మిగతారంగాల్లో ఉన్నతస్థానానికి ఎదిగినవాళ్ళు తమ పిల్లలు కూడా తమ రంగం లోకే అడుగుపెట్టి తమ కంటే ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆశించినట్టే పాపం సినిమా వాళ్ళు కూడా ఆశిస్తూంటారు. చిరంజీవి, నాగార్జున పుత్రరత్నాలు ఆల్రెడీ పరిచయమైపోతే నందమూరి అభిమానులు ఇప్పుడు స్కూలింగ్ లో ఉన్న బాలయ్య కొడుకు మోక్షఙ్ఞ పుట్టిన రోజుకనుకుంటా ఆ మధ్య ఎపుడో సూపర్ హిట్ లోనో ఇంకేదో సినిమా పత్రికలోనో ఒక ప్రకటన ఇచ్చారు 🙂
సరే హీరోల వారసత్వం ఈనాటిది కాదు. వారసులైనా కష్టపడకుండా ఏదీ రాదు. కాకపోతే ఎంట్రెన్స్ ఈజీ. అయితే ఇది కాకుండా ఇంకొంతమంది ఉన్నారు. కొడుకులని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టబోయి తమకే ఎసరు తెచ్చుకున్నవాళ్ళు. కుంజుమోన్ అని ఒక నిర్మాత ఉండేవాడు మొదట్లో శంకర్ తో జెంటిల్మేన్, ప్రేమికుడు ఆ తర్వాత కదిర్ తో ప్రేమదేశం లాంటి సినిమాలు తీసి ఒక్కదెబ్బతో అగ్రనిర్మాతయ్యాడు. కొన్ని హిట్ల అనంతరం అతని డౌన్ ఫాల్ రక్షకుడు తో మొదలైంది. రక్షకుడు తో సగం నాశనమైన ఆయన కెరీర్ ని సర్వనాశనం చేసిన ఘనత మాత్రం కుంజుమోన్ కొడుకు సినిమా కోటీశ్వరన్ కే దక్కుతుంది. కోటీశ్వరుడు గా ఉన్న కుంజుమోన్ ని బికారి ని చేసిన ఈ కోటీశ్వరన్ సినిమా కోసం భారీ గానే ఖర్చుపెట్టాడు కుంజుమోన్. ఒక ఐటెం సాంగ్ కరిష్మా కపూర్ తో తీసాడప్పట్లో. కరిష్మా హిందీ లో ఒక ఫుల్ సినిమాకి తీసుకునే పారితోషికాన్ని ఒక్క పాటకోసమే ఇచ్చాడంటారు అప్పట్లో. కోటీశ్వరన్ దెబ్బకి కనుమరుగైపోయాడు కుంజుమోన్.
ఇక మన ఎ.ఎం రత్నం పరిస్థితి కూడా ఇదే. చిత్రంగా ఈయనా శంకర్ సినిమాలతోనే భారీ నిర్మాతయ్యాడు. భారతీయుడు సినిమా అప్పుడు ఈయన నిర్మాణ విలువలని దేశమంతా మెచ్చుకున్నారు. మంచి హిట్ల తో ఖుషీ ఖుషీ గా ఉన్న ఈయన కి సన్ స్ట్రోక్ కాదు, సన్స్ స్ట్రోక్ తగిలింది. ఒక కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడు గా తెరవెనుక ఉంటే ఇంకో కొడుకు రవికృష్ణ తెరమీద హీరో గా ఉంటూ కేడీ అనే సినిమా తీసారు- ఇలియానా, తమన్నా ని పెట్టి. అక్కడ మొదలైంది. ఇక అంతే.
మన RB చౌదరి గారు కూడా వరస హిట్లతో అగ్రనిర్మాత గా ఉండేవాడు- శుభాకాంక్షలు, సుస్వాగతం, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా అంటూ. కొడుకు తో “విద్యార్థి” తీసాడు. తేరుకోడానికి టైం పట్టింది.
ఇంక మనలో మాట- దర్శకరత్న దాసరి కూడా వాళ్ళ కొడుకుని పెట్టి తీసిన గ్రీకువీరుడు, చిన్నా అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఆ కసి తోనే “కంటే కూతుర్నే కను” తీశాట్ట 🙂
విజయ బాపినీడు…వైభవ్…same story!
ఈ సన్ స్ట్రోక్ కి other side కూడ ఉంది కదా! పీకల్లోతు అప్పుల్లొ ఉన్న పద్మాలయ ను మహేష్ బాబు కాపాడాడు కదా!
పాపం బాబుమోహన్ కి ఏమౌతుందో చూడాలి!
By: korramatta on 2009/10/01
at 1:05 ఉద.
@korramatta, kodanda rami reddy – vaibhav, AM ratnam chetta lyrics raasi naa laanti vaalla “usuru” tagili poyaadu
By: dnchari on 2009/10/01
at 1:38 ఉద.
oh..ya..its kodanda rami reddy!sometimes I get confused with all old chiranjeevi batch!
By: korramatta on 2009/10/01
at 2:01 సా.
A.M.Ratnam lyrics…vaammoooo…i prefer sayaji shide’s telugu dubbing than ratnam’s lyrics 🙂
By: korramatta on 2009/10/01
at 2:04 సా.
ఇంక మనలో మాట- దర్శకరత్న దాసరి కూడా వాళ్ళ కొడుకుని పెట్టి తీసిన గ్రీకువీరుడు, చిన్నా అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఆ కసి తోనే “కంటే కూతుర్నే కను” తీశాట్ట 🙂 🙂 🙂
By: Indian Minerva on 2009/10/01
at 7:29 ఉద.
title and last line – excellent.
By: కొత్తపాళీ on 2009/10/01
at 8:24 ఉద.
//ఇంక మనలో మాట- దర్శకరత్న దాసరి కూడా వాళ్ళ కొడుకుని పెట్టి తీసిన గ్రీకువీరుడు, చిన్నా అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఆ కసి తోనే “కంటే కూతుర్నే కను” తీశాట్ట
🙂 🙂
By: VenkataRamana on 2009/10/01
at 9:40 ఉద.
good post….ending is mind blowing!!!!
By: sowmya on 2009/10/01
at 9:52 ఉద.
// మంచి హిట్ల తో ఖుషీ ఖుషీ గా ఉన్న ఈయన కి సన్ స్ట్రోక్ కాదు, సన్స్ స్ట్రోక్ తగిలింది.
🙂 🙂
By: VenkataRamana on 2009/10/01
at 11:27 ఉద.
You forgot about KS Rama Rao & Vallabha!
By: Gireesh K. on 2009/10/01
at 11:57 ఉద.
Hehehe Thats True 😉 😉 !!
By: nelabaludu on 2009/10/01
at 4:06 సా.