సినిమాల్లో కులం ప్రస్తావించడం అనే విషయం లో సెన్సార్ నిబంధనలు ఇలా ఉంటాయి- ఒక కులాన్ని గురించి నెగటివ్ గా చూపించడం తద్వారా ఆ కులస్తులు బాధపడేలా చేయడం, లేదా ఒక కులాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆకాశానికెత్తేయడం- చేయకూడదు అని. ఒక నెగటివ్ పాత్రకి కులం పేరు ప్రస్తావించడం అవసరమయినపుడు- ఆ కులం లోనే ఉన్న మంచిపాత్రని చూపించడం ద్వారా కానీ మరేరకంగా కానీ ఆ నెగటివ్ పాత్ర కులం మొత్తాన్ని ప్రతిబింబించేది కాదు అన్నట్టుగా చూపించవలసిన బాధ్యత రచయిత-దర్శక-నిర్మాతలదే. ఇది కులనికే కాదు – వృత్తికి కూడా వర్తిస్తుంది. నిజానికి “సామాజిక చైతన్యమే” ప్రధాన ఉద్దేశ్యాంగా తొలినాళ్ళలో వచ్చిన చిత్రాల్లో తప్పిస్తే మిగతా సినిమాల్లో కుల ప్రస్తావన అక్కర్లేదు మన సినిమాలకి.
అయితే అడపాదడపా మనకి జస్టిస్ చౌదరి, సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి టైటిల్స్ వస్తూనే వున్నాయి. అయితే ప్రేక్షకులకి ఎబ్బెట్టుగా అనిపించక- ఆయా కథలకి ఆ టైటిల్స్ సరిపోయినట్టుగానే అనిపించాయి. కులం విషయం లో కొంత నిరసనని ఎదుర్కొన్న సినిమాలు – గత పది పదిహేనేళ్ళలో వచ్చిన వాటిలో తక్కువే. ఇవివి, మోహన్ బాబు తీసిన “అదిరింది అల్లుడూ” అనే సినిమాలో ఒక వర్గం కొంత ఇబ్బంది పడ్డారని, కొంత నిరసన వచ్చింది. నిజానికి ఈ సినిమా భాగ్యరాజా తమిళ్ సినిమా (తెలుగులో నేనూ మీవాణ్ణే అనే పేరుతో డబ్ అయింది) కి రీమేక్. ఈ సినిమా బేసిక్ స్టోరీలైనే కులం అనే అంశం చుట్టూ తిరుగుతుంది కాబట్టి- ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసినా ఏదో ఒక విషయం లో నిరసన రావడం ఊహించదగిందే. కానీ మన్మధుడు అనే క్లీన్ కామెడీ సినిమాలో కూడా ఇలాంటి వివాదమే వచ్చింది. ఈ సినిమా లో “ఉప్పర్ మీటింగ్” అనే పదం వాడతాడు నాగార్జున ఒకచోట. అయితే అది ఒక కులం పేరు అవడమూ- నాగార్జున ఆ పదాన్ని వాడిన సందర్భం – నెగటివ్ సెన్స్ లో ఉండటం తో సహజంగా ఆ కులస్తులు మా మనోభావాలు గాయపడ్డాయి అంటూ నిరసించారు. ఆ తర్వాత ఆ పదాన్ని మ్యూట్ చేసారు థియేటర్స్ లో. అయితే డివిడిల్లో యథాతథంగా ఉందనుకుంటా. సినిమా అనే ఇంత పెద్ద మీడియా తో అంతమంది జనాలకి కమ్యూనికేట్ చేస్తున్నపుడు- “అనవసరమైన చోట” ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవలసిన బాధ్యత రచయిత దర్శకులదే.
ఓసారి- రజనీకాంత్ కూడా ఇలాంటి చిన్న వివాదం లో చిక్కుకున్నాడు. వివేక్ అనే కమెడియన్ ని పొగుడుతూ – “వివేక్ లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి నేను వివేక్ బ్రాహ్మిణ్ అనుకున్నాను. కానీ ఆ తర్వాత వివేక్ దేవర్ (BC ) కులానికి చెందినవాడని తెలిసి ఆశ్చర్యపోయాను” అని. అయితే దేవర్ కులం లో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు అని మీనింగ్ వచ్చేలా ఉంది అని ఆ సంఘాలవాళ్ళు గోల చేస్తే రజనీ సారీ చెప్పాడు ( సారీ చెప్పాడా లేక సారీ అన్న టోన్ లో మాట్లాడాడా కరెక్ట్ గా గుర్తులేదు) . ఏది ఏమైనా రజనీ స్థాయి వ్యక్తి- పబ్లిక్ లో ఆ “క్యాస్ట్” విషయం ప్రస్తావించడమే అనవసరం కదా.
ఏది ఏమైనా సినిమాలు, సినిమా వాళ్ళు చెప్పే విషయాలకి ఉన్న “wide reach” దృష్ట్యా వాళ్ళు ఇలాంటి సున్నితాంశాలు ప్రస్తావించేటపుడు కేర్ ఫుల్ గా ఉండటమో లేక అసలు ప్రస్తావించకుండా ఉండటమో చేయడం బెటర్.
Hi Mohanrazz, mee articles chaala interesting and thought provoking ga vunnayi…..meeru svu lo Btech chesaara…eee batch/branch…nenu svu lo btech chesaanu….
By: muni on 2009/09/24
at 12:24 ఉద.
pls check mail..
By: mohanrazz on 2009/09/24
at 8:23 ఉద.
వివేక్ గారి రంగును చూసి అనుకొని ఉంటాడు తమిళ్ బ్రాహ్మిన్ అని, అక్కడ తెల్లగా ఉన్నారు అంటె సాధారణం గా బ్రాహ్మిన్ అని అనుకుంటారు. మనలా చామనచాయ రంగు ఉండదు. అంతా విజయకాంత్,వడివేలు, సెంథిల్ లాంటి నలుపులే. నిఖార్సైన బొగ్గు నలుపు.
By: sri on 2009/09/24
at 1:05 ఉద.
విజయకాంత్ తెలుగువాడు.
By: అబ్రకదబ్ర on 2009/09/24
at 2:12 ఉద.
అవును విజయకంత్ తెలుగువాడు, రజనీకాంత్ మరాఠీ, ఎంజీయార్ కేరళవాడు, జయలలిత ది కర్ణాటక… 😀
By: mohanrazz on 2009/09/24
at 8:25 ఉద.
ప్రస్తుత కంటెక్స్ట్ లొ చెప్పాలంటే విజయకాంత్ నాయుడు (కమ్మ నాయుడు).
By: prasad on 2009/09/24
at 3:16 ఉద.
మనం కూడా నిజ జీవితంలో కులాల పేర్లతో తిడుతుంటాం. దొమ్మరి గుడెసెల్లో దూరావా, ముతరాసి నా కొడకా లాంటి తిట్లు తిట్టేటప్పుడు దొమ్మరి వారు, ముతరాసి వారు వింటే ఎలా ఉంటుందో ఆలోచించం. సినిమా వాళ్ళు కూడా ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళే కనుక ఈ సొసైటీలో జరిగే నీతిలేని పనులు వాళ్ళు కూడా చేస్తుంటారు. మన తెలుగు బ్లాగర్లలోనే ఒకడు దొమ్మరి స్త్రీలని కించపరిచే బాష వాడాడు. దొమ్మరి స్త్రీలు మాత్రమే భోగం పనులు చేస్తారా? మరి ఆ కులం వాళ్ళకే ఆ వృత్తి అంటగట్టడం ఎందుకు? అని అడిగాను. అతను సమాధానం చెప్పలేదు. సినిమాలలో కుల ప్రస్తావన చాలా వరకు అనవసరమే. అంటరానితనానికి వ్యతిరేకంగా సినిమా తీసినప్పుడో, కులాంతర వివాహాల గురించి సినిమా తీసినప్పుడో కులం పేర్లు డైలాగుల్లో ఉండొచ్చు. ఉప్పర మీటింగ్, ముతరాసి నా కొడుకు లాంటి డైలాగులు మాత్రం ఉండకూడదు.
By: Praveen Sarma on 2009/09/24
at 5:57 ఉద.
రజనీకాంత్ వివేక్ గురించి ఆ వ్యాఖ్య చేసింది “అపరిచితుడు” సినిమాలో అతని నటన చూసి. ఆ సినిమాలో వివేక్ అంబికి స్నేహితుడిగా బ్రాహ్మణ పాత్రలో చాలా బాగా చేశాడు.
By: కె.మహేష్ కుమార్ on 2009/09/24
at 9:28 ఉద.
ఇంతకీ మీరు ఈ వ్యాసం రాసింది ‘Quick gun murugan ‘ ని ఉద్ద్యేశించేనా?
By: phani on 2009/09/24
at 10:34 ఉద.
మోహన్ గారు, చిన్న request.
మీరు ” మగధీర 50 రోజులు..” కి comments off చేసారు. నేను ఒక comment రాయలనుకుంటున్నను. మీకు అభ్యంతరం లేకపోతే comments on చెయ్యండి. నిన్ననే రాయాలనుకున్నను, కానీ కుదరలేదు. ఈరొజు వచ్చి చూస్తే comments off అని ఉంది.
decision is urs. మీకు problem లేకపొతే on చెయ్యండి. Thanks !!!
By: sowmya on 2009/09/24
at 11:30 ఉద.
hmm…opened the comments section again for that post..!
By: mohanrazz on 2009/09/24
at 11:39 ఉద.
Thank you Mohan !!!
By: sowmya on 2009/09/24
at 12:14 సా.
Mohanzzzzz,
వృధా ప్రయత్నం అని తెలిసి కూడా ఓపికతో అంత టైపు చేసి కామెంట్ వ్రాసినందుకు సౌమ్యకు “వెల్ సెడ్” అని నేను ఒక comment రాయలనుకుంటున్నను. మీకు అభ్యంతరం లేకపోతే comments on చెయ్యండి.
just kidding !
By: a2zdreams on 2009/09/24
at 9:59 సా.
@a2Zdreams…
thanks a lot !!!!
వృధా ప్రయత్నమని తెలిసినా నా post ని ఓపిక గా చదివినందుకు 🙂
By: sowmya on 2009/09/29
at 9:38 ఉద.
Oh..forgot latest controversy abt this quickgun.. 🙂
By: mohanrazz on 2009/09/24
at 11:41 ఉద.
ప్రతి విషయం రాజకీయం అయిపోతుంది. మీడియా వారికి అనుగుణంగా వక్రీకరించేస్తుంది.
తెలిసి ఎవడూ ఒకరినీ కించపరచాలని అనుకోడు. తెలియక చేసిన లేదా తెలియక నోరు జారిన మాటలని మాగ్నిఫై చెయ్యడం వలనే ఈ రాద్దాంతాలు.
By: a2zdreams on 2009/09/24
at 11:39 ఉద.
మోహన్ !, మీరు , ప్రవీణ్ శర్మ , ఎ టు జెడ్ వ్రాసిన విషయాలు అన్నీ కరక్టే అనిపిస్తున్నాయి. ఇలా వివాదాలు రాకూడదని కోరుకోవటం తప్ప మనమేం చేయలేం.
By: VenkataRamana on 2009/09/24
at 12:47 సా.
సబాష్ మోహన్ రాజ్ ..నీ బ్లాగు కి హిట్లే హిట్లు చూసుకో ఇక ..
By: b2y on 2009/09/24
at 1:01 సా.
కులాన్ని మాత్రమే తిట్టే నిర్మాతలు
తెనాలి ని శ్రీకాకుళాన్ని తిడితే వాళ్ళ మనోభావాలను గాయపరచినట్టు కాదా
example: happy days లో ఎంత దారుణం గా వుంటుంది ..తెనాలి వాళ్ళ సంగతి సరే సరి
కులం కంటే ప్రాంతం వాళ్ళ మీద తీస్తే ఇంకా ఏమి వుంటుంది
By: b2y on 2009/09/24
at 1:06 సా.
సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమా పై కూడా గొడవ జరిగింది. శ్రీకాకుళం బాషలో లేని phrases పెట్టి శ్రీకాకుళం బాషని కించపరిచారు. శ్రీకాకుళం, తెనాలి ఈ రెండు పట్టణాలు లక్షకి పైగా జనాభా ఉన్న Class ‘A’ పట్టణాలు. ఈ పట్టణాలని పల్లెటూర్లతో పోలుస్తూ సినిమాలు తియ్యడం ఈ పట్టణాల ప్రజలని కించపరచడం కాదా? Tenali is now part of Vijayawada Metro area along with Guntur. Tenali cannot be compared with rural area any way. Telugu cinemas even ridiculed people in the name of Anakapalle that has more than 80,000 population and now part of Vizag Metro.
By: Praveen Sarma on 2009/09/24
at 1:32 సా.
ప్రాంత ప్రజలను కించపరచడమే ..వాళ్ళ మనోభావాలను గాయపరచడానికే వీళ్ళు చేస్తారు యౌనిట్ మొత్తానికి తగిన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇటువంటివి జరగవు
By: b2y on 2009/09/24
at 1:47 సా.
🙂
By: mohanrazz on 2009/09/24
at 5:34 సా.
తెనాలి పట్టణ ప్రజలే వీళ్ళకి పశువుల్లా కనిపిస్తే తెనాలి చుట్టు పక్కల ఉన్న పొన్నూరు, రేపల్లె లాంటి చిన్న పట్టణాల ప్రజలు పందుల్లా కనిపిస్తారా? శ్రీకాకుళం గురించి కూడా అలాగే చూపిస్తే శ్రీకాకుళం చుట్టు పక్కల ఉన్న ఆముదాలవలస, నరసన్నపేట లాంటి పట్టణాల ప్రజల సంగతి ఏమిటి? సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమా పై నిరసనగా ఈ జిల్లాలోని వీరఘట్టం పట్టణంలో పెద్ద ర్యాలీ కూడా జరిగింది.
By: Praveen Sarma on 2009/09/24
at 1:57 సా.
శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లాని అన్నట్టు ..
By: b2y on 2009/09/24
at 2:11 సా.
సినిమా ల లో కులాలు, మతాలు, ప్రాతీయ బేధాల గూర్చి మాట్లాడుతున్నారు కాని ఆడవాళ్ళమి కించపరిచే సంభాషణల గురించి, సన్నివేశాల గురించి ఎవరు మాట్లాడటం లేదేం?
‘ఆది’ సినిమా లో అనుకుంటా…..’బయట విషయాలు ఇంట్లో ఆడవాళ్ళా తో చర్చించే అలవాటు మా వంశం లో లేదు అని Jr. NTR, హీరోయిన్ తో అంటాండు. ఆ డైలాగు రాసినవాడికి, తీసినవాడికి, చెప్పిన వాడికి, ఆ హీరోయిన్ కి, విని ఊరుకుని దాన్ని హిట్ చేసిన మనందరికి సామాజిక స్ప్రుహ అన్నదే లేదు అని చెప్పాలి. సినిమా ల లో కుల ప్రసక్తి కన్నా ఆడవాళ్ళ ని తక్కువ చేసే సందర్భాలు చాలా ఎక్కువ. చెప్పాలంటే కోకొల్లల్ల్లు. ఏ జాతి వారి గురించైనా, ఏ మతం వారి గురించైనా, ఏ కులం వారి గురించైనా, ఏ గ్రూపు కి సంభందించిన వారి గురించి అయినా తప్పు గా మాట్లాడకూడదు. socially sensible గా , responsible గా మనమెప్పుడు తయరవుతామో ఏమో!!!!
By: sowmya on 2009/09/24
at 3:29 సా.
మరి సింహాద్రి లో విల్లన్ సీత ” ని ఒకటి అడుగుతాడు కొలత అనో ఏదో తర్వాత తన పీక కోసేస్తాడు
దాన్ని 175 డేస్ ఆడించిన ఘనత మనది
సిగ్గు వుండాలి
By: vissu on 2009/09/24
at 3:55 సా.
ఆది విషయం వేరు, సింహాద్రి విషయం వేరు. హీరో మంచితనాన్ని జనాలకి క్లారిఫై చేయడానికి విలన్ క్రూరత్వాన్ని గ్లోరిఫై చేయడం అనాదిగా వస్తున్నదే. కాబట్టి సింహాద్రి విషయాన్ని ప్రక్కనపెడదాం కాసేపు. కానీ ఆది విషయం అలా కాదు. హీరో పాత్రద్వారా వివి వినాయక్ ఒకతరహా భావజాలాన్ని propagate చేసాడు . ఈ విషయం మీద సీరియస్ గా డిస్కస్ చేయడం కాదు కానీ- నిజంగా ఈ సీన్ చూసేటపుడు “బయట విషయాలు ఇంట్లో ఆడవాళ్ళా తో చర్చించే అలవాటు మా వంశం లో లేదు” అనే డైలాగ్ కి 😀 గట్టిగా నవ్వేశాను . ఇలాగే సడెన్ గా గట్టిగా నవ్వేసిన ఇంకో వివి వినాయక్ డైలాగ్ – చెన్న కేశవరెడ్డి సినిమాలో – బాలకృష్ణ తో టాబూ డైలాగ్ – “మగాడివి బావా” 😀
By: mohanrazz on 2009/09/24
at 5:23 సా.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ‘ఆది’ డైలాగ్ వినగానే నేనూ పగలబడి నవ్వను. ఎంత కోపం వచ్చిందో అంత నవ్వూ వచ్చింది వాళ్ళ అవివేకానికి !!!
By: sowmya on 2009/09/24
at 5:28 సా.
One of the most ridiculous movies I have seen. From start to the end, I laughed many times. హేమిటో ఆ డైలాగు. అలా అయితే ఇంట్లో విషయాలని మగాళ్ళతో డిస్కస్ చెయ్యటం మా వంశంలోనే లేదంటే సరి. కామెడీ గా ఉందా? జస్ట్ కిడ్డిన్గ్. కానీ ఆ డైలాగ్ గర్హించదగ్గది. మా స్నేహితుల్లో ఒకసారి చర్చకు వచ్చింది.
