ఆ మధ్యెపుడో టీం లీడ్ అయిన కొత్తలో ఒక ట్రైయినింగ్ అటెండ్ అవాల్సివచ్చింది. ఫుల్ వీకెండ్ ట్రెయినింగ్. లీడర్ షిప్ స్కిల్స్ అనో అలాంటిదేదో ఇంకొకటి టాపిక్ అన్నమాట. ఎవరో ఎక్స్‌టర్నల్ ట్రైనర్ వచ్చాడు. అతని క్రెడెన్షియల్స్ ఏమో చాలా బాగా ఉన్నాయి (మర్చెంట్ నేవీ లో చేసాడు, నేషనల్ చానెల్ లో న్యూస్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ లో ఎడిటర్ గా చేసాడు, టివి సీరియల్స్ నిర్మించాడు, డైరెక్షన్ చేసాడు, యాడ్స్ తీసాడు, జెమిని టివి ప్రారంభమిన కొత్తలో దానిలో చీఫ్ ఎగ్జెక్యూటివ్ గా చేసాడు, ఆ తర్వాత ఎంట్రప్రెన్యూర్ గా చేసాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో అడల్ట్ టీచింగ్ మీద డిప్లమో ఏదో చేసాడు….ఆ తర్వాత ఫుల్ టైం కార్పొరేట్ ట్రైనర్ గా మారిపోయాడు..ఇలాంటివే ఇంకొన్ని చెప్పాడు..). క్రెడెన్షియల్స్ సంగతి ప్రక్కన పెడితే ట్రెయినింగ్ కూడా రొటీన్ సోది లాగా లేకుండా -చాలా ఇంటరాక్టివ్ గా, interesting గా ఉండింది.
అయితే ఆయన మధ్య లో లీడర్ షిప్ గురించి ఏదో చెప్తూ “లగాన్” సినిమా ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. లీడర్ షిప్ లోని ఒక్కొక్క క్వాలిటీ ని లగాన్ లో ని అమీర్ ఖాన్ క్యారెక్టర్ లోని ఒక్కొక్క క్వాలిటీ తో కంపేర్ చేస్తూ ఒక రకమైన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేసాడు. అక్కడి దాకా బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే ఒక జెనెరిక్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. “లగాన్ అనే కాదు మీ ఫేవరెట్ సినిమా ఏదో చెప్పండి, అందులోనూ బాగా తరచి చూస్తే మీకు ఇలాంటి లీడర్ షిపే కనిపిస్తుంది. నిజానికి అలా లీడర్ షిప్ క్వాలిటీ ఉండడం వల్లే మీకు తెలీకుండానే అవి మీ ఫేవరెట్ సినిమాలయ్యాయి” అన్నాడు. ఒకతన్ని అడిగాడు “ఫేవరెట్ సినిమా ఏది?” అతను చెప్పాడు “The pursuit of happiness”. సరే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ లో ఉన్న లీడర్ షిప్ క్వాలిటీస్, అవి ఎలా అతను ఎంట్రప్రెన్యూర్ అవడానికి దారి తీసాయో చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకతన్ని అడిగాడు. “షోలే” అన్నాడు. వీరు క్యారెక్టర్, జై క్యారెక్టర్ రెంటి గురించీ కాసేపు డిస్కస్ చేసాడు. ఇంకొకతను “సర్ఫరోష్” అన్నాడు. అందులోని అమీర్ ఖాన్ క్యారెక్టర్ లోని ఇంకొన్ని లీడర్ షిప్ క్వాలిటీస్ చెప్పాడు. మీరు హిట్ అయిన ఏ సినిమా అయినా తీసుకోండి ఆ లీడర్ షిప్ లెసన్ అందులో implicit గా ఉంటుంది అన్నాడు. ఇక నెక్స్ట్ నన్నే అడగబోతున్నాడు. నాకెందుకో ఒక కుటిలమైన ఆలోచన వచ్చింది 🙂 –
“ఫేవరెట్ సినిమా ఏది?” అడిగాడు.
“హం ఆప్కే హై కౌన్” అని చెప్పాను.
ఒక్క క్షణం మిగతా ఆడియెన్స్ కి అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అందరూ పక్కున నవ్వేసారు. ఆయనకూ ఏం చెప్పాలో అర్థం కాలేదు – “yes, even in hum aapke hain kaun….u can..” అంటున్నాడే కానీ ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కావడం లేదతనికి. ఈ లోగా జనాలెవరో ఇంకొంచెం గట్టిగా నవ్వుతూంటే- నాకే ఇబ్బందనిపించి, “I like Dilwale Dulhaniya le jayinge also” అని చెప్తే ఆ తర్వాత అతను – ” yeah, in Dil wale dulhaniya lejayinge sharukh has guts…” అంటూ ఏదో చెప్తూ ఆ రకంగా ముందుకు పోయాడు….
hahhahahahahahha gud …….
By: vinay chakravarthi on 2009/09/10
at 10:35 ఉద.
మొత్తనికి మీ కుటిలం తో, ఆయన పరిస్థితిని జఠిలం చేసారన్నమాట…హ హ హ.
By: sowmya on 2009/09/10
at 10:59 ఉద.
😀 I pity that trainer!!!
By: laxmi on 2009/09/10
at 11:31 ఉద.
ఆ ట్రెయినర్ విజయ్ మారూర్ కాదుకదా!
By: కె.మహేష్ కుమార్ on 2009/09/10
at 3:24 సా.
కాదే….ఎందుకలా అడిగారు? పైన చెప్పిన క్రెడెన్షియల్స్ అన్నీ ఈయనకూ మ్యాచ్ అయ్యాయా ఏంటి???
By: mohanrazz on 2009/09/10
at 3:44 సా.
good one.
By: కొత్తపాళీ on 2009/09/10
at 9:59 సా.
hmmm… 😉 😉
By: nelabaludu on 2009/09/10
at 10:09 సా.
🙂 🙂 🙂
By: వెంకటరమణ on 2009/09/12
at 10:50 ఉద.