నిన్న ఒక ఛానెల్ లో “లైవ్ ప్రోగ్రాం” ఒకటి వచ్చింది. కె. మురారి. అనే నిర్మాత తన ఆత్మకథ లాంటి అనుభవాల్ని ఒక పుస్తకం వ్రాసాడనీ, అందులోని అంశాలు వివాదాస్పదం “అవుతున్నాయని” (ఒకవేళ అవకపోతే, అయ్యేలా తాము కృషి చేస్తామనీ-) ఇద్దరు సినీ విమర్శకులని ఆయనతో పాటు కూర్చోబెట్టి ఓ గంట సేపు కాలక్షేపం చేసారు. ఆ మధ్య కొంతమంది నిర్మాతలు, హీరోలు, దర్శకులు – తమ సినిమాల కి టైటిల్ లో తమపేరు వచ్చేలా పెట్టుకున్నారని ఒక పోస్ట్ వేసినపుడు “నారీ నారీ నడుమ మురారీ” సినిమా ని ఆ సినిమా నిర్మాత కె.మురారి ని ప్రస్తావించాను (లింక్ ఇక్కడ).

 

ఇక నిన్నటి ప్రోగ్రాం లో ఆయన మాట్లాడటం చూస్తుంటే, ఇదేదో కావాలని చేస్తున్న ప్రోగ్రాం తప్ప ఇందులో పస లేదు అనిపించింది. “తెలుగు సినిమా పరిశ్రమలో మరో భూకంపం” అనే స్క్రోలింగ్ తో వచ్చిన ఆ ప్రోగ్రాం లో ఆయన చేసిన ఘాటైన విమర్శలు ఏంటంటే –

చిరంజీవి- సినిమా తీసేటపుడు- అన్ని విషయాల్లో తల దూరుస్తాడు. అది నాకు నచ్చదు. (ఈయన చిరంజీవి తో ఒక్క సినిమా కూడా తీయలేదు)
నాగార్జున తో జానకీరాముడు సినిమా తీసేటపుడు, పాట షూటింగ్ మధ్యలో దర్శకుడు రాఘవేంద్ర రావు వెళ్ళి వ్యాన్ లో కూర్చుని మందు కొట్టాడు.
సంగీత దర్శకుడు చక్రవర్తి కి స్వరాలే రావు.
దర్శకుడు రాఘవేంద్ర రావు ఆరోజుల్లో నాకు కొంత డబ్బు ఎగ్గొట్టాడు..

ఇలాంటివి. ఈయన ఇప్పుడు సినిమాలు తీయట్లేదు. ఎవరేమనుకున్నా ఈయనకి నష్టం లేదు. కాబట్టి అప్పటి నెగటివ్ విషయాలన్నీ ఇప్పుడు ధైర్యంగా వ్రాసుకున్నాడు. అయితే నాకు ఒకటి అర్థం కాదు, సినీ నిర్మాతలు కానీ, ఇక ఏ పరిశ్రమ అయినా కానీ అందులో పని చేసేటపుడు వివిధ రకాల వ్యక్తులతో పని చేయాల్సివస్తుంది. ఆ క్రమం లో రక రకాల పాజిటివ్ అనుభూతులతో పాటు, రకరకాల నెగటివ్ అనుభూతులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దట్ జాబ్. అయితే ఎవరికైనా వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని అక్షరబద్దం చేసే హక్కు ఉంది. అంత మాత్రాన పరిశ్రమ లో భూకంపం, తీవ్ర వివాదం అవుతాయంటారా?? కె. మురారి గారు కూడా ధైర్యంగా ఎవరినీ విమర్శించలేకపోయాడు ప్రోగ్రాం కి వచ్చాక. చిరంజీవి గురించి విమర్శిస్తూనే, ఆయన లాంటి హార్డ్ వర్కర్ లేడు అంటాడు. రాఘవేంద్ర రావు ని విమర్శిస్తూనే “త్రిశూలం ” సినిమా లో సూపర్ సీన్ తీశాడు అంటాడు. ఇక లైవ్ లో అక్కడ కూర్చున్న ఇద్దరు విమర్శకులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయన్ని విమర్శించలేక, ఈయన విమర్శలని ఒప్పుకోలేక, బ్యాలన్స్ చేస్తూ మాట్లాడితే మధ్యలో ఏదో ఒక విషయాన్ని పట్తుకుని పెద్దాయన ఆర్గ్యూ చేస్తాడు. వెరసి, పుస్తకానికి ప్రాచుర్యం కల్పించడం తప్ప ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏమీ లేదనిపించింది.

వ్రాసినది: mohanrazz | 2012/11/15

The 4-hour work week రివ్యూ

ఆ మధ్య రిలీజైన ఈ పుస్తకం చాలా కాలం పాటు “టాప్ బుక్స్” లిస్ట్ లో టాప్ లో ఉందని తెలియడం వల్లా ప్లస్ అసలు వారానికి నాలుగు గంటలు మాత్రమే పనిచేసి సర్వైవ్ అవడం సాధ్యమా అనే కుతూహలం చేతా ఈ పుస్తకం ఈ మధ్యే చదివాను.. ESCAPE 9 -5, LIVE ANYWHERE, JOIN NEW RICH  అనే క్యాప్షన్ తో, తిమోతి ఫెర్రిస్ అనే రచయిత పేరు తో వచ్చిన ఈ పుస్తకం పూర్తిగా చదివి, ఆ తిమోతి ఫెర్రిస్ బ్లాగ్ కాస్త పరికించాక ఒక ఐడియా కి వచ్చి ఒక నాలుగు మాటలు దాని గురించి వ్రాయాలనిపించింది..

అసలేం చెప్పాడు: ఈ బుక్ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక 4 పాయింట్స్ లో చెప్పాడు –
D – డెఫినిషన్
E – ఎలిమినేషన్
A – ఆటోమేషన్
L – లిబరేషన్

ఎలిమినేషన్ చాప్టర్ లో మెయిన్ గా రెండు ఐడియాస్ చెప్తాడు. ఒకటి- ప్రపంచం మొత్తం 80/20 ప్రిన్సిపుల్ మీద నడుస్తుంది. ఉదాహరణకి బ్యాంకులకి వచ్చే 80% ఆదాయం 20% సోర్సెస్ నుండే వస్తుంది (అందరూ ఇదే ఫాలో అయిపోతే, స్టేట్ బ్యాంక్ లాంటి వాళ్ళందరూ, పల్లెల్లో బ్రాంచులన్నీ ఎత్తేసి, wealthy customers ని వెతుక్కుంటారు..సర్జన్స్ అందరూ OP చూడటం మానేసి కేవలం ఆపరేషన్లు చేసుకుని మిగిలిన టైం రిలాక్స్ అయిపోతారు). కాబట్టి ఆ సోర్సెస్ ని మాత్రమే కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. రెండోది – పార్కిన్సన్ ప్రిన్సిపుల్. ఇదేమి చెబుతుందంటే – ఏ పని అయినా దానికి allot అయిన వ్య్వవధి కి అనుగుణంగా swell అవుతుంది. అంటే ఒక రిపోర్ట్ తయారు చేయమని మీకు రెండ్రోజుల వ్యవధి ఇస్తే మీరా పని రెండు రోజుల్లో చేయగలుగుతారు, లేదూ రెండు వారాలు ఇస్తే మీరు ఆ పని పూర్తి చేయడానికి రెండు వారాలు వెచ్చిస్తారు. ఈ రెండు ఐడియాలతో పాటు టైం వేస్ట్ చేసే అన్ని దారుల్నీ మూసేయమని కొన్ని చిట్కాలు చెబుతాడు.

 
ఇక ఆటోమేషన్ చాప్టర్ లో – మీ పనులన్నీ ఆటోమేట్ లేదా అవుట్ సోర్స్ చేసుకోమంటాడు. ఇండియా లాంటి దేశాలకి మీ వ్యక్తిగత పనులు కూడా అవుట్ సోర్స్ చేయొచ్చు, ఇది అంతగా ఖరీదు కూడా కాదు, పైగా మీకు బోలెడు టైం సేవ్ అవుతుంది (ఎందుకో ఈ టాపిక్ చదివేటపుడు, కొంచెం కడుపు మండినట్టనిపించింది) అంటాడు. మీ వైఫ్ కి సారీ చెప్పాలన్నా సరే, మీ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీ కి చెప్తే, బెంగళూర్ నుంచి ఇ-మెయిల్లో మంచి గ్రీటింగ్ కార్డ్ ద్వారా సారీ చెప్తాడు అని వ్రాస్తాడు. అలాగే ఒక వెబ్ బేస్డ్ బిజినెస్ మొదలెట్టడం ఎలా, తద్వారా ఆదాయవనరు ని ఆటోమేట్ చేయడం ఎలా అనే దాన్ని చర్చిస్తాడు. ఈ తరహా బిజినెస్ చేసి ఎక్స్ట్రా ఇన్ కం సంపాదించుకోవాలనుకునేవాళ్ళకి ప్రాక్టికల్ ఐడియాస్ చాలానే ఇస్తాడు.

ఇక చివరిది లిబరేషన్. మీకు ఆటోమేటెడ్ ఇన్ కం ఉందిప్పుడు. అవసరం అయితే మీ జాబ్ ని కూడా వర్క్ ఫ్రం హోం మార్చుకోమంటాడు. అందుకు మీ బాస్ ఒప్పుకోకపోతే ఆయాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో సలహాలు ఇస్తాడు రచయిత. ఇక జీవితం లో తరచూ మినీ టూర్స్ (అంటే 3 నెలలో 6 నెలలో లేకపోతే సంవత్సరమో) చేస్తూ జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆయా టూర్స్ కి వెళ్ళేటపుడు మీ ఇల్లు ఖాళీ చేయాలంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మరి మీకు లెటర్స్ వస్తే ఏ అడ్రస్ కి (ఇప్పుడు టూర్లో ఉన్నందువల్ల – మీకు ఒక ఇల్లంటూ లేదు కదా!) పంపించాలి – ఇలాంటి వాటి మీద చిట్కాలు ఇస్తాడు. ఇదండీ ఈ పుస్తకం కథ.

నాకయితే, ఇందులో వ్యక్తిగతంగా చాలా విషయాలు నచ్చలేదు. అదీగాక ఈ రచయిత ఫ్రెండొకాయన తన బ్లాగ్ లో ఈ పుస్తకాన్ని గురించి వ్రాస్తూ, ఈ రచయిత వారానికి 4 గంటలు కాదు కనీసం 60 గంటలు పనిచేస్తాడు అని చెప్పుకొచ్చాడు :)అయితే, జీవితం అంటే ప్రపంచం మొత్తం విజిట్ చేయడమే అనుకునే వాళ్ళకి, వెబ్ బేస్డ్ బిజినెస్ పట్ల ఒక inclination ఉన్నవాళ్ళకి, ఇది పనికిరావచ్చు అనిపించింది..

వ్రాసినది: mohanrazz | 2012/11/13

ఈగ సినిమాలో నాకో డౌట్.. :)

దర్శకధీర రాజమౌళి తీసినీ ఈగ సినిమా కి మొదట్రోజునే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మూడున్నర కి తక్కువ (అవుటాఫ్ ఫైవ్) ఎవ్వరూ రేటింగ్ ఇవ్వలేదు.

ఎన్టీయార్, ప్రభాస్, రాం చరణ్ ల కి సూపర్ స్టార్ డం తెచ్చిన రాజమౌళి ఆ తర్వాత సునీల్ ని పెట్టి హిట్టుకొట్టాడు, మర్యాద రామన్న ద్వారా. స్టార్స్ లేకుండా కూడా కేవలం తన దర్శక ప్రతిభతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన రాజమౌళి ని ఎవరైనా “సునీల్ కూడా స్టారే కదయ్యా, అందులోనూ సునీల్ కూడా డ్యాన్సులు ఇరగదీసాడు” అని ఎవరైనా అన్నారో ఏమో అన్నట్టుగా నెక్స్ట్ సినిమా కి గ్రాఫిక్స్ ఈగ ని హీరో గా పెట్టేసాడు. అఫ్ కోర్స్ సమంత, సుదీప్ ఉన్నారనుకోండి. కానీ ఏ మాట కి ఆ మాట చెప్పుకోవాలి- రాజమౌళికి ఎక్కడ ఎమోషన్ ని పైకి తీసుకెళ్ళాలో ఎక్కడ ప్రేక్షకుణ్ణి లీనం చేయాలో ఆ టెక్నిక్ బాగా తెలిసిపోయింది..నాని ఈగ గా పుట్టే సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరే అందుకు నిదర్శనం..

సరే, విషయానికి వద్దాం. నాని ఈగ గా మారి సమంత సాయం తో సుదీప్ మీద పగ తీర్చుకోడానికి ట్రై చేస్తున్నట్టు సుదీప్ కి తెలిసాక, సుదీప్ వచ్చి సమంత ని తీసుకెళతాడు.. ఈగ కూడా సుదీప్ కి దొరికిపోతుంది..అప్పుడు సుదీప్ ఈగ ని టార్చర్ చేస్తుంటే సమంత “ఈగ ని చంపొద్దు” అని సుదీప్ ని ప్రాధేయపడుతూంటుంది. అయినా వినకుండా సుదీప్ సూది తో ఈగ ని గ్రుచ్చి, టార్చర్ చేస్తుంటాడు..సమంత ఏడుస్తూనే ఉంటుంది… నేను సినిమా ని క్యాజువల్ గానే చూస్తున్నా..రంధ్రాన్వేషణ చేయాలనే ఉద్దేశ్యం నిజ్జంగా అస్సలు లేదు నాకు..కానీ చిన్న డౌట్ వచ్చింది నాకు..”అసలు సమంత అంత ఏడవాల్సిన అవసరమేముంది?, ఒకవేళ సుదీప్ ఈగని చంపేసినా, మళ్ళీ గంటలో ఈగ గా పుట్టి మళ్ళీ రావచ్చుగా..మళ్ళీ వచ్చి, సుదీప్ మీద పగ తీర్చుకోడానికి మళ్ళీ ట్రై చేయొచ్చు…..ఒక వేళ మళ్ళీ చంపితే, మళ్ళీ పుట్టి మళ్ళీ ట్రై చేయొచ్చు..సుదీప్ చచ్చిపోయేలోపు అలా పగ తీర్చుకోవచ్చు.., , ఆ మాత్రానికి ఎందుకు అంత టెన్షన్ అవడం.. :)”

జై చిరంజీవ లో సమీర రెడ్డి తో అంటాడు చిరంజీవి – “నాకు ఇంగ్లీష్ రాదు” అని. ఠకీమని ఒక ముద్దు పెట్టి “హౌ క్యూట్” అంటుంది సమీరా. ఇంగ్లీష్ రాకపోవడం అంత క్యూటెలా అయిందబ్బా అని మనం ఆలోచిస్తుంటే చిరంజీవి “శైలూ, నాకు హిందీ కూడా రాదు” అని మరో బుగ్గ చూపెడతాడు…. అది చూసి శైలూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. బానే ఉంది. తెలుగు సినిమాల్లో హీరోలకి – ఇంగ్లీష్ రాకపోయినా, హిందీ రాకపోయినా, మహేష్ బాబు లా పొడుగ్గా ఉన్నా , ఎన్టీయార్  లాగా సున్నుండ లా ఉన్నా, రవితేజ లా రఫ్ గా ఉన్నా, నాగ చైతన్య లా స్లిం గా ఉన్నా, హరికృష్ణ లా waist పెద్దగా ఉన్నా  – సరిగ్గా ఆ కారణం మీదే తెలుగు హీరోయిన్లకి ఆయా హీరోలని ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది… సినిమా కాబట్టి అది న్యాయమే!

 

కానీ చిరంజీవిగారు ఈ మధ్య తన ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అక్కడి లోకల్ మీడియా ప్రతినిధులు సారాంశాన్ని హిందీ లో చెప్పమని అడిగినపుడు “ఇత్నా హిందీ నహి ఆతా హై, అబ్ సీఖూంగా” అని అంటూ నెక్స్ట్ టైం నుంచి హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తానని కొంచెం టైం ఇవ్వమని సరదాగా మాట్లాడుతూ వాతావరణాన్ని కాస్త తేలికపరిచి కాన్ఫరెన్స్ ముగించేసారు… ఏ మాటకామాటే చెప్పుకోవాలి – ఆ కాస్త సెన్సాఫ్ హ్యూమర్ వల్లే చిరంజీవి చాలా విషయాల్లోని తన బలహీనతలని అలా నెట్టుకొచ్చేస్తున్నాడు కానీ లేకపోతే తనకి మంత్రి పదవి ఇస్తారని ఆయనకి ముందే తెలుసు.. బహుశా టూరిజం శాఖ ఇస్తారని కూడా తెలిసే ఉండొచ్చు… కాస్తంత హిందీ విషయం లో కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చి ఉంటే ఈ ఇబ్బంది ఎదురై ఉండేది కాదేమో. “నాకు హిందీ రాదు” అని చెబితే, సినిమాలో శైలూ లాగా ముచ్చట పడేవాళ్ళు బయటి ప్రపంచం లో ఉండరు కదా భయ్యా..!!! ఇడియట్ సినిమా లో ఒక డైలాగ్ ఉంటుంది – కోట రవితేజ తో అంటాడు – “ఒక్కోసారి వీణ్ణి చూస్తే, వీడంత తెలివైనోడు ఇంకోడు లేదు అనిపిస్తుంది, ఇంకోసారేమో బండి సున్నాలు తెచ్చుకుంటాడు” అని. రాజకీయాల్లో చిరంజీవి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 

 


ఏదేమైనా ఈ ఫొటో లో చిరంజీవిని సూట్, టై  లో చూస్తే చాలా వెరైటీ గా ఉంది. ఆ మధ్య రాజశేఖర రెడ్డి సూట్ వేసుకుని ఢిల్లీ కి వచ్చినపుడు ఇంతకన్నా వెరైటీ గా ఉండేది.. 🙂

తెలుగు సినీ వెబ్సైటలన్నీ కమర్షియల్ ప్రాతిపదికన నడుస్తున్నాయి. కాబట్టి వీటికి హిట్సే ప్రధానం. తప్పు లేదు. సైట్ లో మంచి కంటెంట్ ఉంటే హిట్స్ ఆటొమాటిగ్గా వస్తాయి. అయితే కమర్షియల్ గా బాగా సంపాదిస్తున్న వెబ్సైట్లు కూడా మరిన్ని హిట్లు, మరిన్ని హిట్లు కావాలనే ఉద్దెశ్యం తో రకరకాల టెక్నిక్ లు ప్రదర్శిస్తూ వాళ్ళ ఓవర్ టాలెంట్ ని చూపించుకుంటున్నాయి.

మొన్నామధ్య ఒక వెబ్సైట్ లో “వై.ఎస్. జగన్ కి జై కొట్టిన బాలకృష్ణ” అని హెడ్డింగు. ఎహె, నందమూరి బాలయ్య టిడిపి లో ఉన్నాడు, జగన్ కి ఎందుకు జైకొడతాడు అని డౌట్ వచ్చినా ఏమో బాలయ్య .. ఏదైనా అయోమయం లో పొరపాటున జై ఎన్టీఆర్ అనబోయి, జై వైఎస్సార్ అన్నడా..దాన్ని గానీ న్యూస్ చేసారా అని క్లిక్ చేసి చేస్తే ఎవరో జిట్టా బాల కృష్ణ అనే నాయకుడు జగన్ పార్టీ లో చేరనున్నట్టు న్యూసు.. ఈ లోగా నాలాగా హెడ్డింగు చూసి హిట్లిచ్చిన వాళ్ళెందరో..

ఇంకోసైట్లో చిరంజీవి నిర్ణయాన్ని నిరసించిన బాలకృష్ణ అని హెడ్డింగు..వీళ్ళిద్దరూ మళ్ళీ కొట్టుకున్నారా అని టెన్షన్..తీరా చూస్తే చిరంజీవి పార్టీలో మొదటి సభ్యత్వం తీసుకున్న బాలకృష్ణ నాయుడు అనే వ్యక్తి నిరసన అది…

ఇక శ్రీజ సంఘటన జరిగిన కొత్తలో శిరీష్ భరద్వాజ్ మీద అభిమానులు కోపంగా ఉన్న ఆ రోజుల్లో ఒక సైట్లో భరద్వాజ్ ని దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు అని హెడ్డింగు.. షరా మామూలుగా క్లిక్ చేసి లోపలికెళ్ళాక..విశాల్ భరధ్వాజ్ అనే హిందీ డైరెక్టర్ రీసెంట్ గా తీసిన సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినందుకు ఆయన అభిమానులు ఆయన్ని దుమ్మెత్తిపోస్తున్నార్ట..అదీ న్యూస్..
మొన్నటికి మొన్న షర్మిళ దీక్ష కి 12 యేళ్ళు అని హెడ్డింగ్.. అదెలా కుదురుతుంది? ఈవిడ రాజకీయాల్లోకి వచ్చిందే ఈమధ్య కదా అని ..లోపలకెళ్ళి చూస్తే ఆవిడ వేరే షర్మిళ. అదీ ట్విస్ట్!

ఇలా రకరకాల టెక్నిక్స్ తో సినీ వెబ్ సైట్లు హిట్లు పెంచుకోడానికి నానా తంటాలూ పడుతూనే ఉన్నాయి..ఇంతకీ అవి ఎంత సంపాదిస్తున్నయి అనేది వేరే స్టోరీ… !!!

ఆ మధ్యెపుడో వెన్నెల సినిమాలో నాకు బాగా ఇష్టమైన ఈ సాంగ్ ఆడియో లో ఉండి సినిమాలో లేదనీ, బహుశా పాటలో ఉన్న “క్యాస్ట్ రెఫరెన్స్” వల్ల సెన్సార్ ప్రాబ్లెంస్ ఎదురు కాకూడదని పాటని సినిమాలో ఉంచకపోయి ఉండవచ్చనీ రాశాను..

లింక్ ఇక్కడ..

అయితే ఒకసారి (2010-నవంబర్ లో) ట్విట్టర్ లో వెన్నెల దర్శకుడు దేవకట్టా ని ఇదే విషయం అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఇదీ..

ఈ సారి తీయబోయే సినిమాలో ఈ పాటని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాననీ ఆయన అన్నారు..అయితే సెన్సార్ వివాదాలు గతం తో పోలిస్తే ఈ మధ్య మరీ “సెన్సిటివ్” అయ్యాయి..చూడాలి ఇలాంటి పాటల్ని కూడా వివాదం చేస్తారొ లేక లైట్ తీసుకుని ఎంజాయ్ చేస్తారో!


ఇవాళ త్రివిక్రం శ్రీనివాస్ బర్త్ డే. ఒక 13 యేళ్ళ క్రితం రైటర్ గా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి, ఇవాళ టాప్ డైరెక్టర్ గా ఉన్న ఆయన గురించి షరా మామూలు గా చాలా కథనాలు టివి లో వచ్చాయి..అయితే అందులో చాలా వరకు ఆయన రాసిన తీసిన కామెడీ సీన్లతో 30 నిమిషాలు నింపేసి మమ అనిపించిన ప్రొగ్రాంసే..


సరే, ఆయా మొదటి సినిమా స్వయంవరం లో మాటల రచయిత పేరు “త్రివిక్రమన్” అని పడింది. దీని మీద ఆ రోజుల్లో జోగి బ్రదర్స్ చిన్నపాటి సెటైర్ వేసారు..”ఏంటి..అందరూ ఈ సినిమాలో డాఇలాగులు సూపరు, డైలాగులు సూపరు అంటున్నారు..తీరా చూస్తే డైలాగులు రాసింది తమిళోడా??” అని. నిజానికి ఆయన ఎందుకో తన కలం పేరు త్రివిక్రమన్ అని పెట్టుకున్నారు..కానీ అదేమో తమిళ పేరు లా అనిపించి మొదటికే మోసం వచ్చేలా ఉంది..ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ లో తన బంధువు ఒకాయన ఈ తమిళ పేరు సమస్య అధిగమించడానికీ, తన కలం పేరు ని వదలకుండా వుండటానికీ వీలుగా “త్రివిక్రం శ్రీనివాస్” అని పేరు వేయించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడనీ, అప్పట్నుంచీ అదే కొనసాగిస్తున్నానీ త్రివిక్రం గారు చెప్పుకొచ్చారు..


అసలు ఆ “త్రివిక్రం” అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనెప్పుడూ చెప్పలేదు కానీ ఆయన రాసే డైలాగుల్లో ఒక ప్రత్యేక శైలి ఆయనకి 3విక్రం అనే పేరు ని సార్థకం అయితే చేసిందని చెప్పగలను.. ఉదాహరణ కి – ఆయన రాసే డైలాగుల్లో – ఈయన ఒక మూడంచెల “ప్యాటర్న్” ని ప్రవేశ పెట్టాడు –


నువ్వే కావాలి లో –
1) భార్యా భర్తలు విడిపోవాలంటే విడాకులు ఉన్నాయి
2) అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి గొడావలు ఉన్నాయి
3) కానీ, స్నేహితులు విడిపోవాలంటే మాత్రం – చనిపోవాలి – అంతే !


ఇలా ఆయన చెప్పాలనుకున్న విషయానికి మరో రెండు జోడించి దాన్ని మూడంచెల్లో చెప్పడం అనే ఒక శైలి ని క్రియేట్ చేసుకున్నాడు..
జల్సా లో –
ఆలీ వచ్చి పవన్ ని ఒకసారి బయటకి రమ్మంటాడు (పార్వతీ మెల్టన్ ప్రపోజ్ చేసే సీన్లో) –
పవన్: 1) అర్జెంటా 2) ఇంపార్టెంటా?
ఆలీ: 3) సీరియస్.


అలాగే “అతడు” లో కూడా వాడికేంటే – 1) తెల్లగా ఉంటాడు, 2) పొడుగ్గా ఉంటాడు 3) ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు అంటుంది త్రిష..
అలాగే 1)సిగ్గుతో కూడిన 2) భయం వల్ల వచ్చిన 3) గౌరవం అనే డైలాగూ ఇందులో సూపర్ పాపులర్!
కామెడీ లోనే కాక సెంటిమెంట్ సీన్లోనూ ఇలా 3 స్టెప్స్ ప్రాసెస్ ఫాలో అయ్యాడు త్రివిక్రం చాల చోట్ల.. అయితే ఇది కాన్షస్ గా చేసిందా లేక ఆయాన శైలి సబ్-కాన్షస్ గా అలా ఫిక్స్ అయిందా చెప్పడాం చాలా కష్టం..


ఈ డైలాగుల్లోనే కాక సన్నివేశాల్లోనూ ఒక స్టాండర్డ్ “ట్విస్ట్” నేర్చుకుని సినిమాల్లోకి వచ్చినట్టున్నాడు త్రివిక్రం..అదేంటంటే – చాలా సినిమాల్లో కీలకమైన కథా మలుపు ఏంటంటే – హీరోయిన్ కి వేరే వ్యక్తి తో ఎంగేజ్ మెంట్ అవడం. కావాలంటే గమనించండి-
స్వయం వరం
నువ్వే కావాలి
చిరునవ్వుతో
నువ్వు నాకు నచ్చావ్
మన్మధుడు


ఇలా చాలా సినిమాల్లో సేం పాయింట్ ని మెయిన్ ట్విస్ట్ గా వాడేసుకున్నాడు త్రివిక్రం..
దర్శకుడయ్యాక దాదాపుగా రచయిత గా ఇతర సినిమాలకి పని చేయడం మానేసినా అప్పుడపుడు ఆబ్లిగేషన్ల వల్ల రచయిత గానూ చేసాడు. అయితే అలా చేసినవి పెద్దగా ఆడలేదు..ఉదాహరణకి పవన్ కళ్యాణ్ హీరో “3ష”  హీరోయిన్ గా “3విక్రం” రైటర్ గా వచ్చిన “3మార్” సినిమా గట్టిగా 3 వారాలు కూడా ఆడలేదు.. ఇలా 3 (“మూడ్”) లేకుండా పనిచేసే సినిమాలు తగ్గించి, మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.

వ్రాసినది: mohanrazz | 2012/11/06

రాజ మౌళి అతి వినయము


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అని చంద్ర బోస్ గారు సెలవిచ్చారు.. మొక్క ఎదిగేటపుడు మాట్లాడదు కాబట్టి అది మౌనంగా ఎదగడం వరకు కరెక్టే కానీ ఇందులో, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమెక్కడినుంచి వచ్చిందో నాకు అంతు పట్టదెపుడూ..


రాజ మౌళి గారు ఇవాళ తెలుగు లొ నం.1 డైరెక్టర్. మగధీర సూపర్ హిట్ తర్వాత ఆయన వేదికల మీద మరింత ఒదిగి మాట్లాడుతున్నాడు.. అదుర్స్ ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఆ మధ్య ఈ సినిమా మగధీర ని దాటేస్తుంది ఎందుకంటే ఇది వి.వి వినాయక్ గారి సినిమా అని వినమ్రంగా సెలవిచ్చారు..ఆ తర్వాత మగధీర రికార్డ్ అలా పదిలంగా నిలబడి పోయింది. దమ్ము ఆడియో ఫంక్షన్ కి వచ్చి బోయపాటి కి సాటి ఎవరూ లేరు… అసలు సిసలైన మాస్ డైరెక్టర్ ఇవాళ ఆయనే..నేనేదో ఈగలు, దోమలు అంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటున్నాను అని  మళ్ళీ అలా ఒదిగి పోయారు..బోయపాటి గారేమో ఎంతో (అతి) విశ్వాసం తో ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి, చూడండి, చూడండి, చూడండి..అని ప్రసంగించారు..ఆ తర్వాత దమ్ము సరిపోక పోవడమూ, ఈగ దుమ్ము రేపడమూ జరిగి పోయాయి… దానికి ముందు బిజినెస్ మేన్ ఫంక్షన్ లో పూరి ని పొగుడుతూ…ఒక ఎమోషన్ ని పైకి లేపడానికి తాను..ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి..దానికి టెంపో పెంచి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాడి, ఎమోషన్ తీసుకు వస్తే, పూరిగార్ చిన్న డైలగ్ తో అంతకంటే ఎక్కువ ఎమోషన్ తీసుకు వస్తాడని..తామంతా ఆయన ముందు దిగదుడుపనీ మళ్ళీ ఒదిగి పోయాడు రాజమౌళి..


మొన్నటికి మొన్న రెబెల్ ఆడియో ఫంక్షన్ లో లారెన్స్ ని ఆకాశానికి ఎత్తెసాడు రాజమౌళి…అసలు ఆ ఫైట్ లో ఆ షాట్ హైలేట్ ..నేనెప్పుడూ అలా తీయలేదు అని వినమ్రంగా ఆశ్చర్య పడిపోయాడు..లారెన్స్ ఏమొ తెగ సంబర పడిపోయాడు ఆ స్పీచ్ విని..కట్ చేస్తే రెబెల్ షెడ్ కి వెళ్ళిపోయింది..ఇక కృష్ణం వందే జగద్గురుం ఆడియో ఫంక్షన్ లో తనకి అసలు ట్రైలర్ చూసాక మాటలు పెగలట్లేదని క్రిష్ ని ఎత్తేశాడు రాజమౌళి.. ఇక ఇదేమవుతుందో చూడాలి…


కాబట్టి ప్రియాతి ప్రియమైన దర్శకులారా…రాజ మౌళి స్పీచుల్లో ఆయన వినమ్రత ఈ మధ్య – ఛత్రపతి సినిమా లో ఇంటర్వల్ కి ముందు సీనో ఎమోషన్ లాగా బాగా పీక్ కి చేరుకుందనీ, ఆయన తనకేమీ రావని మిమ్మల్ని పొగిడినపుడు అది ఆయన వినయానికి పరాకాష్ట అనీ గ్రహించి, మీరు ఆయన స్పీచ్ కి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం తక్షణమే ఆపేసి, మీ పని మీరు చూసుకోగలరనీ..నా ఈ చిన్న విన్నపం..


ఎట్టకేలకి చిరంజీవికి ఒక పదవి దక్కింది. చంద్ర బాబు , వై.ఎస్. వంటి రెండు “ఆంబోతుల” మధ్య (ఈ పద ప్రయోగం నాది కాదు, మంత్రి వట్టి వసంత్ గారిది ) నలిగిపోయి చివరికి కాంగ్రెస్ లో పార్టీ ని విలీనం చేసిన మెగా స్టార్ కి స్వతంత్ర హోదా కేంద్ర మంత్రి పదవి అక్టోబర్ 28 న దక్కింది. అయితే  యాదృచ్చికం గా 1983 లో ఇదే తేదీన ఖైదీ రిలీజ్ అయింది. సో, ఖైదీ తో ఏదో ఒక రకమైన రెఫరెన్స్ చిరంజీవి జీవితాన్ని వదలటం లేదు.


అప్పట్లో ఠాగూర్ సినిమా తీసినపుడు ముందు ఈ “సూర్యం” అనే పేరు పెడదామనుకున్నార్ట. ఖైదీ లొ చిరంజీవి పేరు ఇది. ఈ సారి ఆ సినిమా చూసినపుడు గమనించండి సినిమా మొదలైన 1.5 గంట వరకు సినిమా లొ చిరంజీవి ని ప్రొఫెసర్ అంటారే తప్ప ఎక్కడా చిరంజీవి ని పేరు తో ప్రస్తావించరు. సియాజీ షిండే ని కిడ్నాప్ చేసిన సీన్లో మొదటి సారి “ఠాగూర్” అనే పేరు వినిపిస్తుంది. అంటే షూటింగ్ 75% పూర్తయ్యాక ఈ పేరు కన్ ఫర్మ్ అయిందన్న మాట.


ఇక రైలు గుర్తు తో 2009 ఎలక్షన్స్ లో దెబ్బ తిన్నాక పీఅర్పీ గుర్తు “సూర్యుడు” గుర్తు కి మార్చుకున్నారుట ఇదే సెంటిమెంట్ మీద..
ఇప్పుడేమో ఖైదీ రిలీజ్ తేదీన మంత్రి పదవి!!! ఈ ఖైదీ  సెంటిమెంట్ చిరంజీవి కి ముందు ముందు కూడా కొనసాగుతుందేమో చూడాలి…

వ్రాసినది: mohanrazz | 2012/09/14

టైటిలా? మన పేరే పెట్టేద్దాం..

title

నిర్మాతల పేర్లు, దర్శకుల పేర్లు, హీరోల పేర్లు టైటిల్స్ గా వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి తెలుగులో. హీరోల పేర్లు సినిమా టైటిల్ గా వచ్చినవి కొంచెం బాగా గుర్తుంటాయి మనకి. అయితే ఇక్కడ ఇంకో సెంటిమెంట్ ఉంది తెలుగు లో. హీరోల పేర్లతో కానీ వాళ్ళ నిక్ నేంస్ తో కానీ టైటిల్ పెట్టిన సినిమాలేవీ హిట్ కాలేదుట. చిరంజీవి హీరొ గా వచ్చిన “చిరంజీవి” అనే ఫ్లాప్ సినిమా ఒకటుంటుంది. చిరంజీవి (చిరకాలం జీవించేవాడు) అనే టైటిల్ పెట్టిన ఆ సినిమా లో చిరంజీవి క్లైమాక్స్ లో చచ్చిపోతాడు. మహేష్ బాబు ని ఇంట్లో నాని అని పిలుస్తారు కదా అని ‘న్యూ’ అనే టైటిల్ తో కథ వ్రాసుకొచ్చిన సూర్య కి తెలుగు వెర్షన్ కి “నాని” అని పేరు పెడదామని కన్విన్స్ చేసారు. తమిల్ వెర్షన్ (న్యూ) లో బానే హిట్ అయిన ఆ సినిమా తెలుగు లో మరీ దారుణంగా ఫ్లాప్ అయింది. నాగార్జున నిక్ నేం అని చెప్పి తీసిన “చినబాబు” సినిమా ని బహుశా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిఉండవచ్చు.

హీరోల సంగతి ప్రక్కన పెడితే, నిర్మాతల్లో కూడా ఈ సరదా కొన్నిసార్లు కనపడుతూ ఉంటుంది. రామానాయుడు “నాయుడుబావ” అనే పేరుతో సినిమా తీసినా, ఆ మధ్య కె.మురారి అనే నిర్మాత పట్టుబట్టి తనసినిమాకి నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ పెట్టుకున్నా అశ్వనీదత్ “అశ్వమేధం” అనే పేరుతో భారీ సినిమా తీసినా అన్నీ వాళ్ళ వాళ్ళ సరదాల్ని జనానికి పట్టిచ్చేవే. అయితే హీరోలు, నిర్మాతల సంగతి ప్రక్కన పెడితే ఒక దర్శకుడు తన పేరుని సినిమా కి టైటిల్ పెట్టే సాహసం ఎవరూ చేయలేదు నాకు తెలిసి. అలాంటి సాహస కార్యానికి పూనుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ మన ఉపేంద్ర! ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం అవుతుంది.  ఇంకో టపా లో ఆ గ్రంధం గురించి మాట్లాడుకుందాం!.

మీలో చాలా మంది బహుశా చూసే ఉంటారు. ఎవరో చెబితే నేను ఈ మధ్యే చూశానీ సినిమా. సింప్లీ సూపర్బ్ అనిపించింది నాకైతే!
సినిమా తీసింది అమోల్ గుప్తే (నిర్మాత, దర్శకుడు). ఈయన తారే జమీన్ పర్ సినిమా కి కథ, స్క్రీన్ ప్లే అందించారు. నాకు గుర్తుండి  తారే జమీన్ పర్ డైరెక్షన్ కూడా ముందు ఈయనే మొదలెట్టాడు, అయితే ఆ తర్వాత ఏవో కారణాల వల్ల అమీర్ ఖాన్ డైరెక్షన్ టేకోవర్ చేసాడు..అప్పట్లో ఈయన అమీర్ ఖాన్ మీద “నా సొంత బిడ్డ (అంటే తారే జమీన్ పర్ సినిమా అన్న మాట) కి నన్నే ఆయా ని చేసాడు అమీర్ ఖాన్” అని నసిగినట్టు గుర్తు. అయితే ఈ సారి తన సొంత బిడ్డనే (పార్థో గుప్తే – ఆ పిల్లాడి పేరు) హీరో గా పెట్టి ఒక చిన్న బాలల కథా చిత్రం లాంటిది తీశాడు. బాలీవుడ్ ప్రమాణాలతో పోలిస్తే, బాగా లో బడ్జెటే ఈ సినిమా. అయితేనేమి – సినిమా చూసినతర్వాత ఒక మంచి సినిమా చూసామన్న సంతృప్తి మిగిలించింది. అయితే నేను చెప్పింది విని మీరు దీన్ని తారే జమీన్ పర్ స్థాయి లో ఊహించుకోకండి. తారే జమీన్ పర్ చూస్తే ఎలాంటి వారైనా కంటతడి పెట్టుకోవడం గ్యారంటీ అన్నట్టు ఉంటుంది. ఇది మరీ అంత స్థాయి లో లేదు. అసలు రచయిత ఉద్దేశ్యం అది కాదు కూడా. 

ఇక కథ విషయానికి వస్తే – స్టాన్లీ అనే ఒక చురుకైన కుర్రాడు. రోజూ స్కూల్ అందరికంటే ముందే వస్తుంటాడు. తన మాటలతో కథలతో తోటి స్టూడెంట్స్ ని, టీచర్స్ ని ఆకట్టుకుంటుంటాడు. అయితే హిందీ టీచర్ ఒకాయనకి మాత్రం స్టాన్లీ అంటే పడదు. కారణమేంటో తెలుసా??? స్టాన్లీ టిఫిన్ బాక్స్ తెచ్చుకోడు. అవును. ఈ హిందీ టీచర్ మిగతా టీచర్ల, స్టూడెంట్ల డబ్బాల్లో ఐటెంస్ అనీ టేస్ట్ చేసే బాపతు ఈయన. స్టాన్లీ డబ్బా తెచ్చుకోక పోవడం వల్ల మిగతా స్టూడెంట్స్ తమ డబ్బాల్లోది స్టాన్లీ కి ఆఫర్ చేయడం వల్ల ఈయనకి ఆ ఐటెంస్ తినే వీలు లేకుండా పోతోంది.. ఇక ఆయన స్టాన్లీ ని “రేపటినుంచి డబ్బా తీసుకు వస్తేనే స్కూల్ కి రావాలి” అని హుకుం జారీ చేస్తాడు..ఆ తర్వాత కథ ఏమయింది, అసలు స్టాన్లీ స్కూల్ కిడబ్బా ఎందుకు తీసుకురాడు, ఆ తర్వాత ఎలా తీసుకువస్తాడు అనే ఒక చిన్న కథ, ఆ క్లైమాక్స్ లో ఇచ్చిన సున్నితమైన ట్విస్ట్ కొంచెం ఓపిగ్గా సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనస్సునీ ఆర్ద్రం చేస్తుంది.      

నిజంగా ఇంత స్వచ్చమైన కథ ని చూసి చాలా కాలమైంది అనిపించింది. తెలుగులో ఇలాంటి కేటగరీ లో సినిమాలొ ఎన్నేళ్ళ క్రితం వచ్చాయో కూడా గుర్తులేదు. మొన్న ఏదో టివి షో లో ఒక కుహనా విమర్శకుడు వచ్చి మనకీ “ఆ నలుగురు” లాంటి “గొప్ప” సినిమాలు ఉన్నాయి అని వాదించాడు. ఆయన్ని మనసులోనే క్షమించేసి ఛానెల్ మార్చేసాను.

స్టాన్లీ గా చేసిన కుర్రాడు ముచ్చటగా చేసాడు. హిందీ టీచర్ పాత్ర డైరెక్టరే పోషించాడు. మరో అమ్మాయి -ఇంగ్లీష్ టీచర్- బాగా చేసింది.
ఏది ఏమైనా ఇది నాకు నచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. అయితే హడావుడిగా, ఫార్వర్డ్ చేస్తూ చూద్దామనుకునేపుడు ఈ సినిమా చూడకండి. హాయిగా ప్రశాంతంగా ఉన్నపుడు తాపీగా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.

(This is just for FUN)

సినిమా వాళ్ళ తెలుగు, మనం మామూలు గా మాట్లాడుకునే తెలుగు రెండూ ఒకటేనన్న పెద్ద అపోహ లో వుంటారు చాలామంది. చాలా పొరపాటది. దానికీ దీనికీ రాధిక కి సాధిక కి ఉన్నంత తేడా ఉంది. సినిమా వాళ్ళు మాట్లాడే మాటల వెనుక వుండే అసలు అర్థం తెలియాలంటే కొంచెం జాగ్రత్త గా పరిశీలించాలి.

ఉదాహరణకి సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ లో, ఇంటర్వ్యూ లో మాట్లాడే కొన్ని సినిమా తెలుగు మాటలని సాధారణ తెలుగు లోకి డబ్బింగ్ చేస్తే సారీ ట్రాన్స్ లేట్ చేస్తే ఇలా ఉంటాయి. (సినిమా వాళ్ళ తెలుగు ని, దాని ప్రక్కనే తెలుగు లో ఆ వాక్యం అసలు మీనింగ్ ని గమనించగలరు)


ప్రెస్ మీట్ – సినిమా మొదలెట్టే మందు:

కథే హీరో – హీరో గా ముక్కూ మొఖం(లేని)తెలీని సన్నాసిగాణ్ణి పెట్టాం.
ఈ సబ్జెక్ట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు – ఈ సారి ఎవరికి తెలీని ఇరాన్ సినిమా ని కాపీ కొట్టాం.

(హీరోయిన్:)ఈ సినిమాలో నా క్యారెక్టర్ బబ్లి బబ్లి బబ్లీగా జోవియల్ గా ఉంటుంది-అమ్మతోడు, నాకు కథ గురించి కానీ క్యారెక్టర్ గురించి గానీ ఒక్కముక్క కూడా తెలీదు 

పక్కా స్క్రిప్ట్ తో మొదలెడుతున్నాం – స్టోరీ లైన్ రెడీ అయింది


ప్రెస్ మీట్ – సినిమా రిలీజ్ కి ముందు:

మా డైరెక్టర్ మేమనుకున్న దాని కంటే బాగా తీసాడు – వీడు ఈ మాత్రం తీస్తాడని అనుకోలేదు ముందు.
స్క్రీన్ ప్లే చాల ఫాస్ట్ గా వుంటుంది – పెద్ద స్టోరీ ఏమీ ఉండదు.
రీమేకే అయినా నేటివిటి మార్పులు చాలా చేసాం – ఫస్ట్ సాంగ్ మూడో స్టెప్ లో హీరో లుంగీ కి బదులు ప్యాంట్ వేసుకుంటాడు.

సినిమాకి రీరికార్డింగే హైలెట్-అది తప్ప వేరే ఏమీ లేదు సినిమాలో


రిలీజ్ అయ్యాక –

మొదట్లో డివైడెడ్ టాక్ వినిపించింది – ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్ళు బండబూతులు తిట్టారు.
స్లో గా పికప్ అవుతోంది- కౌంటర్ లో ఈగలు తోలుకుంటున్నారు.
సినిమా చూసిన వాళ్ళంతా టెక్నికల్ గా చాలా బాగుందంటున్నారు – సినిమా ఓవరాల్ గా ఛండాలంగా వుందంటున్నారు.
సినిమా విశ్లేషకుల అంచనాలను తలకిందలు చేసి, ట్రేడ్ పండితులని ఆశ్చర్యపరిచింది- చెత్త సినిమా నే, కానీ (అక్కడక్కడా) ఆడుతోంది, ఎందుకో తెలీదు.


రిలీజైన చాన్నాళ్ళకి:
(నిర్మాత:)ఆ సినిమా నాకు ఎనలేని ఆత్మసంతృప్తినిచ్చింది-పైసా రాలేదు

వ్రాసినది: mohanrazz | 2011/12/17

త్రివిక్రం డైలాగులు

ఈ మధ్య ఎవడైనా మంచి పంచ్ ఒకటి విసిరితే చాలు – ఏంటి బాసూ త్రివిక్రం స్కూల్ లో జాయిన్ అయ్యావా అంటున్నారు జనాలు. ఇప్పుడంటే త్రివిక్రం ట్రెండ్ నడుస్తోంది కానీ నేను ఇంజినీరింగ్ చదివేటప్పటికి ఇంకా త్రివిక్రం సినిమాల్లోకి రాకపోవడం వల్ల అప్పట్లో మా ఫ్రెండ్స్ అంతా ‘ఇ.వి.వి. స్కూల్ ‘ లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేవాళ్ళు. అప్పటి సంగతులు.

1. ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ తెలిసినతనికి అన్న వరస ఒకాయనకి క్యాంపస్ లో పని వుంటే మా రూం లో దిగాడు. మా రూం లో మిగతా వాళ్ళూ ఒకే బ్రాంచ్ అవడం తో సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ చాలా వుండేవి- నీట్ గా వుండేవి కూడా, ఎవరూ పెద్దగా టచ్ చేయకపోవడం వల్ల. వచ్చినతను రాగానే రూం ని పుస్తకాలనీ చూసాడు. బాగా చదువుకునే టైప్ క్యాండిడేట్ అనుకుంటా- అన్నేసి పుస్తకాలు చూసేసరికి తెగ ముచ్చట పడ్డాడు.

అతనన్నాడు – ‘మీ రూం లో బుక్స్ కలెక్షన్ బాగా వున్నట్టుందే ‘ .
ఠకీమని రిప్లై వచ్చింది ఒక మూల నుంచి- ‘ కలెక్షన్ బాగానే వుంటది, కానీ వాటితో మాకు కనెక్షనే – అస్సలుండదు ‘.

2. ఇంకొకసారి ఇంజినీరింగ్ అప్పుడే- మా ఫ్రెండ్ వచ్చి అన్నాడు –
‘బాసూ నేను రూం మారుదామనుకుంటున్నాను. ఆ సైకో గాడి తో కలిసి నేను ఉండలేను.’
నేనేమో అప్పటికే ‘ఇంద్ర-బార్న్ ఫర్ పీపుల్ ‘ లాగా చాలా మంది ని రూం లో అడ్జస్ట్ చేసి వుండడం తో మా రూం కిటకిటలాడుతూండేది. మరి మా రూం కి వస్తానంటాడేమో అని అన్నానో లేక క్యాజువల్ గా అన్నానో గుర్తు లేదు కానీ, అన్నాను-
‘వాడి గురించి తెలిసిందే కదా, నువ్వే కొంచెం సర్దుకుపోవాలి ‘.
వెంటనే అన్నాడు మా వాడు- ” వాడి గురించి ‘తెలిసింది ‘ అందుకే ‘సర్దుకుని ‘ పోతున్నాను “.

3. మా మెస్ లో ఒక వర్కర్ వుండేవాడు. బాగా సోమరి. రోజూ ఒకే గళ్ళ చొక్కా వేసుకుని వచ్చేవాడు. వడ్డించేటపుడు మా ఫ్రెండ్ అడిగాడు-
‘ఇవాళేంటి కర్రీ’ అని.
‘ఇవాళ (కూడా) ముల్లంగి సార్ ‘ అన్నాడు.
మా వాడు అన్నాడు కొంచెం చిరాకుగా – ‘ కొంచెం మార్చండయ్యా- రోజూ ఈ ముల్లంగి నీ, నీ గళ్ళంగి నీ చూడలేక చచ్చిపోతున్నాం ‘ .

4. ఇంకొకటి. ఓ సారి మా రూం-మేట్ ఒకబ్బాయి అన్నాడు.
“జుట్టు బాగా తెల్లబడింది. ఇవాళ హెయిర్ డై అయినా వేసుకోవాలి”.
ప్రక్కన అబ్బాయి అన్నాడు- ” ఇవాళ వద్దులే ఇంకెప్పుడైనా వేసుకో “.
“ఏం? ఎందుకలాగా?” .
” అంటే..’డై అనదర్ డే’ అన్నారు కదా అందుకని..” .

5. ఓ సారి పేకాడుతున్నాం హాస్టల్లో. ఎవరో షో చెప్పాక ఒకతనిది స్కోర్ 250 దాటిపోయింది. అయినా కూడా ఇంకోసారి తను ఔటా కాదా అని కన్‌ఫర్మ్ చేసుకుందామని స్కోర్ వేస్తున్నతన్ని అడిగాడు.
“ఔటా”
అతనన్నాడు-
“డౌటా”

 

వ్రాసినది: mohanrazz | 2011/12/01

సినిమావోళ్ళకి “సన్” స్ట్రోక్

son stroke

మిగతారంగాల్లో ఉన్నతస్థానానికి ఎదిగినవాళ్ళు తమ పిల్లలు కూడా తమ రంగం లోకే అడుగుపెట్టి తమ కంటే ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆశించినట్టే పాపం సినిమా వాళ్ళు కూడా ఆశిస్తూంటారు. చిరంజీవి, నాగార్జున పుత్రరత్నాలు ఆల్రెడీ పరిచయమైపోతే నందమూరి అభిమానులు ఇప్పుడు స్కూలింగ్ లో ఉన్న బాలయ్య కొడుకు మోక్షఙ్ఞ పుట్టిన రోజుకనుకుంటా ఆ మధ్య ఎపుడో సూపర్ హిట్ లోనో ఇంకేదో సినిమా పత్రికలోనో ఒక ప్రకటన ఇచ్చారు 🙂

సరే హీరోల వారసత్వం ఈనాటిది కాదు. వారసులైనా కష్టపడకుండా ఏదీ రాదు. కాకపోతే ఎంట్రెన్స్ ఈజీ. అయితే ఇది కాకుండా ఇంకొంతమంది ఉన్నారు. కొడుకులని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టబోయి తమకే ఎసరు తెచ్చుకున్నవాళ్ళు. కుంజుమోన్ అని ఒక నిర్మాత ఉండేవాడు మొదట్లో శంకర్ తో జెంటిల్మేన్, ప్రేమికుడు ఆ తర్వాత కదిర్ తో ప్రేమదేశం లాంటి సినిమాలు తీసి ఒక్కదెబ్బతో అగ్రనిర్మాతయ్యాడు. కొన్ని హిట్ల అనంతరం అతని డౌన్ ఫాల్ రక్షకుడు తో మొదలైంది. రక్షకుడు తో సగం నాశనమైన ఆయన కెరీర్ ని సర్వనాశనం చేసిన ఘనత మాత్రం కుంజుమోన్ కొడుకు సినిమా కోటీశ్వరన్ కే దక్కుతుంది. కోటీశ్వరుడు గా ఉన్న కుంజుమోన్ ని బికారి ని చేసిన ఈ కోటీశ్వరన్ సినిమా కోసం భారీ గానే ఖర్చుపెట్టాడు కుంజుమోన్. ఒక ఐటెం సాంగ్ కరిష్మా కపూర్ తో తీసాడప్పట్లో. కరిష్మా హిందీ లో ఒక ఫుల్ సినిమాకి తీసుకునే పారితోషికాన్ని ఒక్క పాటకోసమే ఇచ్చాడంటారు అప్పట్లో. కోటీశ్వరన్ దెబ్బకి కనుమరుగైపోయాడు కుంజుమోన్.

ఇక మన ఎ.ఎం రత్నం పరిస్థితి కూడా ఇదే. చిత్రంగా ఈయనా శంకర్ సినిమాలతోనే భారీ నిర్మాతయ్యాడు. భారతీయుడు సినిమా అప్పుడు ఈయన నిర్మాణ విలువలని దేశమంతా మెచ్చుకున్నారు. మంచి హిట్ల తో ఖుషీ ఖుషీ గా ఉన్న ఈయన కి సన్ స్ట్రోక్ కాదు, సన్స్ స్ట్రోక్ తగిలింది. ఒక కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడు గా తెరవెనుక ఉంటే ఇంకో కొడుకు రవికృష్ణ తెరమీద హీరో గా ఉంటూ కేడీ అనే సినిమా తీసారు- ఇలియానా, తమన్నా ని పెట్టి. అక్కడ మొదలైంది. ఇక అంతే.

మన RB చౌదరి గారు కూడా వరస హిట్లతో అగ్రనిర్మాత గా ఉండేవాడు- శుభాకాంక్షలు, సుస్వాగతం, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా అంటూ. కొడుకు తో “విద్యార్థి” తీసాడు. తేరుకోడానికి టైం పట్టింది.

ఇంక మనలో మాట- దర్శకరత్న దాసరి కూడా వాళ్ళ కొడుకుని పెట్టి తీసిన గ్రీకువీరుడు, చిన్నా అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఆ కసి తోనే “కంటే కూతుర్నే కను” తీశాట్ట 🙂

వ్రాసినది: mohanrazz | 2011/11/24

సినిమాల్లో ‘కుల’ వివాదాలు

సినిమాల్లో కులం ప్రస్తావించడం అనే విషయం లో సెన్సార్ నిబంధనలు ఇలా ఉంటాయి- ఒక కులాన్ని గురించి నెగటివ్ గా చూపించడం తద్వారా ఆ కులస్తులు బాధపడేలా చేయడం, లేదా ఒక కులాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆకాశానికెత్తేయడం- చేయకూడదు అని. ఒక నెగటివ్ పాత్రకి కులం పేరు ప్రస్తావించడం అవసరమయినపుడు- ఆ కులం లోనే ఉన్న మంచిపాత్రని చూపించడం ద్వారా కానీ మరేరకంగా కానీ ఆ నెగటివ్ పాత్ర కులం మొత్తాన్ని ప్రతిబింబించేది కాదు అన్నట్టుగా చూపించవలసిన బాధ్యత రచయిత-దర్శక-నిర్మాతలదే. ఇది కులనికే కాదు – వృత్తికి కూడా వర్తిస్తుంది. నిజానికి “సామాజిక చైతన్యమే” ప్రధాన ఉద్దేశ్యాంగా తొలినాళ్ళలో వచ్చిన చిత్రాల్లో తప్పిస్తే మిగతా సినిమాల్లో కుల ప్రస్తావన అక్కర్లేదు మన సినిమాలకి.

అయితే అడపాదడపా మనకి జస్టిస్ చౌదరి, సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి టైటిల్స్ వస్తూనే వున్నాయి. అయితే ప్రేక్షకులకి ఎబ్బెట్టుగా అనిపించక- ఆయా కథలకి ఆ టైటిల్స్ సరిపోయినట్టుగానే అనిపించాయి. కులం విషయం లో కొంత నిరసనని ఎదుర్కొన్న సినిమాలు – గత పది పదిహేనేళ్ళలో వచ్చిన వాటిలో తక్కువే. ఇవివి, మోహన్ బాబు తీసిన “అదిరింది అల్లుడూ” అనే సినిమాలో ఒక వర్గం కొంత ఇబ్బంది పడ్డారని, కొంత నిరసన వచ్చింది. నిజానికి ఈ సినిమా భాగ్యరాజా తమిళ్ సినిమా (తెలుగులో నేనూ మీవాణ్ణే అనే పేరుతో డబ్ అయింది) కి రీమేక్. ఈ సినిమా బేసిక్ స్టోరీలైనే కులం అనే అంశం చుట్టూ తిరుగుతుంది కాబట్టి- ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసినా ఏదో ఒక విషయం లో నిరసన రావడం ఊహించదగిందే. కానీ మన్మధుడు అనే క్లీన్ కామెడీ సినిమాలో కూడా ఇలాంటి వివాదమే వచ్చింది. ఈ సినిమా లో “ఉప్పర్ మీటింగ్” అనే పదం వాడతాడు నాగార్జున ఒకచోట. అయితే అది ఒక కులం పేరు అవడమూ- నాగార్జున ఆ పదాన్ని వాడిన సందర్భం – నెగటివ్ సెన్స్ లో ఉండటం తో సహజంగా ఆ కులస్తులు మా మనోభావాలు గాయపడ్డాయి అంటూ నిరసించారు. ఆ తర్వాత ఆ పదాన్ని మ్యూట్ చేసారు థియేటర్స్ లో. అయితే డివిడిల్లో యథాతథంగా ఉందనుకుంటా. సినిమా అనే ఇంత పెద్ద మీడియా తో అంతమంది జనాలకి కమ్యూనికేట్ చేస్తున్నపుడు- “అనవసరమైన చోట” ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవలసిన బాధ్యత రచయిత దర్శకులదే.

ఓసారి- రజనీకాంత్ కూడా ఇలాంటి చిన్న వివాదం లో చిక్కుకున్నాడు. వివేక్ అనే కమెడియన్ ని పొగుడుతూ – “వివేక్ లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి నేను వివేక్ బ్రాహ్మిణ్ అనుకున్నాను. కానీ ఆ తర్వాత వివేక్ దేవర్ (BC ) కులానికి చెందినవాడని తెలిసి ఆశ్చర్యపోయాను” అని. అయితే దేవర్ కులం లో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు అని మీనింగ్ వచ్చేలా ఉంది అని ఆ సంఘాలవాళ్ళు గోల చేస్తే రజనీ సారీ చెప్పాడు ( సారీ చెప్పాడా లేక సారీ అన్న టోన్ లో మాట్లాడాడా కరెక్ట్ గా గుర్తులేదు) . ఏది ఏమైనా రజనీ స్థాయి వ్యక్తి- పబ్లిక్ లో ఆ “క్యాస్ట్” విషయం ప్రస్తావించడమే అనవసరం కదా.

ఏది ఏమైనా సినిమాలు, సినిమా వాళ్ళు చెప్పే విషయాలకి ఉన్న “wide reach” దృష్ట్యా వాళ్ళు ఇలాంటి సున్నితాంశాలు ప్రస్తావించేటపుడు కేర్ ఫుల్ గా ఉండటమో లేక అసలు ప్రస్తావించకుండా ఉండటమో చేయడం బెటర్.

వ్రాసినది: mohanrazz | 2011/11/21

చేతన్ భగత్



చేతన్ భగత్- ఐఐటి లో బిటెక్, ఐఐఎం లో ఎంబిఏ చేసి, హాంగ్ కాంగ్ లోని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఆ తర్వాత మొదటి సారిగా “Five point someone’ అనే నవల వ్రాసాడు. అది బంపర్ హిట్ అవడం తో ఆ తర్వాత ‘One Night at call centre’ అనే రెండో నవల వ్రాసాడు. దాని తర్వాత మూడోది- ‘3 mistakes in my life’ ఇక లేటెస్ట్ గా ‘Two states’ అనే నాలుగో నవల వ్రాసాడు. మొదటి నవల ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఆధారంగానే ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ‘3 Idiots’ సినిమా రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. ఇక రెండో నవల వన్ నైట్ అట్ కాల్ సెంటర్ ఆధారంగా తీసిన హిందీ సినిమా, సల్మాన్ ఖాన్ నటించిన ‘Hello’ అట్టర్ ఫ్లాప్ అయింది. సరే జయాపజయాల సంగతి ప్రక్కన పెట్టి- అసలు ఈ నవలల కథాకమామీషు ఏంటో చూద్దాం.

1. FIVE POINT SOMEONE:

కథ ఏంటి?

ఐఐటి లో ఇంజనీరింగ్ జాయినైన ముగ్గురు కుర్రాళ్ళు. ఒకడు బాగా రిచ్ బ్యాక్ గ్రౌండ్, ఒకడు యావరేజ్ మిడిల్ క్లాస్, ఒకడు లోయర్ మిడిల్ క్లాస్. ఐఐటి లో సీట్ వచ్చిందంటే ముగ్గురూ బాగా తెలివైన, చురుకైన కుర్రాళ్ళే. అయితే ఐఐటి లో సీట్ వచ్చాక వాళ్ళు ముగ్గురూ తమ చదువుల్ని ఖరాబు చేసుకోవడం, ఒకడు తమ ప్రొఫెసర్ కూతురు అయిన అమ్మాయిని లవ్ చేయడం, ఒకానొక టైం లో ఐఐటి లో పరీక్ష పేపర్ దొంగిలించడానికి ప్రయత్నించి దొరికి పోవడం, జీవితం నాశనమైందన్న బాధ తో ఒకబ్బాయి ఆత్మహత్యాయత్నం చేయడం దాకా వెళ్ళడం..చివరలో మళ్ళీ గాడి లో పడి అన్నీ సెట్ అవడం..ఇదీ స్థూలంగా కథ. అయితే ఇందులో పాఠకుల్ని ముగ్ధుల్ని చేసేది కథ కాదు..దాన్ని నడిపిన తీరు..నవల ఆసాంతం ఒక రకమైన wit, humour తో కొన్ని ఎక్సలెంట్ సెటైర్స్ తో కథని నడపడం. అసలు బిగినింగే- ఒక ప్రొఫెసర్ క్లాస్ కి వచ్చి ‘Machine’ కి డెఫినిషన్ ఇవ్వమని స్టూడెంట్స్ ని అడిగితే స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి తోచిన డెఫినిషన్స్ చెప్తూంటే ఆయన అన్ని నిర్వచనాలకీ వంకలు పెట్టి ఒక సింపుల్ మరియు ఎక్సలెంట్ డెఫినిషన్ చెప్పడం..ఒక స్టుడెంట్ ఆ డెఫినిషన్ ని చీల్చి చెండాడి దశాబ్దాల ఎక్స్ పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇగోనే చావుదెబ్బతీసే ఇంటెర్స్టింగ్ సీన్ తో బిగిన్ అవుతుంది.

బాగున్నవేంటి, బాగోలేనివేంటి-

Obviousగా చేతన్ భగత్ wit, sense of humour, పరుగులుపెట్టించే నేరేషన్- ఇవీ బాగున్నవి. కాకపోతే కథ ఐఐటీ నేపథ్యం కాబట్టి ఆ ఇంజనీరింగ్ క్లాసులు, ఆ ర్యాగింగ్ సన్నివేశాలు, ఆ ప్రొఫెసర్లు..మాగ్జిమం ఇంజనీరింగ్ ఓరియెంటేషన్ ఉండటం వల్ల మిగతా వాళ్ళకి కొన్ని చోట్ల ‘నస ‘ అనిపిస్తుందేమోనని నా డౌట్. కానీ ఇదేమంత పెద్ద నెగటివ్ కాదనుకుంటా.

టైటిల్ జస్టిఫికేషన్-

ఐఐటి లో ప్రతి సబ్జెక్ట్ కీ CGPA(Cumulative Grade Point Average) 10 స్కేల్ మీద ఇస్తారు. సబ్జెక్ట్ టాపర్ కి 10 కి 10 ఇచ్చి మిగతా వాళ్ళకి రిలేటివ్ గా ఇచ్చినా దాదాపు అందరూ హీనపక్షం 6 పాయింట్స్ పైనే తెచ్చుకుంటారు. అయితే ఎవడికైనా 5 కి 6 కి మధ్య అంటే ఏ 5.34 లేదా 5.46 అలా వస్తే ఆ గ్రేడ్ ని మాటల్లో ఫైవ్ పాయింట్ సం థింగ్ అంటారు కాబట్టి గ్రేడ్ 5 కి 6 కి మధ్య వచ్చిన వాడు ఫైవ్ పాయింట్ సం వన్ అవుతాడన్నమాట 🙂

ఇతరత్రా-

అమీర్ ఖాన్ తీస్తున్న 3ఇడియట్స్ సినిమా ఫైవ్ పాయింట్ సం వన్ ఆధారంగా అన్నారు. అయినా అమీర్ ఖాన్, మాధవన్ లాంటి వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ గా 20 ఏళ్ళ కుర్రాళ్ళ పాత్రలు చేస్తున్నారా?? కాకపోవచ్చు. మరి ఐఐటి నేపథ్యాన్ని తీసివేసి కథని వీళ్ళకోసం మారుస్తున్నారా? అయినా ఈ నవల లోనుంచి ఐఐటీ నేపథ్యాన్ని, ఆ కాలేజీ సన్నివేశాల్నీ తీసివేస్తే మిగిలేది కవర్ పేజీలు మాత్రమే. చూడాలి ఈ 3 ఇడియట్స్ పరిస్థితి ఏంటి అనేది..

2. One night @ the call center

కథ ఏంటి?

కొంతమంది కాల్ సెంటర్ ఎంప్లాయీస్. అమ్మాయిలు, అబ్బాయిలు. అందరిలోనూ ఒకరకమైన డిప్రెషన్, కాంప్లెక్స్. జీవితం లో మనం ఏ ఉద్యోగానికీ పనికిరాకపోవడం వల్లే ఈ జాబ్ లో ఉన్నామనే కాంప్లెక్స్. బంధువుల దగ్గరినుండీ ఎవరు కనిపించినా “కాల్ సెంటరా?” అని చిరాగ్గా తీసివేసినట్టుగా మాట్లాడటం, ప్రేమించిన అమ్మాయి ఈ కాల్ సెంటర్ గాణ్ణి వదిలేసి ఫారిన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళికి ఒప్పుకోవడం ఇలాంటి వరస సన్నివేశాలు ఈ ప్రధాన పాత్రల్లోని ఫ్రస్ట్రేషన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఒకరాత్రి ఆఫీస్ లో సిస్టంస్ పని చేయకపోవడం వల్ల వీళ్ళంతా బ్రేక్ కోసం బయటికి వెళ్తారు క్యాబ్ లో. దానికి యాక్సిడెంట్ అయి ఒక పెద్ద గోతిలో పడిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఒక కాల్ వస్తుంది- దేవుణ్ణుంచి. మీరు కరెక్ట్ గానే చదివారు. దేవుడి నుంచే. దేవుడు ఒక్కొక్కళ్లకీ వాళ్ళ వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు చెప్పడమో ధైర్యం చెప్పడమో చేస్తాడు. అందరికీ కాన్‌ఫిడెన్స్ వచ్చి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాక తమ సమస్యలన్నీ పరిష్కరించేసుకుంటారు. ఈ పరిష్కారాలు కూడా సిల్లీ గా ఉంటాయి. ఈ కథ మొత్తం చేతన్ భగత్ కి (నేరేటర్ కి) ట్రెయిన్ లో వెళ్తుంటే ఒక అమ్మాయి చెబుతుంది. సినిమాలో ఆ చేతన్ భగత్ పాత్ర ని సల్మాన్ ఖాన్ చేసాడు.

బాగున్నవేంటి, బాగోలేనివేంటి-

కథ మొత్తం పూర్తయ్యాక కథాపరంగా it is just scrap అనిపిస్తుంది. కానీ కథ లో చేతన్ భగత్ తెలివి గా చొప్పించిన చెణుకులు, చురకలు ఆ సెన్సాఫ్ హ్యూమర్ – ఇవి మాత్రమే ఈ నవల ని ఆ మాత్రమైనా నిలబెట్టాయి. అయితే కాల్ సెంటర్ ambience ని క్రియేట్ చేయడానికి చేతన్ భగత్ బాగానే హోం వర్క్ చేసాడనిపిస్తుంది. ఆ కాల్ సెంటర్ అట్మాస్ఫియర్ ‘పరికించడానికీ ఒక సారి చదవొచ్చు.

టైటిల్-

టైటిల్ లో చెప్పినట్టు ఒక కాల్ సెంటర్ లో ఒకే రాత్రి ఈ కథ మొత్తం జరుగుతుంది. స్టోరీ మొత్తం ఒకే నైట్ జరుగుతుందీ అంటే కథ నడపడం చాలా కష్టం కదా అని టెన్షన్ పడుతున్నారా..టెన్షన్ పడకండి- తరచుగా పీరియాడిక్ ఇంటర్వల్స్ లో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. చేతన్ భగత్ కూడా మొదటి నవల ఐఐటీ స్టూడెంట్స్ మీద వ్రాసాను, ఐతే ఐఐటీ స్టూడెంట్స్ అనేది చాలా చిన్న కమ్యూనిటీ, దానితో పోలిస్తే అత్యంత ఎక్కువ మంది యువతీ యువకులు ఇప్పుడు (2005లో) కాల్ సెంటర్స్ లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అప్పీల్ అయ్యేలా ఈ నవల వ్రాసాను అని చెప్పుకున్నాడు.

ఇతరత్రా-

ఈ నవల ని సినిమా గా తీస్తున్నారన్నపుడే- ష్యూర్ షాట్ ఫ్లాప్ అవుతుందని దాదాపు నవల చదివిన వాళ్ళందరూ ఊహించారు. చేతన్ భగత్ పాత్ర సినిమాలో బహుశా 5 నిముషాలుండొచ్చేమో, ఆ పాత్రకి సల్మాన్ ఖాన్ ని తీసుకుని పోస్టర్స్ మొత్తం సల్మాన్ తో నింపేసినా ప్రయోజనం లేకపోయింది ఈ సినిమాకి.

3. 3 Mistakes of my life.

కథ ఏంటి?

ముగ్గురు కుర్రాళ్ళు. అహ్మాదాబాద్. బిజినెస్ లో బాగా ఎదగాలని కలలు కంటారు. ఒక క్రికెట్ కిట్ అమ్మే షాప్ పెడతారు. గుజరాత్ భూకంపం, గుజరాత్ మతకలహాలు అన్ని కథలో ఇమిడేలా కథ 2000-2002 ప్రాంతం లో జరుగుతుంది. ఆ ముగ్గురి లో ఒకబ్బాయి చెల్లెలికి ఇంకో అబ్బాయి (ప్రధాన పాత్ర) కి మధ్య లవ్ స్టోరీ. ఇది కాకుండా క్రికెట్ లో అసాధారణ ప్రతిభ గలిగి చివరికల్లా మంచి క్రికెటర్ గా ఎదిగే ఒక చిన్న ముస్లిం కుర్రాడు. ఇదీ కథ. ఇంతకంటే బాగా ఈ కథని చెప్పడం నావల్ల కాలేదు.

బాగున్నవేంటి, బాగోలేనివేంటి?

ఓవరాల్ గా ఒకే ముక్క లో చెప్పాలంటే- చదివేటప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండి మొత్తం చదవడం పూర్తయ్యాక పెద్దగా అనుభూతిని మిగల్చని నవల. టైం కిల్ చేయడానికి చదవొచ్చు ఒకసారి. అయితే One night at call center క్లైమాక్స్ చదవడం పూర్తయాక కోపం వచ్చినట్టు ఇది పూర్తయ్యాక కోపమైతే రాదు.

టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి.

ఏదో ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టాలి కదా అని ఈ టైటిల్ పెట్టినట్టుగా ఉంది కానీ పర్టిక్యులర్ గా మూడు మిస్టేక్స్ అంటూ కథ లో ఏమీ ఉండవు. ఉదాహరణకి- భూకంపం వచ్చి తన షాప్ మొత్తం కూలిపోతే అప్పుడు హీరో కుప్పకూలిపోతాడు- “ఆ సమయం లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోవడం-నా జీవితం లో నేను చేసిన మొదటి మిస్టేక్” అంటాడు. ఇలా పెట్టాలనుకుంటే- వెన్నెల్లో ఆడపిల్ల నవల దగ్గరనుంచీ మగధీర సినిమా దాకా దేనికైనా “3Mistakes of my life అని టైటిల్ పెట్టి దాన్ని జస్టిఫై చేయొచ్చు.

ఇక లేటెస్ట్ గా “Two states’ అని ఏదో నవల వచ్చిందట- నేనింకా చదవలేదు. అయితే నాకు మాత్రం అన్నింట్లోకీ ఫైవ్ పాయింట్ సం వన్ బెస్ట్ అనిపించింది. రెండోదీ, మూడోదీ జస్ట్ పర్లేదు అంతే. అయితే ఆ మద్ధ్య ఫ్రెండ్స్ తో మాటల్లో చేతన్ భగత్ గురించి చిన్న డిస్కషన్ వచ్చింది. అక్కడ జనాలు తేల్చిన విషయమేంటంటే (జస్ట్ ఫర్ ఫన్) – చేతన్ భగత్ వచ్చాక ఇంగ్లీష్ నవలల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి- మొదటిది ఏంటంటే, అంతకు ముందు ఇంగ్లీష్ నవలలు మినిమం మూడొందల రూపాయలుండేవి cost, చేతన్ భగత్ వచ్చాక 95 రూపాయలకి దిగాయి  😀 . రెండోది ఏంటంటే- అంతకు ఐదొందల పేజీలకి పైగా ఉండి  బోర్ కొట్టేవి, ఇప్పుడు రెండొందల పేజీల్లో పూర్తవుతున్నాయి 😀 ..  సరదాకి ఇలా అంటున్నాను కానీ, ఆ మధ్య టైమ్‌స్ ఆఫ్ ఇండియాలో చేతన్ భగత్ ఇంటర్వ్యూ లాంటి ఆర్టికల్ లాంటి వ్యాసమొకటి వచ్చింది. అందులో అంటున్నాడు- “ఒక మల్టిప్లెక్స్ కి వెళ్ళి సినిమా చూసి రావడనికి ఒకరికి రెండొందల రూపయల ఖర్చు, ఒక ఐదు గంటల సమయం పడుతుంది. అంతకంటే తక్కువ ఖర్చులో, ఆ ఐదు గంటలు నవల ద్వారా ఎంటర్టైన్ చేయాలనేదే నా ఉద్దేశ్యం” అని.

వ్రాసినది: mohanrazz | 2011/11/13

లేడీ డిటెక్టివ్…అమ్మో :-)

ఈటీవీ మొదలైన కొత్తలో మొదలైందనుకుంటా ఈ సీరియల్. సినీ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో టివి సీరియల్..అందులోనూ టైటిల్ లేడీ డిటెక్టివ్ అని విని ప్రతి ఎపిసోడ్ ఒక అన్వేషణ సినిమా లాగా ఉంటుందేమోనని ఎక్స్‌పెక్ట్ చేసా. మొదటి ఎపిసోడ్ చూడగానే మ్యాటర్ అర్థమైంది. ఆ డిటెక్టివ్ గారి బుర్రనుపయోగించడం గట్రా ఏమీ ఉండవు, స్కూటీ వేసుకొని అనుమానితుల్నందరినీ ఫాలో అయి ఆమె అన్నిటినీ కనిపెట్టేస్తుందని. వంశీ మీద అభిమానం తో ఒకట్రెండు ఎపిసోడ్స్ చూసా కానీ చూసిన ప్రతి ఎపిసోడ్ లోనూ గూబ పగలగొట్టడం తో మానేసా. ఆ తర్వాత వంశీ కూడా ఆ సీరియల్ ని డైరెక్ట్ చేయడం మానేశాడు, వేరే ఎవరో డైరెక్ట్ చేసారు.

అయితే ఈ సీరియల్ కి టైటిల్ సాంగ్ ఒకటి వచ్చేది-
లేడీ డిటెక్టివ్,
అమ్మో యమ యాక్టివ్..
….
అటెంటివ్, క్రియేటివ్, సజెస్టివ్..

 

ఎస్పీబీ పాడాడనుకుంటా. వ్రాసిందెవరో తెలీదు (సుమనో కాదో ఐడియా లేదు) . మొదట్లో పాట వింటే బానే ఉందే అనిపించేది. అయితే “సజెస్టివ్” అనే పదానికి అప్పుడు నాకు మీనింగ్ తెలీదు. సజెషన్ అంటే సలహా కాబట్టి, సజెస్టివ్ అంటే సలహాలిచ్చే గుణముండడం అయివుండొచ్చనుకున్నాను. బహుశా గీతరచయిత కూడా అలా అనుకునే వ్రాసాడనుకుంటా ఆ పదాన్ని 😀 . తర్వాతెప్పుడో సజెస్టివ్ మీనింగ్ తెలిసింది. మరి పాట వ్రాసినాయన తెలిసే అలా వ్రాసాడో తెలీక వ్రాసాడో తెలీదు. గీతరచయిత అనేవాడు ఒక ఇంగ్లీష్ పదాన్ని వాడేటపుడు కనీసం ఒకసారి డిక్షనరీ తెరిచి అర్థాన్ని సరిచూసుకోవడానికి కూడా బద్దకిస్తే ఇలాగే జరుగుతుంది. శ్రీ శ్రీ గారి పాట లో వ్యాకరణపరమైన ఒక చిన్న పొరపాటు దొర్లిందంటే అర్థముంది. వేటూరి గారు కొన్ని కారణాల వల్ల నేతాజీ కి సంబంధించిన ఒక విషయం లో పొరబడ్డారంటే అక్కడ అవకాశం ఉంది. కానీ లేడీ డిటెక్టివ్ గీతరచయిత కి డిక్షనరీ తీయడానికి కుదర్లేదంటే అది ఏ రకంగానూ జస్టిఫై చేసుకోదగ్గది కాదు.

 

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఒక్కోసారి ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ ఉత్తర వేసుకునే డ్రస్ లు చూసినపుడు లేడీ డిటెక్టివ్ నిజంగానే సజెస్టివ్ అనిపించేది 😀 .

వ్రాసినది: mohanrazz | 2011/10/30

మరపు రావు కాలేజీ రోజులు…


నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి మాట. కాలేజ్ లో జాయినవగానే ఫ్రెషర్స్ డే (టాలెంట్స్ డే) ఒకటుంటుంది. ఫస్ట్ ఇయర్ కొన్ని ప్రోగ్రాంస్ చేసాను. రెండు స్కిట్స్ వ్రాయడం, అందులో చేయడం గట్రా..అయితే ఫస్ట్ ఇయర్ లో మనం కేవలం రచన/నటన కి పరిమితం అవుతూంటాం. దర్శకత్వం, దర్శకత్వ పర్యవేక్షణ సెకండియర్సో లేక థర్డియర్సో చూసుకుంటూంటారు. సరే, ఇక మనం సెకండియర్ కి వచ్చాం. వచ్చాక “పర్యవేక్షణ” కి ఫుల్లుగా ప్రిపేరైపోయాం. ఈలోగా ఒక “పిడుగు” లాంటి వార్త మా నెత్తిన వేసారు.


అప్పట్లో ర్యాగింగ్ నిరోధక చట్టం ఫుల్లు ఫాం లో ఉండేది. టాలెంట్స్ డే పర్యవేక్షణ సీనియర్ల చేస్తికిస్తే పర్యవేక్షణ పేరిట రిహార్సల్సప్పుడే ర్యాగింగ్ జరగవచ్చని కాలేజ్ ప్రిన్సిపాల్ గట్రా అందరూ కలిసి ఒక విప్లవాత్మకమైన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే “ఈ సారి మీ బోడి “పర్యవేక్షణ” అక్కర్లేదు. దానికి బయటి నుంచి వేరే వాళ్ళని పిలిపించాము” అని. ఇంతకీ “ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పర్యవేక్షకుడు” అనుకుంటూ మా వాళ్ళందరమూ కవాతు చేస్తూ రిహార్సల్స్ జరుగుతున్న రూం దగ్గరికెళితే అక్కడొకతను ఉన్నాడు. మాటా మంతీ కలిపితే పరిచయం చేసుకుంటూ చెప్పాడు – “I am Rajasimha, currently working at Jayant C paranjee” అని. అప్పుడే జయంత్ ఫ్రెష్ గా వచ్చాడు ఇండస్ట్రీ కి. ప్రస్తుతానికి తాను జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాననీ త్వరలోనే దర్శకత్వం కూడా చేస్తాననీ, కొంతమంది నిర్మాతలు తనని ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారనీ ఇలా ఏదో చెప్పాడు.

 

సరే, అతను ఎవరన్నా కానీ మన కాలేజ్ ఫంక్షన్ మనకి తెలీకుండా చేయడమేంటి, నాన్సెన్స్ అని సీనియర్సంతా కలిసి మాట్లాడుకుని ఒక రోజు క్లాసెస్ బాయ్‌కాట్ చేసాం. కాలేజ్ మేనేజ్‌మెంట్ దిగి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. అప్పటికి ఫుల్లు ఆవేశం లో ఉన్న కుర్రాళ్ళుగా ఏవేవో మాట్లాడాం, “అదే మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే- మన ఇంట్లో వాళ్ళకి తెలీకుండా చేస్తామా గట్రా గట్రా..” చివరాఖరికి ఆ టాలెంట్స్ డే క్యాన్సిల్ చేసి మళ్ళీ మా చేత ఫ్రెష్ గా ప్రోగ్రాంస్ డిజైన్ చేసి, ఫ్రెష్ గా రిహార్సల్స్ చేసి మొత్తానికి ఆ ఫ్రెషర్స్ డే ని ఫ్రెష్ గానే ముగించాము. అయితే ఆ రాజ సింహ అనే అతను వ్రాసిన ఒక స్కిట్ మాత్రం ఆల్రెడీ రిహార్సల్సన్నీ అయి ఉండడం చేత దాన్ని కూడా ప్రదర్శించాం. ఏ మాటకామాటే చెప్పాలి. ఆ స్కిట్ కూడా మంచి డైలాగులతో సెటైర్లతో బాగా ఉండింది. నాకు నచ్చింది. అయితే ఆ తర్వాత అతని గురించి ఆ ఎపిసోడ్స్ గురించీ మొత్తం మరిచిపోయాం.

మొన్నామధ్య “కరెంట్” అనే సినిమాకనుకుంటా డైలాగ్ రైటర్ గా ఈయన పేరు చూసా. ఆ తర్వాత ఓయ్ సినిమా ఫంక్షన్ లో సిద్దార్థ అంటున్నాడు- రాజసింహ లో మంచి సెన్సాఫ్ హ్యూమరుంది అంటూ. ఈ లోగా ఈ మధ్య ఇంకో న్యూస్- రాజసింహ తొలిసారి దర్శకత్వం వహిస్తూ వరుణ్ సందేష్ హీరోగా ఒక సినిమా ఏదో వస్తూ ఉందని. జయంత్ దర్శకత్వం వహించిన “శంకర్ దాదా MBBS” లో తెలుగు-ఇంగ్లీష్ సామెతల పార్ట్ జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాజ సింహ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ది అని ఆ మధ్య ఐడిల్ బ్రెయిన్ లో వ్రాసాడు. అంతా బానే ఉంది కానీ – నిజంగా నాకు ఆశ్చర్యమనిపించిన విషయం – అప్పుడెప్పుడో 1998 లోనే “ఇక త్వరలో దర్శకత్వం చేయబోతున్నాను” అని చెప్పిన వ్యక్తి కి దాదాపు 11-12 యేళ్ళ తర్వాత ఇప్పుడు అవకాశం రావడం..అప్పటిదాకా అతను సహనం తో ఒకే గోల్ మీద నిలబడగలగడం…!

వ్రాసినది: mohanrazz | 2011/10/29

నా పేరు నరసింహ :)

                  

మొన్నీమధ్య టివి లో నరసింహ సినిమా వచ్చింది. టివి లో చూస్తూంటే సినిమా రిలీజైన కొత్తలో ఒక ఫ్రెండ్ వేసిన సెటైర్ గుర్తుకు వచ్చింది.

నరసింహ సినిమా లో రజనీకాంత్ వాళ్ళ నాన్న శివాజీ గణేశన్. ఆస్తి పంపకాలు చేయమని శివాజీ గణేశన్ తమ్ముడు మణివన్నన్ పట్టుబడితే శివాజీ గణేశన్ మొత్తం ఆస్తి ని తమ్ముడి కే ‘త్యాగం’ చేస్తాడు. అదేంటో రజనీ కాంత్ సినిమాల్లో డబ్బుకి విలువే ఉండదసలు. ముత్తు లో కూడా ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద రజనీ కాంత్ మొత్తం ఆస్తి ని “ఎడమచేత్తో” రఘు వరన్ పేరిట వ్రాసేసి ఎటో వెళ్ళిపోతాడు.సరే, నరసింహ లో ఆస్తి వ్రాసేసి బయటికొచ్చాక శివాజీ గణేశన్ చనిపోవడం, ఊరిచివర్న పొలం లో వ్యవసాయం చేస్తూ రజనీకాంత్ కుటుంబాన్ని పోషించడమూ జరుగుతూంటాయి. అయితే అక్కడున్నది రజనీ కాబట్టి- రజనీ “అంచెలంచలు” పైకి వస్తే చూడ్డం ఆల్రెడీ అన్నామలై (కొండపల్లి రాజా) లో అయిపోయింది కాబట్టి- ఈ సారి రజనీ పొలం లో డైరెక్ట్ గా గ్రానైట్ పడుతుంది. ఇంకేముంది, ఒక్క పాట లో “స్టోరీ మారిపోద్ది”. “జీవితమంటే పోరాటం” అనే ఆ పాట రెహ్మాన్ చాలా బాగా కంపోజ్ చేసాడు.

ఒక్క పాట లో రజనీకాంత్ ఎదిగి పోయినట్టు చూపించిన ఆ పాట లో కొంత మంది కూలీలు “రాళ్ళు కొడుతుంటారు”. వాళ్ళ తో పాటు రజనీకాంత్ కూడా. అయితే మొత్తం కూలీలందరూ కింద రాళ్ళు కొడుతూంటే రజనీకాంత్ ఒక్కడే “బా..గా..పైన” కొడుతూంటాడు 🙂 మా ఫ్రెండంటాడు- అప్పుడు కింద రాళ్ళు కొట్టేవాడు అంటాడంటా..”రేయ్, ముందు కింద కొట్టరా..రాళ్ళన్నీ మా మీద పడుతున్నాయి” 😀

జస్ట్ ఫర్ ఫన్.

పొద్దులో గార్లపాటి ప్రవీణ్ గారి వ్యాసం , రేరాజ్ బ్లాగ్ లోని వ్యాసం– తెలుగు బ్లాగులకి మానెటైజ్ చేయడం గురించి- చదివాక ఇది వ్రాస్తున్నాను. అయితే ఇది తెలుగు బ్లాగుల గురించి కాదు తెలుగు సినిమా సైట్ల గురించి.

 

ఐదారేళ్ళ క్రితం idlebrain, nonstopcinema లాంటి ఒకట్రెండు సైట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు పదుల సంఖ్య లో ఉన్నాయి. idlebrain జీవి బిట్స్ పిలానీ ఇంజినీరింగ్ చదివి ఆ తర్వాత ఐటీ లో పని చేసి- ఆ తర్వాత ఈ సైట్ ని నమ్ముకుని జాబ్ వదిలేసుకున్నానని చెప్పుకుంటాడు. ఇప్పటికి పదేళ్ళయింది ఆ సైట్ పెట్టి. ఐతే ఆయన జాబ్ వదిలేయడం వల్ల నష్టపోయిందేమీ లేదంటారు కొందరు. idlebrain సంపాదన నెలకు లక్షల్లోనే అని ఇంటర్నెట్ డిస్కషన్ బోర్డుల్లో ఒక రూమర్. idlebrain తర్వాత ఇంటర్నెట్ లో అతి ఎక్కువ మంది చూసే సినిమా వెబ్ సైట్ greatandhra. గత ఐదారేళ్ళలో విపరీతంగా వ్యూయర్షిప్ సంపాదించుకున్న సైట్ ఇది. idlebrain తో పోలిస్తే (మిగతా ఏ ఇతర తెలుగు సినిమా వెబ్ సైట్ తో పోల్చినా ) per day పోస్ట్స్ ఇందులో ఎక్కువ. ఇది వట్టి గాసిప్ సైట్, గ్యాస్ సైట్ అని తిట్టే వాళ్ళు కూడా దీనికి చాలా ఎక్కువ. కానీ తిట్టిన వాళ్ళెవరూ దీన్ని చూడటం మానరు. టివి9 ని తిడుతూనే పొద్దస్తమానం మళ్ళీ టివి9 ని చూడటం లాంటిదన్నమాట. ఎంబీయస్ లాంటి పాత్రికేయులని తీసుకొచ్చి వాళ్ళతో కూడా కొన్ని ఆర్టికల్స్ వ్రాయిస్తుంటారు ఈ సైట్ లో. ఈ సైట్ నెలసరి ఆదాయం కూడా లక్షల్లోనే అని అంటారు మరి . అది ఎంతవరకు నిజమో చెప్పలేను కానీ దాదాపు idlebrain కి సరిసమానంగా ఉంటాయి హిట్స్ దీనికి. పూర్తి స్థాయి లో ఎంతవరకు నమ్మవచ్చో చెప్పలేను కానీ – http://statbrain.com/ లెక్కల ప్రకారం eenadu.net ని రోజూ చదివే వాళ్ళు సుమారు ఏడు లక్షలు. idlebrain ని రెండులక్షల ఎనభై ఒక వేలు, greatandhra.com ని రెండులక్షల డెబ్బైతొమ్మది వేల మందీ చదువుతున్నారు. ఇక మిగతా అన్ని తెలుగు సినిమా సైట్లకి యాభైవేల లోపే ఉన్నారు వీక్షకులు. idlebrain, greatandhra -ఈ రెండింటి తర్వాత అంత ఎక్కువ వ్యూయర్ షిప్ ఉన్న సైట్స్ telugucinema.com, తెలుగుపీపుల్, ఆంధ్రకేఫ్ . వీళ్ళు ఎంతవరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారో నాకు తెలీదు. నంది అవార్డుగ్రాహెత ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు ఇన్వాల్వ్ అయిఉన్న సినీగోయర్ సైట్ నైతే అమ్మేశారని విన్నాను-నిజమెంతో తెలీదు.

 

idlebrain పూర్తిగా ఇంగ్లీష్ లో వ్రాయడం వల్ల గూగుల్ యాడ్స్ ప్రాబ్లెం ఉండకపోవచ్చు కానీ మిగతా తెలుగు సైట్లకి గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బు రావాలంటే కష్టమే. ఎందుకంటే శుభ్రంగా తెలుగులిపి లో వ్రాసే సైట్లుండగా ఇంగ్లీష్ లిపి లో ఉండే సైట్లెందుకు చదువుతారు అదే న్యూస్ కోసం. కానీ తెలుగు లిపి లో వ్రాస్తే గూగుల్ యాడ్స్ నుంచి పైసలు రావు. అందుకే గ్రేటాంధ్ర వాళ్ళు సగం ఇంగ్లీష్, సగం తెలుగు తో మెయింటెయిన్ చేస్తుంటారు.   

 

కొంతమంది NRI లు ఈమధ్య తెలుగు సినిమాలు విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం మొదలెట్టారు. వీళ్ళలో ఎంతమంది లాభాలు సంపాదించారు అని చూస్తే చాలాతక్కువ- సినిమా హిట్టయినప్పటికీ. ఎందుకంటే సినిమా కొనేవాళ్ళలో చాలా మంది ఈ సినిమా తోనే సంపాదించుకుందామని కాకుండా సినిమావాళ్ళతో పరిచయాలు పెంచుకుందామనో లేక పరిచయం పెరిగితే తమ సినిమా కోరికలు తీర్చుకోవచ్చనో కొంటారు, కొంచెం రేటెక్కువైనా సరే అని. తీరా సినిమా హిట్టయినా వీళ్ళు పోసినన్ని డబ్బులు రావు. సినిమా వెబ్ సైట్ లు నడిపే వాళ్ళూ ఇంతే. లాభాలు వచ్చినా రాకపోయినా- సైట్ నడపాలనే “దుగ్ధ” తో సైట్ నడిపేవాళ్ళే ఎక్కువంటారు కొందరు. అయితే ఈ మధ్య మా టీవీ, టివి9 లాంటి ఛానెల్స్ లో రెగులర్ గా కొన్ని రోజులు స్క్రోలింగ్ ఇచ్చి మరీ సైట్ ప్రారంభించారు కొందరు. చిరంజీవి చేతులమీదుగా ప్రారంభించారు ఇంకొక సైట్ ఓ నాలుగు నెలల క్రితం. వాటిలో కొన్నింటి హిట్స్ వెయ్యి కూడా లేవు, కొన్నింటికి వంద కూడా లేవు, ఒకట్రెండు సైట్స్ కొంచెం పర్లేదు. మరి సినిమా సైట్ల పరిస్థితే ఇప్పటికీ ఇలా ఉంటే  బ్లాగులకి ఆదాయం అనేది సుదూరస్వప్నమే అనుకుంటున్నా ప్రస్తుతానికైతే!

వ్రాసినది: mohanrazz | 2011/09/15

WHO WILL CRY WHEN YOU DIE by Robin Sharma లో :)

                                   

రాబిన్ శర్మ వ్రాసిన The Monk who sold his ferrari నాకు పెద్దగా నచ్చలేదని ఇంతకు ముందోసారి వ్రాసేను. అయితే WHO WILL CRY WHEN YOU DIE అని ఇంకో పుస్తకం ఉంటుంది ఆయనదే, పాకెట్లో పెట్తుకుందామంటే పెద్దగా- చేతిలో పట్టుకుందామంటే చిన్నగా -అయేలా అంతే అంత ఉంటుందీ పుస్తకం. అది నవల కాదు, కథ కాదు, సెల్ఫ్ హెల్ప్ పేరిట పెద్ద స్పీచిలివ్వడాలూ ఉండవు కానీ ఒక 150 చాప్టర్లు, ఒక్కొక్కటీ ఒక్కొక్క పేజీ ఉంటాయి..ఏవో చిన్న చిన్న మంచి విషయాలు కొన్ని చెబుతూంటాడు..అందులో దాదాపు 85% మనకి తెలిసినవే ఉంటాయి కానీ ఇలాంటి పుస్తకాలు తీసుకున్నపుడు – 99% తెలిసిన విషయాలే ఉన్నా పర్లేదు ఒక్కటి మన బుర్ర ని కొంచెం “స్టిర్” చేసే పాయింటున్నా గిట్టుబాటైనట్టే కదా అని తీసుకుంటూంటాను. ఆ రకంగా చూస్తే ఇది నాకు గిట్టుబాటైన పుస్తకమే!-

 
ఇందులో చెప్పే విషయాలన్నీ చిన్న చిన్న విషయాలే- వారం లో ఐదు అరగంటలైనా జిం కి వెళ్ళు, జీవిత కాలం మొత్తం మీద కనీసం ఒక మొక్కనైనా పెంచి అది రోజూ పెరిగి పెద్దవడాన్ని చూస్తూ ఆస్వాదించు, Be kind to a stranger, నీకేదైనా ఒక సమస్య వచ్చి ఏం చేయాలో తోచకపోతే నీ రోల్ మోడెల్ అయిన మహనీయుడెవరైనా అదే సమస్యలో ఉంటే ఎలా ప్రతిస్పందిస్తాడో ఊహించి నువ్వూ అలానే స్పందించడానికి ట్రై చేయి..ఇలాంటివన్నమాట! మరీ రొటీన్ గా మైక్ పెట్టుకుని చెవిలో పోరినట్టు కాకుండా కొంచెం ఆసక్తికరంగా ఒక్కోసారి కొన్ని పిట్ట కథలతో తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తూ ఉంటాడు. ఈ పుస్తకం లో ‘పాజిటివ్ థింకింగ్’ గురించి చెబుతూ ఒక చిన్న కథ ఉంటుందిలాగే-

ఒక హాస్పిటల్లో ఒక రూం లో ఇద్దరు పేషెంట్స్ బెడ్ మీద  ఉంటారు కదలలేని స్థితి లో. రోజుల తరబడి అలాగే కదలకుండా బెడ్ మీద ఉండటం తో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతూంటారు. జీవితం లో ఇంకా ఎంత కాలం అదే బెడ్ మీద అలాగే ఉండాలో వాళ్ళకే తెలీదు. నిరాసక్త జీవితం గడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళలో ఒకతని బెడ్ ప్రక్కన కిటికీ ఉంటుంది. అతను రోజూ కిటికీలోనుంచి బయటికి చూస్తూ అక్కడ జరుగుతోంది ప్రక్కనతనికి చెప్తూ ఉంటాడు. చిన్న చిన్న పిల్లలు గులాబీ పూలు పట్టుకుని వెళ్తున్నారనీ, బయటంతా పచ్చదనం ఆహ్లాదంగా కనిపిస్తోందనీ, ఒక అబ్బాయి, అమ్మాయి కేరింతలు కొట్టుకుంటూ వెళ్తున్నారనీ – ఇలా అన్నీ వర్ణిస్తూ చెప్తూంటాడు. అయితే ఈ రెండో అతనికి – అరె, ఆ కిటికీ ప్రక్క సీట్ మనకి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అతని మీద జెలసీ పెరుగుతుంది. అది పెరిగీ, పెరిగీ విపరీతంగా పెరిగిపోయి- ఒకరోజు అతని ఆక్సిజన్ సిలిండర్ కి తనవైపునున్న వాల్వ్ ఏదో మూసేసి అతను చనిపోయేలా చేస్తాడు. అతను చనిపోయి బెడ్ ఖాళీ అయ్యాక- నర్సునడిగి ఆ బెడ్ కి తను షిఫ్టవుతాడు. షిఫ్టయ్యాక కిటికీలోనుంచి చూస్తే అవతల ఒక పెద్ద గోడ తప్ప ఇంకేమీ కనబడదు. అంటే ఇంత కాలం అతను ఆ మట్టిగోడనే చూస్తూ కూడా తమ ఇద్దరి జీవితల్లోని నిరాసక్తత పోగొట్టడం కోసం మంచి మంచి సంఘటనలు ఊహించి అవి అక్కడ జరుగుతున్నట్టు తనకి చెప్పేవాడని అర్థమై పశ్చాత్తాపపడతాడు, జీవితం లో పాజిటివ్ థింకింగ్ అలవరచుకుంటాడు.-

 
మంచి కథ. బాగుంది. అయితే అప్పట్లో ఫ్రెండ్స్ అంతా- బ్యాచిలర్స్ ఒక రూం లో ఉన్నపుడు – ఎలా ఉంటుందంటే – ఎవరైనా ఒకటి చెబితే ప్రక్కనున్న వాళ్ళు అది నచ్చినా నచ్చకపోయినా ఏదో సెటైర్ వేస్తుంటారు. సీరియస్ గా ఏదో సెటైర్ వేసేద్దాం అన్న ఉద్దేశ్యం ఉండకపోయినా జస్ట్ సరదాకి అన్నమాట. మరి, ఏ సెటైరూ వేయకుండా ఒకరు చెప్పింది ఒకరు వింటూ ఉంటే డిస్కషన్స్ ఎట్టా జరుగుతాయి, టైం పాస్ ఎట్టా అవుతుంది 🙂 ? ఈ కథ చదివిన రూం మేట్ కి బాగా నచ్చి, ప్రక్కనున్న అతనికి చెప్తే అతనన్నాడు 🙂 – –

“దీన్ని బట్టి నాకొకటి అర్థమయింది గురూ- అందుకే అలా ఎగస్ట్రా లు చేసి మరీ ప్రక్కనున్న వాణ్ణి ఆనందింపచేద్దాం అని ఎప్పుడూ ట్రై చేయకూడదు…మర్యాదగా అక్కడ గోడ ఉందని ఉన్నదున్నట్టు చెప్పిఉంటే ఇట్టా జరిగేది కాదు గా….మనకి కిటికీ లేకపోయినా ప్రాబ్లెం లేదులే అని ఆడికో శాటిస్‌ఫాక్షన్ ఉండేది…రోజు కో కొత్త స్క్రిప్ట్ తయారు చేసి ఆడికి చెప్పే బాధ ఈడికి తప్పేది….ఆడి బాధలు ఈడు ఈడి బాధలు ఆడూ వింటూ అట్టా కాలం గడిపేసే వాళ్ళు- ఇప్పుడు చూడు అనవసరంగా ఆడి జెలసీ ని రెచ్చగొడితే పరిస్థితి ఇట్టా తయారయింది..కాబట్టి ఎప్పుడూ అలా ఎగస్ట్రాలు చేయకూడదు అనేది ఈ కథలో నీతి…ఏటంటావ్ 😀  ??” ఇంకేటంటాడు- “మీరు మారరు రా” అని వదిలేశాడు.-

రాజమౌళి సినిమాలన్నిటికీ ఫ్యామిలీ ప్యాక్ కింద విజయేంద్ర ప్రసాద్ (కథ) , కీరవాణి (మ్యూజిక్), రాజమౌళి(డైరెక్షన్) కలిసి పనిచేస్తుంటారు. లేటెస్ట్ గా కాస్ట్యూం డిజైనింగ్ రమారాజమౌళి కూడా జాయిన్ అయినట్టునారు.

కె.విజయేంద్రప్రసాద్ చాలామందికి తెలుసనుకుంటా. సమరసింహారెడ్డి, యువరత్న రాణా, సింహాద్రి (లేటెస్ట్ గా మగధీర) లాంటి సినిమాలకి కథ అందించిన రైటర్. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్టర్ అయిన కొత్త లో అన్నారు – “రాజ మౌళి అంటే ఎవరో కాదు ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కొడుకే” అని. అవునా పర్లేదే అనుకున్నాను..కానీ మరి కె. విజయేంద్రప్రసాద్ కొడుకైతే కె.రాజమౌళి అవ్వాలి కదా ఎస్.ఎస్. రాజమౌళి ఏంటి? అని చిన్న సందేహం వచ్చింది..సర్లే అని వదిలేస్తే..తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ‘M.M’. కీరవాణి ఇంటర్వ్యూ లో చెప్పాడు..’K’. విజయేంద్రప్రసాద్ తన సొంత బాబాయ్ అని..అంటే..’M.M’. కీరవాణి వాళ్ళ నాన్న గారి సొంత తమ్ముడన్నమాట ‘K’. విజయేంద్రప్రసాద్…మరి అప్పుడు ఈయన ‘K’.కీరవాణి అన్నా అవ్వాలి ఆయన ‘M.M’.విజయేంద్రప్రసాద్ అన్నా అవ్వాలి….ఏంటీ ట్విస్ట్ మీద ట్విస్ట్ అనుకుంటే, ఈ లోగా మళ్ళీ ‘M.M.’ శ్రీలేఖ అటుపక్క. ఈమె ఏమో కీరవాణి గారి చెల్లెలు..పోనీలే ఈమె మళ్ళీ మన మెదడుకి మేత వేయకుండా ఎం.ఎం.కీరవాణి చెల్లెలు కాబట్టి ఎం.ఎం.శ్రీలేఖ గానే వచ్చ్చిందని సంతోషించా. ఈ ధర్మ సందేహం 🙂 చాలా రోజులు అలాగే ఉండిపోయింది.

 

తర్వాతెప్పుడో తెలిసింది..కె.విజయేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారి ఫాదర్ అన్నదమ్ములు. ఆ లెక్కన కీరవాణి గారి ఇనిషియల్ కూడా “కె”. అయితే “మరకతమణి” అనేది కీరవాణి గారి లక్కీ స్టోన్. కాబట్టి పేరు లో దీన్ని కలుపుకుంటే కలిసి వస్తుంది అని ఆయన తన ఇనిషియల్ “ఎం.ఎం” అని పెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీ లో కి వచ్చిన శ్రీలేఖ తాను కీరవాణి చెల్లెలు గా ఇండస్ట్రీ లో కి వచ్చింది కాబట్టి ఆ గుర్తింపు ఆమె కి అవసరం కాబట్టి (ఈమె లక్కీ స్టోన్ “మరకతమణి” కాకపోయినా కూడా) తన పేరు కి ముందు “ఎం.ఎం.” తగిలించుకుంది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ లో కి వచ్చిన రాజమౌళి గారు తనకి కలిసి రావాలని పేరుకి ముందు “ఎస్.ఎస్.” అని పెట్టుకున్నాడట. మరి అది ఈయన లక్కీ స్టోనో, న్యూమరాలజీ యో, గ్రాఫాలజీ యో, ఫెంగ్ షుయి యో మనకి తెలీదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. జనరల్ గా సినిమా వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు కొంచెం ఎక్కువని అంటుంటారు..నిజమే మేస్టారూ..కానీ కొంచెం కాదు కిలోమీటర్ ఎక్కువ!!

 

కొసమెరుపేమిటంటే- ఈ మధ్య రాజమౌళి గారి వైఫ్ రమ గారు రాజమౌళి సినిమాలన్నిటికి కాస్ట్యూం డిజైనర్ గా చేస్తున్నారు. ఈసారి ఈమె పేరు కూడా టైటిల్స్ లో వస్తుంది అన్నపుడు.. “ఓర్నాయనో ఈమె మళ్ళీ ఏం ట్విస్ట్ ఇస్తుందో” అని చూసా…సేఫ్ సైడ్ – “రమా రాజమౌళి” అని వేసుకుంది టైటిల్స్ లో ఇనిషియల్ ఏమీ లేకుండా 🙂 !!!!

ఈ టివి లో వచ్చే “ఢీ” ప్రోగ్రాం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. దానిలో వచ్చే జడ్జి తరుణ్ మాస్టర్ కూడా జనాలకి బాగా పరిచయం అయ్యాడు. నిజానికి తరుణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేసాడు. హిందీ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ లాంటి వాళ్ళకి, రజనీ “బాషా” లాంటి సినిమాలకి కొరియోగ్రఫీ చేసాడు. అయితే జనాలకి మన లారెన్స్ లాంటి వాళ్ళు తెలిసినంతగా మొదట్లో ఈయన తెలీదు. సరే, ఢీ ప్రోగ్రాం పుణ్యమా అని జనాలకిప్పుడు ఈయన బాగా తెలిసాడు. ఆ మధ్య “ఈనాడు” లో చిన్న ఇంటర్వ్యూ లాంటి ఆర్టికల్ వచ్చింది ఈయనది(మీ లో కొంత మంది చదివే వుంటారు) . ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే –

“నేను మొన్నొక సారి మంత్రాలయం వెళదామని బయలుదేరాను. మధ్యలో మదనపల్లి దగ్గర మంత్రాలయం వెళ్ళే రోడ్ కనుక్కుందామని దారి లో ఎవరినో అడిగాను. అతను కార్లో ఉన్న నన్ను గుర్తు పట్టి, ‘సార్, మీరు తరుణ్ మాస్టర్ కదా, మంత్రాలయం రోడ్డా?..ఊ..అదీ..సార్, మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది సార్, రోడ్డు..ఇలా నేరు గా వెళ్ళి..సార్, మీరు ఇచ్చే రేటింగ్ కూడా చాలా కరెక్ట్ గా వుంటుంది సార్…ఇలా నేరు గావెళ్ళి ఎడమ వెళ్ళండి సార్..’ ఇలా చెప్పాడు..నాకు చాలా ఆనందమనిపించింది. అలాగే కొంత దూరం వెళ్ళాక కర్నూల్ దగ్గర అనుకుంటా మళ్ళీ ఎవరినో అడిగాను..అక్కడా ఇంతే.. ‘సార్, తరుణ్ మాస్టర్ గారూ..మీ ఢీ ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తుంటాం సార్..మీ జడ్జిమెంట్ సింప్లీ సూపర్బ్ సార్ ‘..ఇలా.. అడిగిన ప్రతి చోటా ఇలాగే…సరే మొత్తానికి మంత్రాలయం వెళ్ళాను..దర్శనం కోసం జనరల్ క్యూ లో నుంచున్నాను. క్యూ లో వున్న వాళ్ళలో కొంతమంది నన్ను గమనించడం, వాళ్ళలో వాళ్ళే జడ్జి గారు అని గుసగుసలాడుకోవడం,ఆ తర్వాత కాసేపటికి అంతా నా చుట్టూ గుమికూడిపోవడం జరిగిపోయాయి..ఇలా అంత గోల గోల గా వుంటే అటు వచ్చిన పోలీసులు – జనాలంతా నన్ను జడ్జి గారు, జడ్జి గారు అంటూంటే చూసి, నేను ఏ జిల్లా జడ్జో అనుకుని జనరల్ క్యూ లో నుంచి తీసుకెళ్ళె వి.ఐ.పి. క్యూ లో నుంచోబెట్టి దర్శనం చేయించి మరీ పంపారు..”       

అయితే అంతా బాగానే ఉంది కానీ- ఇదంతా చదివాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే (జస్ట్ ఫర్ ఫన్) – “మంత్రాలయం పోలీస్ క్వార్టర్స్ లో కేబుల్ కనెక్షన్ లేదా?” అని. ఎందుకంటే ..ఢీ ప్రోగ్రాం ఎంతలా పాపులర్ అయిందంటే మదనపల్లి దగ్గర ఎవరో చదువురాని ఆయన, కర్నూల్ దగ్గర ఎవరో  చదువుకున్నాయన..ఇంకా ఎక్కడికెళ్ళినా ఎవరో ఒకరు- ‘తరుణ్ మాస్టర్, మీ జడ్జిమెంట్ సూపర్, మీ రేటింగ్ హైలెట్’ అన్నారు..క్యూ లో అందరూ గుర్తు పట్టారు..(వీటన్నిటి ద్వారా- నేను ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాను అని చెప్పదల్చుకున్నారు తరుణ్ మాస్టర్..) మరి పోలీసులు మాత్రం ఈయన ఎవరో జిల్లా జడ్జి అయివుంటారని ఎలా అనుకున్నారో !!!

RB

ఆ మధ్య RB చౌదరి సూపర్ గుడ్ సినిమాలు వరసగా హిట్ అయ్యాయి. కాస్టింగ్ నో లేదంటే కాంబినేషన్లనో లేదంటే ఇతరరకాల పైపై మెరుగుల్ని నమ్ముకోకుండా కథని నమ్ముకుని వరస హిట్లిచ్చాడు RB చౌదరి. కథల్లో కూడా ఆయన మరీ మాస్ సినిమాల జోలికి పోకుండా సెంటిమెంట్ కామెడీ కలిసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లనిచ్చాడు. ఆయా కథల్లో సెంటిమెంట్ పండించడానికి హీరో పాత్రల్ని ఉదాత్తంగా, త్యాగపూరితంగా  చిత్రిస్తూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. అయితే ఆ మధ్య ఏమైందంటే ఆయనకి తెలీకుండానే కథల్లో ఒకరకమైన ట్రాప్ లో పడిపోయి, కొన్నిరోజులు ఒకేతరహా కథల్నిచ్చాడు.

నువ్వు వస్తావని సినిమాలో సిమ్రన్ కి “కళ్ళు” పోతాయి. నాగార్జున “కిడ్నీ” అమ్మి ఆమె ఆపరేషన్ కి డబ్బు సర్దుతాడు. తర్వాత “నిన్నే ప్రేమిస్తే” సినిమా లో (ఈ సినిమా కి తమిళ్ ఒరిజినల్ కి టైటిల్ “నీ వరువాయరే” అంటే నువ్వు వస్తావని అని. అయితే ఆ టైటిల్ ని “తుళ్ళాదు మానం తుళ్ళుం” రీమేక్ అయిన నాగార్జున ప్రీవియస్ సినిమాకి వాడేసుకోడం వల్ల దీనికి నిన్నే ప్రేమిస్తా అని పెట్టుకోవాల్సి వచ్చింది )నాగర్జున “కళ్ళు” శ్రీకాంత్ కి పెడతారు. సౌందర్య గతం లో నాగార్జున ని ప్రేమించి ఉంటుంది కాబట్టి ఇప్పుడు శ్రీకాంత్ కి పెట్టిన కళ్ళు నాగార్జునవే కాబట్టి శ్రీకాంత్ వెంటపడుతూంటుంది. ఇక శ్రీను సినిమా లో వెంకటేష్ “నాలుక” కోసివేసుకుంటాడు. అంటే హీరోయిన్ వెంకటేష్ ని మూగవాడు అనుకుంటూంది ముందు నుంచి. మూగవాడు కాదని తెలిస్తే తనతో చనువు గా ఉండదేమోనని హీరో కూడా అలాగే మెయింటెయిన్ చేస్తాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ అబద్దాన్ని నిజం చేద్దామని హీరోయిన్ కోసం నాలుక త్యాగం చేస్తాడు. అయితే తర్వాత ఆలోచిస్తే సిల్లీ గా అనిపిస్తాయేమో కానీ ఇవన్నీ అప్పట్లో మంచి హిట్ సినిమాలే. అయితే ప్రాబ్లెం ఈ సినిమాలతో కాదు. ఈ సినిమాల్ని చూసి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు తయారు చేసుకున్న కథలతో. 
        

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రోజుల్లో తను తయారు చేసుకున్న కథ చెప్పాడు. (ఈ కథ ఇప్పటికి స్టేల్ అయిపోయింది కాబట్టి ధైర్యంగా ఇక్కడ వ్రాస్తున్నా) హీరోయిన్ డాక్టర్. హీరో వెంటపడుతూ ఉంటుంది. ఎప్పుడూ హీరో తో మాట్లాడాలని ఆయన ప్రక్కనే ఉండాలని ట్రై చేస్తుంటుంది. కానీ హీరో అడ్వాంటేజ్ తీసుకోబోతే దూరం జరుగుతూంటుంది. ఓవరాల్ గా ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే హీరో కి ఒక ప్రాబ్లెం వల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి ఉంటుంది. అది చేసిన డాక్టర్ కూడా హీరోయినే. ఆ హార్ట్ ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ది. చిన్న వయసు లో చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె హార్ట్ ని హీరో కి ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు. హీరోయిన్ కి ట్విన్ అయిన ఆమె హీరోయిన్ కి క్లోజ్ కాబట్టి హీరోయిన్ ఆ హార్ట్ ఉన్న హీరో తో గడపడానికి ఇష్టపడుతూంటుంది. చివరికి క్లైమాక్స్ లో ఇంకో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు స్టోరీకి.ఇదైనా ఒక రకం. ఇంకొకాయన ఇంకో స్టోరీ చెప్పాడు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బ్యాక్ డ్రాప్ లో. హమ్మో.

అప్పట్లో జోగి బ్రదర్స్ అని జెమిని లో ఒక ప్రోగ్రాం వచ్చేది. ఈ “పార్ట్‌లు పార్ట్‌లు” త్యాగం చేసే కాన్సెప్ట్ మీద ఒక “భయంకరమైన” సెటైర్ వేశారు. అఫ్ కోర్స్ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రోగ్రాం ఆగిపోయింది, అది వేరే విషయం!!

pellam oorelite

తేడాల సంగతి ప్రక్కన పెడితే, నిజానికి వీళ్ళిద్దరి మధ్యా చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ కూడా కామెడీ సినిమాలు తీయడం లో ఒక తమకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు. జంధ్యాల, రేలంగి ల తర్వాత హాస్య దర్శకుల విషయం లో ఏర్పడిన ఒక ఖాళీ స్లాట్ ని వీళ్ళిద్దరూ భర్తీ చేసారు. ఇద్దరూ చిన్న హీరోలతో కామెడీ సినిమాలు తీసి హిట్లు కొట్టి ఆ తర్వాత పెద్ద హీరోల తో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. ఇద్దరూ పెద్ద హీరోలతో కూడా కామెడీ చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పోలికలు. కాకపోతే ఇద్దరి మధ్య ఉన్న తేడా అనగానే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చే పాయింట్ ఒక్కటే. ఎస్వీ సినిమాల్లో బూతు కానీ డబల్ మీనింగులు కానీ లేకుండా చిన్నపిల్లలతో సహా ఇంటిల్లిపాది ధైర్యంగా చూడగలిగేలా ఉంటుంది. ఇవివి సినిమాల్లో ఒక్కోసారి కొంచెం డబల్ మీనింగులు గట్రా మోతాదు మించుతుంటాయి అప్పుడప్పుడు. డబల్ మీనింగుల సంగతి ప్రక్కన పెడితే అప్పట్లో నేను ఇవివి కి భీబత్సమైన ఫ్యాన్ ని. ఆయన డైలాగుల్లో పంచ్ లు కేక అనిపించేవి. కొన్ని శ్లేషలైతే చాలా ఇంటలెక్చువల్ గా ఉండేవి. ఇవివి సినిమాల్లో పంచ్ ల గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం కానీ, ప్రస్తుతానికి – ఓసారి మా ఫ్రెండ్స్ తో ఎస్వీ కి ఇవివి కి మధ్య తేడా ఏంటి అనే టాపిక్ మీద జరిగిన ఒక సరదా డిస్కషన్ ని మీతో పంచుకుందామని ఈ టపా 🙂 .   

 
“ఇవివి కి ఎస్వీ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనేది ఒక్క ఎగ్జాంపుల్ తో చెప్పేయచ్చు”
“ఎట్లా”
“ఇప్పుడు.. ఎస్వీ డైరెక్షన్ లో శ్రీకాంత్, సంగీత హీరో హీరోయిన్లుగా ‘పెళ్ళాం ఊరెళితే ‘ అని ఒక సినిమా వచ్చింది. సపోజ్..జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్..ఇదే సినిమా ఇదే టైటిల్ తో ఇవివి కూడా తీసాడనుకుందాం..అంటే జస్ట్ వాళ్ళిద్దరి థాట్ ప్రాసెస్ లో  డిఫరెన్స్ ఎలా ఉంటుందీ చెప్పడానికి- ఇద్దరూ సేం టైటిల్ తో, సేం హీరో హీరోయిన్లతో సినిమా తీసారని అనుకుందాం….”
“ఊ..”
” పెళ్ళాం ఊరెళ్ళాక- ఇక్కడ శ్రీకాంత్ ఏమి చేస్తాడు లేదా ఏమి చేయడానికి ట్రై చేస్తాడు అనేదానిమీద ఫోకస్ చేసి సినిమా తీస్తే అది ఎస్వీ కృష్ణారెడ్డి.
అలా కాకుండా,
శ్రీకాంత్ ని ఇక్కడే పెట్టేసి- పెళ్ళాం ఊరెళ్ళాక- ఏం చేస్తుంది లేదా ఆమె కి ఆ ఊళ్ళో ఏమేమి ఎక్స్‌పీరియెన్స్ లు ఎదురవుతాయి అనేదాని మీద ఫోకస్ చేసి సినిమా తీసాడనుకో..అది ఇవివి అన్నమాట..  😀 “

« Newer Posts - Older Posts »

వర్గాలు