వ్రాసినది: mohanrazz | 2012/11/07

త్రివిక్రం కి ఆ పేరెలా వచ్చింది..


ఇవాళ త్రివిక్రం శ్రీనివాస్ బర్త్ డే. ఒక 13 యేళ్ళ క్రితం రైటర్ గా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి, ఇవాళ టాప్ డైరెక్టర్ గా ఉన్న ఆయన గురించి షరా మామూలు గా చాలా కథనాలు టివి లో వచ్చాయి..అయితే అందులో చాలా వరకు ఆయన రాసిన తీసిన కామెడీ సీన్లతో 30 నిమిషాలు నింపేసి మమ అనిపించిన ప్రొగ్రాంసే..


సరే, ఆయా మొదటి సినిమా స్వయంవరం లో మాటల రచయిత పేరు “త్రివిక్రమన్” అని పడింది. దీని మీద ఆ రోజుల్లో జోగి బ్రదర్స్ చిన్నపాటి సెటైర్ వేసారు..”ఏంటి..అందరూ ఈ సినిమాలో డాఇలాగులు సూపరు, డైలాగులు సూపరు అంటున్నారు..తీరా చూస్తే డైలాగులు రాసింది తమిళోడా??” అని. నిజానికి ఆయన ఎందుకో తన కలం పేరు త్రివిక్రమన్ అని పెట్టుకున్నారు..కానీ అదేమో తమిళ పేరు లా అనిపించి మొదటికే మోసం వచ్చేలా ఉంది..ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ లో తన బంధువు ఒకాయన ఈ తమిళ పేరు సమస్య అధిగమించడానికీ, తన కలం పేరు ని వదలకుండా వుండటానికీ వీలుగా “త్రివిక్రం శ్రీనివాస్” అని పేరు వేయించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడనీ, అప్పట్నుంచీ అదే కొనసాగిస్తున్నానీ త్రివిక్రం గారు చెప్పుకొచ్చారు..


అసలు ఆ “త్రివిక్రం” అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనెప్పుడూ చెప్పలేదు కానీ ఆయన రాసే డైలాగుల్లో ఒక ప్రత్యేక శైలి ఆయనకి 3విక్రం అనే పేరు ని సార్థకం అయితే చేసిందని చెప్పగలను.. ఉదాహరణ కి – ఆయన రాసే డైలాగుల్లో – ఈయన ఒక మూడంచెల “ప్యాటర్న్” ని ప్రవేశ పెట్టాడు –


నువ్వే కావాలి లో –
1) భార్యా భర్తలు విడిపోవాలంటే విడాకులు ఉన్నాయి
2) అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి గొడావలు ఉన్నాయి
3) కానీ, స్నేహితులు విడిపోవాలంటే మాత్రం – చనిపోవాలి – అంతే !


ఇలా ఆయన చెప్పాలనుకున్న విషయానికి మరో రెండు జోడించి దాన్ని మూడంచెల్లో చెప్పడం అనే ఒక శైలి ని క్రియేట్ చేసుకున్నాడు..
జల్సా లో –
ఆలీ వచ్చి పవన్ ని ఒకసారి బయటకి రమ్మంటాడు (పార్వతీ మెల్టన్ ప్రపోజ్ చేసే సీన్లో) –
పవన్: 1) అర్జెంటా 2) ఇంపార్టెంటా?
ఆలీ: 3) సీరియస్.


అలాగే “అతడు” లో కూడా వాడికేంటే – 1) తెల్లగా ఉంటాడు, 2) పొడుగ్గా ఉంటాడు 3) ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు అంటుంది త్రిష..
అలాగే 1)సిగ్గుతో కూడిన 2) భయం వల్ల వచ్చిన 3) గౌరవం అనే డైలాగూ ఇందులో సూపర్ పాపులర్!
కామెడీ లోనే కాక సెంటిమెంట్ సీన్లోనూ ఇలా 3 స్టెప్స్ ప్రాసెస్ ఫాలో అయ్యాడు త్రివిక్రం చాల చోట్ల.. అయితే ఇది కాన్షస్ గా చేసిందా లేక ఆయాన శైలి సబ్-కాన్షస్ గా అలా ఫిక్స్ అయిందా చెప్పడాం చాలా కష్టం..


ఈ డైలాగుల్లోనే కాక సన్నివేశాల్లోనూ ఒక స్టాండర్డ్ “ట్విస్ట్” నేర్చుకుని సినిమాల్లోకి వచ్చినట్టున్నాడు త్రివిక్రం..అదేంటంటే – చాలా సినిమాల్లో కీలకమైన కథా మలుపు ఏంటంటే – హీరోయిన్ కి వేరే వ్యక్తి తో ఎంగేజ్ మెంట్ అవడం. కావాలంటే గమనించండి-
స్వయం వరం
నువ్వే కావాలి
చిరునవ్వుతో
నువ్వు నాకు నచ్చావ్
మన్మధుడు


ఇలా చాలా సినిమాల్లో సేం పాయింట్ ని మెయిన్ ట్విస్ట్ గా వాడేసుకున్నాడు త్రివిక్రం..
దర్శకుడయ్యాక దాదాపుగా రచయిత గా ఇతర సినిమాలకి పని చేయడం మానేసినా అప్పుడపుడు ఆబ్లిగేషన్ల వల్ల రచయిత గానూ చేసాడు. అయితే అలా చేసినవి పెద్దగా ఆడలేదు..ఉదాహరణకి పవన్ కళ్యాణ్ హీరో “3ష”  హీరోయిన్ గా “3విక్రం” రైటర్ గా వచ్చిన “3మార్” సినిమా గట్టిగా 3 వారాలు కూడా ఆడలేదు.. ఇలా 3 (“మూడ్”) లేకుండా పనిచేసే సినిమాలు తగ్గించి, మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.


స్పందనలు

 1. chala baga study chasaru, cinemas twist nice find

 2. త్రివిక్రం శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. సినిమాల్లో ఒక కలం పేరు బాగా కలిసొస్తుంది. అది ఎంత బావుంటే అంత మంచిది. అలా త్రివిక్రముడి పేరును తన కలంగా పెట్టుకున్నాడు. ఇట్ మీన్స్.. వామనుడు. ఇంత పొట్టిగా వుంటూ అంత విశ్వాన్ని మూడడుగుల సాయంతో ఆక్రమించాలన్నదే త్రివిక్రముడి ఆలోచన. అది ఈ రచయితకు కరెక్టుగా సరిపోయింది. చిన్న కథతో మూడంటే మూడంచలతో.. విశ్వం మొత్తాన్ని మెప్పించాలని ప్రయత్నం చేయడంలో ఎక్స్ పర్ట్ గా మారాడు. అటు తనలోని మాటల రచయితను, దర్శకుడ్ని బాలెన్స్ చెయ్యలేక ఇబ్బంది పడుతున్నాడు కానీ, డైరెక్టర్ గా క్లిక్ అయిన రైటర్లలో కాంటెంపరరీ తెలుగు సినిమాలో ముఖ్యుడు. కనుక త్రివిక్రం.. ను తక్కువగా తీసిపారేయలేం. గత రెండు సినిమాలుగా తనలోని రచయితను కాస్త పక్కన పెట్టి దర్శకుడికే ఎక్కువ విలువివ్వాలన్న తాపత్రయం అధికంగా కనబరుస్తున్నట్టుంది. దీనివల్ల.. త్రివిక్రం మార్కు డైలాగ్ పంచ్ లు ఆశించిన వారు భంగ పడుతున్నారు. అటు రైటర్, ఇటు డైరెక్టర్ గా త్రివిక్రం రాణించే సినిమా రావాలని ఆశిద్దాం.

  • nice info adi..
   and i gone through your media blog..its very nice bro.. (especially telugu media gossips one 🙂 )

 3. త్రివిక్రం పేరు సంగతేమో కానీ…మీరు మళ్ళీ రాస్తున్నారని ఒక ఫ్రెండు చెప్తే తెల్సి వచ్చాను. అందుకు సంతోషం….

  • అవునండీ…మళ్ళీ మొదలెట్టా 🙂 మీరు సంతోషిస్తున్నందుకు నాకు సంతోషం 🙂

 4. Trivikram is one of the finest directors. But the only bad thing is plagiarism (May be wrong word here) But, he copies scenes from other foreign language movies. Of course, all our telugu directors do – SSRajamouli, Puri Jagan etc.

  But, Trivikram movies are special. Always.

  • plagiarism (May be wrong word here) >>

   కొంతవరకు కరెక్టే భయ్యా.. “Meet the parents” లో సీన్ నువ్వు నాకు నచ్చావ్ లో ఉంది..అలాగే చిరునవ్వుతో లో సినిమా థియేటర్ లో సీన్ ఈ మధ్యనే “Life is beautiful” అనే ఇంగ్లీష్ సినిమాలో చూసా..ఇలాంటివి బోలెడు..but who cares..మనకి కావలసింది ఆయన ఇస్తున్నాడు

   • ఆయన కాపి కొటుడుతున్నాడు అనే ముందర, మనల్ని మనం విశ్లేషించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగు తనం అనేది ఎంతవరకు ఉంది? విశ్వనాథ్,బాపు తీసినట్టు సినేమాలు తీస్తే ఈ రోజుల్లో ఎవరైనా చూస్తారా? మన మీద ప్రతిదానిలో చదువుల నుంచి మొదలుకొని ఉద్యోగాలు చేసే కంపేనిల పాశ్చత్య ప్రభావం ఇంత పెరిగ్ పోయిందో మనకే తెలియదు.

 5. Man, you are back…I am so happy ! good to see you. Now don’t stop writing..no brakes…please continue 🙂

 6. Super post…good observation!

 7. nice

 8. Good to see you again in blogs Mohan garu.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: