ఎట్టకేలకి చిరంజీవికి ఒక పదవి దక్కింది. చంద్ర బాబు , వై.ఎస్. వంటి రెండు “ఆంబోతుల” మధ్య (ఈ పద ప్రయోగం నాది కాదు, మంత్రి వట్టి వసంత్ గారిది ) నలిగిపోయి చివరికి కాంగ్రెస్ లో పార్టీ ని విలీనం చేసిన మెగా స్టార్ కి స్వతంత్ర హోదా కేంద్ర మంత్రి పదవి అక్టోబర్ 28 న దక్కింది. అయితే యాదృచ్చికం గా 1983 లో ఇదే తేదీన ఖైదీ రిలీజ్ అయింది. సో, ఖైదీ తో ఏదో ఒక రకమైన రెఫరెన్స్ చిరంజీవి జీవితాన్ని వదలటం లేదు.
అప్పట్లో ఠాగూర్ సినిమా తీసినపుడు ముందు ఈ “సూర్యం” అనే పేరు పెడదామనుకున్నార్ట. ఖైదీ లొ చిరంజీవి పేరు ఇది. ఈ సారి ఆ సినిమా చూసినపుడు గమనించండి సినిమా మొదలైన 1.5 గంట వరకు సినిమా లొ చిరంజీవి ని ప్రొఫెసర్ అంటారే తప్ప ఎక్కడా చిరంజీవి ని పేరు తో ప్రస్తావించరు. సియాజీ షిండే ని కిడ్నాప్ చేసిన సీన్లో మొదటి సారి “ఠాగూర్” అనే పేరు వినిపిస్తుంది. అంటే షూటింగ్ 75% పూర్తయ్యాక ఈ పేరు కన్ ఫర్మ్ అయిందన్న మాట.
ఇక రైలు గుర్తు తో 2009 ఎలక్షన్స్ లో దెబ్బ తిన్నాక పీఅర్పీ గుర్తు “సూర్యుడు” గుర్తు కి మార్చుకున్నారుట ఇదే సెంటిమెంట్ మీద..
ఇప్పుడేమో ఖైదీ రిలీజ్ తేదీన మంత్రి పదవి!!! ఈ ఖైదీ సెంటిమెంట్ చిరంజీవి కి ముందు ముందు కూడా కొనసాగుతుందేమో చూడాలి…
Welcome back bro.
By: Indian Minerva on 2012/10/30
at 8:35 సా.
yeah..thanks..
By: mohanrazz on 2012/11/06
at 1:31 సా.
హ్మ్. అయితే ఖైదీతో సినీజీవితం మలుపు తిరిగినట్లు ఈ పదవితో రాజకీయ జీవితం మలుపు తిరుగుతుందంటారా 🙂 తిరిగితే మంచిదే.
వెల్కం బాక్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం 🙂 మొన్నే నా గూగుల్ రీడర్ అప్డేట్ చేస్తూ మిమ్మల్ని గుర్తు చేసుకున్నా ఈ రోజు టపా కనిపించేసరికి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యా 🙂
By: వేణూశ్రీకాంత్ on 2012/10/31
at 11:43 ఉద.
మొన్నే నా గూగుల్ రీడర్ అప్డేట్ చేస్తూ మిమ్మల్ని గుర్తు చేసుకున్నా>>>
థాంక్స్ బాసూ
By: mohanrazz on 2012/11/06
at 1:32 సా.
brother,
Shriyaa pani pilla tho matlaadetappudu anaadha pilla gurinchis ebuthoo Tgaoree antuu chebuthundhi kathaa
By: sai on 2012/11/07
at 7:38 సా.