చేతన్ భగత్- ఐఐటి లో బిటెక్, ఐఐఎం లో ఎంబిఏ చేసి, హాంగ్ కాంగ్ లోని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఆ తర్వాత మొదటి సారిగా “Five point someone’ అనే నవల వ్రాసాడు. అది బంపర్ హిట్ అవడం తో ఆ తర్వాత ‘One Night at call centre’ అనే రెండో నవల వ్రాసాడు. దాని తర్వాత మూడోది- ‘3 mistakes in my life’ ఇక లేటెస్ట్ గా ‘Two states’ అనే నాలుగో నవల వ్రాసాడు. మొదటి నవల ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఆధారంగానే ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ‘3 Idiots’ సినిమా రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. ఇక రెండో నవల వన్ నైట్ అట్ కాల్ సెంటర్ ఆధారంగా తీసిన హిందీ సినిమా, సల్మాన్ ఖాన్ నటించిన ‘Hello’ అట్టర్ ఫ్లాప్ అయింది. సరే జయాపజయాల సంగతి ప్రక్కన పెట్టి- అసలు ఈ నవలల కథాకమామీషు ఏంటో చూద్దాం.
1. FIVE POINT SOMEONE:
కథ ఏంటి?
ఐఐటి లో ఇంజనీరింగ్ జాయినైన ముగ్గురు కుర్రాళ్ళు. ఒకడు బాగా రిచ్ బ్యాక్ గ్రౌండ్, ఒకడు యావరేజ్ మిడిల్ క్లాస్, ఒకడు లోయర్ మిడిల్ క్లాస్. ఐఐటి లో సీట్ వచ్చిందంటే ముగ్గురూ బాగా తెలివైన, చురుకైన కుర్రాళ్ళే. అయితే ఐఐటి లో సీట్ వచ్చాక వాళ్ళు ముగ్గురూ తమ చదువుల్ని ఖరాబు చేసుకోవడం, ఒకడు తమ ప్రొఫెసర్ కూతురు అయిన అమ్మాయిని లవ్ చేయడం, ఒకానొక టైం లో ఐఐటి లో పరీక్ష పేపర్ దొంగిలించడానికి ప్రయత్నించి దొరికి పోవడం, జీవితం నాశనమైందన్న బాధ తో ఒకబ్బాయి ఆత్మహత్యాయత్నం చేయడం దాకా వెళ్ళడం..చివరలో మళ్ళీ గాడి లో పడి అన్నీ సెట్ అవడం..ఇదీ స్థూలంగా కథ. అయితే ఇందులో పాఠకుల్ని ముగ్ధుల్ని చేసేది కథ కాదు..దాన్ని నడిపిన తీరు..నవల ఆసాంతం ఒక రకమైన wit, humour తో కొన్ని ఎక్సలెంట్ సెటైర్స్ తో కథని నడపడం. అసలు బిగినింగే- ఒక ప్రొఫెసర్ క్లాస్ కి వచ్చి ‘Machine’ కి డెఫినిషన్ ఇవ్వమని స్టూడెంట్స్ ని అడిగితే స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి తోచిన డెఫినిషన్స్ చెప్తూంటే ఆయన అన్ని నిర్వచనాలకీ వంకలు పెట్టి ఒక సింపుల్ మరియు ఎక్సలెంట్ డెఫినిషన్ చెప్పడం..ఒక స్టుడెంట్ ఆ డెఫినిషన్ ని చీల్చి చెండాడి దశాబ్దాల ఎక్స్ పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇగోనే చావుదెబ్బతీసే ఇంటెర్స్టింగ్ సీన్ తో బిగిన్ అవుతుంది.
బాగున్నవేంటి, బాగోలేనివేంటి-
Obviousగా చేతన్ భగత్ wit, sense of humour, పరుగులుపెట్టించే నేరేషన్- ఇవీ బాగున్నవి. కాకపోతే కథ ఐఐటీ నేపథ్యం కాబట్టి ఆ ఇంజనీరింగ్ క్లాసులు, ఆ ర్యాగింగ్ సన్నివేశాలు, ఆ ప్రొఫెసర్లు..మాగ్జిమం ఇంజనీరింగ్ ఓరియెంటేషన్ ఉండటం వల్ల మిగతా వాళ్ళకి కొన్ని చోట్ల ‘నస ‘ అనిపిస్తుందేమోనని నా డౌట్. కానీ ఇదేమంత పెద్ద నెగటివ్ కాదనుకుంటా.
టైటిల్ జస్టిఫికేషన్-
ఐఐటి లో ప్రతి సబ్జెక్ట్ కీ CGPA(Cumulative Grade Point Average) 10 స్కేల్ మీద ఇస్తారు. సబ్జెక్ట్ టాపర్ కి 10 కి 10 ఇచ్చి మిగతా వాళ్ళకి రిలేటివ్ గా ఇచ్చినా దాదాపు అందరూ హీనపక్షం 6 పాయింట్స్ పైనే తెచ్చుకుంటారు. అయితే ఎవడికైనా 5 కి 6 కి మధ్య అంటే ఏ 5.34 లేదా 5.46 అలా వస్తే ఆ గ్రేడ్ ని మాటల్లో ఫైవ్ పాయింట్ సం థింగ్ అంటారు కాబట్టి గ్రేడ్ 5 కి 6 కి మధ్య వచ్చిన వాడు ఫైవ్ పాయింట్ సం వన్ అవుతాడన్నమాట 🙂
ఇతరత్రా-
అమీర్ ఖాన్ తీస్తున్న 3ఇడియట్స్ సినిమా ఫైవ్ పాయింట్ సం వన్ ఆధారంగా అన్నారు. అయినా అమీర్ ఖాన్, మాధవన్ లాంటి వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ గా 20 ఏళ్ళ కుర్రాళ్ళ పాత్రలు చేస్తున్నారా?? కాకపోవచ్చు. మరి ఐఐటి నేపథ్యాన్ని తీసివేసి కథని వీళ్ళకోసం మారుస్తున్నారా? అయినా ఈ నవల లోనుంచి ఐఐటీ నేపథ్యాన్ని, ఆ కాలేజీ సన్నివేశాల్నీ తీసివేస్తే మిగిలేది కవర్ పేజీలు మాత్రమే. చూడాలి ఈ 3 ఇడియట్స్ పరిస్థితి ఏంటి అనేది..
2. One night @ the call center
కథ ఏంటి?
కొంతమంది కాల్ సెంటర్ ఎంప్లాయీస్. అమ్మాయిలు, అబ్బాయిలు. అందరిలోనూ ఒకరకమైన డిప్రెషన్, కాంప్లెక్స్. జీవితం లో మనం ఏ ఉద్యోగానికీ పనికిరాకపోవడం వల్లే ఈ జాబ్ లో ఉన్నామనే కాంప్లెక్స్. బంధువుల దగ్గరినుండీ ఎవరు కనిపించినా “కాల్ సెంటరా?” అని చిరాగ్గా తీసివేసినట్టుగా మాట్లాడటం, ప్రేమించిన అమ్మాయి ఈ కాల్ సెంటర్ గాణ్ణి వదిలేసి ఫారిన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళికి ఒప్పుకోవడం ఇలాంటి వరస సన్నివేశాలు ఈ ప్రధాన పాత్రల్లోని ఫ్రస్ట్రేషన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఒకరాత్రి ఆఫీస్ లో సిస్టంస్ పని చేయకపోవడం వల్ల వీళ్ళంతా బ్రేక్ కోసం బయటికి వెళ్తారు క్యాబ్ లో. దానికి యాక్సిడెంట్ అయి ఒక పెద్ద గోతిలో పడిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఒక కాల్ వస్తుంది- దేవుణ్ణుంచి. మీరు కరెక్ట్ గానే చదివారు. దేవుడి నుంచే. దేవుడు ఒక్కొక్కళ్లకీ వాళ్ళ వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు చెప్పడమో ధైర్యం చెప్పడమో చేస్తాడు. అందరికీ కాన్‌ఫిడెన్స్ వచ్చి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాక తమ సమస్యలన్నీ పరిష్కరించేసుకుంటారు. ఈ పరిష్కారాలు కూడా సిల్లీ గా ఉంటాయి. ఈ కథ మొత్తం చేతన్ భగత్ కి (నేరేటర్ కి) ట్రెయిన్ లో వెళ్తుంటే ఒక అమ్మాయి చెబుతుంది. సినిమాలో ఆ చేతన్ భగత్ పాత్ర ని సల్మాన్ ఖాన్ చేసాడు.
బాగున్నవేంటి, బాగోలేనివేంటి-
కథ మొత్తం పూర్తయ్యాక కథాపరంగా it is just scrap అనిపిస్తుంది. కానీ కథ లో చేతన్ భగత్ తెలివి గా చొప్పించిన చెణుకులు, చురకలు ఆ సెన్సాఫ్ హ్యూమర్ – ఇవి మాత్రమే ఈ నవల ని ఆ మాత్రమైనా నిలబెట్టాయి. అయితే కాల్ సెంటర్ ambience ని క్రియేట్ చేయడానికి చేతన్ భగత్ బాగానే హోం వర్క్ చేసాడనిపిస్తుంది. ఆ కాల్ సెంటర్ అట్మాస్ఫియర్ ‘పరికించడానికీ ఒక సారి చదవొచ్చు.
టైటిల్-
టైటిల్ లో చెప్పినట్టు ఒక కాల్ సెంటర్ లో ఒకే రాత్రి ఈ కథ మొత్తం జరుగుతుంది. స్టోరీ మొత్తం ఒకే నైట్ జరుగుతుందీ అంటే కథ నడపడం చాలా కష్టం కదా అని టెన్షన్ పడుతున్నారా..టెన్షన్ పడకండి- తరచుగా పీరియాడిక్ ఇంటర్వల్స్ లో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. చేతన్ భగత్ కూడా మొదటి నవల ఐఐటీ స్టూడెంట్స్ మీద వ్రాసాను, ఐతే ఐఐటీ స్టూడెంట్స్ అనేది చాలా చిన్న కమ్యూనిటీ, దానితో పోలిస్తే అత్యంత ఎక్కువ మంది యువతీ యువకులు ఇప్పుడు (2005లో) కాల్ సెంటర్స్ లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అప్పీల్ అయ్యేలా ఈ నవల వ్రాసాను అని చెప్పుకున్నాడు.
ఇతరత్రా-
ఈ నవల ని సినిమా గా తీస్తున్నారన్నపుడే- ష్యూర్ షాట్ ఫ్లాప్ అవుతుందని దాదాపు నవల చదివిన వాళ్ళందరూ ఊహించారు. చేతన్ భగత్ పాత్ర సినిమాలో బహుశా 5 నిముషాలుండొచ్చేమో, ఆ పాత్రకి సల్మాన్ ఖాన్ ని తీసుకుని పోస్టర్స్ మొత్తం సల్మాన్ తో నింపేసినా ప్రయోజనం లేకపోయింది ఈ సినిమాకి.
3. 3 Mistakes of my life.
కథ ఏంటి?
ముగ్గురు కుర్రాళ్ళు. అహ్మాదాబాద్. బిజినెస్ లో బాగా ఎదగాలని కలలు కంటారు. ఒక క్రికెట్ కిట్ అమ్మే షాప్ పెడతారు. గుజరాత్ భూకంపం, గుజరాత్ మతకలహాలు అన్ని కథలో ఇమిడేలా కథ 2000-2002 ప్రాంతం లో జరుగుతుంది. ఆ ముగ్గురి లో ఒకబ్బాయి చెల్లెలికి ఇంకో అబ్బాయి (ప్రధాన పాత్ర) కి మధ్య లవ్ స్టోరీ. ఇది కాకుండా క్రికెట్ లో అసాధారణ ప్రతిభ గలిగి చివరికల్లా మంచి క్రికెటర్ గా ఎదిగే ఒక చిన్న ముస్లిం కుర్రాడు. ఇదీ కథ. ఇంతకంటే బాగా ఈ కథని చెప్పడం నావల్ల కాలేదు.
బాగున్నవేంటి, బాగోలేనివేంటి?
ఓవరాల్ గా ఒకే ముక్క లో చెప్పాలంటే- చదివేటప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండి మొత్తం చదవడం పూర్తయ్యాక పెద్దగా అనుభూతిని మిగల్చని నవల. టైం కిల్ చేయడానికి చదవొచ్చు ఒకసారి. అయితే One night at call center క్లైమాక్స్ చదవడం పూర్తయాక కోపం వచ్చినట్టు ఇది పూర్తయ్యాక కోపమైతే రాదు.
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి.
ఏదో ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టాలి కదా అని ఈ టైటిల్ పెట్టినట్టుగా ఉంది కానీ పర్టిక్యులర్ గా మూడు మిస్టేక్స్ అంటూ కథ లో ఏమీ ఉండవు. ఉదాహరణకి- భూకంపం వచ్చి తన షాప్ మొత్తం కూలిపోతే అప్పుడు హీరో కుప్పకూలిపోతాడు- “ఆ సమయం లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోవడం-నా జీవితం లో నేను చేసిన మొదటి మిస్టేక్” అంటాడు. ఇలా పెట్టాలనుకుంటే- వెన్నెల్లో ఆడపిల్ల నవల దగ్గరనుంచీ మగధీర సినిమా దాకా దేనికైనా “3Mistakes of my life అని టైటిల్ పెట్టి దాన్ని జస్టిఫై చేయొచ్చు.