“సినిమా ల లో కులాలు, మతాలు, ప్రాతీయ బేధాల గూర్చి మాట్లాడుతున్నారు కాని ఆడవాళ్ళమి కించపరిచే సంభాషణల గురించి, సన్నివేశాల గురించి ఎవరు మాట్లాడటం లేదేం?”
Well asked. ఆలోచించాల్సిందే కదా
By: గీతాచార్య on 2009/09/24
at 6:13 సా.
ఇంకో సినిమా లో బేబీ సునయన కి సూమో లో ఒక్కొక్కడు చొక్కా విప్పెస్తారు..ఏమిటో ఈ చెత్త
By: mccllum on 2009/09/24
at 5:55 సా.
‘Quick gun Murugan’ సినిమా నేనూ చూసాను. సినిమా కామెడీ గా ఉంది. కానీ ఇది మన south Indians ని ముఖ్యం గా తెలుగు, తమిళ్ వాళ్ళని కించపరిచే విధంగా ఉంది. అలాంటి సినిమా లో south Indian నటులు ఎలా నటించారో నాకర్థం కాలేదు. పైగా ‘నా సినిమా లలో అతిముఖ్యమైన సినిమాలలో ఇది ఒకటి’ అని రాజెంద్రప్రసాద్ చెప్పుకోవడం ఇంకా హాస్యాస్పదం గా ఉంది. ఇవాళ ఈనాడు వార్తా పత్రిక లో రాజెంద్రప్రసాద్ ఇంటర్వూ వచ్చింది. అందులో ” దర్శకనిర్మాతలు, తమిళ్, తెలుగువాళ్ళ అలవాట్ల గురించి, వంటకాల గురించి ఎంతో పరిశోధన చేసారు. నేను కూడా వాళ్ళకి మనవాళ్ళ భావోద్వేగాల గురించి చెప్పాను” అని చెప్పాడు. నిజంగా తెలుగు, తమిళ్ వాళ్ళ భావోద్వేగాలు అర్థం చేసుకున్నవారే అయితే ఈ సినిమా ని ఎందుకు తీస్తారు. అందులో మన రాజెంద్రప్రసాద్ , మన రంభ, మన నాజర్ ఎందుకు నటిస్తారు!!! సినిమా చూసివచ్చాక, అందులో రంభ ఏమీ బాగులేదు అని మా ఫ్రెండు తో అన్నప్పుడు, తను అన్నాడూ…”అలా ఉండాలనే రంభ ని తీసుకున్నారు. south Indian హీరోయిన్స్ అంటే అలాగే ఉంటారు అని చూపించడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం అని”…చాలా నిజం అనిపించింది నాకు.
By: sowmya on 2009/09/24
at 4:00 సా.
వార్నర్ బ్రదర్స్ సినిమా ని వడులుకోకుకుండా మన సంస్కృతిని సైతం కించపరచడానికి రెడీ అయ్యిన రాజేంద్ర ప్రసాద్ రంభ కు సిగ్గు వుండాలి
By: vissu on 2009/09/24
at 5:03 సా.
ఇందులో మన సంస్కృతి అంటూ పెద్ద గా ఏమీ చూపించలేదులెండి. All that they have done is making fun of our movies, hero, heoins and villions and played pranks on our habits, tastes and emotions !!!
By: sowmya on 2009/09/24
at 5:12 సా.
షారుక్ ఖాన్ చేస్తే అది అవమానమా ?సిగ్గుచేటా కామెడీ ఆ ?మద్రాసి లు అని కించపరచడమే కరెక్ట్
By: vinay on 2009/09/24
at 5:45 సా.
చికాకులం అంటూ పిచి వ్రాతలు రాస్తున్న బ్లాగ్గేర్లనూ మనోభావాలు దేబ్బతేసే విధంగా ప్రవర్తించినందుకు వాళ్ళ IP అడ్రెస్స్ లతో సహా వాళ్ళని ఎం చెయ్యాలో అది చేయాలి
By: vissu on 2009/09/24
at 5:43 సా.
south Indian హీరోయిన్స్ అంటే అలాగే ఉంటారు ….
గుమ్మడికాయ లా ఉంటారని నార్త్ ఇండియా మిత్రుల అభిప్రాయం. దానిని ఎవ్వరం మార్చలేము. అలా దెప్పి పొడవడానికే వాళ్ళు రంభను ఎంచుకున్నారు.
By: sri on 2009/09/24
at 7:31 సా.