వ్రాసినది: mohanrazz | 2012/11/26

విజయ శాంతి ని కోతిని చేసిన పోస్టర్ డిజైనర్ క్రియేటివిటి

ఆ మధ్య ఏదో సినిమా పోస్టర్ చూస్తున్నపుడు దాని మీద see to day అని వ్రాసి ఉండటం చూసాను. today స్పెల్లింగ్ కరెక్ట్ గా తెలీక to day అని పోస్టర్ డిజైన్ చేసిన కుర్రాడు వ్రాసాడే అనుకుందాం..దర్శకుడికి, నిర్మాతకీ కూడా ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా అని డౌట్ వచ్చింది. అయితే ఈ పోస్టర్ డిజైన్ చేసే కుర్రాళ్ళ లో క్రియేటివిటీకి మాత్రం కొదువ ఉండదు. “ఇంద్ర” సినిమా ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సినిమా టైటిల్ ఇంద్ర అని మాత్రం చెప్పి పోస్టర్ డిజైన్ చేయమని చెబితే ఆ కుర్రాడే Born for people అని సొంతంగా యాడ్ చేసి పోస్టర్ డిజైన్ చేసాట్ట. అది చిరంజీవి కీ దర్శకుడికీ నచ్చడం తో దాన్నే కంటిన్యూ చేసార్ట.

అలాగే ఆ మధ్య నచ్చావులే సినిమా కి రవిబాబు హీరో హీరోయిన్లని పోస్టర్ మీద చూపించకుండా కోతిబొమ్మలతో చేసిన పబ్లిసిటీ కి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ మచి అప్లాజ్ వచ్చింది. అయితే ఆ సినిమా ని చూసి వాత పెట్టుకుని ఆ వెంటనే మస్త్ అనే సినిమా (ఎస్వీ కృష్ణారెడ్డి దీని దర్శకుడు) కి చీమ బొమ్మలతో ఏదో డిజైన్ చేసారు కానీ ఆ పోస్టర్ చూసిన వాళ్ళకి అది సినిమా వాల్ పోస్టర్ లా కాక ఏదో బ్రెడ్-జాం కంపెనీ వాళ్ళ యాడ్ లా అనిపించి మొదటికే మోసం వచ్చింది.

ఇలాగే ఆ మధ్య- పోస్టర్ డిజైన్ లో ఇంకో ట్రెండ్ నడిచింది – అదీ ప్రత్యేకించి హీరో బేస్డ్ సినిమాలకి. ఉదాహరణకి “మాస్టర్” అనే సినిమా కి చిరంజీవి in and as అని చిన్నగా వ్రాసి దాని కింద పెద్ద అక్షరాలతో “మాస్టర్” అని టైటిల్ వ్రాసే వాళ్ళూ. ఈ తరహా లో కొంత కాలం పాటు చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలన్నింటికీ (టైటిల్ ని బట్టి కూడా) ఇలా in and as అని వ్రాసారు. మరి ఈ డిజైన్ ఏ కుర్ర డిజైనర్ నో బాగా ఇంప్రెస్ చేసినట్టుంది – విజయశాంతి హీరో(యిన్) గా ఆ మధ్య (ఓ పదేళ్ళ క్రితం) వచ్చిన సాహస బాలుడు విచిత్రకోతి అనే సినిమాకి కూడా ఇలాగే పోస్టర్ మీద విజయశాంతి ని ఆ కుర్రాణ్ణి (సాహస బాలుడు ని) పోస్టర్ మీద వేసి (పోస్టర్ మీద సినిమాలో ముఖ్య పాత్ర అయిన ఆ కోతి బొమ్మ వేయకుండా) – విజయశాంతి in and as అని చిన్నక్షరాలతో వ్రాసి దాని కింద పెద్దగా “సాహస బాలుడు విచిత్ర కోతి” అని వ్రాసారు. అలా ఉంటాయి క్రియేటివిటీ పాట్లు.

 


స్పందనలు

 1. hahahaha

 2. ఇంద్ర సినిమాకు అలా డిజైన్ చేసిన కుర్రాడు తర్వాత దర్శకుడు కూడా అయ్యాడు.
  రైడ్, వీర సినిమాలు డైరెక్ట్ చేసిన రమేశ్ వర్మ.

  • ఓహ్..ఆ పోస్టర్ డిజైన్ చేసింది రమేష్ వర్మయా?? సలోని, తరుణ్ ల తో ఫస్ట్ సినిమా తీసాడు..ఆ తర్వాత “మల్లెపూవు” అనే పోయెటిక్ టైటిల్ ని పాడుచేసాడు….

 3. in and as హహహహ :))

 4. అవును రమేశ్ వర్మ ఒక ఊరిలో భయంకరమైన సినిమా. ప్రేమ కథలకు విషాద ముగింపు ఉన్నవి చాలా మంచి సినిమాలు అయ్యాయి. కానీ విషాదం మాత్రమే ఉంటే ఎలా… అందుకే ఒక ఊరిలో ఫ్లాప్. ఇక మల్లెపూవు ఆర్ బీ చౌదరి ఆస్థాన దర్శకుడు వి సముద్ర ది.

  • అవును మల్లెపూవు డైరెక్టర్ సముద్ర యే..రమేష్ వర్మ కేవలం కథ, టైటిల్ మాత్రం ఇచ్చినట్టున్నాడు…

 5. ఓ హీరోనో, హీరోయిన్‌నో తెరకు పరిచయం చేసేటప్పుడు దాదాపు మనోళ్లందరూ ‘తొలి పరిచయం’ అనే వేస్తారెందుకు? ‘మలి పరిచయం’, ‘మళ్లీ పరిచయం’ లాంటివి కూడా ఉంటాయా? (Nandamuri Taraka Ratna deserves an exception. అతనికి ‘మళ్లీ మళ్లీ పరిచయం’ అని వేసుకోవచ్చు. ఎన్ని సినిమాల్లో చేసినా అతనింకా తెలుగు ప్రేక్షకావళికి కొత్తోడే కదా)

  • నిజమే! “పరిచయం” అని వ్రాస్తే పోయేదానికి “తొలి పరిచయం”, “నూతన పరిచయం” అని వ్రాస్తారు మనవాళ్ళు. బహుశా మన వాళ్ళు వాడే “సంత మార్కెట్”, “గుండెకి హార్ట్ అటాక్ వచ్చింది” లాంటిదే ఇదీనూ..

 6. Nachavule time lo nenu hyd lone work chestunna…..
  Naaku ippatiki baagaa gurthu….. maa sahodhyogi oka ammay adigina prashan idi……
  Nachavule poster meeda vunna kukkalu…. ee jaati (breed) kukkalu meekemina telusa ani amayakanga adigindi……….
  Ventane naku Janetu ya Jaane na movie lo second heroin doubt rani la kanipinchindi aa ammay…..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: