వ్రాసినది: mohanrazz | 2011/12/19

సినిమా వాళ్ళ మాటలకి అర్థాలే వేరులే!!

(This is just for FUN)

సినిమా వాళ్ళ తెలుగు, మనం మామూలు గా మాట్లాడుకునే తెలుగు రెండూ ఒకటేనన్న పెద్ద అపోహ లో వుంటారు చాలామంది. చాలా పొరపాటది. దానికీ దీనికీ రాధిక కి సాధిక కి ఉన్నంత తేడా ఉంది. సినిమా వాళ్ళు మాట్లాడే మాటల వెనుక వుండే అసలు అర్థం తెలియాలంటే కొంచెం జాగ్రత్త గా పరిశీలించాలి.

ఉదాహరణకి సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ లో, ఇంటర్వ్యూ లో మాట్లాడే కొన్ని సినిమా తెలుగు మాటలని సాధారణ తెలుగు లోకి డబ్బింగ్ చేస్తే సారీ ట్రాన్స్ లేట్ చేస్తే ఇలా ఉంటాయి. (సినిమా వాళ్ళ తెలుగు ని, దాని ప్రక్కనే తెలుగు లో ఆ వాక్యం అసలు మీనింగ్ ని గమనించగలరు)


ప్రెస్ మీట్ – సినిమా మొదలెట్టే మందు:

కథే హీరో – హీరో గా ముక్కూ మొఖం(లేని)తెలీని సన్నాసిగాణ్ణి పెట్టాం.
ఈ సబ్జెక్ట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు – ఈ సారి ఎవరికి తెలీని ఇరాన్ సినిమా ని కాపీ కొట్టాం.

(హీరోయిన్:)ఈ సినిమాలో నా క్యారెక్టర్ బబ్లి బబ్లి బబ్లీగా జోవియల్ గా ఉంటుంది-అమ్మతోడు, నాకు కథ గురించి కానీ క్యారెక్టర్ గురించి గానీ ఒక్కముక్క కూడా తెలీదు 

పక్కా స్క్రిప్ట్ తో మొదలెడుతున్నాం – స్టోరీ లైన్ రెడీ అయింది


ప్రెస్ మీట్ – సినిమా రిలీజ్ కి ముందు:

మా డైరెక్టర్ మేమనుకున్న దాని కంటే బాగా తీసాడు – వీడు ఈ మాత్రం తీస్తాడని అనుకోలేదు ముందు.
స్క్రీన్ ప్లే చాల ఫాస్ట్ గా వుంటుంది – పెద్ద స్టోరీ ఏమీ ఉండదు.
రీమేకే అయినా నేటివిటి మార్పులు చాలా చేసాం – ఫస్ట్ సాంగ్ మూడో స్టెప్ లో హీరో లుంగీ కి బదులు ప్యాంట్ వేసుకుంటాడు.

సినిమాకి రీరికార్డింగే హైలెట్-అది తప్ప వేరే ఏమీ లేదు సినిమాలో


రిలీజ్ అయ్యాక –

మొదట్లో డివైడెడ్ టాక్ వినిపించింది – ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్ళు బండబూతులు తిట్టారు.
స్లో గా పికప్ అవుతోంది- కౌంటర్ లో ఈగలు తోలుకుంటున్నారు.
సినిమా చూసిన వాళ్ళంతా టెక్నికల్ గా చాలా బాగుందంటున్నారు – సినిమా ఓవరాల్ గా ఛండాలంగా వుందంటున్నారు.
సినిమా విశ్లేషకుల అంచనాలను తలకిందలు చేసి, ట్రేడ్ పండితులని ఆశ్చర్యపరిచింది- చెత్త సినిమా నే, కానీ (అక్కడక్కడా) ఆడుతోంది, ఎందుకో తెలీదు.


రిలీజైన చాన్నాళ్ళకి:
(నిర్మాత:)ఆ సినిమా నాకు ఎనలేని ఆత్మసంతృప్తినిచ్చింది-పైసా రాలేదు


స్పందనలు

  1. బాగా రాసారు. చప్పట్లు! డిఫరెంట్ పాత్ర లాంటివి ఇంకా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా రాయండి. అలాగే టీవీ చానెళ్ళు ఎలా చెబుతాయో కూడా.

  2. Hilarious! Dishout more!!

  3. బావున్నాయి. ఇంకా చాలా రాయచ్చనుకుంటాను, రాయండి..ఉ.’కథ పాతదే అయినా ట్రీట్మెంటు డిఫరెంటు’

  4. బాగుంది మీ కామెడీ! 🙂

  5. ha ha ha super

  6. ha baaraasaaru
    meeeru
    mee taking baavundi

  7. thanks for ur comment in my blog

  8. 9/10

  9. good one!

  10. superb man

  11. second release అన్నట్టు 🙂

  12. చాలా బాగా రాశారు. Different Taking. సినిమా వాళ్ళ వొకాబ్యులరీ కూడా స్పెషలే ! ఫీలింగ్ ని ఫీల్ అంటారు. ఆ ఫీల్ రావాల. ఈ ఫీల్ వచ్చింది.. అంటూ ఉంటారు. ఎంత పెద్ద వీరో అయినా, వీరోయిను అయినా – అటు ఇంగ్లీషూ సరిగ్గా మాట్లాడక, ఇటు తెలుగూ మాట్లాడక – సదా, ఉబ్బితబ్బిబ్బయిపోతూనే కనిపిస్తారు. కమేడియన్లు ప్రతి హీరో కీ క్లోసు ఫ్రెండ్సే ! అది ఎలా సాధ్యమో తెలీదు. మళ్ళా – హిట్ అయినా కాక పోయినా, సినిమా ఫంక్షన్లూ, వాటి ప్రత్యక్ష ప్రసారాలూ – మామూలు అయిపోయాయి. అదేంటో అంతా సినీ మాయ !

    • >>కమేడియన్లు ప్రతి హీరో కీ క్లోసు ఫ్రెండ్సే ! అది ఎలా సాధ్యమో తెలీదు. మళ్ళా – హిట్ అయినా కాక పోయినా, సినిమా ఫంక్షన్లూ, వాటి ప్రత్యక్ష ప్రసారాలూ – మామూలు అయిపోయాయి>>
      చాలా బాగా చెప్పారు

  13. 🙂 🙂 🙂

  14. chaalaaa bagundi

  15. ఖండిస్తున్నాం ! – just kidding …

    పర్టిక్యులర్ గా ఒకరిని అని పాయింట్ అవుట్ చెయ్యకుండా విమర్శించిన మీ తీరు బాగుంది.

  16. చాలా బాగా వ్రాశారు. నిజ్జంగా ఇలానే చెప్తారు.

  17. హ హ…చాలా బాగా రాశారు. ఈ మధ్య వచ్చిన ఇంకొక సంకటం ఏమిటంటే, ప్రతీ cinema గురించి TV లో కార్యక్రమాలే. ప్రతీ అనామక‌ cinema తాలూక hero, heroin ని పిలవడం (ఈ మధ్య కొత్తగా director ని, producer ని, పాటల రచయిత, సంగీత దర్శకులని కూడా పిలుస్తున్నారులెండి). మీ direction బాగుందండి, మీ production బాగుందండి అని ఒకటే పొగుడుతూ నంగిరోడిపోవడం. ప్రతీ cinema ని super dooper hit గా నే కొనియాడడం. పైగా ప్రేక్షకులు మీ cinema ని ఇంత గా ఆదరిస్తున్నందుకు వారికి మీరేమి తెలియజేస్తారు అని TV anchors భాద్యత అంతా మన నెత్తిన రుద్దడం. వీళ్ళు chance దొరికింది కద అని, pose లు కొడుతూ thanks చెప్పడం. ఇంకో సంగతి మరచిపోయాను….ఆ cinema లో ని music dircetor ని singers ని పిలిచి, ఆ cinema లో పాటలు పాడించడం. వీళ్ళు, ఘంటశాల, సాలూరి రాజేశ్వర రావు గార్ల లా గ feel అయిపోయి దిక్కుమాలిన పాటలన్నీ పాడడం. ఏ channel పెట్టినా ఇదే సంత !!!!


వ్యాఖ్యానించండి

వర్గాలు