(PS: నిజానికి నాకు కవిత్వమన్నా కవితాసంపుటాలన్నా ఇష్టమే. ఈ పోస్ట్ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు. జస్ట్ ఫర్ ఫన్.
అయితే కవిత్వం చదువుతున్నపుడు కాస్త తన్మయత్వం లో ఉండి పట్టించుకోము కానీ ఆ కవితా సంపుటాలకి వ్రాసిన ముందు మాటలని – ఒకసారి కూల్ గా, తర్వాత, ఒక హ్యూమరస్ సెన్స్ తో గమనిస్తే మాత్రం – అదో తరహా కామెడీ గా అనిపిస్తుంది నాకు. ఎట్టాగో చిన్న ఉదా.. తో 🙂 )
మీరొక కవితా సంపుటి చదివారు, దానికి ముందు మాట వ్రాయాలనుకోండి. ఏం చెబుతారు? బహుశా ఈ కింది నాలుగు ముక్కలు.
1. ఈ కవి తన భావాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచాడు. అతని శైలి బాగుంది.
2. ఈ కవితలు మీ ఆలోచనాసరళి ని ప్రశ్నిస్తాయి, ప్రభావితం చేస్తాయి, మీ ఆలోచనల్లో మార్పు తీసుకువస్తాయి.
3. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి ఇలాంటి కవిత్వం చాలా అవసరం.
4. ఈ కవి ఇలాంటి కవిత్వం ఇంకా ఎంతో వ్రాయాలని కోరుకుంటున్నాను.
అయితే ఇలా చెప్పడం స్టేజీ మీద ఉపన్యాసానికి బాగానే ఉంటుంది కానీ, కవితా సంపుటికి ముందు మాటగా వ్రాయటానికి పనికి రాదు 🙂 . దానికి కూసింత కళా పోషణుండాల. ఉదాహరణకి పై నాలుగు ముక్కల్నే ఒక మోస్తరుగా చెప్పాలంటే ఇలా వ్రాయాలి- 😀 😀
1. మీగడతరకొకటి పాలకీ శూన్యానికీ మధ్య సందిగ్ధపు సంఘర్షణకు చరమగీతం పాడటానికి తనను తాను ఆవిరి 🙂 చేసుకుంటున్నట్టు ఏ పాలపుంతకేసో మరే ఉటోపియాకేసో మన నిస్తేజ స్వప్నాలని పరుగులెట్టించడానికి ఈ కవి కదనోత్సాహం తో విస్ఫోటనం గావించడానికి సన్నద్దంగా ఉన్న ఆర్డీఎక్స్ లా సూటిగా తన వచనాన్ని పసిపాప నిష్కల్మషమైన చిరునవ్వంత మెత్తగా మనముందు పరిచాడు.
2. ముందే చెప్పుకున్నట్టు (??) ఆ వచన కాంతి పుంజాల తరంగధైర్ఘ్యాన్ని contain చేయడానికి సంకుచితమైన ఈ మనస్సులు సరిపోనప్పుడు సెరెబ్రం విప్పారుతూ విప్పారుతూ అలసిపోతే ఒక కాన్షస్ నెస్ హఠాత్తుగా నిశ్శబ్దంగా మేల్కొని తననుతాను ఒక ఈక్వేషన్ లో ఇముడ్చుకోవడానికి బద్దలవుతోన్న దేహం లోనుంచి ప్రయత్నిస్తుంది. నిస్సందేహమే, ఇతనొక ఐకనోక్లాస్ట్. 🙂
3. నిజానికిప్పుడు ఇతని కవిత్వం తో ఆటొప్సీ చేయించుకోవాల్సిన అవసరమీ ప్రపంచానికి లేదు. అంతకు మించి, డిస్టోపియా ని మరిగి మరిగి నిశ్చేతన మారిజునా తో తన్మయత్వంగా ఊగిపోతున్న మానవాళికి ఇతని ఉదాత్తమైన ఇంటెన్షన్స్ తో పనీ లేదు.కానీ ప్రసవవేదనకు సరిసమానమైన, నిజానికి అంతకుమించిన ఒక futuristic vision తో నిరంతరాయమైన ఒక నిశ్శబ్ద అంతరాయం తో ప్రతి మస్తిష్కానికి సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడానికి ఇతని కవిత్వం జారుడుబండలాడుతోంది. 🙂
4. మీరెంతైనా చెప్పండి. మరెంతైనా చెప్పకుండా ఉండండి. ఎజెక్ట్ చేసిన సిడి డ్రైవ్ మీద పరావర్తనం 😀 చెందిన నియాన్ కిరణాన్ని ఒక్క అంగలో డార్క్ మ్యాటర్ లో కలిపేయడం వీలు కుదరనంతవరకూ, అశాంతితో ఓవర్ ఫ్లో అవుతున్న మనసులకి ఒక సింప్లిఫైడ్ సొల్యూషన్ దొరకనంతవరకూ, త్రాసుకిరువైపులా అసహనమే ఊగిసలాడటం సమాప్తమయ్యేంత వరకూ ఇతని కలానికి hibernation ప్రాప్తమవ్వకూడదని- అభినందనలతో- అంతకు మించి ఆశీస్సులతో- దానితోటే ప్రార్థనలతో-
మీ XXX
(PS: మామూలుగా అయితే PS -మ్యాటర్ అయిపోయాక కిందే వ్రాయాలి. కానీ ఇట్టాంటి ముందుమాటలకి ముందే కూడా వ్రాయొచ్చు. 🙂 )
ఓహో మీరు ముందుమాట ఇంత బాగా చదువుతారన్న మాట. 🙂
By: రవి చంద్ర on 2009/12/08
at 11:36 సా.
ఏదో అప్పుడప్పుడూ.. 🙂
By: mohanrazz on 2009/12/09
at 11:23 ఉద.
అప్పుడప్పుడూ చదివితేనే ఇలా కుమ్మేరు…రోజూ చదివితే పరిస్థితి ఏమిటో 😛
By: sowmya on 2009/12/09
at 11:47 ఉద.
విరగతీత 😀
ఎంత అర్ధంపర్ధం లేకుండా రాస్తే అంతగొప్ప ముందుమాటన్నమాట.
రవిగాంచని చోటు కవిగాంచుననేది పాత సామెత. కవి కూడా కాంచని విషయాలెన్నిట్నో అలవోకగా వివరించేస్తారీ ముందు మాటగాళ్లు! అది చదివాక సదరు కవి ‘అడ్డె, ఇయన్నీ రాసినోన్ని నాకే తెలీదే’ అనుకుంటాడు గుంభనంగా 😉
By: అబ్రకదబ్ర on 2009/12/09
at 1:39 ఉద.
అడ్డె, ఇయన్నీ రాసినోన్ని నాకే తెలీదే’ అనుకుంటాడు గుంభనంగా>>>
😀 మరే..!!
By: mohanrazz on 2009/12/09
at 2:22 సా.
నువ్వు సూపరన్నా… ఇర్గదీసినౌ బో… ఇప్పుడూ…. ముందుమాటే ఇంత కవితాత్మకంగా (అంగా భీభత్స భయానకంగా) వుంటే ఇక కవితలేం చదువుతామూ… అని.
By: Indian Minerva on 2009/12/09
at 7:42 ఉద.
సూపర్ బాసూ. ఇరగదియ్యటం అంటే ఇదే 😀
By: వెంకటరమణ on 2009/12/09
at 9:47 ఉద.
🙂
By: mohanrazz on 2009/12/09
at 11:24 ఉద.
నాకు ఈ మధ్యనే కవితాసంపుటి రాయలన్న ఆలోచన వచ్చింది. దానికి ముందుమాట మీరే రాయలి…మరి కాదనకూడదు.
నేను రాసే వెరైటీ కవితలకి, ఇలాంటి వెరైటీ ముందుమాట ఐతేనే మాంఛి రంజుగా ఉంటుంది 🙂
ముందే చెప్పేస్తున్నా….తరువత తూఛ్ అంటే నేనొప్పుకోను. మీరు రాయాలి అంతే 😀
మీకు మచ్చుకి ఒక కవిత వినిపిస్తాను (అంటే మీకు ఒక ఐడియా రావాలి కదా)
నేను చిన్నప్పుడు గంగూలీ మీద ఉన్న వీరాభిమానంతో రాసిన ఒక కవిత
ఓరోరీ గంగూలీ
నీ ఊరు బెంగాలీ
నువ్వు ఆడి చెలరేగాలి
మేము చూసి ఊగిపోవాలి
వినీలాకాశంలో విస్ఫోటనాన్ని కలిగించే ఇలాంటి ప్రచండ కవితలెన్నో నా దగ్గర ఉన్నాయి. మీరు ముందు మాట రాయడానికి రెడీ అయిపోండి చెప్తాను 😛
By: sowmya on 2009/12/09
at 9:59 ఉద.
మీ కవితలు కేకోకేక. కానీ – ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారూ.. 🙂
By: mohanrazz on 2009/12/09
at 11:07 ఉద.
రావుగారు ఎవరండీ?
By: sowmya on 2009/12/09
at 11:14 ఉద.
ఢీ సినిమా లో మంచు విష్ణు వర్ధన్ బాబు 🙂 (బ్రహ్మానందం డైలాగే మరిచిపోయారా??)
By: mohanrazz on 2009/12/09
at 11:16 ఉద.
ఓ అదా? 🙂
చారిగారు మీరు అనవసరం గా భయపడుతున్నారు, ఇందులో అంత రిస్క్ లేదు. మీరు ధైర్యంగా ముందుమాట రాయడానికి ఒప్పేసుకొండి 😀
By: sowmya on 2009/12/09
at 11:45 ఉద.
hmm..అంతేనంటారా?? 🙂 అయితే ఓ పని చేద్దాం..మీరు ముందో రెండొందలో మూడొందలో వ్రాసేయండి కవితలు. ముందు మాట సంగతి అప్పుడు చూసుకోవచ్చు 😀
By: mohanrazz on 2009/12/09
at 2:14 సా.
అబ్బే రెండొందలో, మూడొందలో ఏమిటండీ…నేను త్వరలో అర్థసహస్రం (500) పూర్తి చెయ్యబోతున్నాను.
చారిగారు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు
మీరింక తప్పించుకోలేరు….ముందుమాటకి ఫిక్స్ అయిపోండి 😛
మీ టేలంట్ మీకు తెలీయట్లేదు….నా కవితాసంపుటి అని భయపడకండి,మీరు ఖచ్చితం గా రాయగలరు, మీకా టాలెంటు ఉంది 😀
By: sowmya on 2009/12/09
at 2:25 సా.
కేక పెట్టించారండీ!!! నేను కవితలు చదవను (చదివినా దానిలోని భావుకతో మరేదో నా మట్టిబుర్రకి అస్సలు ఎక్కదు, ఇది లోగుట్టు), కానీ మీ ముందు మాటలు చదివాక, “ఒహ్హో కవితలే అనుకుంటే వాటి ముందు మాటలు కూడా ఇంతే అబ్స్ ట్రాక్ట్ గా ఉంటయాన్నమాట” అనేసుకున్నా, నిజం కావాలంటే జాబిల్లి దాకా ఎగిసిపడుతున్న నాలోని భావ తరంగాల తరంగదైర్ఘ్యాన్ని అడిగిచూడండి 🙂
By: laxmi on 2009/12/09
at 10:43 ఉద.
నాలోని భావ తరంగాల తరంగదైర్ఘ్యాన్ని అడిగిచూడండి
baaboyyy!!!
By: onlyforpraveen on 2009/12/09
at 2:02 సా.
నిజం కావాలంటే జాబిల్లి దాకా ఎగిసిపడుతున్న నాలోని భావ తరంగాల తరంగదైర్ఘ్యాన్ని అడిగిచూడండి >>
అంత దుస్సాహసం నేను చేయలేనేమో..!! 🙂
By: mohanrazz on 2009/12/09
at 11:08 ఉద.
అదరగొట్టేసారండీ! దరగొట్టేసారండీ! రగొట్టేసారండీ! గొట్టేసారండీ! ట్టేసారండీ! సారండీ! రండీ! డీ! ఢీ చారిగారూ!
By: చదువరి on 2009/12/09
at 12:18 సా.
బాగుందం”ఢీ” కామెంటు
By: mohanrazz on 2009/12/09
at 2:14 సా.
😀 😀 😀
By: sowmya on 2009/12/09
at 5:48 సా.
🙂
By: చదువరి on 2009/12/09
at 7:19 సా.
little bit confused
By: జాన్ హైడ్ కనుమూరి on 2009/12/09
at 4:41 సా.
హ హ హ :-))) కెవ్వు కేక.. జస్ట్ కుమ్మేశారు మాష్టారు.. చాలా బాగుంది ఇంకా నవ్వుతూనే ఉన్నాను. బాబ్బాబు సినిమా రివ్యూలకు కూడా ఇలాటి టెంప్లేట్ ఒకటి ఊహించి చెప్పకూడదూ..
By: వేణూ శ్రీకాంత్ on 2009/12/09
at 6:43 సా.
మోహన్ గారు, అక్కడ (ఆ బ్లాగులో) మీ కామెంటుకి రిప్లై ఇచ్చాను చూసుకున్నారా?
మరి ఆ పనిమీదుండండి 😀
By: sowmya on 2009/12/09
at 8:15 సా.
Idi chaduvutunte Yandamoori novel ki unde mundu matalu gurtocchayi… 😀
By: VIshvak on 2009/12/10
at 8:39 సా.