వ్రాసినది: mohanrazz | 2012/09/14

టైటిలా? మన పేరే పెట్టేద్దాం..

title

నిర్మాతల పేర్లు, దర్శకుల పేర్లు, హీరోల పేర్లు టైటిల్స్ గా వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి తెలుగులో. హీరోల పేర్లు సినిమా టైటిల్ గా వచ్చినవి కొంచెం బాగా గుర్తుంటాయి మనకి. అయితే ఇక్కడ ఇంకో సెంటిమెంట్ ఉంది తెలుగు లో. హీరోల పేర్లతో కానీ వాళ్ళ నిక్ నేంస్ తో కానీ టైటిల్ పెట్టిన సినిమాలేవీ హిట్ కాలేదుట. చిరంజీవి హీరొ గా వచ్చిన “చిరంజీవి” అనే ఫ్లాప్ సినిమా ఒకటుంటుంది. చిరంజీవి (చిరకాలం జీవించేవాడు) అనే టైటిల్ పెట్టిన ఆ సినిమా లో చిరంజీవి క్లైమాక్స్ లో చచ్చిపోతాడు. మహేష్ బాబు ని ఇంట్లో నాని అని పిలుస్తారు కదా అని ‘న్యూ’ అనే టైటిల్ తో కథ వ్రాసుకొచ్చిన సూర్య కి తెలుగు వెర్షన్ కి “నాని” అని పేరు పెడదామని కన్విన్స్ చేసారు. తమిల్ వెర్షన్ (న్యూ) లో బానే హిట్ అయిన ఆ సినిమా తెలుగు లో మరీ దారుణంగా ఫ్లాప్ అయింది. నాగార్జున నిక్ నేం అని చెప్పి తీసిన “చినబాబు” సినిమా ని బహుశా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిఉండవచ్చు.

హీరోల సంగతి ప్రక్కన పెడితే, నిర్మాతల్లో కూడా ఈ సరదా కొన్నిసార్లు కనపడుతూ ఉంటుంది. రామానాయుడు “నాయుడుబావ” అనే పేరుతో సినిమా తీసినా, ఆ మధ్య కె.మురారి అనే నిర్మాత పట్టుబట్టి తనసినిమాకి నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ పెట్టుకున్నా అశ్వనీదత్ “అశ్వమేధం” అనే పేరుతో భారీ సినిమా తీసినా అన్నీ వాళ్ళ వాళ్ళ సరదాల్ని జనానికి పట్టిచ్చేవే. అయితే హీరోలు, నిర్మాతల సంగతి ప్రక్కన పెడితే ఒక దర్శకుడు తన పేరుని సినిమా కి టైటిల్ పెట్టే సాహసం ఎవరూ చేయలేదు నాకు తెలిసి. అలాంటి సాహస కార్యానికి పూనుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ మన ఉపేంద్ర! ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం అవుతుంది.  ఇంకో టపా లో ఆ గ్రంధం గురించి మాట్లాడుకుందాం!.


స్పందనలు

  1. boss!!! oka tamil dubbing cinema vundi vijaykanth di telugu lo Suresh Productions vallu release chesaru dani peru ‘RAMA NAIDU’. nuvvu mention cheyaledu mastaru….feel aiyannu…

  2. అసలు ఉపేంద్ర సినిమాలలోనే ఉంది మజా అంతా. సినిమాలో అతను సందేశాన్ని అందించే విధానం కాస్త వింతగా ఉన్నా, బాగా మనసుకు హత్తుకునే విధంగా చెప్తాడు. మన సినీ పరిశ్రమకు గిట్టనిది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపకపోవడం. కాస్త మార్చి తక్కువైనా చేస్తారు, లేదా ఎక్కువైనా చేస్తారు(ఎక్కువగా బాలాకృష్ణ సినిమాలలో ఈ తంతు జరుగుతూ ఉంటుంది). ఉపేంద్ర ఉన్నది ఉన్నట్టుగా చూపడంలో అందవేసిన చెయ్యి.

  3. బన్ని = అల్లు అర్జున్

  4. మీ బ్లాగు టైటిల్ వైరటిగా అందరినీ ఎలా ఆకట్టుకుందో, మీ టపాలన్నీ కూడా ఏదో ఒక వైరటీ పాయింట్ ను టచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి .. Great going and Kepp Writing !

    • thank u boss…

      చిరంజీవి సినిమా గురించి కూడా పైనే వ్రాసాను. మొదటిసారి ఈ సినిమాని జెమిని టివి లో చూసాను జెమిని వచ్చిన కొత్తలో. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా వేసాడు “చిరంజీవి” అన్న పేరుతో ఉన్న సినిమా కదా అని. ఆ వారం పోస్ట్ బాక్స్ 1562 లో కుంచె రఘు అన్నాడు.చిరంజీవి బర్త్ డే రోజు చిరంజీవి అన్న పేరున్న సినిమా వేయడం బాగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో చిరంజీవి చనిపోయే సన్నివేశం ఉన్న సినిమా ని చిరంజీవి పుట్టిన రోజున వేయడం బాగోలేదు అని అభిమానుల నుంచి కుప్పలుతెప్పలుగా ఉత్తరాలొచ్చాయట!!

  5. “చిరంజీవి” అనే టైటిల్ కూడా వున్నట్టువుంది కదా !

  6. upendra is a fantastic movie

  7. >> “నాగార్జున నిక్ నేం అని చెప్పి తీసిన “చినబాబు” సినిమా ని బహుశా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిఉండవచ్చు”

    ప్రేక్షకులు మర్చిపోయినా పోకపోయినా, ఆ సినిమా తీసిన రామానాయుడు మాత్రం మర్చిపోయుండడని ఢంకా బజాయించి చెప్పొచ్చు. ఆయన కుమార్తె కాపురానికి ఎసరొచ్చింది ఆ సినిమాతోనే కదా.

    • ఎసరొచ్చింది ఆ సినిమాతోనే కదా>>
      😀

  8. […] నిన్న ఒక ఛానెల్ లో “లైవ్ ప్రోగ్రాం” ఒకటి వచ్చింది. కె. మురారి. అనే నిర్మాత తన ఆత్మకథ లాంటి అనుభవాల్ని ఒక పుస్తకం వ్రాసాడనీ, అందులోని అంశాలు వివాదాస్పదం “అవుతున్నాయని” (ఒకవేళ అవకపోతే, అయ్యేలా తాము కృషి చేస్తామనీ-) ఇద్దరు సినీ విమర్శకులని ఆయనతో పాటు కూర్చోబెట్టి ఓ గంట సేపు కాలక్షేపం చేసారు. ఆ మధ్య కొంతమంది నిర్మాతలు, హీరోలు, దర్శకులు – తమ సినిమాల కి టైటిల్ లో తమపేరు వచ్చేలా పెట్టుకున్నారని ఒక పోస్ట్ వేసినపుడు “నారీ నారీ నడుమ మురారీ” సినిమా ని ఆ సినిమా నిర్మాత కె.మురారి ని ప్రస్తావించాను (లింక్ ఇక్కడ). […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: