వ్రాసినది: mohanrazz | 2011/12/17

త్రివిక్రం డైలాగులు

ఈ మధ్య ఎవడైనా మంచి పంచ్ ఒకటి విసిరితే చాలు – ఏంటి బాసూ త్రివిక్రం స్కూల్ లో జాయిన్ అయ్యావా అంటున్నారు జనాలు. ఇప్పుడంటే త్రివిక్రం ట్రెండ్ నడుస్తోంది కానీ నేను ఇంజినీరింగ్ చదివేటప్పటికి ఇంకా త్రివిక్రం సినిమాల్లోకి రాకపోవడం వల్ల అప్పట్లో మా ఫ్రెండ్స్ అంతా ‘ఇ.వి.వి. స్కూల్ ‘ లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేవాళ్ళు. అప్పటి సంగతులు.

1. ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ తెలిసినతనికి అన్న వరస ఒకాయనకి క్యాంపస్ లో పని వుంటే మా రూం లో దిగాడు. మా రూం లో మిగతా వాళ్ళూ ఒకే బ్రాంచ్ అవడం తో సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ చాలా వుండేవి- నీట్ గా వుండేవి కూడా, ఎవరూ పెద్దగా టచ్ చేయకపోవడం వల్ల. వచ్చినతను రాగానే రూం ని పుస్తకాలనీ చూసాడు. బాగా చదువుకునే టైప్ క్యాండిడేట్ అనుకుంటా- అన్నేసి పుస్తకాలు చూసేసరికి తెగ ముచ్చట పడ్డాడు.

అతనన్నాడు – ‘మీ రూం లో బుక్స్ కలెక్షన్ బాగా వున్నట్టుందే ‘ .
ఠకీమని రిప్లై వచ్చింది ఒక మూల నుంచి- ‘ కలెక్షన్ బాగానే వుంటది, కానీ వాటితో మాకు కనెక్షనే – అస్సలుండదు ‘.

2. ఇంకొకసారి ఇంజినీరింగ్ అప్పుడే- మా ఫ్రెండ్ వచ్చి అన్నాడు –
‘బాసూ నేను రూం మారుదామనుకుంటున్నాను. ఆ సైకో గాడి తో కలిసి నేను ఉండలేను.’
నేనేమో అప్పటికే ‘ఇంద్ర-బార్న్ ఫర్ పీపుల్ ‘ లాగా చాలా మంది ని రూం లో అడ్జస్ట్ చేసి వుండడం తో మా రూం కిటకిటలాడుతూండేది. మరి మా రూం కి వస్తానంటాడేమో అని అన్నానో లేక క్యాజువల్ గా అన్నానో గుర్తు లేదు కానీ, అన్నాను-
‘వాడి గురించి తెలిసిందే కదా, నువ్వే కొంచెం సర్దుకుపోవాలి ‘.
వెంటనే అన్నాడు మా వాడు- ” వాడి గురించి ‘తెలిసింది ‘ అందుకే ‘సర్దుకుని ‘ పోతున్నాను “.

3. మా మెస్ లో ఒక వర్కర్ వుండేవాడు. బాగా సోమరి. రోజూ ఒకే గళ్ళ చొక్కా వేసుకుని వచ్చేవాడు. వడ్డించేటపుడు మా ఫ్రెండ్ అడిగాడు-
‘ఇవాళేంటి కర్రీ’ అని.
‘ఇవాళ (కూడా) ముల్లంగి సార్ ‘ అన్నాడు.
మా వాడు అన్నాడు కొంచెం చిరాకుగా – ‘ కొంచెం మార్చండయ్యా- రోజూ ఈ ముల్లంగి నీ, నీ గళ్ళంగి నీ చూడలేక చచ్చిపోతున్నాం ‘ .

4. ఇంకొకటి. ఓ సారి మా రూం-మేట్ ఒకబ్బాయి అన్నాడు.
“జుట్టు బాగా తెల్లబడింది. ఇవాళ హెయిర్ డై అయినా వేసుకోవాలి”.
ప్రక్కన అబ్బాయి అన్నాడు- ” ఇవాళ వద్దులే ఇంకెప్పుడైనా వేసుకో “.
“ఏం? ఎందుకలాగా?” .
” అంటే..’డై అనదర్ డే’ అన్నారు కదా అందుకని..” .

5. ఓ సారి పేకాడుతున్నాం హాస్టల్లో. ఎవరో షో చెప్పాక ఒకతనిది స్కోర్ 250 దాటిపోయింది. అయినా కూడా ఇంకోసారి తను ఔటా కాదా అని కన్‌ఫర్మ్ చేసుకుందామని స్కోర్ వేస్తున్నతన్ని అడిగాడు.
“ఔటా”
అతనన్నాడు-
“డౌటా”

 


స్పందనలు

  1. ha ha haa..

  2. మా కాలేజీలో కూడా ఒకడు ఉండేవాడండీ. అతను కొత్త వాచీ పెట్టుకొస్తే, “బావుందే!” అన్నా.. దానికి వాడు, “అందుకే కొన్నా” అని సమాధానం. అప్పటికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా, తరవాత తలుచుకుంటే, నవ్వొస్తుంది. 🙂

  3. baagunnayi dialogues

  4. hahah…..
    baagundi punch

  5. quite funny.

  6. మూడోది నాకు బాగా నచ్చింది. ఇలాంటిదే నాకూ ఒకటి, ఇంజనీరింగులో ఉండగా. నేను బూట్లు పాలిషు చేసుకుంటూ, మా రూమ్మేటుతో.. “పాలిషు చెయ్యడం నాకెంతో ఇష్టం అన్నా.” (ఎందుకలా అన్నావని మీరడిగితే ఏం చెప్పగలను.. ఒక్కోసారి ఖర్మ అలా కాలుతుంది. ఇదిగో ఇలా..) వెంటనే వాడి బూట్లను నా ముందుకు తోసి, “ఇవిగో వీటిక్కూడా చెయ్యి” అన్నాడు.

  7. Abbo….naakaithe..”vichala vidigaa” nachesaayi…… Venkat Reddy

  8. hehe.. all are fresh and new…

    ఒక్కోసారి ఫ్రెండ్స్ మధ్య జోకులు కొంప ముంచుతాయి. మా బాచ్ లో జగ్గు గాడు ఎప్పుడూ వంశీగాణ్ణి(వీడింకో ఫ్రెండు) డాడీ అని పిలిచేవాడు. ఒకసారి వాడు ‘ఎక్కడికెళ్ళావు డాడీ’ అని వంశీ గాణ్ణడిగితే ‘మీ అమ్మ దగ్గరకురా’ అన్నాడు వాడు. పాపం వాడు నిష్కల్మషంగానే అన్నా, అర్ధం వేరేగా ధ్వనించి జగ్గు తెగ ఫీలయిపోయాడు.

  9. చాలా చాలా బాగునాయి. ఇంకా ఇలాంటివుంటే చెప్తూ ఉండండి

  10. హ..హ.. హ…బావున్నాయి..

    మా ఫ్రెండొకడు జాబ్ లో జాయిన్ అవుతూనే ఒక చిన్నపాటి రేడియో అంత ఫోన్ కొన్నాడు. చాలా అప్లికేషన్స్ ఉండి అర చెయ్యంత ఉంది అది. అది చూసి ఇంకోడు సీరియస్గా వాడి భుజం మీద చెయ్యేసి –
    “బాబాయ్, లోన్ పెట్టి కొన్నావా?” అన్నాడు :).

  11. బావున్నాయి

  12. very funny…………….

  13. 🙂 బావున్నాయి.

  14. super unnayi….mukhyamgaa second di kekaa. 4th de lite 🙂

  15. ఫుల్లుగా నవ్విస్తున్నావు బాసు, సుపర్, keep continue

  16. Super..Keep Writing..


Leave a reply to vinay chakravarthi స్పందనను రద్దుచేయి

వర్గాలు