ఆ మధ్యెపుడో వెన్నెల సినిమాలో నాకు బాగా ఇష్టమైన ఈ సాంగ్ ఆడియో లో ఉండి సినిమాలో లేదనీ, బహుశా పాటలో ఉన్న “క్యాస్ట్ రెఫరెన్స్” వల్ల సెన్సార్ ప్రాబ్లెంస్ ఎదురు కాకూడదని పాటని సినిమాలో ఉంచకపోయి ఉండవచ్చనీ రాశాను..
లింక్ ఇక్కడ..
అయితే ఒకసారి (2010-నవంబర్ లో) ట్విట్టర్ లో వెన్నెల దర్శకుడు దేవకట్టా ని ఇదే విషయం అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఇదీ..
ఈ సారి తీయబోయే సినిమాలో ఈ పాటని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాననీ ఆయన అన్నారు..అయితే సెన్సార్ వివాదాలు గతం తో పోలిస్తే ఈ మధ్య మరీ “సెన్సిటివ్” అయ్యాయి..చూడాలి ఇలాంటి పాటల్ని కూడా వివాదం చేస్తారొ లేక లైట్ తీసుకుని ఎంజాయ్ చేస్తారో!
‘వెన్నెల’ సినిమాలోని పాటలు నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ చాలా ఎక్కువగా వింటూ ఉంటాను.
By: Ramana on 2012/11/09
at 9:34 సా.