వ్రాసినది: mohanrazz | 2012/12/19

తెలుగు లో ట్రూ మల్టీ స్టారర్ వచ్చి నిజంగా 25 ఏళ్ళు అయిందా ???

దిల్ రాజు గారు “సీతమ్మ వాకిట్లో” ఫంక్షన్ లో అన్నారు ఈ మాటని.

శ్రీకాంత్ సెకండ్ హీరో రోల్ లో శంకర్ దాదా సినిమాలు, వెంకటేష్ తో సంక్రాంతి సినిమా, ఇంకా అలాంటి చాలా సినిమాలు వచ్చినా బహుశా శ్రీకాంత్ మరీ స్టార్ హీరో కాదు కాబట్టి సర్దుకుపోదాం, దిల్ రాజు గారే కరక్టయి ఉండవచ్చు..మంచు మనోజ్ కి కూడా  వేదం సమయానికి స్టార్ డం రాలేదు కాబట్టి మళ్ళీ దిల్ రాజు గారే కరక్టనుకుందాం. ఇక నాగార్జున-సుమంత్, మోహన్ బాబు-విష్ణు బాబు, కృష్ణం రాజు-ప్రభాస్ – వీళ్ళ కాంబినేషన్ సినిమాలన్నీ బంధుత్వ కేటగరీ లో అవాయిడ్ చేసెయొచ్చు..మరేమో, మోహన్ బాబు-నాగార్జున, చిరంజీవి-పవన్ కళ్యాణ్, రజనీకాంత్-మోహన్ బాబు ఇవన్నీ నిఖార్సైన గెస్ట్ స్టారర్సే కానీ మల్టీ స్టారర్స్ కాదు కాబట్టి మళ్ళీ దిల్ రాజు గారే కరక్టనుకుందాం. ఇక వెంకటేష్-కమల్ హాసన్ సినిమా కూడా దిల్ రాజు గారు మల్టీ స్టారర్ గా పరిగణంచలేదు, బహుశా ఇద్దరు వేరే వేరే భాషల్లో స్టార్స్ కాబట్టి- ఆ రకంగా దీన్ని లిస్ట్ లోనుంచి పీకేసారనుకుందాం…

కానీ ఎన్ని పీకేసినా, ఎన్ని అవాయిడ్ చేసినా, ఎన్ని సర్దుకు పోయినా – తెలుగు చలనచిత్ర జగత్తు లోనే కళా ఖండమైన – యువరత్న బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు కలిసి నటించగా వచ్చిన “సుల్తాన్” సినిమాని ఒగ్గేయడం మాత్రం నేను ఖండిస్తున్నా….ఖండిస్తున్నా….తెలుగు లో అసలు సిసలైన మల్టీ స్టార్ పన్నెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాయే!!

అన్నట్టు ఇంకో విషయం..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ అంజలి తన కేరక్టర్ పేరు “సీత” అని చెప్పింది.. ఆ లెక్కన సమంత పేరు బహుశా “సిరి” అయి ఉండ వచ్చు..సో.. సీతమ్మ (అంజలి) వాకిట్లో సిరి (సమంత) మల్లె చెట్టు ఏమో…! టైటిల్ జస్టిఫికేషన్ ఇలా చేసారేమో!!!

SVSC


స్పందనలు

 1. siri is name of samantha only.. u can observe it in a song

 2. correct. not just that… early ninties lo, inkaa krishna & krishnamraju heros ga movies teestunna time lo, ‘indrabhavanam’, etc. movies kooda vachchayi. ayinaa, ilaanti definitions annee manam ishtamochchinattu raasukovachchu. edi cheppalanukunte, adi cheppeyyadame. evarannaa adigite, evo saakulu cheppochchu (paina refer chesina combos laga). for eg: flop leni director ani rajamouli ni antaaru, 2nd cinema ‘sye’ super flop movie. commercial hit ano, b,c centers hit ano, adano, idano daanni hit kinda jama kattesi cheppadam.

  • edi cheppalanukunte, adi cheppeyyadame. evarannaa adigite, evo saakulu cheppochchu>>>
   perfect!!!

  • ‘సై’ రాజమౌళి మూడవ సినిమా. రెండోది ‘సింహాద్రి’. మొదటి మూడు సినిమాల పేర్లు చూశాక అతనిక్కూడా విశ్వనాధ్‌లా ‘S’ సెంటిమెంట్ ఉందేమో అనుకున్నా.

   ‘సై’ హిట్ కాకపోవచ్చు కానీ దాని వల్ల ఎవరూ నష్టపోలేదు కూడా. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇది డ్రా అయినట్లు. కాబట్టి ‘రాజమౌళి అన్నీ విజయవంతమైన చిత్రాలే తీశాడు’ అంటే తప్పేమో కానీ ‘రాజమౌళి అపజయం ఎరగడు’ అంటే తప్పు లేదు.

 3. మహేష్ ‘మల్లి’ అయ్యుండొచ్చనుకుంటే (మొదటక్షరాలు కలిశాయి కాబట్టి) మిగిలింది ‘చెట్టు’. వెంకటేష్ వృక్షంలా (మళ్లీ మొదటక్షరాలు కలిశాయోచ్) ఈ కథకి ఊతమిస్తాడనుకుంటే అతని పాత్ర పేరు అదే అయ్యుండాలి 😉

  మల్టీస్టారర్లంటే కేవలం మగ హీరోలు కలిసి నటించేవే అయ్యుండాలా? కొందరు హీరోయిన్లకి, ఒకరిద్దరు ఆడ హీరోలకి ఈ మగ హీరోలని మించిన స్టార్‌డమ్, మార్కెట్ వాల్యూ ఉండేవి/ఉన్నాయి. అంచాత నే సెప్పొచ్చేదేందంటే, స్టార్ హీరోలూ స్టార్ హీరోయిన్లూ కల్సి నటించిన సిన్మాల్ని కూడా మల్టీ స్టారర్ల కిందనే లెక్కెయ్యాల. ఆ రకంగా సూత్తే తెలుగులో మల్టీస్టారర్లకెప్పుడూ కరువు రాలా.

  • అంచాత నే సెప్పొచ్చేదేందంటే, స్టార్ హీరోలూ స్టార్ హీరోయిన్లూ కల్సి నటించిన సిన్మాల్ని కూడా మల్టీ స్టారర్ల కిందనే లెక్కెయ్యాల. ఆ రకంగా సూత్తే తెలుగులో మల్టీస్టారర్లకెప్పుడూ కరువు రాలా. >>

   LOL…ఈ లెక్కన మెకానిక్ అల్లుడు మొదలుకుని..అతడు వరకు అన్నీ మల్టీ స్టారర్సే అంటారా ??

 4. లైట్ తీసుకొండి రావు గారు…
  నేను ఏప్పుడూ చెప్పినట్టుగానే ** డబ్బా కొట్టుకొకపొతే అది సినిమా ఇండస్ట్రి కానే కాదు.** అందరి లాగానే… (….ఏంటి… అందరి లాగానే ) దిల్ రాజు ఆ చెట్టు కొమ్మే.
  ఏన్ని సినిమా ఫంక్షన్లలో…ఏవరెవరు ఏ ఏ నిజాలు మాట్లాడుతున్నారో మనం చూస్తూనే వున్నాం.
  లాజికల్ గా మీరు కర్రెక్ట్…నొ డౌట్… కాకపొతే ఏక కాలం లో కొద్దో గొప్పో ఫాం లొ వున్న పెద్ద హీరోలు అని ఆయన అర్థం కావచ్చు,
  అయినా….
  ఆ రొజున ఫంక్షన్ జరిగిన వాతావరణం చాలా బావుంది.
  మన తెలుగు నటి అంజలి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది
  మొట్టమొదటి సారిగా వెంకటెష్ కొడుకు మీడియా ముందుకు రావటం జరిగింది.
  మహేష్ కొడుకుతొ కలిసి ఆడియో రిలిజ్ చెసాడు.
  సుమ మరియు ఝాన్సి చెసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు…..
  ఈ ఫంక్షన్ రీ టేలికాస్ట్ మరుసటి రొజున వచ్చిన ‘ నాయక్ ‘ ఆడియో ఫంక్షన్ ని డామినేట్ చెయ్యకుండడానికి అల్లు అరవింద్ కింద మీద పడ్డాడు .

  ఇవన్నీ వదిలేసి ఎదో ప్రొడ్యూసర్ కొట్టుకున్న డబ్బా మీద మనం కూడ ఒక రాయి వెయ్యలంటారా చెప్పండి రావు గారు….
  ఏన్నో బాలారిష్టాలు దాటుకోని మన ముందుకి వస్తున్న ఈ సొ కాల్ద్ మల్టీ స్టారర్ ని ఎంకరేజ్ చెయాల్సిన అవసరం ఎంతైనా వుందంటాను.

 5. eti booossju full free.. malla blogla meeda padddav….


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: