లాగులో రాశాను. చూశారా?

    • మిగతా పోస్టులు చదివా కానీ ఎందుకో ఈ పోస్ట్ మిస్సయ్యా. ఇప్పుడే చదివా… 🙂

  6. FULL VERSION of the story:

    http://ravichandrae.wordpress.com/2009/08/27/%e0%b0%ae%e0%b0%a8%e0%b0%b8%e0%b1%81-%e0%b0%95%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%80-%e0%b0%95%e0%b0%a5/

  7. నాకైతే అతను కావాలనే జెలసీని రెచ్చగొట్టాడని అనిపిస్తు౦ది. ఏమ౦టారు?

  8. Already I had read this story .In that, the storytelling patient’s death is natural not preplanned.In that situation the story becomes hearttouching not a crime…In that way also the criminal released the friend from the worstcondition of lying on the hospital bed.so for his good heart , he received the fruit of freedom from this world.The criminal was punished both ways; to lose his friend & regret for his sin

  9. story lite..reality ki dooramgaa undi. kani me roommate respose maatram sarigga undi. prati room lonu inte anukunta 🙂

  10. ఈ కథ ని రవిచంద్ర, అంతర్వాహిని లో రాసేసారు. ఈ కథ చదివాక ఇలాంటి ఆలోచనైతే నాకు రాలేదు సుమీ !!!
    అయ్యో అని బాధపడ్డాను. కాకపోతే మీ ఫ్రెండు చెప్పినదాన్లో నిజం లేకపోలేదు అనిపిస్తున్నాది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: