అప్పట్లో (1998-2000) జెమిని టివి లో రోజూ మధ్యాహ్నం ఒక సినిమా వేసే వాడు. అప్పటికింకా కొత్త తెలుగు సినిమాల శాటిలైట్ రైట్స్ పెద్దగా తీసుకోక పోవడం వల్ల తొంభై శాతం తమిళ డబ్బింగ్ సినిమాలు వేసేవాడు. అవి కూడా కనీసం తమిళం లో పెద్ద హీరోల సినిమాల డబ్బింగ్ లు కాదు. తమిళ వాళ్ళు కూడా మరిచిపోయిన తమిళ సినిమాల డబ్బింగ్ లు. వీటి డబ్బింగ్ కూడా మరీ ముతక స్థాయి లో ఉండేది. అయినా ఇలాంటి సినిమాల్ని నేను వీరోచితంగా చూసేవాణ్ణి.అప్పుడు గమనించిన కొన్ని డబ్బింగ్ మెరుపులు.
1. ఓక సారి ఏదో సినిమా వేశాడు. అందులో కవిత (అనుకుంటా) హీరోయిన్. ఆమె ఏదో బందిపోటు. “ఒసే రాములమ్మ” సినిమా లో మాదిరిగా ఆమెకి చిన్నపుడు అన్యాయం జరిగి ఉంటుంది. తర్వాత ఆమె బందిపోటై తనకంటూ ఒక ముఠా ఏర్పడ్డాక తనని అన్యాయం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటూంటుంది. అయితే వాళ్ళని ఒక్కొక్కరినీ చంపేముందు కొన్ని భారీ డైలాగులు చెప్తుంది. అలా ఆమె చెప్పే ఒక డైలాగు –
“ఒరే నేను బ్రహ్మ రాక్షసి ని అనుకున్నావా(ఈ డైలాగు మెల్లిగా చెప్పి) కాదు రా (తర్వాత డైలాగు గట్టిగా చెప్తుంది) నేను రాక్షసి ని రా”
నాకర్థం కాలేదు బ్రహ్మ రాక్షసి పెద్దదా లేక రాక్షసి పెద్దదా అని. బహుశా లిప్ సింకింగ్ కోసం డైలాగులు వ్రాయడం వల్ల వచ్చిన తిప్పలు అనుకుంటా.
2. ఇంక ఈ అరవ డబ్బింగ్ సినిమాల్లో మరీ కామన్ గా వినిపించే డైలాగు ఒకటుంది-
“ఏమ్మా, కళ్యాణానికి వచ్చారా”
దీనిలాగే-
“అమ్మాయికి కళ్యాణం చేయాల్సిన వయసువచ్చింది”
“కళ్యాణానికి టైమవుతుంది..” అని..
ఇలా “పెళ్ళి” అనే పదం వాడాల్సి వచ్చిన చోటల్లా “కళ్యాణం” అని అంటూంటే- తెలుగులో ఒక సామెతుంటుంది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని, అలా వాళ్ళు మాటి మాటికీ కళ్యాణం అంటూంటే నాకు సామెతలో రెండో భాగం వచ్చేది.
3. ఇంక పోలీస్ సినిమాలు. ఒక పోలీస్ సినిమా ని స్ట్రెయిట్ తెలుగు సినిమా నా లేక తమిళ్ నుంచి కానీ కన్నడ నుంచి కానీ మళయాళం నుంచి కానీ డబ్బింగ్ అయిన పోలీస్ సినిమా నా అని కనుక్కోవాలంటే చాలా సింపుల్.
పవర్ ఫుల్ గా “అదే రా ఆంధ్రా పోలీస్ అంటే” అనే డైలాగ్ సినిమా లో ఉందీ అంటే అది గ్యారంటీ గా డబ్బింగ్ అయి వచ్చిన సినిమా. ఆ డైలాగ్ ఎక్కడా లేదూ అంటే అది ష్యూర్ గా స్ట్రెయిట్ తెలుగు పోలీస్ సినిమా 🙂
4. పోలీస్ సినిమాలనే కాదు. “తెలుగు వాడి పవరేంటో చూపిస్తా”, “ఒక తెలుగు వాడితో పెట్టుకుంటే..”, “తెలుగు వాడు తలుచుకుంటే..” ఇలాంటి డైలాగులు అన్నీ మనకి డబ్బింగ్ సినిమాల్లో మాత్రమే లభ్యమవుతాయి.
అయితే రాజశ్రీ, వెన్నెల కంటి లాంటి రచయితలు వచ్చాక మనకీ బాధలు కొంతమేరకు తప్పాయి. శంకర్, మణిరత్నం లాంటి దర్శకుల సినిమాలు తెలుగు సినిమాలతో పోటీపడసాగాయి. అసలు ప్రేమికుడు అన్న టైటిల్ విన్నపుడైతే – మన వాళ్ళు అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, ఆ ప్రియుడు..ఈ ప్రియుడు అని ఇన్ని సినిమాలు తీశారు కానీ “ప్రేమికుడు” అని అంత సరళమైన టైటిల్ మన వాళ్ళకి ఎందుకు తట్టలేదు అనిపించింది. అదండీ డబ్బింగ్ డైలాగుల సంగతి!!!
బాగున్నాయ్ మీ అబ్జర్వేషన్లు.
By: కె.మహేష్ కుమార్ on 2009/08/24
at 10:21 ఉద.
బాగున్నాయి 🙂
By: వెంకటరమణ on 2009/08/24
at 10:56 ఉద.
telugodi to pettukunte.. ante ! ilane observe chestaru. hee hee!
By: sujata on 2009/08/24
at 11:35 ఉద.
😀
By: mohanrazz on 2009/08/24
at 11:37 ఉద.
రాజశ్రీ డబ్బింగ్ పాటల్లో అయితే – ప్రతి పాదం చివరా “అంటా” అనే పదం వస్తుంది. “నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా…” ఇలా…
By: రవి on 2009/08/24
at 12:01 సా.
డబ్బింగ్ సినిమాల్లో పెళ్లిని కళ్యాణం అని ఎందుకు అంటారంటే తమిళ్ లో పెళ్లిని కళ్యాణం అంటారు గనక మనం పెళ్లి అనిమాటని సినిమాల్లో ఎలా యూస్ చేస్తామో వాళ్లు కళ్యాణం అనే మాటని అలాగే యూస్ చేస్తారు. ఇంకో విషయం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో వున్న తమిళులు అదృష్టవంతులు ఎందుకంటే తమిళ్ సినిమాలని ఎంచక్కా తెలుగు లో చూసుకోవచ్చు కాని తమిళనాడు లో ఏ ఒక్క తమిళ చానళ్లోను తెలుగు నుండి వచ్చిన డబ్బింగ్ సినిమాలు వెయ్యడు (సంవత్సరానికి ఒక్కటో , రెండో మాత్రం అది కూడా మహేష్ బాబు లేక నాగార్జున్ సినిమాలే) .
కానీ ఇప్పుడు డిష్ టీవీ , టాటా స్కయ్ వల్ల ఆ కష్టాలు తీరుతున్నాయి(డబ్బులు కూడా )
By: TAMILAN on 2009/08/24
at 12:45 సా.
హ హ నేను చాలాసార్లు చూసాను ఈ అరవ డబ్బింగ్ సినిమాలు. అందులో ఒక సినిమా పేరు గుర్తులేదు, విజయ్, సంఘవి హీరో, హీరోయిన్లు. ఇద్దరి మొహాల్లోని expression కరువే…ఈ సినిమా ఎన్నిసార్లు ఇచ్చాడో చెప్పలేను. జెమిని కాకపోతే తేజ లో ఇచ్చేస్తూంటాడు. లేకపోతె విజయ్ కాంత్ సినిమాలు ఇచ్చేస్తూంటాడు. భలే నవ్వు వస్తుంటుంది చూస్తూంటే.
ఈ ‘కల్యాణం’ అనే పదం ఒకటయితే, ‘సంతోషం’ అనేది ఇంకోపదం ఎక్కువగా వస్తూ ఉంటుంది. మన తెలుగు లో అయితే ‘ఆనందం’ అని వాడుతూంటాం. కానీ అన్ని డబ్బింగ్ సినిమాలలో ‘సంతోషం’ అనే వాడతారు. విన్నప్పుడల్లా ఎంత నవ్వొస్తుందో !!!
ఇదే ప్రక్రియ ని జెమిని, తేజ ల లో వచ్చే డబ్బింగ్ సీరియల్స్ లో కూడా గమనించవచ్చు.
మన తెలుగు సినిమాలు (చాలామటుకు నాగార్జున వి) , హింది లో డబ్ అయి zee, setmax వాటిల్లో వస్తూ ఉంటాయి. అవి మరీ funny గా ఉంటాయి. అందులో అన్ని male పాత్రలకు ఒకటే male voice డబ్బింగ్ చెప్తూంటుంది. అలాగే female పాత్రలకు ఒకటే female voice డబ్బింగ్ ఉంటుంది. నవ్వలేక మనం చావాలి !!!
By: sowmya on 2009/08/24
at 2:02 సా.
సౌమ్యా..విజయ్, సంఘవి నటించిన ఆ సినిమా తెలుగు టైటిల్ “యమలవ్” (తమిళ్ లో రసిగన్). ఈ సినిమా లో ఒక సాంగ్ ఉంటుంది. గోవిందా గోవిందా లో ని “మందిర చంద్ర సుందర తార” ట్యూన్ లో. దారుణమైన సినిమా.
ఇక్కడ నార్త్ వాళ్ళలో కూడా హిందీ చానెల్స్ లో రెగ్యులర్ గా వచ్చే “ఇంద్ర- ద టైగర్” (మన “ఇంద్ర” సినిమా) చాలా పాపులర్ 🙂
By: mohanrazz on 2009/08/24
at 2:18 సా.
అవును నాకు ఇప్పుడు గుర్తొచ్చింది….యమలవ్…కత్తిలాంటి title కద…అవును ఆ పాట గుర్తుంది….హ హ….అమ్మో ఆ సినిమా గుర్తు వచ్చి నవ్వు తెరలు తెరలు గా వస్తోంది.
ఇంద్ర ది టైగర్……….hillarious….ha ha
By: sowmya on 2009/08/24
at 2:45 సా.
hahaha…ఇంకా అన్నగారు అనే డైలాగ్ కూడా చాలా డబ్బింగ్ సినిమాల్లో ఉంటుంది..
పైన సౌమ్య గారన్నట్లు, మన తెలుగు సినిమాలని హిందీలో డబ్ చేసినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది.. ఈ మధ్య సెలవు రోజు ఏ హిందీ ఛానెల్ పెట్టినా, ఈ తెలుగు డబ్బింగ్ వే కనిపిస్తున్నాయి! పాపం హిందీ వాళ్ళు అనిపిస్తుంటుంది.. 🙂
By: మేధ on 2009/08/24
at 2:16 సా.
అలాగే “అతన్ని కలిశావా?” అనడానికి కూడా “అతన్ని మీటయ్యావా”అంటుంటారు…ఇది కూడా లిప్ సింక్ కోసమే అనుకుంటా! తెలుగోడి…అబ్జర్వేషన్ బావుంది.
ఇంకో మాట “నీ మీద నేను ప్రాణాలే పెట్టుకున్నాను”అంటూ ఉంటారు. “ఆశపడ్డాను”..మరొకటి!
“నేనా కాదన్నాను?”
“నేనా ప్రేమించాను?” ఇది మరో వరస!
సౌమ్య చెప్పిన యమ లవ్ సినిమా జెమిని, తేజల్లో కలిపి శత ప్రదర్శన పూర్తి చేసుకుంది.భలే కామెడీ లవ్!
ఈ మధ్య కొంచెం నయం కానీ మరీ పాత డబ్బింగ్ సినిమాల్లో అయితే (అక్కా తమ్ముడు అని జయలలిత సినిమా ఒకటి వేస్తూ ఉంటారు) మరీ పక్కా అనువాదం…నవ్వలేక విసుగొస్తుంది.
By: సుజాత on 2009/08/24
at 5:25 సా.
హ హ
“నేనా ఆశపడ్డాను”, “నేనా కాదన్నాను?”, “నేనా ప్రేమించాను?” – ఈ తరహా వాక్యాలు కూడా డబ్బింగ్ సినిమాల్లో ఒక్కటే ఉంటాయి..కేక అబ్జర్వేషన్.. 🙂
By: mohanrazz on 2009/08/24
at 6:00 సా.
వంద ప్రదర్శనలు ఏమిటండి, వెయ్యి ప్రదర్శనలు పూర్తి చేసుకుని ఉంటుంది, 10-12 యేళ్ళ బట్టి వస్తున్నాది ఆ సినిమా జెమిని, తేజ ల లో కలిపి.
By: sowmya on 2009/08/25
at 9:30 ఉద.
“తెలుగు వాడితో పెట్టుకుంటే..” తరహా డవిలాగులు డాన్ సినిమాలో కూడా చాలా అసందర్భంగా వస్తాయి. బహుశా లారెన్స్ అరవం వాసనల వల్లనేనేమో…
By: బృహస్పతి on 2009/08/24
at 6:31 సా.
హ్మ్..కరక్టే..నాకు తెలిసి “తెలుగు వాడి పవర్” అనే డైలాగులున్న ఏకైక తెలుగు సినిమా డాన్ అనుకుంటా 🙂
By: mohanrazz on 2009/08/24
at 6:42 సా.
@బృహస్పతి లారెన్స్
“తెలుగువాడితో పెట్టుకోవడం” డైలాగులు స్టైల్ సినిమాలో కూడా నూటపదహారు సార్లు చెప్తాడండీ. అసలా సినిమానే డబ్బింగ్ సినిమాలా ఉండటం వల్ల ఆ డైలాగులు అసహజంగా అనిపించలా!
By: సుజాత on 2009/08/25
at 8:15 సా.
నేనూ అరవ డబ్బింగ్ డైలాగులు చెప్తాను 🙂
“ఎందుకంత టెన్షన్ అవుతున్నారూ.?” ” నేనేం టెన్షన్ అవ్వట్లేదు.”
అదే మనం అయితే కంగారు పడటమో.. లేకపోతే టెన్షన్ పడటమో అంటాం. కేవలం డబ్బింగ్ సీరియళ్ళు, సినిమాల్లో మాత్రమే టెన్షన్ అవుతుంటారు 😉
“అది మాత్రమే కాకుండా..” అని ప్రతీ వాక్యానికి ముందు వాడతారు.
“మీట్ అవ్వడం’ అయితే మరీ మరీ వాడేస్తుంటారు 😉
“తెలుగోడి పవర్” ని భలే పట్టేశారే మీరు 🙂
By: మధురవాణి on 2009/08/24
at 9:52 సా.
మధురవాణీ,
ఎక్కడో ఉండి కూడా అరవ డబ్బింగ్ డైలాగులు భలే చెప్పారే! టెన్షన్ అవడం అనే మాట అబ్బ, ఎన్ని సార్లు వాడతారో!
By: సుజాత on 2009/08/25
at 8:17 సా.
ఇక ఆంగ్లం నుండి తెలుగుకి డబ్బింగ్ చెప్పనక్కర్లేదు, Gladiator [విజేత]లో intro లో “Best of Luck” అని చెప్తుంటే తెలుగు లో “సాహసే ధైర్యే లక్ష్మి” అంటారు, నవ్వలేక చచ్చాం, ఇలాంటివి శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ బ్యానర్ లో కోకొల్లలు
By: sunnygadu on 2009/08/25
at 12:20 ఉద.
మమ్మీ సినిమాలో అనుకుంటా తెలుగులో ఒక డైలాగ్ ఉంటుంది- “బాస్ కాస్తా బామ్మర్ది అయ్యాడు” అని 😀
By: mohanrazz on 2009/08/25
at 10:21 ఉద.
మోహన్ గారు, నిన్నా రాత్రి zee తెలుగు లో ” ప్రేమంజలి’ అనే తమిళ్ డబ్బింగ్ కళాఖండం ప్రదర్శించారు…ఊహ, రమేష్ అరవింద్, హీరో, హీరోయిన్లు….మీరు, మీ post, వాటి comments గుర్తుకు వచ్చాయి నాకు. మనం అందరం వాటిని ఎలా ఆడుకుంటున్నామో ఆ సినిమా produce చేసేవాళ్ళకి తెలియదు కదా అనిపించి తెగ నవ్వొచ్చింది.
నాకు వచ్చిన చిక్కేమిటంటే, నాకు తమిళ్ కూడా వచ్చు. అందుకని వాళ్ళ lip movement అర్థమయిపోతూంటుంది, ఇవతల తెలుగు వినిపిస్తూ ఉంటుంది…..భలే comedy గా ఉంటుందలెండి.
By: sowmya on 2009/08/25
at 9:39 ఉద.
🙂
By: mohanrazz on 2009/08/25
at 10:20 ఉద.
[…] చూసి టెన్షన్ అవకండి. నేనిప్పుడు అర్జంటు గా సినిమాలు తీసి […]
By: I am gonna be next Maniratnam.. « జురాన్ సినిమా on 2009/08/27
at 11:41 ఉద.
super! telugodi power baaga pattaru. u r genius! 🙂
just tell me if you know abt this:
I think, those tamil films were not originally dubbed at the time of release. Just to create the content for all its tv channels, they have dubbed all those movies into telugu with shoe string budgets, after buying the rights of such flops in “gampa gutta ” deals.
But the telugu movies in hindi – this i doubt were planned by our guys – invariably they made sure to have some charcaters played by north actors so that it will appeal there too. I think it started with Khushi as a “plan” in marketing
Lawrence had carefully planned tht tamilodi sorry telugodi power. The choice of casting that villan was brilliant stroke as far as i am concerend.You will realise this when u will see the movie in Hindi!
It made money very easily that way – isn’t it?
Good post! arey arey re …I too was trying to do a piece to explain the above ideas.
Killer post! good show.
By: rayraj on 2009/08/27
at 9:28 సా.
rayraj..i stay in pune..ఇక్కద అల్లరిపిడుగు హింది డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయితే పోస్టర్స్ లో కత్రినా కైఫ్ ఫోటో పెద్దగా వేసి ఒక మోస్తరుగా చార్మీ, పునీత్ ఇస్సార్ ల ఫోటోలు వేసి చివర్లో ఎక్కడో బాలకృష్ణ ఫోటో వేసారు..ఇలాంటి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లు కూడా బాగా పాత థియేటర్లు, టికెట్ తక్కువ, ఆ ఏరియా ల్లో జనాలు కూడా వీటిని అలా చూసేస్తూ ఉంటారు..నాకు తెలిసి ఇవన్నీ “ప్రాఫిట్ వెంచర్లే”.
By: mohanrazz on 2009/08/28
at 10:26 ఉద.