వ్రాసినది: mohanrazz | 2012/12/20

గజరాజు vs మృగరాజు

శివాజీ గణేషణ్ కొడుకు ప్రభు (చంద్రముఖి ఫేం) తనయుడు – విక్రం ప్రభు హీరో గా రేపు రిలీజవుతున్న డబ్బింగ్ సినిమా గజ రాజు. ఆల్రెడీ తమిళ్ లో యావరేజ్ గా ఆడిన సినిమా ని ఇప్పుడు డబ్ చేస్తున్నారు.

గజరాజా? అదేమి టైటిల్ అనుకున్నాను కానీ కథ చూసాక మనవాళ్ళు డబ్బింగ్ వెర్షన్ కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం అయింది. మృగరాజు సినిమాలో ఒక సింహం వచ్చి జనాల్ని చంపడం లాంటి గోల చేసినట్టుగానే ఇందులో ఒక ఏనుగు ఒక ట్రైబల్స్ ఉండే ఏరియా ని భీబత్సం చేస్తూ ఉంటుంది. దాని భీబత్సం ఎలాకట్టడి చేసారు చివరికి అనేదే కథ. మధ్యలో ట్రైబల్ లీడర్ కూతురు తో హీరో కి ఒక లవ్ స్టోరీ.అంతే కథ.

మన తెలుగు లో హీరోలు ఫస్ట్ సినిమా లో “ప్యూర్లీ” కమర్షియల్ అంశాలు ఉండేలా తీస్తారు – చిరుత, రాజకుమారుడు లాగా..కానీ ఈ తమిళ హీరోలెందుకో మొదటి సినిమాలో బాగా గెడ్డం పెంచి, ఊర మాస్ అనిపించే పాత్రలే చేస్తారు..సెంటిమెంటో లేక ఏదైనా స్ట్రాటజీయో అర్థం కాదు.. ఇక దీని డైరెక్టర్ ప్రభు సాల్మన్ ఆ మధ్య “మైనా” అనే తమిళ సినిమా తీసాడు..తెలుగులో ప్రేమకథ పేరు తో డబ్ అయింది..అమలాపాల్ కి హీరోయిన్ గా తెలుగులో కూడా బానే గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ఈ దర్శకుడి సినిమాల్లో విజువల్స్ బాగుంటాయి, మెలోడీ సాంగ్స్ ఉంటాయి..కొన్ని లవ్ సీన్స్ బానే ఉంటాయి..కానీ ఓవరాల్ గా సినిమా ఎత్తిపోతుంది..మరి గజరాజు కీ మృగరాజు గతే పడుతుందో… లేక ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సినిమాల మాదిరి కొట్టుకుపోతుందో..లేక కాస్తో కూస్తో ఆడుతుందో చూడాలి..

 

Gaja_Raju1 gajaraju2


స్పందనలు

  1. “మన తెలుగు లో హీరోలు ఫస్ట్ సినిమా లో “ప్యూర్లీ” కమర్షియల్ అంశాలు ఉండేలా తీస్తారు – చిరుత, రాజకుమారుడు లాగా..”…
    నిన్న ఈ సినిమా తమిళ మాతృక చూస్తున్నప్పుడు మేము అనుకున్న మాటలు కూడా ఇవే… మన ప్రేక్షకుల మనసు కమర్షియల్ సినమా ల మూడ్ నుండి కొంతకాలమైనా ఆర్ట్ సినిమాలవైపు మళ్ళాలని కోరుకుంటున్నాను…

  2. good


వ్యాఖ్యానించండి

వర్గాలు