వ్రాసినది: mohanrazz | 2013/11/14

యండమూరి “కాసనోవా 99” ని ఇప్పుడు సినిమా గా తీయొచ్చా??

చాలా కాలం తర్వాత గుర్తొచ్చింది  ఈ నవల. 1994 ప్రాంతం లో వచ్చిందనుకుంటా. అది కూడా 2 పార్ట్స్ గా వచ్చినట్టు గుర్తు. అప్పుడు నేను పది చదువుతున్నా. నా హైస్కూల్ రోజుల్లో వచ్చిన చాలా నవలల్లాగే దీన్నీ ఏకబిగిన చదివాను (కొద్దిరోజుల పాటు). అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ నవల ఎప్పుడూ పూర్తిగా చదవలేదు కాబట్టి, ఇప్పుడు ఆ నవల విశేషాలని సమగ్రంగా చెప్పగలనో లేదో డౌటే కానీ, గుర్తున్నంతవరకు ట్రై చేస్తా..

ఒక పాకిస్తానీ వ్యక్తి వచ్చి భారత దేశానికి ప్రధాన మంత్రి అవడం అనే పాయింట్ ని తీసుకుని, దాన్ని “నమ్మబుల్” గా వ్రాసిన యండమూరి ఈ నవల ని ఒక ప్రయోగం గా చెప్పుకుంటాడు. సైన్స్ ఫిక్షన్ లాగా దీనికి “సోషల్ ఫిక్షన్” అని చెప్పుకున్నాడు. అంటే సమకాలీన చరిత్ర లోని కొన్ని యధార్థ పాత్రలని తీసుకుని వాటి మధ్యలో కొన్ని కల్పిత పాత్రల్ని చొప్పించి వాటిద్వారా కథ నడిపే విధానం నాకు తెలిసి తెలుగు లో అదే మొదటిది అనుకుంటా. ఉదాహరణకి జుల్ఫ్ కర్ ఆలీ భుట్టో తో పాటు కొందరు పాకిస్తాన్ మిలటరీ అధికారులు కాశ్మీర్ ని ఏనాటికైనా పూర్తిగా పాక్ వశం చేసుకునేందుకు – ఒక ISI ఏజెంట్ ని ఇల్లీగల్ గా భారత్ లో ప్రవేశపెట్టి ఒక 40 ఏళ్ళ లోపు అతను భారత ప్రధానిని చేసి అతని ద్వారా కాశ్మీర్ ని పాక్ కి భారతే అప్పగించేలా ఒక భీబత్సమైన ప్లాన్ వేస్తారు. అయితే అది వీళ్ళు అతికొద్ది మందికి తప్ప ఇంకెవరికీ తెలీదు. అలా భారత్ కి వచ్చిన వాడే ఫాక్స్ (FOX – పూర్తి పేరు ఫరూఖ్ ఓం క్సేవియర్) .  అతను భారత్ లో కి 1950 ల్లో (ఒక వందకోట్ల డబ్బుతో సహా) ప్రవేశించి, తెలంగాణా ఉద్యమం లో పాల్గొని, రకరకాల ఎత్తులు వేసి, భారత ఓటర్ కార్డ్ సంపాదించడం తో సహా అన్ని రకాలు గా భారతీయుడయిపోతాడు.

ఇక హీరోయిన్ పాత్ర ఒక అమాయక డాక్టర్. ప్రతి చిన్న విషయానికీ “మురుగా మురుగా” అనుకుంటూంటుంది. బహుశా ఈ నవల కంటే ముందే వచ్చిన క్షణ క్షణం సినిమా లో “దేవుడా దేవుడా” అనుకునే శ్రీదేవి పాత్ర ని ఇమిటేట్ చేశాడనుకుంటా యండమూరి. స్వప్నమిత్ర, మాంధాత అని ఇద్దరు హీరోలు. అయితే రకరకాలుగా ఒక్కొక్క మెట్టు రాజకీయాల్లో ఎదుగుతూ, పివి నరసింహ రావు తర్వాత ఒక రెండు టర్మ్స్  తర్వాత  ఫాక్స్ -శ్రీ వాత్సవ అనే పేరుతో భారత ప్రధాని అవుతాడు. అప్పట్లో తాంత్రిక స్వామి చంద్రస్వామి స్కాం ఒకటి దేశాన్ని కుదిపేస్తూ ఉండేది. ఆ స్కాం లో ఎవరో ఒకతని పేరు బబ్లూ శ్రీవాత్సవ అని ఉన్నట్టు గుర్తు. బహుశా ఆ పేరు నే (అప్పీలింగ్ గా ఉంటుందనే ఉద్దేశ్యం తో) విలన్ కేరక్టర్ కి పెట్టాడనుకుంటా యండమూరి.

అయితే ఈ నవల లో ఒక హైలెట్ పాత్ర ఏంటంటే- ముస్తఫా అనో ముస్తాక్ అనో ఒక 90 ఏళ్ళ ముసలాయన పాత్ర ఉంటుంది. ఆయనకి ఒక భయంకరమైన టాలెంట్ ఉంటుంది. అదేంటంటే ఎవరి గొంతైనా ఒకసారి వింటే ఎన్ని సంవత్సరాల తర్వాతైనా ఆయన గుర్తు పడతాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఇతణ్ణి రెండవ ప్రపంచ యుద్ద కాలం లో ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించుకుని ఉంటుంది. ఇప్పుడాయన తన తొంభై ఏళ్ళ వయసులో ఉన్నాడు. శ్రీ వాత్సవ ప్రధాని అయ్యాక రేడియో లో ఒక స్పీచ్ ఇస్తాడు. ముస్తఫా ఇది విని నిశ్చేష్టుడవుతాడు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితం ఒక ఫోన్ ట్యాపింగ్ లో తాను విన్న పాకిస్తాన్ కి చెందిన ISI ఏజెంట్ ఫాక్స్ గొంతు అది  అని అతనికి అర్థమవుతుంది కాబట్టి. ఇక ఆ తర్వాత ఈ విషయం హీరో కి ఎలా తెలుస్తుంది, శ్రీ వాత్సవ పాకిస్తాన్ కి కాశ్మీర్ ని అప్పగిస్తూ భారత రాజ్యాంగ సవరణ చట్టం చేయాలనుకుంటే దాన్ని హీరో ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ.

ఇక ఇది సినిమా కి ఎంతవరకు పనికి వస్తుంది అనేది, మీరే చెప్పాలి. నిజానికి ఇది నవల గానే తెలుగు లో హిట్టవలేదు. అయితే ఈ నవల తెలుగు పాఠకులకి ahead of time అవడం కూడా కారణమని నాకనిపిస్తుంది. ఇక “సోషల్ ఫిక్షన్” కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పాతదైపోయింది. ప్రత్యేకించి శంకర్ భారతీయుడు లాంటి సినిమాల్లో కమల్ హాసన్ ని సుభాష్ చంద్ర బోస్ ప్రక్కన నిలబెట్టించేయడం లాంటివి మనవాళ్ళు ఇప్పటికే చూసేసారు. ఇక కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ తో గొడవలు ఆల్రెడీ అరిగిపోయిన రికార్డులయిపోయాయి..

అయితే ఈ నవల లోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు మాత్రం ఇప్పటికీ ఫ్రెష్ గా ఉండటం వల్ల (ముస్తఫా లాంటి పాత్రలు, మరికొన్ని సన్నివేశాలు), అవి మాత్రం వేరే రకంగా ఉపయోగించుకుంటే బానే ఉంటుందనిపిస్తుంది..మీరేమంటారు..


స్పందనలు

 1. ఈ కథాంశానికి ప్రేరణ 1959లో వచ్చిన ఆంగ్ల నవల ‘The Manchurian Candidate’ కావచ్చు. యండమూరికి ఇలాంటి ‘ప్రేరణ’లు సాధారణమే అని మీకు చెప్పక్కర్లేదు 😉

  పై పుస్తకం అదే పేరుతో రెండు సార్లు తెరకెక్కింది. మొదటి దాంట్లో ఫ్రాంక్ సినాట్రా, రెండో దాంట్లో డెంజెల్ వాషింగ్టన్ ప్రధాన పాత్ర పోషించారు. మీరు రెండోది చూసే ఉంటారు, బహుశా.

  • మీరు రెండోది చూసే ఉంటారు, బహుశా>>
   చూడలేదు భయ్యా…అయితే చూసే ప్రయత్నం చేస్తాను…

 2. మంచూరియన్ కి కాసనోవాకి చాలా తేడా ఉందండీ…
  కాసనోవా నాకు బాగా నచ్చిన నవల. ఎంత నచ్చిందంటే, ఆ పేరుతో నేను కూడా ఒక కథ వ్రాశాను 🙂
  అసలు పాకిస్తాన్ సీక్రెట్ ఏజంట్ కోట్ల రూపాయల ధనంతో ఇండియా వచ్చి స్వామిగా మారి మొత్తం రాజకీయాన్ని గుప్పెట్లో పెట్టుకోని ప్రధానమంత్రిగా పని చెయ్యడం కేక కాన్సెప్టు. ఏదో నాగార్జున సినిమాలో కూడా పాకిస్తాన్ టెర్రరిస్టు ఇండియాలో స్వామిగా అవతారం ఎత్తుతాడు….
  నవల, చిరంజీవిని సినిమాగా తియ్యగలిగేట్టే వ్రాయబడిందని నా ఉద్దేశ్యం. మరి ఎందుకు తియ్యలేదో….
  ఇప్పుడు సినిమాగా తీస్తే కష్టం. పెద్దగా గిట్టుబాటు కాదేమో. దానికి తోడూ సవాలక్ష వివాదాలూ చుట్టుముడతాయి. టీవీ సీరియల్ అయితే బెటర్, కానీ ఇంకా అత్తా కోడళ్ళ స్థాయి నుండి అవి దాటి రాలేదుగా. వెయిట్ చేద్దాం.

  • >> “మంచూరియన్ కి కాసనోవాకి చాలా తేడా ఉందండీ”

   అందుకే ‘ప్రేరణ’ అన్నా. కాపీ అనలేదు 🙂

  • అవును…ఆ రోజుల్లో యండమూరి రాసిన చాలా నవలల లాగే, ఇందులోనూ హీరో పాత్రలో చిరంజీవిని ఊహించుకుని చదివినా నవల స్మూత్ గానే ఫ్లో అవుతుంది…
   అయితే ఎందుకో అప్పట్లో నాకు మాంధాత అనే పాత్ర లో హిందీ హీరో సునీల్ షెట్టి యే కనబడేవాడు..బహుశా ఆ నవల చదవడానికి కొద్ది రోజుల ముందు ఏదో సునీల్ షెట్టి యాక్షన్ ఫిల్మ్ చూసాననుకుంటా… అయితే ఇప్పుడు ఎవరు దీన్ని సినిమాగా తీసినా వివాదాలు చుట్టుముడతాయి అనేది ఎంత వాస్తవమో, అదే చిరంజీవి గనక సినిమా తీస్తే- అది హం ఆప్కే హై కౌన్ రీమేక్ అయినా కూడా తీవ్ర వివాదాలు చుట్టుముడతాయనేదీ అంతే వాస్తవం..అన్నట్టు ఆ నాగార్జున సినిమా పేరు “ఆజాద్”

 3. ప్రస్తుత మన ప్రధాని మన్మోహన్ పాకిస్తాన్ నుండి ఇండియా వలస వచ్చినోడే కదా. అంతెందుకు మాజీ ఉప ప్రధాని LK అద్వానీ కూడా పాకిస్తాన్ నుండే వలస వచ్చాడు . ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్న లాయర్, హిందూ పురాణాలపై తరచూ దాడి చేసే రాం జెటల్మానీ కూడా పాకిస్తాన్ నుండి వలస వచ్చినోడే . ఇలా చాలా మంది హిందూ ముసుగులో ఉన్నారు

 4. వావ్ భలే గుర్తు ఉంచుకుని రాసారు . ఈ నావెల్ పెద్ద గా హిట్ కాలేదా ? నేను 1999 , 2000 ల లో ఈ పుస్తకం చదివిన గుర్తు ఉంది. యండమూరి నావెల్స్ లో చాల మందికి నచ్చిన నావెల్ వెన్నెల్లో ఆడపిల్ల అని చెప్తారు, కానీ ఎందుకో దాని కన్నా ఇది ఎక్కువ నచ్చింది :-). నేను ఈ పుస్తకం చదివిన కొత్తలో ఆ మాంధాత పేరు భలే ఇష్టం ఉండేది . infact ఈ పుస్తకం చదివాకా నేను ఇండియా , పాకిస్తాన్ యుద్ధం గురించిన నాన్ ఫిక్షన్ చదివాను .

 5. మాజీ ప్రధాని IKగుజ్రాల్ కూడా పాకిస్తాన్ నుండి వలస వచ్చినోడే. ఆ మాటకొస్తే ప్రస్తుతం ఇండియాలో సెలిబ్రిటీ హోదా అనుభవిస్తున్న చాలా మంది పెద్ద మనుషులు పాకిస్తాన్ నుండి వలస వచ్చినోల్లే. చిత్రమేంటంటే వీళ్ళంతా 1994 తరువాతే ప్రధానులయ్యారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ?

 6. ఈ concept పూర్తిగా కాకపోయినా కొంత ‘ఆజాద్’ సినిమాలో ఉంది….

 7. mohan we discussed about this in 1996 in adoni…i remember the day also.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: