వ్రాసినది: mohanrazz | 2013/10/19

ఫస్టాఫ్ చూడటానికి ‘వస్తామ(వ)య్యా’ సెకండాఫ్ కి మాత్రం ‘రామయ్యా’…


మొన్న ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీయార్ మాట్లాడుతూ “అసలు మనం ఇలా అమ్మాయిల వెంటపడుతూ, అల్లరి చేసే స్టూడెంట్ తరహా లో చేస్తే ప్రేక్షకులు చూస్తారా” అని తాను హరీష్ శంకర్ ని అడిగినట్టు, దానిక్ హరీష్ తప్పకుండా చూస్తారని కాన్ఫిడెంట్ గా అన్నట్టు చెప్పాడు. బహుశా ఎన్టీయార్ కి అక్కడికీ నమ్మకం కుదిరినట్టు లేదు, అందుకే ఫస్టాఫ్ నీ స్టైల్లో కొత్తగా తీస్తే తీశావ్, సెకండాఫ్ మాత్రం నా స్టైల్లో మాస్ పాత్రలో చూపించమని దర్శకుణ్ణి అడిగినట్టు ఉన్నాడు. అందుకే సినిమా ఫస్టాఫ్ ఒక జోనర్ లో సెకండాఫ్ ఇంకో జోనర్ లో నడిచినట్టు అనిపిస్తుంది. మొత్తంగా టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచి, టీజర్స్ తో, ట్వీట్స్ తో, ట్రైలర్స్ తో పెంచిన అంచనాల్ని, ఫస్టాఫ్ అయ్యాక అభిమానుల్లో పెరిగిన ఆశలని, సెకండాఫ్ తుస్సుమనిపించిన విధంబెట్టిదనిన…

అసలు కథ మొత్తం కలిపి మూడు లైన్లు – ఒకటి, హీరో సమంత వెంటపడి, ఆమెకి, వాళ్ళ కుటుంబానికీ దగ్గరవుతాడు. రెండు, ఇంతలోనే గబుక్కున సమంత వాళ్ళ నాన్న ని చంపేస్తాడు హీరో. మూడు, సమంత తండ్రి వల్ల తన కుటుంబాన్ని కాబోయే భార్యని కోల్పోవడం వల్లే, ప్లాన్ చేసి మరీ ఇదంతా హీరో చేసాడు అని చెప్పడం. ఇందులో మొదటి పాయింట్, రెండో పాయింట్ ఇంటర్వల్ కి అయిపోతాయి…దాంతో సెకండాఫ్ మొత్తం కేవలం మూడో పాయింట్ మీద నిలబెట్టాల్సి వచ్చింది. అదే సినిమా కి ప్రధాన ప్రతికూలత అయింది. నిజానికి ఫస్టాఫ్ క్లాస్, సెకండాఫ్ మాస్ లేదా, ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ సెంటిమెంట్ లేదా ఫస్టాఫ్ యూత్, సెకండాఫ్ ఫ్యామిలీస్ లేదా ఫస్టాఫ్ ఫారిన్ సెకండాఫ్ విలేజ్ ఇలా ఫస్టాఫ్ ఒక తరహా, సెకండాఫ్ ఇంకో తరహాలో వచ్చి సూపర్ హిట్టయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కాబట్టి సెకండాఫ్ ఫస్టాఫ్ కి భిన్నంగా ఉండటం కంటే కూడా, సెకండాఫ్ మరీ ప్రిడిక్టబుల్ గా ఉండటం వల్లే సినిమా దెబ్బ తిన్నదని చెప్పొచ్చు.

ఇక ఎన్టీయార్ ని ఫస్టాఫ్ లో అలా చూడటం కొత్తగా, వైవిధ్యంగా సరదాగా ఉంది. హీరో ఒక తొట్టి గ్యాంగ్ ని వేసుకుని సొల్లు కబుర్లు చెబుతూ హీరోయిన్ వెంటపడుతూ ఉండే ఇలాంటి పాత్రలు అల్లు అర్జున్ రవితేజ లే కాక పవన్ కళ్యాణ్ లాంటి హీరో లు కూడా గతం లో చేసారు కానీ ఎన్టీయార్ ఎప్పుడూ చేయలేదు. ఎన్టీయార్ బాడీ లాంగ్వేజ్ లో ఈ పాత్ర కొత్తగా అనిపించింది. దానివల్ల ఆ సన్నివేశాలన్నీ బోర్ కొట్టకుండా చకచకా అయిపోయాయి. డ్యాన్సుల్లోనూ కొన్ని కొత్త స్టెప్స్ ట్రై చేసారు, అవీ బాగానే ఉన్నాయి. బహుశా సినిమా హిట్టయి ఉంటే ఆ స్టెప్స్ గురించి కూడా బాగానే మాట్లాడుకునేవాల్లు. కానీ కొన్ని సేం స్టెప్స్ రిపీట్ అయ్యాయి. ఇక సేం టు సేం తమన్ సారీ.. ఎస్.ఎస్.తమన్ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు.

ఇక హరీష్ శంకర్ గురించి. హరీష్ శంకర్ దగ్గర కొన్ని స్టాండర్డ్ ఫార్మేట్స్ ఉన్నాయి. హీరో రియల్ లైఫ్ కి కూడా అన్వయించే కొన్ని డైలాగులని తెలివిగా సినిమాలోని సన్నివేశానికి అనుగుణంగా ప్రవేశపెట్టి అభిమానులతో విజిల్స్ వేయించడం, వాటిలో ఒకటి. ఇందులోనూ దాన్ని వాడాడు. ఇక కొత్తదనం కోసం హీరో, హీరోయిన్ ని మొదటగా చూసే సన్నివేశాల బ్యాక్ డ్రాప్ లో ఇళయరాజా పాటలు పెట్టాడు. ఐడియా బానే ఉంది కానీ హీరో మొదటిసారి హీరోయిన్ ని చూసినపుడు బ్యాక్ డ్రాప్ లో “తొలిరేయి హాయి మహిమా” పాట వేయడం ఏంటో మరి. అలాగే హరీష్ దగ్గర ఉన్న ఇంకో ఫార్మేట్, కొన్ని మంచి ఆణిముత్యాలు అని తనకి అనిపించిన డైలాగులని కథ కి సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక చోట దాన్ని ఇరికించడం. హీరో తన వెంటపడుతుంటే హీరోయిన్ అతన్ని “మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా” అని ఫిలసాఫికల్ క్వొశ్చెన్ వేస్తుంది. ఎందుకో మరి. మరొక ఫార్మేట్ ఏంటంటే, హరీష్ హీరో కేరక్టరైజేషన్ మీద ఎక్కువ హోం వర్క్ చేస్తాడు, కానీ కథ ని లైట్ తీసుకుంటాడు. సినిమాలో హీరో కేరక్టరిజేషన్ ఎంత బాగున్నా, పాటలు డ్యాన్సులు ఎన్ని ఉన్నా, అసలు కథలో ఏం జరుగుతోంది అనో, లేదా కనీసం ఎలా జరుగుతోంది అనో క్యూరియాసిటీ సస్టెయిన్ చేయకపోతే ఇలాంటి ఫలితాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.


స్పందనలు

  1. where is rating ..we want rating

  2. నిజమే జురాన్ భయ్యా…నాక్కూడా కలయా నిజమా పాట వేయడం….ఎందుకో అర్థం కాలేదు. బహుశా కలయా నిజమా వరకే హరీశ్ శంకర్ కి అర్థమైంది తప్ప అది ఫస్ట్ నైట్ సాంగ్ అని అర్థం కాలేదనకుంటా.
    అన్నట్లు హరీశ్ ను బాగానే అర్థం చేసుకున్నావే…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: