నిన్న ఒక ఛానెల్ లో “లైవ్ ప్రోగ్రాం” ఒకటి వచ్చింది. కె. మురారి. అనే నిర్మాత తన ఆత్మకథ లాంటి అనుభవాల్ని ఒక పుస్తకం వ్రాసాడనీ, అందులోని అంశాలు వివాదాస్పదం “అవుతున్నాయని” (ఒకవేళ అవకపోతే, అయ్యేలా తాము కృషి చేస్తామనీ-) ఇద్దరు సినీ విమర్శకులని ఆయనతో పాటు కూర్చోబెట్టి ఓ గంట సేపు కాలక్షేపం చేసారు. ఆ మధ్య కొంతమంది నిర్మాతలు, హీరోలు, దర్శకులు – తమ సినిమాల కి టైటిల్ లో తమపేరు వచ్చేలా పెట్టుకున్నారని ఒక పోస్ట్ వేసినపుడు “నారీ నారీ నడుమ మురారీ” సినిమా ని ఆ సినిమా నిర్మాత కె.మురారి ని ప్రస్తావించాను (లింక్ ఇక్కడ).
ఇక నిన్నటి ప్రోగ్రాం లో ఆయన మాట్లాడటం చూస్తుంటే, ఇదేదో కావాలని చేస్తున్న ప్రోగ్రాం తప్ప ఇందులో పస లేదు అనిపించింది. “తెలుగు సినిమా పరిశ్రమలో మరో భూకంపం” అనే స్క్రోలింగ్ తో వచ్చిన ఆ ప్రోగ్రాం లో ఆయన చేసిన ఘాటైన విమర్శలు ఏంటంటే –
చిరంజీవి- సినిమా తీసేటపుడు- అన్ని విషయాల్లో తల దూరుస్తాడు. అది నాకు నచ్చదు. (ఈయన చిరంజీవి తో ఒక్క సినిమా కూడా తీయలేదు)
నాగార్జున తో జానకీరాముడు సినిమా తీసేటపుడు, పాట షూటింగ్ మధ్యలో దర్శకుడు రాఘవేంద్ర రావు వెళ్ళి వ్యాన్ లో కూర్చుని మందు కొట్టాడు.
సంగీత దర్శకుడు చక్రవర్తి కి స్వరాలే రావు.
దర్శకుడు రాఘవేంద్ర రావు ఆరోజుల్లో నాకు కొంత డబ్బు ఎగ్గొట్టాడు..
ఇలాంటివి. ఈయన ఇప్పుడు సినిమాలు తీయట్లేదు. ఎవరేమనుకున్నా ఈయనకి నష్టం లేదు. కాబట్టి అప్పటి నెగటివ్ విషయాలన్నీ ఇప్పుడు ధైర్యంగా వ్రాసుకున్నాడు. అయితే నాకు ఒకటి అర్థం కాదు, సినీ నిర్మాతలు కానీ, ఇక ఏ పరిశ్రమ అయినా కానీ అందులో పని చేసేటపుడు వివిధ రకాల వ్యక్తులతో పని చేయాల్సివస్తుంది. ఆ క్రమం లో రక రకాల పాజిటివ్ అనుభూతులతో పాటు, రకరకాల నెగటివ్ అనుభూతులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దట్ జాబ్. అయితే ఎవరికైనా వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని అక్షరబద్దం చేసే హక్కు ఉంది. అంత మాత్రాన పరిశ్రమ లో భూకంపం, తీవ్ర వివాదం అవుతాయంటారా?? కె. మురారి గారు కూడా ధైర్యంగా ఎవరినీ విమర్శించలేకపోయాడు ప్రోగ్రాం కి వచ్చాక. చిరంజీవి గురించి విమర్శిస్తూనే, ఆయన లాంటి హార్డ్ వర్కర్ లేడు అంటాడు. రాఘవేంద్ర రావు ని విమర్శిస్తూనే “త్రిశూలం ” సినిమా లో సూపర్ సీన్ తీశాడు అంటాడు. ఇక లైవ్ లో అక్కడ కూర్చున్న ఇద్దరు విమర్శకులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయన్ని విమర్శించలేక, ఈయన విమర్శలని ఒప్పుకోలేక, బ్యాలన్స్ చేస్తూ మాట్లాడితే మధ్యలో ఏదో ఒక విషయాన్ని పట్తుకుని పెద్దాయన ఆర్గ్యూ చేస్తాడు. వెరసి, పుస్తకానికి ప్రాచుర్యం కల్పించడం తప్ప ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏమీ లేదనిపించింది.
నిజంగా ఈ ప్రోగ్రాం యొక్క ఆంతర్యం అర్ధం కాక చాల సేపు తలబాదుకొని.ఓవెర్రినవ్వు,పిచ్చి నవ్వుతో మన సుత్తి వీరభద్రం గారిలా అయిపోయాను,
.
తర్వాత మాములుగా అయ్యాను అది వేరసంగతి !!
అంటే దేనికోసం ?ఎందుకోసం ? తెలియదు! అయిపోయిన విషయాల ప్రస్తావన వల్ల తేవడం ఎందుకో? దీనిని ‘ఆ’ చానెల్ వాళ్ళుప్రసారం చెయ్యడం ఏమిటో? అన్ని ప్రస్నార్ధకాలే?
By: phalguni on 2012/11/16
at 9:12 సా.
మీరు గమనించారో లేదో ..అందులో ఒక జర్నలిస్ట్ , పేరు నాగేంద్ర అనుకుంట..అచ్చం చిరనజీవిని imitate చేసేడు తన హావభావాలతో .చాల ఫన్నీగా అనిపించింది అంత వయసు వొచ్చాక కూడా ఇంకా ఆ imitation ఏంటో అని. మురారి గారి కన్నా ABN మూర్తి గారు ఎక్కువ చేసారు. ఎన్నిసార్లు వక్తలు అందరూ ఇందులో అంత భూకంపం ఎమున్నాది అంటున్న , మూర్తి గారు తగ్గకుండా ప్రోగ్రాం ని ముందుకి నడిపించి మమ అనిపించారు. రేపో మాపో ఆ గోకుడు RK గారు ఓపెన్ హార్టు కూడా చేసేస్తారు మురారి గారితో ..
By: raghu on 2012/11/18
at 12:37 సా.