జై చిరంజీవ లో సమీర రెడ్డి తో అంటాడు చిరంజీవి – “నాకు ఇంగ్లీష్ రాదు” అని. ఠకీమని ఒక ముద్దు పెట్టి “హౌ క్యూట్” అంటుంది సమీరా. ఇంగ్లీష్ రాకపోవడం అంత క్యూటెలా అయిందబ్బా అని మనం ఆలోచిస్తుంటే చిరంజీవి “శైలూ, నాకు హిందీ కూడా రాదు” అని మరో బుగ్గ చూపెడతాడు…. అది చూసి శైలూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. బానే ఉంది. తెలుగు సినిమాల్లో హీరోలకి – ఇంగ్లీష్ రాకపోయినా, హిందీ రాకపోయినా, మహేష్ బాబు లా పొడుగ్గా ఉన్నా , ఎన్టీయార్ లాగా సున్నుండ లా ఉన్నా, రవితేజ లా రఫ్ గా ఉన్నా, నాగ చైతన్య లా స్లిం గా ఉన్నా, హరికృష్ణ లా waist పెద్దగా ఉన్నా – సరిగ్గా ఆ కారణం మీదే తెలుగు హీరోయిన్లకి ఆయా హీరోలని ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది… సినిమా కాబట్టి అది న్యాయమే!
కానీ చిరంజీవిగారు ఈ మధ్య తన ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అక్కడి లోకల్ మీడియా ప్రతినిధులు సారాంశాన్ని హిందీ లో చెప్పమని అడిగినపుడు “ఇత్నా హిందీ నహి ఆతా హై, అబ్ సీఖూంగా” అని అంటూ నెక్స్ట్ టైం నుంచి హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తానని కొంచెం టైం ఇవ్వమని సరదాగా మాట్లాడుతూ వాతావరణాన్ని కాస్త తేలికపరిచి కాన్ఫరెన్స్ ముగించేసారు… ఏ మాటకామాటే చెప్పుకోవాలి – ఆ కాస్త సెన్సాఫ్ హ్యూమర్ వల్లే చిరంజీవి చాలా విషయాల్లోని తన బలహీనతలని అలా నెట్టుకొచ్చేస్తున్నాడు కానీ లేకపోతే తనకి మంత్రి పదవి ఇస్తారని ఆయనకి ముందే తెలుసు.. బహుశా టూరిజం శాఖ ఇస్తారని కూడా తెలిసే ఉండొచ్చు… కాస్తంత హిందీ విషయం లో కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చి ఉంటే ఈ ఇబ్బంది ఎదురై ఉండేది కాదేమో. “నాకు హిందీ రాదు” అని చెబితే, సినిమాలో శైలూ లాగా ముచ్చట పడేవాళ్ళు బయటి ప్రపంచం లో ఉండరు కదా భయ్యా..!!! ఇడియట్ సినిమా లో ఒక డైలాగ్ ఉంటుంది – కోట రవితేజ తో అంటాడు – “ఒక్కోసారి వీణ్ణి చూస్తే, వీడంత తెలివైనోడు ఇంకోడు లేదు అనిపిస్తుంది, ఇంకోసారేమో బండి సున్నాలు తెచ్చుకుంటాడు” అని. రాజకీయాల్లో చిరంజీవి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఏదేమైనా ఈ ఫొటో లో చిరంజీవిని సూట్, టై లో చూస్తే చాలా వెరైటీ గా ఉంది. ఆ మధ్య రాజశేఖర రెడ్డి సూట్ వేసుకుని ఢిల్లీ కి వచ్చినపుడు ఇంతకన్నా వెరైటీ గా ఉండేది.. 🙂
bagundhi
By: anu on 2012/11/12
at 2:29 సా.
“ఒక్కోసారి వీణ్ణి చూస్తే, వీడంత తెలివైనోడు ఇంకోడు లేదు అనిపిస్తుంది, ఇంకోసారేమో బండి సున్నాలు తెచ్చుకుంటాడు”
హహహ బాగా చెప్పారు 🙂
By: వేణూశ్రీకాంత్ on 2012/11/12
at 8:01 సా.
Had this incident happened to any Tamil MP, he would reply IN TAMIL that he would not learn in TAMIL. As a topping, he would suggest media to learn TAMIL and let whole the f*****g world learn TAMIL.
Media would tell him that they did not understand a single bit. Even then he would reply “I dont care” in TAMIL. 🙂
Yes, really it was a good gesture that Chiru took it positively and convered it with funny hindi Pronunciation. 🙂
By: Chandu on 2012/11/13
at 2:18 ఉద.
*he would not learn HINDI.” Sorry! Typo of aalochana!
By: Chandu on 2012/11/13
at 2:18 ఉద.
boss, ikkada samasya federal system lo andaru Hindi, English teliste inka aa vidham ga munduku povachu rajakeeyala lo…adhi sangati………
By: Srini on 2012/11/16
at 3:04 సా.