ఆ మధ్య రిలీజైన ఈ పుస్తకం చాలా కాలం పాటు “టాప్ బుక్స్” లిస్ట్ లో టాప్ లో ఉందని తెలియడం వల్లా ప్లస్ అసలు వారానికి నాలుగు గంటలు మాత్రమే పనిచేసి సర్వైవ్ అవడం సాధ్యమా అనే కుతూహలం చేతా ఈ పుస్తకం ఈ మధ్యే చదివాను.. ESCAPE 9 -5, LIVE ANYWHERE, JOIN NEW RICH అనే క్యాప్షన్ తో, తిమోతి ఫెర్రిస్ అనే రచయిత పేరు తో వచ్చిన ఈ పుస్తకం పూర్తిగా చదివి, ఆ తిమోతి ఫెర్రిస్ బ్లాగ్ కాస్త పరికించాక ఒక ఐడియా కి వచ్చి ఒక నాలుగు మాటలు దాని గురించి వ్రాయాలనిపించింది..
అసలేం చెప్పాడు: ఈ బుక్ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక 4 పాయింట్స్ లో చెప్పాడు –
D – డెఫినిషన్
E – ఎలిమినేషన్
A – ఆటోమేషన్
L – లిబరేషన్
ఎలిమినేషన్ చాప్టర్ లో మెయిన్ గా రెండు ఐడియాస్ చెప్తాడు. ఒకటి- ప్రపంచం మొత్తం 80/20 ప్రిన్సిపుల్ మీద నడుస్తుంది. ఉదాహరణకి బ్యాంకులకి వచ్చే 80% ఆదాయం 20% సోర్సెస్ నుండే వస్తుంది (అందరూ ఇదే ఫాలో అయిపోతే, స్టేట్ బ్యాంక్ లాంటి వాళ్ళందరూ, పల్లెల్లో బ్రాంచులన్నీ ఎత్తేసి, wealthy customers ని వెతుక్కుంటారు..సర్జన్స్ అందరూ OP చూడటం మానేసి కేవలం ఆపరేషన్లు చేసుకుని మిగిలిన టైం రిలాక్స్ అయిపోతారు). కాబట్టి ఆ సోర్సెస్ ని మాత్రమే కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. రెండోది – పార్కిన్సన్ ప్రిన్సిపుల్. ఇదేమి చెబుతుందంటే – ఏ పని అయినా దానికి allot అయిన వ్య్వవధి కి అనుగుణంగా swell అవుతుంది. అంటే ఒక రిపోర్ట్ తయారు చేయమని మీకు రెండ్రోజుల వ్యవధి ఇస్తే మీరా పని రెండు రోజుల్లో చేయగలుగుతారు, లేదూ రెండు వారాలు ఇస్తే మీరు ఆ పని పూర్తి చేయడానికి రెండు వారాలు వెచ్చిస్తారు. ఈ రెండు ఐడియాలతో పాటు టైం వేస్ట్ చేసే అన్ని దారుల్నీ మూసేయమని కొన్ని చిట్కాలు చెబుతాడు.
ఇక ఆటోమేషన్ చాప్టర్ లో – మీ పనులన్నీ ఆటోమేట్ లేదా అవుట్ సోర్స్ చేసుకోమంటాడు. ఇండియా లాంటి దేశాలకి మీ వ్యక్తిగత పనులు కూడా అవుట్ సోర్స్ చేయొచ్చు, ఇది అంతగా ఖరీదు కూడా కాదు, పైగా మీకు బోలెడు టైం సేవ్ అవుతుంది (ఎందుకో ఈ టాపిక్ చదివేటపుడు, కొంచెం కడుపు మండినట్టనిపించింది) అంటాడు. మీ వైఫ్ కి సారీ చెప్పాలన్నా సరే, మీ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీ కి చెప్తే, బెంగళూర్ నుంచి ఇ-మెయిల్లో మంచి గ్రీటింగ్ కార్డ్ ద్వారా సారీ చెప్తాడు అని వ్రాస్తాడు. అలాగే ఒక వెబ్ బేస్డ్ బిజినెస్ మొదలెట్టడం ఎలా, తద్వారా ఆదాయవనరు ని ఆటోమేట్ చేయడం ఎలా అనే దాన్ని చర్చిస్తాడు. ఈ తరహా బిజినెస్ చేసి ఎక్స్ట్రా ఇన్ కం సంపాదించుకోవాలనుకునేవాళ్ళకి ప్రాక్టికల్ ఐడియాస్ చాలానే ఇస్తాడు.
ఇక చివరిది లిబరేషన్. మీకు ఆటోమేటెడ్ ఇన్ కం ఉందిప్పుడు. అవసరం అయితే మీ జాబ్ ని కూడా వర్క్ ఫ్రం హోం మార్చుకోమంటాడు. అందుకు మీ బాస్ ఒప్పుకోకపోతే ఆయాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో సలహాలు ఇస్తాడు రచయిత. ఇక జీవితం లో తరచూ మినీ టూర్స్ (అంటే 3 నెలలో 6 నెలలో లేకపోతే సంవత్సరమో) చేస్తూ జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆయా టూర్స్ కి వెళ్ళేటపుడు మీ ఇల్లు ఖాళీ చేయాలంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మరి మీకు లెటర్స్ వస్తే ఏ అడ్రస్ కి (ఇప్పుడు టూర్లో ఉన్నందువల్ల – మీకు ఒక ఇల్లంటూ లేదు కదా!) పంపించాలి – ఇలాంటి వాటి మీద చిట్కాలు ఇస్తాడు. ఇదండీ ఈ పుస్తకం కథ.
నాకయితే, ఇందులో వ్యక్తిగతంగా చాలా విషయాలు నచ్చలేదు. అదీగాక ఈ రచయిత ఫ్రెండొకాయన తన బ్లాగ్ లో ఈ పుస్తకాన్ని గురించి వ్రాస్తూ, ఈ రచయిత వారానికి 4 గంటలు కాదు కనీసం 60 గంటలు పనిచేస్తాడు అని చెప్పుకొచ్చాడు :)అయితే, జీవితం అంటే ప్రపంచం మొత్తం విజిట్ చేయడమే అనుకునే వాళ్ళకి, వెబ్ బేస్డ్ బిజినెస్ పట్ల ఒక inclination ఉన్నవాళ్ళకి, ఇది పనికిరావచ్చు అనిపించింది..
స్పందించండి