వ్రాసినది: mohanrazz | 2011/09/16

తెలుగు సినిమా వెబ్ సైట్లు – ఎంత సంపాదిస్తాయి?

పొద్దులో గార్లపాటి ప్రవీణ్ గారి వ్యాసం , రేరాజ్ బ్లాగ్ లోని వ్యాసం– తెలుగు బ్లాగులకి మానెటైజ్ చేయడం గురించి- చదివాక ఇది వ్రాస్తున్నాను. అయితే ఇది తెలుగు బ్లాగుల గురించి కాదు తెలుగు సినిమా సైట్ల గురించి.

 

ఐదారేళ్ళ క్రితం idlebrain, nonstopcinema లాంటి ఒకట్రెండు సైట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు పదుల సంఖ్య లో ఉన్నాయి. idlebrain జీవి బిట్స్ పిలానీ ఇంజినీరింగ్ చదివి ఆ తర్వాత ఐటీ లో పని చేసి- ఆ తర్వాత ఈ సైట్ ని నమ్ముకుని జాబ్ వదిలేసుకున్నానని చెప్పుకుంటాడు. ఇప్పటికి పదేళ్ళయింది ఆ సైట్ పెట్టి. ఐతే ఆయన జాబ్ వదిలేయడం వల్ల నష్టపోయిందేమీ లేదంటారు కొందరు. idlebrain సంపాదన నెలకు లక్షల్లోనే అని ఇంటర్నెట్ డిస్కషన్ బోర్డుల్లో ఒక రూమర్. idlebrain తర్వాత ఇంటర్నెట్ లో అతి ఎక్కువ మంది చూసే సినిమా వెబ్ సైట్ greatandhra. గత ఐదారేళ్ళలో విపరీతంగా వ్యూయర్షిప్ సంపాదించుకున్న సైట్ ఇది. idlebrain తో పోలిస్తే (మిగతా ఏ ఇతర తెలుగు సినిమా వెబ్ సైట్ తో పోల్చినా ) per day పోస్ట్స్ ఇందులో ఎక్కువ. ఇది వట్టి గాసిప్ సైట్, గ్యాస్ సైట్ అని తిట్టే వాళ్ళు కూడా దీనికి చాలా ఎక్కువ. కానీ తిట్టిన వాళ్ళెవరూ దీన్ని చూడటం మానరు. టివి9 ని తిడుతూనే పొద్దస్తమానం మళ్ళీ టివి9 ని చూడటం లాంటిదన్నమాట. ఎంబీయస్ లాంటి పాత్రికేయులని తీసుకొచ్చి వాళ్ళతో కూడా కొన్ని ఆర్టికల్స్ వ్రాయిస్తుంటారు ఈ సైట్ లో. ఈ సైట్ నెలసరి ఆదాయం కూడా లక్షల్లోనే అని అంటారు మరి . అది ఎంతవరకు నిజమో చెప్పలేను కానీ దాదాపు idlebrain కి సరిసమానంగా ఉంటాయి హిట్స్ దీనికి. పూర్తి స్థాయి లో ఎంతవరకు నమ్మవచ్చో చెప్పలేను కానీ – http://statbrain.com/ లెక్కల ప్రకారం eenadu.net ని రోజూ చదివే వాళ్ళు సుమారు ఏడు లక్షలు. idlebrain ని రెండులక్షల ఎనభై ఒక వేలు, greatandhra.com ని రెండులక్షల డెబ్బైతొమ్మది వేల మందీ చదువుతున్నారు. ఇక మిగతా అన్ని తెలుగు సినిమా సైట్లకి యాభైవేల లోపే ఉన్నారు వీక్షకులు. idlebrain, greatandhra -ఈ రెండింటి తర్వాత అంత ఎక్కువ వ్యూయర్ షిప్ ఉన్న సైట్స్ telugucinema.com, తెలుగుపీపుల్, ఆంధ్రకేఫ్ . వీళ్ళు ఎంతవరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారో నాకు తెలీదు. నంది అవార్డుగ్రాహెత ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు ఇన్వాల్వ్ అయిఉన్న సినీగోయర్ సైట్ నైతే అమ్మేశారని విన్నాను-నిజమెంతో తెలీదు.

 

idlebrain పూర్తిగా ఇంగ్లీష్ లో వ్రాయడం వల్ల గూగుల్ యాడ్స్ ప్రాబ్లెం ఉండకపోవచ్చు కానీ మిగతా తెలుగు సైట్లకి గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బు రావాలంటే కష్టమే. ఎందుకంటే శుభ్రంగా తెలుగులిపి లో వ్రాసే సైట్లుండగా ఇంగ్లీష్ లిపి లో ఉండే సైట్లెందుకు చదువుతారు అదే న్యూస్ కోసం. కానీ తెలుగు లిపి లో వ్రాస్తే గూగుల్ యాడ్స్ నుంచి పైసలు రావు. అందుకే గ్రేటాంధ్ర వాళ్ళు సగం ఇంగ్లీష్, సగం తెలుగు తో మెయింటెయిన్ చేస్తుంటారు.   

 

కొంతమంది NRI లు ఈమధ్య తెలుగు సినిమాలు విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం మొదలెట్టారు. వీళ్ళలో ఎంతమంది లాభాలు సంపాదించారు అని చూస్తే చాలాతక్కువ- సినిమా హిట్టయినప్పటికీ. ఎందుకంటే సినిమా కొనేవాళ్ళలో చాలా మంది ఈ సినిమా తోనే సంపాదించుకుందామని కాకుండా సినిమావాళ్ళతో పరిచయాలు పెంచుకుందామనో లేక పరిచయం పెరిగితే తమ సినిమా కోరికలు తీర్చుకోవచ్చనో కొంటారు, కొంచెం రేటెక్కువైనా సరే అని. తీరా సినిమా హిట్టయినా వీళ్ళు పోసినన్ని డబ్బులు రావు. సినిమా వెబ్ సైట్ లు నడిపే వాళ్ళూ ఇంతే. లాభాలు వచ్చినా రాకపోయినా- సైట్ నడపాలనే “దుగ్ధ” తో సైట్ నడిపేవాళ్ళే ఎక్కువంటారు కొందరు. అయితే ఈ మధ్య మా టీవీ, టివి9 లాంటి ఛానెల్స్ లో రెగులర్ గా కొన్ని రోజులు స్క్రోలింగ్ ఇచ్చి మరీ సైట్ ప్రారంభించారు కొందరు. చిరంజీవి చేతులమీదుగా ప్రారంభించారు ఇంకొక సైట్ ఓ నాలుగు నెలల క్రితం. వాటిలో కొన్నింటి హిట్స్ వెయ్యి కూడా లేవు, కొన్నింటికి వంద కూడా లేవు, ఒకట్రెండు సైట్స్ కొంచెం పర్లేదు. మరి సినిమా సైట్ల పరిస్థితే ఇప్పటికీ ఇలా ఉంటే  బ్లాగులకి ఆదాయం అనేది సుదూరస్వప్నమే అనుకుంటున్నా ప్రస్తుతానికైతే!


స్పందనలు

  1. మరి చిరంజీవి నాగార్జున నందమూరి ఫాన్స్ వెబ్ సైట్స్ సంగతి సరే సరి ..అంతా దుగ్ధ..మంచి పోస్ట్

  2. mmmmmm

  3. Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

    Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

    Click here for Install Add-Telugu widget

  4. తెలుగు లో వ్రాస్తే యాడ్స్ రాకపోతే గులుతె లో వ్రాయిస్తే సరి.

    ” బ్లాగులకి ఆదాయం అనేది సుదూరస్వప్నమే అనుకుంటున్నా ప్రస్తుతానికైతే!”