ఇక లేటెస్ట్ గా “Two states’ అని ఏదో నవల వచ్చిందట- నేనింకా చదవలేదు. అయితే నాకు మాత్రం అన్నింట్లోకీ ఫైవ్ పాయింట్ సం వన్ బెస్ట్ అనిపించింది. రెండోదీ, మూడోదీ జస్ట్ పర్లేదు అంతే. అయితే ఆ మద్ధ్య ఫ్రెండ్స్ తో మాటల్లో చేతన్ భగత్ గురించి చిన్న డిస్కషన్ వచ్చింది. అక్కడ జనాలు తేల్చిన విషయమేంటంటే (జస్ట్ ఫర్ ఫన్) – చేతన్ భగత్ వచ్చాక ఇంగ్లీష్ నవలల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి- మొదటిది ఏంటంటే, అంతకు ముందు ఇంగ్లీష్ నవలలు మినిమం మూడొందల రూపాయలుండేవి cost, చేతన్ భగత్ వచ్చాక 95 రూపాయలకి దిగాయి 😀 . రెండోది ఏంటంటే- అంతకు ఐదొందల పేజీలకి పైగా ఉండి బోర్ కొట్టేవి, ఇప్పుడు రెండొందల పేజీల్లో పూర్తవుతున్నాయి 😀 .. సరదాకి ఇలా అంటున్నాను కానీ, ఆ మధ్య టైమ్‌స్ ఆఫ్ ఇండియాలో చేతన్ భగత్ ఇంటర్వ్యూ లాంటి ఆర్టికల్ లాంటి వ్యాసమొకటి వచ్చింది. అందులో అంటున్నాడు- “ఒక మల్టిప్లెక్స్ కి వెళ్ళి సినిమా చూసి రావడనికి ఒకరికి రెండొందల రూపయల ఖర్చు, ఒక ఐదు గంటల సమయం పడుతుంది. అంతకంటే తక్కువ ఖర్చులో, ఆ ఐదు గంటలు నవల ద్వారా ఎంటర్టైన్ చేయాలనేదే నా ఉద్దేశ్యం” అని.
వ్రాసిన విధానం బాగుంది. నేను ఇంగ్లీషు పుస్తకాలు చదవటం బాగా తక్కువే. ఈ పుస్తకాల గురించి విన్నాను కానీ, చదవటం మాత్రం జరగలేదు. మీరు చెప్పేది చూస్తుంటే కనీసం ఫైవ్ పాయింట్ సమ్ వన్ అయినా చదవొచ్చు అనిపిస్తుంది.
By: వెంకటరమణ on 2009/11/11
at 10:15 ఉద.
Mohan garu
Cumulative Grade Point Average
వీలైతే సవరించండి
SGPA CGPA మాకు అలవాటు అయిపోయాయి
By: onlyforpraveen on 2009/11/11
at 11:46 ఉద.
thx..!!!
By: mohanrazz on 2009/11/11
at 1:33 సా.
మరో విశేషం ఏంటి అంటే
బి టెక్ లో కంటేCGPA 5 కంటే తగ్గితే institution నుండి బయటకు తరిమేస్తారు అందుకే
5 point someone ani టైటిల్ పెట్టాడు
By: onlyforpraveen on 2009/11/11
at 11:49 ఉద.
emperior college Delhi(గుర్గాన్ దగ్గరలో ) lo shooting jaruguthondi
prasthtam
By: onlyforpraveen on 2009/11/11
at 11:51 ఉద.
two states
వాడి లైఫ్ స్టొరీ
బుక్ ఫర్వాలేదు
ఒనె నైట్ అంత చెత్తగా లేదు
3 mistakes కంటే కొంచెం బాగా రాసాడు
యూత్ ని టార్గెట్ చేస్తూ spontaneity penchadu
By: onlyforpraveen on 2009/11/11
at 11:55 ఉద.
thanks for feed back on this book..will read it soon..konchem busy ga undi anni panuloo postpone avutoonnaayi..
By: mohanrazz on 2009/11/11
at 1:26 సా.
టూస్టేట్స్ చదువుతుంటే నాకు ‘ఆకాశమంత’ సినిమా అనిపించింది. నాకొలీగ్‌తో కూడా అదే చెప్పాను.
By: Chaithanya MS on 2009/11/11
at 7:50 సా.
If u want to go for an informative crap go to Dan (Drawn) Brown (Frown).
And just pure crap, CB. Hehehe
By: గీతాచార్య on 2009/11/11
at 10:13 సా.
Read 2 States recently. Didn’t like it. It was all too convenient – with the right things happening at the right time. Absolutely no realism. The language was bad too with grammatical mistakes here and there. CB should fire his editor.
By: Platypus on 2009/11/14
at 4:51 సా.
Platy..welcome to my blog 🙂
I think this is ur first comment here.. I started this book in my train journey last friday night..i am yet to complete this..!!!
By: mohanrazz on 2009/11/15
at 12:02 సా.