వ్రాసినది: mohanrazz | 2012/11/26

ఖడ్గం షఫి డైరెక్షన్ లో నా రచన…

నేను తిరుపతి లో ఇంజనీరింగ్ చేసేటపుడు, అంటే దాదాపు   ఓ పదేళ్ళ క్రితం పరిచయం నాకు ఖడ్గం షఫి. అప్పటికింకా “ఖడ్గం” ఆయన చేతిలో కానీ పేరులో కానీ లేదు. ఆయనది తిరుపతి ప్రక్కన ఉన్న చంద్రగిరి. మా కాలేజీ లో ఒక ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే ఆయనని పిలిపించారు – ఫస్ట్ యియర్ స్టుడెంట్స్ తో ఏవైనా కొన్ని స్కిట్స్ చేయిస్తాడేమోనని. సరే ఆయన రాగానే, అంతకు ముందు సంవత్సరాల్లో స్కిట్స్ నేను వ్రాసి ఉండటం చేత కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆయన్ని నాకు అటాచ్ చేసారు.

 

పరిచయం చేసుకుంటూ చెప్పాడు- “నేను కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాను . కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇంటికి వచ్చాను, ఇంతలో మీ వాళ్ళు పిలిపించారు” అని. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు పోయి కొంచెం అలవాటయ్యక తన రెస్యూం చూయించాడు – నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ లో మూడేళ్ళ యాక్టింగ్ కోర్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఈయన. గిరీష్ కర్నాడ్ వీళ్ళకి ప్రిన్సిపాల్ ఆ రోజుల్లో. చాలా పేపర్ కటింగ్స్, అవీ చూయించాడు. గిరీష్ కర్నాడ్ వ్రాయగా-ఈయన ప్లస్ వాళ్ళ క్లాస్ మేట్స్ కలిసి ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శించిన చాలా డ్రామాల తాలూకు కవరేజ్ లు, అవి వచ్చిన ఇంగ్లీష్ పేపర్ల కటింగులు- అన్నీ ఒక పెద్ద ఫైల్ మెయింటెయిన్ చేసేవాడు. మరి యాక్టింగ్ కోర్స్ చేసి అసిస్టెంట్ డైరెక్షన్ ఏంటీ అని అడిగితే – “నాకు డైరెక్షన్ ఇష్టం” అని చెప్పేవాడు.    

 

సరే, మరి మా కాలేజ్ లో స్కిట్స్ చేయించడానికి మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉందా అని అడిగితే – “ఆ స్క్రిప్ట్ మీ ఫస్ట్ యియర్ స్టూడెంట్స్ తోనే తయారు చేయిస్తాను చూడు” అన్నాడు.  “అబ్-బ్బో ” అనుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ యియర్ స్టూడెంట్స్ అందరినీ ఓ రూం లో కూర్చోబెట్టి “మీకు తోచిన బేవార్స్ ఐడియాలు చెప్పండి, అది ఎంత చెత్తదైనా పర్లేదు” అన్నాడు. ఓ గంట గడిచింది. ఎవరికి తోచినవి వాళ్ళు చెబుతున్నారు..కొన్ని కామెడీ గా అనిపించేవి, కొన్ని నస అనిపించేవి. అందరికీ ఒకటే డౌట్. వీటన్నిటితో ఈయనేం చేస్తాడు, అసలు ఒక స్క్రిప్ట్ అంటూ లేకుండా ఏం చేద్దామని వచ్చాడు అని గొణుక్కుంటున్నారు…..ఇంతలో వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ లో నుంచే నాకు ఏదో చిన్న స్టొరీలైన్ స్ట్రైక్ అవడం, అది చెప్తే- ఆయనతో పాటు మిగతా స్టూడెంట్స్ కి కూడా నచ్చడం, దాన్నే పూర్తి స్థాయి స్కిట్ గా మౌల్డ్ చేసి వ్రాసివ్వడం – అప్పటికప్పుడు జరిగిపోయాయి. తర్వాత ఆ స్కిట్ ని ఆయనే దగ్గరుండి చేయించాడు.

 

ఆ తర్వాత – “విజన్ 3030” అని మేము చేసిన ఆ స్కిట్ తనకి బాగా నచ్చిందని ప్రిన్సిపాల్ ఆయన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తే ఆయన స్టొరీ వ్రాసింది నేనని నా గురించి ప్రిన్సిపాల్ కి ఓ మూడు మంచి ముక్కలు చెప్పి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొద్దిరోజుల పాటు చంద్రగిరిలో బోరు కొడుతుందని సాయంత్రమవగానే క్యాంపస్ కి వచ్చేసేవాడు పిచ్చాపాటి గురించన్నట్టు. తర్వాత షరామామూలే. మన ఇంజనీరింగ్ అయిపోయి మనదారిన మనం వెళ్ళిపోతే- సడెన్ గా ఖడ్గం సినిమా తెర మీద కనపడి షాకిచ్చాడు. 

 

అదండీ సంగతి. అలా జరిగిందప్పట్లో 🙂


స్పందనలు

  1. gud……………..


వ్యాఖ్యానించండి

వర్గాలు