    లెస్స పలికితిరి

  5. వెబ్సైట్లు డబ్బులు అర్జించడానికి పెడితే, బ్లాగులు వ్యక్తిగత అభిప్రాయాల్ని చెప్పుకోవడానికి రాసుకుంటాం.

    ఉద్దేశమే వేరైనప్పుడు రెవెన్యూ మోడల్ ఒకటి ఎలా అవుతుంది? బ్లాగుద్వారా మనకొచ్చే రెవెన్యూ మన అభిప్రాయాలకు వచ్చే స్పందనలు, ప్రశంశలు,విమర్శలు. అంతకన్నా ఆశించడం అవసరమా!

  6. ఈ రామ్ మీద ఒక పోస్ట్ ఎవడు రాస్తాడో ఏమంటారు మోహన్రాజ్ గారు

  7. what about http://www.indiaglitz.com
    alexa – Traffic rank is – 1803
    idlebrain – traffic rank – 2026
    in tamil and telugu indiaglitz.com website is best

  8. మీరు http://www.andhravilas.com ని మర్చిపోయినట్లున్నారు. నేను ఎక్కువ దీనినే చూస్తుంటాను. 🙂

  9. మోహన్ రాజ్,

    నేను మీ బ్లాగ్ ని ప్రతి దినము చూస్తూవుంటాను.మీరు రాసిన అన్నీ విషేషాలు చదివాను చాలా బావుంటాయి మోహన్.మీ ఒక స్నేహితుడు గిరిధర్ రాజు “కెరటం” రాశారని చెప్పారు అతని క్లాస్మేట్ అమెరికా లొ నా సహోద్యోగి.అతని పేరు ఈశ్వర్ రాజు.మీ బ్లాగ్ ఇతనికి చూపించాను.బ్లొగు లొని కొన్ని మి కాలేజ్ కబుర్లు అన్నీ మీరు చెప్పినట్టుగా నేను చెప్ప..చాలా సంతొషపడ్డాడు.మీరు ఇలాగే అద్భుతంగా రాస్తూ వుండాలని కోరుకుంటూ..

    మాది ప్రొద్దుటుర్ కడప జిల్ల..మీ ఈ మైల్ ఇవ్వండి వీలైతే..

    చంద్ర

  10. hmmm

    ee sites seperate ga maintain cheytam kanna
    blogspot lo host cheskunte ekuva revenue vasthadhiii

  11. మొదట్లో తెలుగుసినిమా డాట్ కామ్ ఒకటే ఉండేది – 1998 మధ్యకాలంలో. అమెరికాలో కొందరు ఔత్సాహిక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సరదాగా నడుపుతుండేవారు దాన్ని. దాన్ని వ్యాపారంగా మలచుకుంటే బాగుంటుందన్న ఆలోచనల్ జీవికి వచ్చింది మొదట. 1999లో అనుకుంటా, అతను తెలుగుసినిమా నుండి విడిపోయి ఐడిల్‌బ్రెయిన్ పెట్టాడు. అప్పట్లో ఈ రెండు సైట్ల మధ్యా చిన్నపాటి యుద్ధం కూడా నడిచింది. తర్వాతెప్పుడో ‘తెలుగుసినిమా’ కూడా వ్యాపార ధోరణిలోకి వచ్చినా, అప్పటికే ఆలస్యమైపోయింది.

  12. nice article

  13. Hello Sir,

    I have recently started a Telugu news portal. ఏదైనా సూటిగా…సుత్తి లేకుండా…చెప్పాలని. ఈ వెబ్ సైటెను పాపులర్ చెయ్యలంటె ఎమిచెయ్యలొ దయచేసి తెలియచెయ్యండి please.

    Website: http://www.apreporter.com
    (AP Reporter.com)

    Best Regards,
    Jyothi

  14. […] […]

  15. చాలా విషయాలు తెలుసుకున్నాను, థాంక్స్…….
    http://www.64kalalu.com


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: