వ్రాసినది: mohanrazz | 2013/07/07

పాపం వేటూరి!

వేటూరి..నా ఆల్-టైం ఫేవరెట్ గీతరచయిత.

చిన్నపుడెపుడో సీతాకోక చిలుక పాటలు వింటుంటే..

హే చుక్కా నవ్వవే
నావకు చుక్కానవ్వవే..

……

……

చుక్కా నవ్వవే
వేగుల చుక్కానవ్వవే..

లాంటి పదకేళులు చూస్తే అబ్బురమనిపించేది!!!

  
తెలుగు సినిమా పాటల్లో “వేటూరి”కి ఒక విశిష్టమైన స్థానముంది. “ఆనంద్” సినిమా రిలీజ్ అయిన కొత్తలో శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ లో చెప్పేవాడు- “ముందు నేను ఈ సినిమా ని పాటల్లేకుండా ప్లాన్ చేసాను.కానీ వేటూరి గారితో ఒక సారి మాట్లాడాక నాకు పాటల ప్రాశస్త్యం తెలిసింది.వంద సీన్లలో చెప్పగల విషయాన్ని పాటల్లో ఒక్క ఎక్స్ ప్రెషన్ లో చెప్పొచ్చని తెలిసింది. అందువల్ల పాటలు జతచేసాం”. ఆనంద్ సినిమా లో వేటూరి చాలా మంచి పాటలు వ్రాశారు.

ఆ మధ్యెపుడో ఆనంద్ సినిమా డివిడి చూస్తున్నాను. క్రింద ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ తో. ఒక పాట వస్తోంది.

ఎదలో గానం ..
పెదవే మౌనం..
సెలవన్నాయి కలలు..
సెలయేరైన కనులలో..
మెరిసెనిలా శ్రీరంగకావేరి సారంగ వర్ణాలలో…..      

పాటని బాగా ఆస్వాదిస్తూ చూస్తున్నాను. ఇటు పాట వస్తుంటే అటు అన్ని లైన్లకి క్రింద ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ లో వాటి అనువాదాలు వస్తున్నాయి. ఇంతలో ఒక విషయం నాకు గమ్మత్తుగా అనిపించింది. అదేంటంటే వేటూరి గారు “మెరిసెనిలా శ్రీరంగకావేరి సారంగ వర్ణాలలో” అని వ్రాస్తే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసిన వాళ్ళు “They glistered in colours” అని ఒక్క ముక్క లో వ్రాసేసారు. నిజానికి ఆ ఒక్క అంశం చాలా విషయాలు చెప్పింది- తెలుగుకే సొంతమై, ఇంగ్లీష్ లాంటి భాషల్లోకి అనువదించవీలు కాని తెనుగు సొగసు ని, అలాంటి సొగసైన పదాలతో “ఆనంద్” లాంటి కమర్షియల్ సినిమా పాటలకి సాహితీ గుబాళింపులద్దిన వేటూరి గొప్పదనాన్ని. నిజంగా వేటూరి గారు చాలా గ్రేట్ అనిపించింది.

 అయితే (just for fun) ఇంతలోనే వచ్చిన ఒక చిలిపి ఆలోచన “పాపం వేటూరి!” అని నేను అనుకునేలా చేసింది. అదేంటంటే – పాపం వేటూరి గారు అంత కష్టపడి

“శ్రీ–రం–గ–కా–వే–రి–సా–రం–గ– వ–ర్ణా–ల–లో” అని వ్రాస్తే, వాడెవడో చా..లా…. సింపుల్ గా “colors” అని ఒక్క ముఖ్ఖ లో తేల్చేసాడుగా అని 🙂 !!!!


స్పందనలు

  1. 🙂

  2. glistered? what kind of word is that?

    You shd take a close look at the songs he penned for Sankarabharanam movie, esply the song – Raagam thaanam pallavi. Beautifully done.

  3. వేటూరి గారు రాసింది “శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో” అని అనుకుంటానండి.

  4. really exxcellent lyricist…………
    i agree with kottapali
    see all his songs even in aa ante amalapuram……..u will find at least one nice experiment

  5. సీతాకోక చిలుక సినిమాలో ఒక పాటలో వేటూరి గారు, తన ప్రేయసి పట్ల ఓ ప్రియుడి గుండెల్లోని ప్రేమకి తన మాటలతో ఎలాంటి పట్టుచీర కప్పారో …

    ” నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా…
    ఆ కట్టుబడికి తరించేనే పట్టుపురుగు జన్మా…ఓ పుత్తడి బొమ్మా…! “

  6. పదిహేనేళ్ల పై మాటేమో – ఆదివారం డి.డి లో ఓ చిత్రరాజం వచ్చేది, వారానికి ఒక భాష చొప్పున, క్రింద ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ తో. ఓ సారి దాన వీర శూర కర్ణ సినిమా వేస్తారంటే – టీవీ ముందు చేరాం – ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ రాసే వీరుడెవ్వడో చూద్దామని –
    ఆ వారం ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ లేకుండానే సినిమా వేశారు.

  7. మీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.

  8. ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని “శంకరాభరణం” లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు.”సిరి సిరి మువ్వలో” వారు వ్రాసిన”ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల” అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి.”ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన” అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే “మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ” అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,”నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక “అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని”స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ” అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే.”నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు””మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం’ అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే .”క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు” అని తట్టిలేపింది వారె.”ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె” అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే.”ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది.” అని కులాలు లేవు అని చెప్పందీ వారె.”పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో” అని ఒక అమాయక కొయదొర భక్తిని “ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము ” అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె.”ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ” అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే.”నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన” అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ “అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె.”ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ,” అని “అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ ” అంటూ ధైర్యాన్నిచ్చింది వారె.”వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం ” అని చెప్పిన అయనే “అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం” అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.

  9. విశ్వనాథ్ గారికి, రాఘవేంధ్రరావు గారికి సమానంగా హిట్ సాంగ్స్ ఇవ్వటం కేవలం ఆయన వల్లనే సాధ్యం.
    “ఓంకారనాదాను సంధానమౌ” అన్నా “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నా
    నవరసాలు తన పాటల్లో చూపించటం ఆయనకే చెల్లుతుంది.
    అవును. సుశీల గారికి లాగా వేటూరి గారికి సన్మానం ఏమీ లేదా?

    నాదో సందేహం .
    సబ్ టైటిల్స్ లో ఆయన పేరుని VETURI అని వేసారా లేక VETTORI అని వేసారా?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: