వ్రాసినది: mohanrazz | 2012/11/06

రాజ మౌళి అతి వినయము


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అని చంద్ర బోస్ గారు సెలవిచ్చారు.. మొక్క ఎదిగేటపుడు మాట్లాడదు కాబట్టి అది మౌనంగా ఎదగడం వరకు కరెక్టే కానీ ఇందులో, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమెక్కడినుంచి వచ్చిందో నాకు అంతు పట్టదెపుడూ..


రాజ మౌళి గారు ఇవాళ తెలుగు లొ నం.1 డైరెక్టర్. మగధీర సూపర్ హిట్ తర్వాత ఆయన వేదికల మీద మరింత ఒదిగి మాట్లాడుతున్నాడు.. అదుర్స్ ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఆ మధ్య ఈ సినిమా మగధీర ని దాటేస్తుంది ఎందుకంటే ఇది వి.వి వినాయక్ గారి సినిమా అని వినమ్రంగా సెలవిచ్చారు..ఆ తర్వాత మగధీర రికార్డ్ అలా పదిలంగా నిలబడి పోయింది. దమ్ము ఆడియో ఫంక్షన్ కి వచ్చి బోయపాటి కి సాటి ఎవరూ లేరు… అసలు సిసలైన మాస్ డైరెక్టర్ ఇవాళ ఆయనే..నేనేదో ఈగలు, దోమలు అంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటున్నాను అని  మళ్ళీ అలా ఒదిగి పోయారు..బోయపాటి గారేమో ఎంతో (అతి) విశ్వాసం తో ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి, చూడండి, చూడండి, చూడండి..అని ప్రసంగించారు..ఆ తర్వాత దమ్ము సరిపోక పోవడమూ, ఈగ దుమ్ము రేపడమూ జరిగి పోయాయి… దానికి ముందు బిజినెస్ మేన్ ఫంక్షన్ లో పూరి ని పొగుడుతూ…ఒక ఎమోషన్ ని పైకి లేపడానికి తాను..ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి..దానికి టెంపో పెంచి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాడి, ఎమోషన్ తీసుకు వస్తే, పూరిగార్ చిన్న డైలగ్ తో అంతకంటే ఎక్కువ ఎమోషన్ తీసుకు వస్తాడని..తామంతా ఆయన ముందు దిగదుడుపనీ మళ్ళీ ఒదిగి పోయాడు రాజమౌళి..


మొన్నటికి మొన్న రెబెల్ ఆడియో ఫంక్షన్ లో లారెన్స్ ని ఆకాశానికి ఎత్తెసాడు రాజమౌళి…అసలు ఆ ఫైట్ లో ఆ షాట్ హైలేట్ ..నేనెప్పుడూ అలా తీయలేదు అని వినమ్రంగా ఆశ్చర్య పడిపోయాడు..లారెన్స్ ఏమొ తెగ సంబర పడిపోయాడు ఆ స్పీచ్ విని..కట్ చేస్తే రెబెల్ షెడ్ కి వెళ్ళిపోయింది..ఇక కృష్ణం వందే జగద్గురుం ఆడియో ఫంక్షన్ లో తనకి అసలు ట్రైలర్ చూసాక మాటలు పెగలట్లేదని క్రిష్ ని ఎత్తేశాడు రాజమౌళి.. ఇక ఇదేమవుతుందో చూడాలి…


కాబట్టి ప్రియాతి ప్రియమైన దర్శకులారా…రాజ మౌళి స్పీచుల్లో ఆయన వినమ్రత ఈ మధ్య – ఛత్రపతి సినిమా లో ఇంటర్వల్ కి ముందు సీనో ఎమోషన్ లాగా బాగా పీక్ కి చేరుకుందనీ, ఆయన తనకేమీ రావని మిమ్మల్ని పొగిడినపుడు అది ఆయన వినయానికి పరాకాష్ట అనీ గ్రహించి, మీరు ఆయన స్పీచ్ కి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం తక్షణమే ఆపేసి, మీ పని మీరు చూసుకోగలరనీ..నా ఈ చిన్న విన్నపం..


స్పందనలు

 1. athi vinayam durtha lakshanam antaaru .. kaani ee athi vinayam vere Director kompa munchadanikemo mari. Chandra Bose paata hit ye aina, prasaku tagga mata laga vundi.. “yedigina koddi vodigadam” anedi yekkada spurichadu “maunamgaane yedagamani…” lo.

 2. lol 🙂 good observation, great presentation (just vinayam, not ati)
  I wish you post more frequently ….

 3. ఆ ఫంక్షన్ లో వున్న వాళ్ళు ఏది ఎక్సపెట్ చేస్తారో అది మాట్లాడితే అతి వినయం ఎలా అవుతుంది? (do not take this question as serious .. ఎదో విభేదించాలని మాత్రమే)

  my interpretation to his speeches:
  జనాల నాడి బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి.

 4. అది వినయం కాదు, వ్యంగ్యం అనిపిస్తుంది నాకు 🙂

 5. మీ సునిశిత పరిశీలనా జ్ణ్యానం, ప్రదర్శనా చతురత అమోఘం మాస్టారు… ఈ కథ మొత్తంలో నేను ఏరుకునే ముక్క ఏంటంటే… దర్శకులు చాలా విశాల హృదయంతో ఒకరి సినిమా కార్యక్రమానికి ఇంకొకరు ఏ భేషజాలు లేకుండా వెళ్తున్నారు…. ఇది నిజంగా శుభపరిమాణం… ఇప్పుడు కుర్ర హీరోలు కూడా ఈ దారిలోనే నడుస్తున్నట్టనిపిస్తోంది… మొన్న జూ.ఎన్‌ సినిమా ముహూర్తపు సన్నివేషానికి రాంచరణ్ వచ్చి రెండు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లడం (అవి మనసువా గొంతువా.. ఇక్కడ అప్రస్తుతం 😉 )… నాకు భలే ముచ్చటేసింది…..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: