“ఏంటి బాసూ అప్పుడెప్పుడో చిరంజీవి సొంత ఛానెల్ పెడతానన్నాడు..చాలా రోజులయింది ..దాని గురించి అప్ డేటే లేదు..”
” ఇంక పెట్టడేమో.. సొంత ఛానెల్ పెట్టిన వెంటనే, ఢిల్లీ కోర్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి చిరంజీవి సొంత ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు..పార్టీకి ఇది మంచిది కాదు అని..ఓ గ్రూప్ వెళ్ళి చెప్తారు..అక్కడికి చిరంజీవి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది..”
” మరి కాంగ్రెస్ ఎంపీ వివేక్ V6 ఛానెల్ పెట్టాడు కదా..అతనికి ఏం ప్రాబ్లెముండదా..”
” అతను తెలంగాణ ఎంపీ. తెలంగాణ అంటే ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి..కెసీఅర్ చేతిలో ఒక్కటే ఎందుకు తెలంగాణ మీడియా ఉండటం అని కాంగ్రెస్ ఎంపీ కి కొంచెం “పుష్” ఇచ్చిఉంటారు..అయినా ఈ వివేక్ వాళ్ళ ఫాదర్ వెంకటస్వామి ఆ రోజుల్లోనే రెండు మూడుసార్లు కేబినేట్ ర్యాంకు లో సెంట్రల్ మినిస్ట్రీ చేసినట్టున్నాడు..కొంచెం వెయిట్ ఉంటది మరి..వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు V తో మొదలవుతాయంట..వెంకటస్వామి, వివేక్, వినోద్ అట్లా..అలా వాళు 6 మంది ఉన్నారు కాబట్టి V6 అని పెట్టారంట ఛానెల్ పేరు..”
” ఈ కాకా కి అంతుందా..మరి వైఎస్సార్ ఎప్పుడూ ఈ కాకా, కేకే వీళ్ళెవరూ వార్డ్ మెంబర్ గా కూడా గెలవరు అని పదే పదే అనేవాడు..”
” అది “మహానేత” స్ట్రాటజీ.. ”
” అప్పట్లో హీరో శ్రీకాంత్ లాండ్ గొడవైంది..ఈ కాకా తోనే కదా..ఇంతకీ ఏమయింది అది చివరికి..చిరంజీవి ఏమైనా హెల్ప్ చేసిఉంటాడా శ్రీకాంత్ కి..”
” చిరంజీవికి శ్రీకాంత్ కి ..దానికి ముందునుంచే కొంచెం టర్మ్స్ పోయినట్టున్నాయి కదా… 2008 టైం లో ఏదో ఇన్ కం టాక్స్ రైడ్ ఏదో జరిగితే శ్రీకాంత్ వాళ్ళతో కాస్త దురుసుగా ప్రవర్తించి ఆ తర్వాత ఇష్యూ పెద్దదైతే చిరంజీవి హెల్ప్ అడిగితే చిరంజీవి “ఏవైనా పాజిటివ్ విషయాలకి వాడుకుంటే పర్లేదు కానీ నా పేరు ఇలాంటి నెగటివ్ విషయాలకి వాడుకోవద్దు..” అని వార్నింగ్ లాగా చెప్పాడంట కదా..అంటారు మరి.. ”
” ఇది మరీ టూమచ్ బాసూ.. ఇంక ఓన్లీ పాజిటివ్ విషయాలకి ..రక్త దానాలకి..చిరంజీవి సూపర్ అనే విషయాలకి చిరంజీవి పేరు వాడుకోవాలి..ఇట్లా ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు మాత్రం చిరంజీవి హెల్ప్ అడగకూడదు అంటే ఎట్లా..లీడర్ అనేవాడు తనవాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి..”
” అది కరెక్టేలే కానీ చిరంజీవికి అంత గట్స్ ఉన్నట్టు లేవు..అదే జగన్ చూడు … అప్పట్లో అంబటి రాంబాబు మీద వుమనిజర్ అనే ఆరొఫణలు ABN ఛానెల్ తెస్తే సాయంత్రానికల్లా ఆ ఛానెల్ నే డిఫెన్స్ లో పడేసారు..అదే చిరంజీవి పార్టీ లో ఇలాంటిది జరిగుంటే గంట లో రాంబాబుని పార్టీలోంచి తీసేసి, చిరంజీవి సాయంత్రానికల్లా రోడ్ మీద మోకాళ్ళ మీద కూర్చుని మహిళా లోకానికి క్షమాపణ చెప్పి ప్లస్ మెసేజ్ ఇచ్చి, ఆ (అంబటి వల్లో పడ్డ) అమ్మాయిని పార్టీ లోకి అహ్వానించి ఉండేవాడు..”
” ఈ విషయం లో జగన్ గట్స్ మాత్రం..వైఎస్సార్ రేంజ్ లో ఉన్నాయి..సిఎం అవుతాడంటావా మరి..”
” ఏమో భయ్యా..ఇప్పుడున్నంత సీన్ రెండేళ్ళ తర్వాత ఉంటుందో లేదో చెప్పలేం… లాస్ట్ లో టిడిపి, కాంగ్రెస్, టీఅరెస్, వైకాపా..4 పార్టీలు చెరో డెబ్బై సీట్లు….ప్లస్ ఆర్ మైనస్ 10 కొడతారేమోనని నా డౌట్..”
“అప్పుడు మిగిలిన 14 సీట్లొ కొట్టిన miscellaneous పార్టీలు కింగ్ మేకర్లు అవుతాయా మళ్ళీ..వర్స్ట్ గా ఉంటది ఏపి పరిస్థితి..”
” అవునూ.. మన తారకరత్న ఏంటి “నేను చాలా వరస్ట్” అనే పేరు తో సినిమా తీస్తున్నాడంట..హహ్హహ్హ ఆ పేరెట్లా పెట్టారు స్వామీ..మరీ దారుణంగా..”
” యముడి క్యారెక్టరంటగా అందులో 🙂 ”
” అవునా..అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి భయ్యా.. ”
” ఇప్పుడైతే ఏమి సినిమాలు కూడా లేనట్టున్నాయి..ఢమరుకం వచ్చేట్ళు లేదిప్పట్లో ”
” ఫేస్ బుక్ లో “ఢమరుకం ముందొస్తుందా..తెలంగాణ ముందొస్తుందా” అని పోల్ పెట్టారంట కదా.. ”
” అవునూ..మొన్నొకసారి ఏదో ఆటో లో ఆరుకోట్లు డబ్బు దొరికింది కదా..అది ఢమరుకం ప్రొడ్యూసర్ ది అంట కదా..నిజమేనా.. ”
” అంటున్నారు మరి..ఆ డబ్బు దొరికిపోయినందుకే, ఫైనాన్సర్ బాకీ తీర్చలేకపోయారంట..అందుకే సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయిందంట..”
” మరి బాల సాయి బాబా డబ్బులన్నారు??”
” ఈ ఆశ్రమాల డబ్బులకి అంతగా ఇన్ క టాక్స్ రెస్ట్రిక్షన్స్ ఉండవ్..అందుకని… తప్పించుకోడానికి వాళ్ళ ని ఇన్వాల్వ్ చేసి ఉంటారు..”
” మరి బాల సాయి బాబా మనుషులు ఎందుకు ఒప్పుకున్నారు..”
” cash down, carry on అయి ఉంటదేమో..”
” అంతే అయి ఉంటది బాసూ.. ప్రతివోడూ cash down, carry on ఇప్పుడూ..సర్లే..ఛలో..లేటవుతోంది..మళ్ళీ మాట్లాడుదాం….”
Lol……
By: Ramana on 2012/11/26
at 3:52 సా.