వ్రాసినది: mohanrazz | 2013/07/06

గజల్ శ్రీనివాస్ కూడా..అదే బాపతా??

గజల్ శ్రీనివాస్ అంటే తెలుగు కళాప్రియులకి సుపరిచితం అయిన పేరే! తెలుగులో గజల్స్ ని బాగా పాపులర్ చేసిన కళాకారుడు. ఆయన గజల్స్ చెప్పే విధానం కూడ చాలా బాగుంటుంది.మధ్య మధ్య లో చిన్న చిన్న సొంత వ్యాఖ్యానాలు జతచేస్తూ చెప్తూంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఆయన గజల్స్! ఆయన చెప్పే విధానం ఒకే ఫ్లో లో భలే ఉంటుంది.ఉదాహరణకి ఆయన తన స్టైల్లో చెప్పే ఒక గజల్:

“ఉందో లేదో స్వర్గం
నా పుణ్యం నాకిచ్చి

మనకి చిన్నప్పటినుంచీ చెప్తూ ఉంటారండీ..మంచిపనులు చేస్తే మనం స్వర్గానికి వెళతామని, లేదంటే నరకానికి వెళతామని..ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి వెళ్ళాలనే కోరుకుంటారు..అయితే ఆ స్వర్గం ఉందో లేదో మనకి తెలీదు..చేసిన పుణ్యాలవల్ల నాకు స్వర్గం రావాలి..కానీ ఆ స్వర్గం ఉందో లేదో నాకు తెలీదు..
ఉందో లేదో స్వర్గం
నా పుణ్యం నాకిచ్చి…

నా సర్వస్వం నీకిస్తా..
నా సర్వస్వం నీకిచ్చేస్తాను..దేని గురించండీ..
నా బాల్యం నాకిచ్చెయ్..

ఉందో లేదో స్వర్గం  / నా పుణ్యం నాకిచ్చి / నా సర్వస్వం నీకిస్తా ../నా బాల్యం నాకిచ్చెయ్..”

ఇలా ఆయన చెప్పే గజల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఆయన మూడ్ లోకి మనల్ని తీసుకెళతాయి.అప్పుడెప్పుడో 1998 లో అనుకుంటా,జెమిని టివి లో “శుభోదయం” అనే ప్రోగ్రాం వచ్చేది.మొదటి సారిగా అప్పుడు విన్నాను ఈయన గజల్స్ ని.

సరే కాసేపు గజల్ శ్రీనివాస్ సంగతులు పక్కన పెడితే, నేను తిరుపతి లో ఇంజనీరింగ్ చదివాను.అప్పట్లో కాలేజ్ లో స్కిట్స్ గట్రా రాసేవాణ్ణి.ఇంజనీరింగ్ లో మా ఫ్రెండ్ (నాకు క్లాస్ మేట్/రూమ్మేట్) ఒకతను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండేవాడు.అతను కాలేజ్ ఫంక్షన్స్ తో పాటు తిరుపతి మున్సిపల్ పార్క్ లో ప్రతి ఆదివారం మిమిక్రీ ప్రోగ్రాంస్ చేసేవాడు.వీటిల్లో చాలావరకు స్క్రిప్ట్స్ నేను రాసేవాణ్ణి.నేనూ అతని తో పాటు, వాళ్ళ ట్రూప్ తో పాటు వాళ్ళ ప్రోగ్రాంస్ అన్నిటికీ వెళ్ళేవాణ్ణి.వాళ్ళ ట్రూప్ లో చాలా మంచి ఆర్టిస్ట్స్, మిమిక్రీ కళాకారులు ఉండేవాళ్ళు.అయితే వాళ్ళలో ఒకే ఒక్క విషయం నాకు గానీ మా ఫ్రెండ్ కి కానీ  నచ్చేది కాదు- అదేంటంటే, తమని తాము అప్ డేట్ చేసుకోకపోవడం, కొత్తవాటిని ప్రయత్నించకపోవటం.ఒక మిమిక్రీ స్క్రిప్ట్ దొరికిందంటే దాన్నే పట్టుకుని సంవత్సరాల తరబడి వేళ్ళాడేవాళ్ళు.ఎక్కడికెళ్ళినా అదే చేసేవాళ్ళు.కొంతవరకు స్క్రిప్టుల కొరత ఉన్నమాట వాస్తవమే అయినా,వాళ్ళకు వాళ్ళుగా కొత్త స్క్రిప్టుల కోసం ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కాదు.ఇంకొక విషయమేంటంటే, ఈ జాడ్యం ఇలాంటి లోకల్ ఆర్టిస్టులతో పాటు పెద్ద పెద్ద ఆర్టిస్టుల్లో కూడా గమనించాను…

సరే నా గోల పక్కనపెట్టి, కాసేపు గజల్ శ్రీనివాస్ సంగతుల గురించి మాట్లాడుకుందాం.మొన్న ఈ మధ్య (నెల, 2నెలల క్రితం అయివుండొచ్చు) గజల్ శ్రీనివాస్ మళ్ళీ ఏదో టి.వి షో లో వచ్చాడు.మునుపటి లాగే అదే ఉత్సాహం తో గజల్స్ పాడుతున్నాడు.ఆయన తన స్టైల్ లో పాడిన ఒక గజల్:

“అమ్మ లాలనకి ముందు..
బ్రహ్మ వేదాలు బందూ.. 

నాకు ఒక కూతురుందండీ..పేరు సంస్కృతి….నేను ఏరి కోరి మరీ ఈ పేరు పెట్టుకున్నాను నా కూతురికి. అందరూ నన్ను నువ్వు పాటలు బాగా పాడుతుంటావ్ అంటూంటారు కదా అని ఎప్పుడైనా నా కూతురు ఏడిస్తే నేను లాలిపాట పాడి ఆ బిడ్డ ఏడుపు మానిపించడానికి ప్రయత్నిస్తుంటానండీ…అయితే నేను పాట మొదలెట్టగానే నా కూతురు ఇంకా గట్టిగా ఏడుస్తుంది.అదే ఏ మాత్రం సంగీత ఙ్ఞానం లేని నా ఇల్లాలు పాట మొదలెట్టగానే ఠక్కున ఏడుపు ఆపివేస్తుంది..

అమ్మ లాలనకి ముందు..
బ్రహ్మ వేదాలు బందూ..

చాలా అద్భుతమైన సాహిత్యం.చాలా అద్భుతమైన వివరణ తో గజల్ శ్రీనివాస్ ఆ గజల్ పాడుతూంటె చాలా గొప్పగా అనిపించింది కానీ,ఒకటే నాకు చిన్న వెలితి అనిపించింది.అప్పుడెప్పుడో 1998 లో టి.వి షో లో అచ్చు ఇదే పాట…అచ్చు ఇదే వివరణ.1998 లో వాళ్ళ అమ్మాయి సంస్కృతి ఏడిస్తే ఈయన లాలి పాట పాడాడు బానే వుంది.2009 వచ్చినా మళ్ళీ..ఇప్పుడు కూడా లాలిపాట పాడటమే నాకు నచ్చలా…  🙂  

గజల్ శ్రీనివాస్ స్థాయి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా మా వాళ్ళ బాపతే అయితే ఎలా బాస్..!!!


స్పందనలు

  1. good point 🙂
    This has been my constant complaint against Telugu mimicry artists.
    He needs to start new ghazals for his now teenage daughter

    • మిమిక్రీ ఆర్టిస్ట్స్ అనే కాదండీ..తెలుగు ఫంక్షన్స్ లో జరిగే స్కిట్స్ వగైరా ప్రోగ్రాంస్ చూసినా – ఇదె అనిసిపిస్తుంది నాకు!!

  2. correct ey!
    kaani..ademito, aa ghazal singing ni monopolize chesesaadatanu!….migitaa artists ghazals paadalera?..itanu training ivvada?

    • తెలుగు గజల్స్ పాడటం లో వేరే ఆర్టిస్ట్స్ ఎవ్వరూ ఇప్పటికీ రాకపోవడం నాకూ ఆశ్చర్యంగానే ఉంటుంది..

  3. most of his songs are the translagtions of gulam ali & jagjith ghajals including నా బాల్యం నాకిచ్చెయ్..


వ్యాఖ్యానించండి

వర్గాలు