వ్రాసినది: mohanrazz | 2009/09/07

“అపాత్రదానం” కి – జెమిని మ్యూజిక్ యాంకర్ చెప్పిన అర్థం :)

జెమిని మ్యూజిక్ లాంటి ఛానెల్స్ లో పాటలు చూస్తానేమో కానీ యాంకర్ల సొల్లు, కాలర్స్ తో వాళ్ళు మాట్లాడే మాటలు ఎప్పుడూ చూడను. ఎందుకంటే ఏం చెప్తాం, నాకంత పెద్ద మనసు లేదు.. 🙂

అయితే ఓ సారి పొరపాటున ఒక యాంకర్ మాట్లాడుతూంటే వినాల్సి వచ్చింది. కుర్రాడి పేరు గుర్తురావట్లేదు కానీ అతను జెమిని మ్యూజిక్ లో బాగా పాపులర్ యాంకరట. FM లో ఏదో బెస్ట్ యాంకర్ అవార్డ్ ఇస్తే ఈ కుర్రాడికే వచ్చిందనో ఏదో చెప్పారు. సరే, ఇంతకీ ఆరోజు ప్రోగ్రాం లో ఏదో “దానం”, “ధర్మం” ఇలాంటి టాపిక్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో మధ్యలో “అపాత్రదానం” అనే పదం వచ్చింది. ఎవరో పెద్దావిడ ఇంతలో కాల్ చేసారు. “హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు..” లాంటి మాటలు అయ్యాక ఆవిడని అడిగాడు “అపాత్రదానం” అంటే అర్థం ఏంటో చెప్పగలరా అని. ఆవిడ పాపం కరెక్టు గానే చెప్పబోతోంది-“అంటే..ఎవరైనా అర్హులు కానివారికి…” అంటూ ఏదో  చెప్పబోతూంటే మధ్యలో కట్ చేసి..”ఆంటీ..ఆంటీ..బహుశా మీకు కరెక్ట్ సమాధానం తెలిసినట్టు లేదు…సరే మీకు తెలీకపోతే తెలుసుకోవడం లో తప్పేమీ లేదు కాబట్టి..నేనే మీకు దాని మీనింగ్ ఏంటి అనేది చెప్తాను..పూర్వం రోజుల్లో ఏదైనా బియ్యం కానీ పప్పు కానీ ఇంకేదైనా కానీ దానం చేయాలంటే ఏదైనా ఒక పాత్ర లో దాన్ని దానం చేసేవారు..అప్పుడు ఆ పాత్ర తో సహా వాళ్ళకే దానం చేసేవారు…అందుకే అంటారు..అపాత్రదానం చేయకూడదు…అంటే దానర్థం అలా పాత్ర లేకుండా దానం చేయకూడదు అని… 😀 ఇప్పుడంటే మనం చేత్తో అలా దానం చేసేస్తాం కానీ అప్పట్లో అలా చేసేవాళ్ళు కాదు..ఏదైనా కానీ పాత్ర తో సహా చేసే వాళ్ళు…ఇప్పుడర్థమైందాండీ అపాత్రదానం చేయకూడదు అని ఎందుకంటారో…ఓకె ఇప్పుడొక మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి”

తర్వాత దాదాపు ఆ యాంకర్ కనిపించిన ఆ అరగంట సేపు ట్రై చేసాను లైన్ కలిస్తే చెడామడా తిట్టేద్దామని..లైన్ దొరకలేదు..


స్పందనలు

  1. ప్రైవేట్ గా కాదు, పబ్లిక్ టెలీకాస్ట్ లో ఇలా మాట్లాడిన యాంకర్ కి ఎంత తల కొవ్వో?

  2. 🙂 బహుశా మిస్ ఫైర్ అయ్యిన జోకేమో…

    • జోక్ అయితే ప్రాబ్లెమేముందండీ..జోక్ కాదు చాలా సీరియస్ గానే- ఈ మధ్య చాలా మందికి చాలా విషయాలు తెలీకుండాపోతున్నాయని ఇలాంటివి కొన్ని చెప్పాడు.

  3. Mygod!!!! ఇలా కూడా చెప్పగలరా!!!
    ఆ యాంకర్ కార్యక్రమాలు నేను అప్పుడప్పుడు చూద్దామని ప్రయత్నించాను కానీ, రెండో నిమిషంలో ఛానెల్ మార్చేసేదాన్ని!

  4. కరెక్టే…
    పాత్రుడు అంటే పాత్రను మోసుకుంటూ తిరిగేవాడు అనగా భిక్షగాడు అని అర్ధం :-))

    • మరి “పాత్ర పోషించడం” అంటే? 😀

      • “పాత్ర”ని పోషించడం లేదా “పాత్ర”లోంచి తనను తాను పోషించుకోవడం

  5. ఒరియాలో పాత్రొ అనే బ్రాహ్మణుల టైటిల్. పాత్రొ అంటే అర్హుడు అని అర్థం.

  6. పాత్రుడు అంటే అర్హుడు అనే అర్థం. ఒరిస్సాలో మా అన్నయ్య ఉండే రాయగడ పట్టణంలో ఒక బ్రాహ్మణ మునిసిపల్ చైర్మన్ ఉండే వాడు. అతని పేరుని ఇంగ్లిష్ లో Krishna Chandra Boxipatra అని వ్రాసే వాడు. ఒరియాలో బొక్సిపాత్రొ అనే పేరుని తెలుగులో భక్షిపాత్రుడు అని వ్రాయొచ్చు. పూర్వం రాజులు బ్రాహ్మణులకి భూదానం, శూద్రులకి మేకలు, గొర్రెలు వంటివి దానం చేసే వారు.

  7. బ్రాహ్మణుడు పరమాన్నం భక్షిస్తాడు, శూద్రుడు కుక్క మాంసం భక్షిస్తాడు. మొరటు బాషలో చెపితే భక్షిపాత్రుడు అంటే తిండిబోతు అనుకోవాలి.

    • ఇంతకి మీరేం తింటారు ?

      • నేను తినేది శుద్ధ శాఖాహారమే కానీ నేను కూడా శూద్రుడినే.

        • ఇక్కడ మీ కుల ప్రస్తావన ఎందుకు
          మీ కధల్లో ఎలాగు ఒక కులం అని రాసే ధైర్యం లేదా వుంటే లింక్ పంపండి

          • http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/ramaneeyam.html ఈ కథలో హీరో మొదట ఒక బి.సి. అమ్మాయిని ప్రేమించాడని అతని తండ్రి, అన్న అతన్ని తిడతారు. అయితే ఆ అమ్మాయి కూడా హీరోని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించడం వల్ల హీరో మొదటి లవ్ ఫెయిల్ అవుతుంది.

  8. శ్రీకాకుళం జిల్లా కామేశ్వరిపేట గ్రామం వద్ద వంశధార రైల్వే బ్రిడ్జి పై “ఈ వంతెన పై నడవడం ప్రమాదకరం & నేరం, ఈ వంతెన పై నడిచిన వాళ్ళు శిక్షాపాత్రులు” అని వ్రాసి ఉంటుంది. శిక్షాపాత్రులు అంటే శిక్షార్హులు అని అర్థం.

    • రైల్వే ట్రాక్ మీదికి వెళ్ళవలసిన అవసరం మీకేంటి ?

  9. ఇప్పుడు నవ్వాలా ఏడవాలా……..

  10. “ఆంధ్ర భోజుడు” అంటే ఎవరు అని అడిగితే “శ్రీకృష్ణ దేవరాయులు” అని కాకుండా “ఆంధ్రా భోజనం చేసేవాడు” అని సమాధానం చెప్పాడు ఒకడు. వాడు కూడా ఇలాంటివాడే.

    • ఇంకా నయం, ఆంధ్రా ని భోజనం చేసేవాడు అని చెప్పలేదు అంతవరకు సంతోషం.

      • భోజుడు అంటే పోషించే వాడు అని అర్థం. కృష్ణ దేవరాయులు తెలుగు బాషని పెంచి పోషించాడు కనుక అతనికి ఆంధ్ర భోజుడు అని పేరు వచ్చింది.

        • తెలుసండీ!!!

          • మన టివి వాళ్ళు తెలుగు ఎక్కడ నేర్చుకున్నారో ఏమో? మిషనరీ స్కూల్ లో ఇంగ్లిష్ మీడియం చదువుకున్న వాళ్ళకి వచ్చిన తెలుగు కూడా వీళ్ళకి రాదు. ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివిన అనుభవంతోనే చెపుతున్నాను.

            • చిన్నప్పుడు రామ్ చరణ్ కూడా ఇంగ్లీష్ మీడియం స్చూలేనండీ !!

              • స్కూల్ లో చెప్పకపోతే మాత్రం లోకల్ లాంగ్వేజ్ ని ఇంత సులభంగా ఖూనీ చేసి మాట్లాడుతారా? ఒరియా మీడియం స్కూల్ లో చదువుకున్న మా నాన్న గారు కూడా తెలుగు బాగానే మాట్లాడేవారు. మా నాన్న గారి ఊరిలో జనం రెండు బాషలు మాట్లాడుతారు కానీ బాషని ఖూనీ చెయ్యరు.

                • వాళ్ళు తెలుగు బాగా మాట్లాడినా ఒరియా ని ఖూని చేస్తున్నారు కదా

        • పెళ్ళాం పిల్లలనిపోషించేవాడిని పిల్లభోజుడు అని ఎవరు పిలవరు కదా !

          • కుంతీదేవి తండ్రిని కుంతీభోజుడు అనే వారు. చిన్నప్పుడు మహాభారతంలో చదివినట్టు గుర్తు.

            • అంటే పల్లకిలో పెల్ల్లికూతురు ఫేం ‘రతి’ తండ్రి ని నువ్వు ఏమని పిలవాలి

              • హ హ…భలే అడిగారు, అమ్మో నవ్వగట్లేదు.

                • భక్షిపాత్రుడిని తిండిపోతు అంటే ఎంత నవ్వు వస్తుందో, ఇక్కడ కూడా ఇంతే.

  11. ఈ మద్య తెలుగు భాష కి తెగులు పట్టించే తుంటరులు తెగ తయారౌతున్నారు, టి.వి లో యాంకర్ల ని పక్కన పెడితే న్యూస్ రీడర్స్ కి కనీస తెలుగు రాదు, చస్తున్నా తెలుగు వార్తలు వినలేక, వాతలు పెడుతున్నట్టు ఉంటోంది. “వై.ఎస్ అంకుటిత దీక్ష ట”, ఫోరేస్నిక్ నిపుణులట, వీళ్ళ పిండాకూడు, ప్రూఫ్ రీడర్స్ ఏం పీకుతున్నారో, ఏంటో,

    ఆ లాజిక్ లేని మేజిక్ అంటూ ఒకడు వస్తాడు, “one ball ఈ చేతి లో ఉంది, other ball ఈ చేతోలి ఉంది, mee hands లో ఏ ball ఉంది” ఇలా చిర్రెస్త్తిస్తూ ఉంటాడు.
    రియాల్టీ shows వద్దు బాబు, offline లో డబ్బింగ్ చెప్పి అప్పుడు టెలికాస్ట్ చెయ్యండి, మమ్మల్ని కాపాడండి,

  12. ఎంత ఇంగ్లిష్ మీడియం అయితే మాత్రం, తెలుగుని మరీ ఇలా ఖూనీ చేసి మాట్లాడాలా?

  13. అసలు ఆ యాంకర్ ని సెలెక్ట్ చేసిన టివి చానెల్ స్టాఫ్ కి తెలుగు సరిగా వచ్చా? ఆ యాంకర్ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవడానికి ఒప్పుకున్నాడని అతన్ని సెలెక్ట్ చేశారా?

  14. వాట్ వాటూ ? అపాత్రదానం అంటే ఇదా ? అసలా అనర్హుడి కి యాంకరింగ్ చేసే అవకాశం ఇవ్వడం అపాత్రదానం. టీ.వీ లో కెరియర్ అంటే ఆషామాషీ అయిపోయింది అనుకుంటాను. ఎప్పటికపుడు మన జి.కె. ను మెరుగుపరుచుకుంటూ చాకులా ఉండాల్సిన కుర్రాళ్ళు ‘ఏమ్మా బుజ్జీ ! బాగా చదూకో !’ అనేసి పాట ప్లే చేసేయటమే ఏంకరింగు అయిపోయింది. అదే ఆశ్చర్యం.

  15. ఆ యాంకర్ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవడానికి ఒప్పుకున్నాడని అతని సెలెక్ట్ చేశారు. లేకపోతే ఇంత దారుణంగా తెలుగు ఎవడు మాట్లాడుతాడు? ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న నేను కూడా తెలుగు బాగానే మాట్లాడుతుంటాను. మరీ ఆ యాంకర్ లా తెలుగు ఖూనీ చేసేంత అమాయకులు ఉంటారనుకోలేదు.

    • మీరు తెలుగు మాట్లాడ్డమేంటి అండీ!.. చెరసాల అని చిన్చేస్తేనూ మిమ్మల్ని తక్కువ అంచనా ఎందుకు వేసుకుంటారు ..మీ ఫాన్స్ తట్టుకోలేరు.. తెలుగు బాషా(రజని కాంత్) ప్రవీణులు మీరు

      • baboi ! naku ardham kaledu ! hee hee !

        • మీరు చెరసాల కధ చదవలేదా ! 80 కామెంట్స్ తో సెంచరీ దిశగా సాగిపోతున్న చెరసాల మీ అభిమాన బ్లాగ్ లో imea

          • మా బంధువు ఒకతను యాభై ఏళ్ళ వయసులో పాతికేళ్ళ పేద ఇంటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అలాంటి మగరాయుళ్ళని విమర్శించడానికి వ్రాసిన కథ అది.

          • ఓహో ఈయన‌ ఆ ప్రవీణ్ గారా, ఇందాకట్నుంచి తెగ రాసేస్తూ ఉంటే ఎవరో అనుకున్నాను !!!
            చెరసాల, వైరాగ్యం fame ప్రవీణ్ గారు !!!

            సుజాత గారికి thanks లు, హి హిహి

    • తెలుగు ని ఖూనీ చేసేవాళ్ళని అమాయకులు అంటారా?

      • అమాయకులు కాకపోతే వెర్రి వెంగళప్పలు అనుకోవచ్చు.

        • ఇప్పుడు మీ కదల గురుండి ఎందుకు మాట్లాడడం

  16. అసలు పాత్రుడు అంటే పొందదగినవాడు, అర్హుడు అని అర్థం. ఇది ఒక సంస్క్రుత పదం. ఒరియా లో ‘మహపాత్రో’ అని కూడా ఉంది. మన సదరు యంకర్ గారిని పిలిచి ఈ పదానికి అర్థం చెప్పమంటే ‘పెద్ద పాత్ర లో దానమిచ్చేవాడనో, లేదా పెద్ద పాత్ర లో అడుక్కునేవాడనో, లేకపోతే పెద్ద పాత్ర లో భోజనం చేసేవాడనో చెప్తాడు కాబోలు.

    అయ్యా, మోహన్ గారు ఆ సదరు యంకరు పేరు చెప్తే, జెమిని మ్యూజిక్ వాళ్ళకి ఒక ఉత్తరం రాసుకుంటాము, ఇటువంటి అపాత్రులకి యంకరింగు ఇవ్వద్దని.

    మోహన్ గారు, మీ వెర్రి తాపత్రయమేగానీ, లైన్ కలుస్తుంది అని ఎలా అనుకున్నరండీ? మనలాంటి వాళ్ళకి లైన్ కలవనుగాక కలవదు. కానీ ఎక్కడో ఆమదాలవలస మండలంలో రావూరిపేట లో ఉన్న సుబ్బారావు కో, జానకమ్మ కో కలుస్తుంది. వాళ్ళకి ఎప్పుడూ, అంటే వారం లో ఐదు సార్లు కలుస్తూఉంటుంది. పైగా వాళ్ళు, ఈ యంకర్ల వీరఫ్యాన్సు. వారి కుటుంబంలోనివారు, వీధిలోని వారు కూడా ఫ్యాన్సే. మనం ఫ్యాన్సు కాదు కదా అందుకని కలవదు. నేను ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు, కోపం వచ్చినప్పుడల్లా, జెమిని మ్యూజిక్ యంకర్సు కి, రేడియో లో FM యంకర్సు కు ఫోన్ చేసాను (అంటే అప్పుడు సెలవులలో కొన్నాళ్ళు పనిలేకుండా ఉన్నాననుకోండి). ఒక్కసారి కూడా కలవలేదంటే నమ్మండి. 2, 3 సార్లు రింగు అయింది, కానీ ఎత్తలేదు. ఎత్తరు, మరి జెమిని స్టూడియో లో ఉన్నా ఆమదాలవలస లో ని సుబ్బారావు కి కలవాలి కదా!!!

  17. ఓహో..వాళ్ళ ఫ్యాన్స్ కి మాత్రమే లైన్స్ కలుస్తాయన్నమాట…నిజమే! ఫోన్ చేసిన వాళ్ళందరూ సొంత బంధువుల కంటే ఆప్యాయంగా మాట్లాడుకుంటూంటారు చూసినప్పుడల్లా..! పైగా “పోయినసారి మాట్లాడినప్పుడు – అలా చెప్పావ్ కదా..” అని – ఆ పాత మధురాలు స్మరించుకోవడాలు మళ్ళీ..!!

    • అబ్బ, ఇప్పటికి అసలు విషయాన్ని సూక్ష్మబుద్ధి తో గ్రహించారు. ఏతావాత తేలిందేమిటంటే మనకి లైన్లు కలవవు, కలిస్తే తిడదామనే మన వాంఛ, వాంఛ గానే ఉండిపోతుంది ఎప్పటికీ. వాళ్ళ సొల్లు మనం విని భరించడమేగాని మన అప్రాచ్యపు దీవెనలు (తిట్లు) వాళ్ళు భరించరు.

  18. యాంకర్ పేరు రాజశేఖర్,

    • ఒహో ఆ మహనుభావుడా, అన్నన్న, తెలియక ఏదో అనేశాను కాని వారు బహుముఖప్రఙ్ఞాశాలి. వారి ప్రఙ్ఞ “పాత్ర” లకే పరిమితం కాదు. ప్రతీరోజు జెమిని మ్యూజిక్ చూస్తే మీకే అర్థమవుతుంది….వారి బుద్ధికుశలత వర్ణింప‌తరమా!!!!

      • యాంకర్ పేరు రాజశేఖరా? కాదనుకుంటా. ఆ ప్రోగ్రాం మీరూ చూసారా? మిగతా అందరు యాంకర్స్ కంటే నేను చెప్పిన యాంకర్ బాగా యాక్టివ్ గా ఉంటాడు, “మామా, మామా” అంటూ. ఈసారి జెమిని మ్యూజిక్ లో అతని పేరు చూసాక చెప్తాను.

        • ఆ ప్రోగ్రాం నేను చూడలేదు. కానీ రాజశేఖర్ అనే పేరుగల వ్యక్తి యంకర్ గా వ్యవహరించిన ప్రోగ్రం ఒకటి ఉంది జెమిని మ్యూజిక్ లో, ప్రోగ్రాం పేరు గుర్తులేదు. జెమిని మ్యూజిక్ లో వచ్చేవాళ్ళలో చాలామటుకు తెలుగు ని తెగులు తో మాట్లాడేవాళ్ళేలెండి. కాబట్టి ఏ రాయి అయినా ఒకటే పళ్ళు ఊడగొట్టుకోవడానికి, ఏవంటారు?

          అయితే ఈ ‘మామా, మామా’ అనే అబ్బయి నాకూ తెలుసు, అతని ప్రోగ్రం కూడ చూసాను. అతను S FM లో ‘ఒకరికొకరు’ అనే ప్రోగ్రాం లో కూడా మట్లాడుతూ ఉంటాడు. పేరు ఠక్కున గుర్తు రావట్లేదు. ఈసారి పేరు చూడండి మరచిపోకుండా.

  19. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి ఫోన్లు చేసిన నాకు కూడా ఆ యాంకర్లతో ఫోన్లు కలవలేదు. మా జిల్లాలోని ఆముదాలవలస, కళింగపట్నం లాంటి పట్టణాల నుంచి వెళ్ళే ఫోన్లు ఆ యాంకర్లకి ఎలా కాంటాక్ట్ అవుతాయి? ఆముదాలవలస ఏరియా కోడ్, శ్రీకాకుళం ఏరియా కోడ్ ఒకటే. ఆముదాలవలస నుంచి ఫోన్ చేసినా, ముందు శ్రీకాకుళం టెర్మినల్ కి వెళ్ళిన తరువాతే హైదరాబాద్ కి లైన్ కలుస్తుంది. నా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి. ఒకటి BSNL, ఇంకొకటి టాటా వైర్ లెస్ ల్యాండ్ ఫోన్. రెండిటి నుంచీ ప్రయత్నించినా హైదరాబాదీ యాంకర్లు రిసీవ్ చేసుకోరు.

    • దాన్నే విధి అంటారు ఏమో

      • ఏమైనా అనుకోండి. ఆముదాలవలస పట్టణానికి మూడు కి.మి. దూరాన ఉన్న కనుగులవస గ్రామం నుంచి ఫోన్ చేస్తే సిగ్నల్ మొదట ఆముదాల వలస టెలీఫోన్ ఎక్స్చేంజ్ కి వెళ్తుంది. ఆముదాలవలస ఎక్స్చేంజ్ నుంచి శ్రీకాకుళం టెర్మినల్ స్టేషన్ తొమ్మిది కి.మి. దూరం. శ్రీకాకుళం టెలీఫోన్ ఎక్స్చేంజ్ నుంచి టెర్మినల్ స్టేషన్ రెండు కి.మి. దూరం. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ కి ఎప్పుడు ఫోన్ చేసినా లైన్ బిజీ అని మెసేజ్ వస్తుంది. నేను చెయ్యగా వెళ్ళని ఫోన్ కాల్స్ ఆముదాలవలస మండలం నుంచి వెళ్ళాయంటే నేను నమ్మాలా?

  20. పేరు అందంగానే ఉంటుంది కానీ ఆ వ్యక్తి మాట్లాడే బాష మాత్రం ‘మిడితాన అప్పల సన్యాసి నాయుడు’ మాట్లాడే బాషలా ఉంటుంది.

  21. నమ్మడం అనేకంటే
    మీరు సాంగ్ వేసినప్పుడు కాల్ చేస్తే ప్రయోజనం వుంటుందేమో
    యాంకర్ వేరే మనుషుల తో మాట్లాడినప్పుడు మీకు ఎలా కలుస్తుంది
    మీకు లైన్ కలవాలని దేవుడి ని ప్రార్థిస్తున్నాను

  22. ఫోన్ టాక్ అంతా ఒక నాటకం. టివి చానెల్ ఆఫీసుల్లో వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్ ఉంటారు. వాళ్ళని అడిగితే మండలాలూ, గ్రామాల పేర్లు చెప్పేస్తారు. ఈటివిలో న్యూస్ రీడర్ గా పని చేసిన ఒకతనిది శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామం. ఆ ఊరు మా అమ్మమ్మ గారి ఊరి దగ్గరే ఉంది. అతన్ని అడిగితే వీరఘట్టం మండలంలోని గ్రామాలతో పాటు పక్క మండలాలైన పాలకొండ, వంగర, సీతంపేట మండలాలలోని గ్రామాల పేర్లు కూడా తెలుసుకోవచ్చు, ఆ పేర్లు ఫోన్ కాల్ నాటకంలో వినిపించొచ్చు.

  23. అటెన్షన్ ప్లీజ్! ఇక్కడ, పైన సుజాత పేరుతో ప్రవీణ్ రాసిన చెరసాల కథను,అతని తెలుగునూ విమర్శించింది నేను కాదు! అసలు నేను ఆ కథ చదివలేదు, చదివినా, నచ్చకపోతే అతని బ్లాగులోనే ఆ విషయం చెప్పేదాన్ని!

    ప్రవీణ్, ఆ రాసిందెవరో మీరు కనుక్కోవలసిందే! ఆలోచించండి! తట్టకపోదు.

    సుజాత(మనసులో మాట)

  24. హేమిటీ!.. ఇప్పుడు మా నాన్నను తిట్టాలా సుజాత అని నాకు పేరు పెట్టినందుకు

  25. అయ్యో సుజాత గారూ, అదేం కాదండీ! కూడలిలో “సుజాత”అన్న పేరుతో ప్రస్తుతానికి నేనొక్కదాన్నే రాస్తుంటాను వ్యాఖ్యలు! ఆ వ్యాఖ్యలు రాసింది నేను అనుకుంటారేమో అని వివరణ ఇచ్చానంతే! మీ వ్యాఖ్యలు మీరు రాయొచ్చు!

  26. అపాత్ర దానం అనే మాటలు యాంకర్ చెప్పిన పాయింటాఫ్ వ్యూలొ అర్థం లేదని కన్ ఫర్మ్ చేసుకున్నాను. పాత్రత అంటే అర్హత లేని వారికి చేసే దానమే అపాత్ర దానం! అయితే అది యాంకర్ గారిసొంత పైత్యమే అన్నమాట.

  27. తెలియని విషయాలజోలికి ఎందుకు వెళ్ళడం ఈ ఏంకర్లు?


Leave a reply to Praveen స్పందనను రద్దుచేయి

వర్గాలు