అదేంటో.. కొన్ని సార్లు, కొన్ని అచ్చిరావు కొంతమందికి. చిరంజీవి లాంటి స్టార్ కి కూడా ఈ అచ్చిరాకపోవడం తప్పలేదు. చిరంజీవి సినిమాల్లో చూస్తే సింహం అన్న పేరు- డైరెక్ట్ గా గానీ, ఇన్ డైరెక్ట్ గా గానీ, ఇంకోరకంగా కానీ ప్రస్తావించిన ప్రతీసారీ దెబ్బే తగిలింది. ఆఖరికి కొదమ సింహం లాంటి మంచి సినిమాకి కూడా ఈ దెబ్బ తప్పలేదు.
ఒకసారి మీరే చూడండి-
-సింహపురి సింహం (ఫ్లాప్)
-కొదమసింహం (ఇది నా ఫేవరెట్ సినిమా..యవరేజ్ గా ఆడింది)
-మృగరాజు (డిజాస్టర్)
సింహాలొక్కటే కాదు, పులులు కూడా అంతే …
-పులి (చిరంజీవి సినిమా పాతది)
-పులి బెబ్బులి (ఫ్లాప్)
ఇంకా చెప్పాలంటే “పులిరాజు” అనేది ఆరాధన సినిమాలో చిరంజీవి పాత్ర పేరు. భారతీరాజా తీసిన ఈ సినిమా తమిళం లో హిట్టయింది. మరి తెలుగులో – “అరె ఏమయిందీ..” అంటే… మళ్ళీ దెబ్బపడింది.
ఈ నేపథ్యం లో చిరంజీవి వారసుడిగా చరణ్ ని పరిచయం చేస్తున్న మొదటి సినిమా పేరు చిరుత అనగానే – టైటిల్ బాగున్నప్పటికీ సెంటిమెంటు పరంగా దెబ్బతింటుందేమోనని కొంతమంది ఫ్యాన్స్ అప్పట్లో టెన్షన్ పడ్డారు. చిరుత కలెక్షన్స్ పరంగా “ప్రాఫిట్ వెంచరే” కానీ ఇటు ప్రేక్షకుల్ని కానీ అటు ఫ్యాన్స్ ని కానీ సాటిస్ఫై చేసిన సినిమా కాదు.
మరి ఇన్ని సెంటిమెంట్ల మధ్యలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా పేరు “పులి” …ఏమవుతుందో చూడాలి..ఈ సారయినా ఈ సెంటిమెంట్ బ్రేకవ్వాలనే ఆశిద్దాం.
దీనికి కాంట్రారీ గా బెబ్బులి పులి, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, (స్నేహం కోసం లో చిరంజీవి పాత్ర పేరు సింహాద్రి. మరి ఆ సినిమా హిట్టా అంటే హిట్టే కానీ…అలాగే గంగోత్రి లో అల్లు అర్జున్ పేరు కూడా సింహాద్రే) సింహాద్రి -ఇవన్నీ హిట్లే- ఒక్క సీమ సింహం తప్ప. మరి బాలయ్య నెక్స్ట్ ఫిల్మ్ “సింహా” ఏమవుతుందో చూడాలి 🙂
బాగుంది మీ అనాలిసిస్…
By: రవి చంద్ర on 2009/12/08
at 11:13 ఉద.
భలే కనిపెడతారే ఇలాంటి విషయాలు ! 🙂
By: sowmya on 2009/12/08
at 2:11 సా.
🙂 🙂
By: venkataramana on 2009/12/08
at 2:26 సా.
“లంకేశ్వరుడు” లో కూడా పులి నో , చిరుత నో పెంచుతుంటాడు, అది కూడా అట్టర్ డమాల్!
By: కోర్రమట్ట on 2009/12/08
at 5:06 సా.
>>చిరుత కలెక్షన్స్ పరంగా “ప్రాఫిట్ వెంచరే” కానీ ఇటు ప్రేక్షకుల్ని కానీ అటు ఫ్యాన్స్ ని కానీ సాటిస్ఫై చేసిన సినిమా కాదు.<<
I can't agree with this. అది నిజం కాదు. ఏదో ఒక క్షణంలో చిరుత సినిమాలో ఇంకా ఏదో వుంటే అని అనిపించిన మాట వాస్తవమే కాని, బెస్ట్ ఇంట్రడక్షన్ మూవీ ఫర్ స్టార్ హిరో సన్ గా చరిత్రలో నిలుస్తుంది. పూరీని ఎంచుకోవడం చాలా మంచి నిర్ణయం. పూరీపై వుంచిన నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. చరణ్ కు వున్నా స్కిల్స్ ను బాగా చూపించడంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
మీరన్న పై మాట నిజం అయితే,
ఫస్ట్ మూవీలో ఇంకా ఎక్సపేట్ చేయడం ప్రేక్షకులు, అభిమానులు తప్పు తప్ప, సినిమా తప్పు కాదు.
By: a2zdreams on 2009/12/08
at 7:53 సా.
మీరన్న పై మాట నిజం అయితే,
ఫస్ట్ మూవీలో ఇంకా ఎక్సపేట్ చేయడం ప్రేక్షకులు, అభిమానులు తప్పు తప్ప, సినిమా తప్పు కాదు…>>
hmm..సరే..ఒక చిన్న విషయం చెబుతాను..ఆ మధ్య పందెం కోడి రిలీజయిన కొత్తలో..ఒక ఫ్రెండ్ అన్నాడు సినిమా చూస్తూ..(అప్పటికింకా రాం చరణ్ ఇంట్రడక్షన్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా జరగలేదు)..”బాసూ..ఏమి స్టోరీ బాసూ..ఈ స్టోరీ ఒక పెద్ద హీరో కొడుక్కి ఇంట్రడక్షన్ మూవీ గా పడితే అరాచకం గా హిట్టయ్యేదసలు..చిరంజీవి కొడుకు debut movie కి ఇలాంటి కథ పడితే 50 కోట్లు (అప్పటికి 50 కోట్లే పెద్ద టార్గెట్ తెలుగు సినిమాకి) కలెక్ట్ చేసేది సులభంగా”. నిజమేనేమో. చిరుత లో “షోకేస్” చేసిన డ్యాన్స్, ఫైట్లు అన్నీ ఉండి కథ కూడా పందెం కోడి లాంటిది పడి ఉంటే అలాగే జరిగేదేమో. సరే, ఆ పందెం కోడి సంగతి ప్రక్కన పెడితే “కహో నా ప్యార్ హై” లాగా ఒక సెన్సేషన్ ని ఎక్స్పెక్ట్ చేసారు చాలా మంది. కాబట్టి చిరుత డబ్బులు కలెక్ట్ చేసినా, “చిరు”తనయుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళలో చాలా మందిని “సాటిస్ఫై” చేయకుండానే పంపించింది.
By: mohanrazz on 2009/12/08
at 8:59 సా.
i agree with you. movie is not upto most people expectations !
By: a2zdreams on 2009/12/08
at 9:49 సా.
kodamasimham average? first time i am hearing this………………..
By: vinay chakravarthi on 2010/01/11
at 12:32 సా.
పులి సెంటిమెంట్ ఏమో గాని, ఈ “పులి” సినిమా కి రెహమాన్ సెంటిమెంట్ పని చేసేలా ఉంది. ఇప్పటి వరకు రహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన స్ట్రైట్ తెలుగు సినిమా ఏదీ కూడా హిట్ అవలేదు.
By: రామ on 2009/12/17
at 9:40 ఉద.