వ్రాసినది: mohanrazz | 2011/08/06

ఒకే సినిమా – రెండు క్లైమాక్సులు !

2D
ఒకే సినిమా – రెండు క్లైమాక్స్ లు అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి-1)ఒకే కథ కి రెండు రకాల ముగింపులు ఇచ్చి ఆ రెండూ అదే సినిమా లో చూపించే సినిమాలు అని 2) ఒక సినిమా కి ఒక ఏరియా లో ఒక క్లైమాక్స్ ఇంకో ఏరియా లో ఇంకో క్లైమాక్స్ చూపించి ఆ రకంగా రెండు క్లైమాక్స్ లు కలిగిన సినిమాలు అని.

నిజానికి ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్ లో ఈ టెక్నిక్ (ఒకే కథకి రెండు రకాల లేదా అంతకంటే ఎక్కువ ముగింపులు ఇవ్వడం అనేది) కొంత విరివి గానే ఉంది. కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లోనూ అలా చూపించినట్టు చదివాను. అయితే ఇంకో రకం సినిమాలు ఉన్నాయి. 12B అని వచ్చిన తమిళ్ సినిమా (దీనికి ఆధారం స్లైడింగ్ డోర్స్ అంటారు )లాంటి సినిమాల్లో “ఒకే కథ కి” రెండు క్లైమాక్సులు అన్నట్టు కాకుండా సినిమా మొదటినుంచీ రెండు కథలు నడుస్తూ ఉంటాయి ప్యారలల్ గా. ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం లో హీరో కి రెండురకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడినుంచీ కథ రెండుపాయలు గా విడిపోతుంది. హీరో ఒక నిర్ణయం తీసుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక కథ. అది కాకుండా రెండో నిర్ణయం తీసుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది అనేది ఇంకో కథ. ఈ రెండూ ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి. కాబట్టి క్లైమాక్సులూ రెండు రకాలుగా ఉంటాయి. ఇదింకోరకం అన్నట్టు. ఇప్పుడు కిక్ లో రవితేజ పక్కన సెకండ్ హీరో గా చేసిన శ్యాం మొదటి సినిమా ఇది. సిమ్రన్, జ్యోతికలు హీరోయిన్లు.

పైన చెప్పిన రెండూ కాకుండా, సేం సినిమా కి ఒక్కో చోట ఒక్కో క్లైమాక్స్ ఉండే ఉదంతాలు కొన్ని ఉన్నాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దళపతి. తమిళ్, తెలుగు వెర్షన్స్ లో మమ్ముట్టి ని విలన్స్ చంపేస్తే రజనీ కాంత్ వెళ్ళి, తన స్నేహితుణ్ణి చంపినందుకుగానూ విలన్స్ మీద పగ తీర్చుకుంటాడు. ఇదే సినిమా మళయాళ వెర్షన్ కి వచ్చేసరికి, విలన్స్ మమ్ముట్టిని కాకుండా రజనీకాంత్ ని చంపేస్తే మమ్ముట్టి వెళ్ళి విలన్స్ ని చంపేస్తాడు. మమ్ముట్టి చనిపోయి, రజనీ బతికితే మముట్టి ఫ్యాన్స్ హర్ట్ అవుతారమ్మా! నిజానికి ఈ రోల్ మమ్ముట్టి కంటే ముందు మణిరత్నం చిరంజీవి ని అడిగితే, చిరంజీవి ఒప్పుకోలేదట. అయితే మణిరత్నం కూడా స్టోరీ ని పూర్తి డిటెయిల్డ్ గా చెప్పకుండా రజనీ మెయిన్ హీరో, మీరు సెకండ్ హీరో అని చెప్పాట్ట చిరంజీవితో. అక్కడికీ చిరంజీవి, “ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేయము కేవలం తమిళ్ లో మాత్రమే తీస్తామని హామీ ఇస్తే చేయడానికి అభ్యంతరం లేద”ని చెప్పాట్ట. అయితే ఈ సినిమా ని మిస్ అయినందుకు తనకేమీ రిగ్రెట్స్ లేవని చిరంజీవి, చిరంజీవి ఒప్పుకోకపోయినా చిరంజీవి కన్సర్న్స్ తనకు అర్థమయ్యాయని మణిరత్నం చెప్పుకొచ్చారు. బహుశా చిరంజీవి తో గనక తీసి ఉంటే తెలుగులో కూడా రజనీ ని చంపేసి చిరంజీవిని బతికించి ఉండేవారేమో 🙂

దళపతి విషయం లో అయితే ఒక భాష లో రజనీ పెద్ద హీరో, ఇంకో భాష లో మమ్ముట్టి పెద్ద హీరో కాబట్టి సరిపోయింది. అదే ఇద్దరూ ఒకే భాషలోని పెద్ద హీరోలైతే ? ఇలాంటి సమస్య ఒక మళయాళ సినిమాకి వచ్చింది. మోహన్ లాల్, మమ్ముట్టి, జూహీ చావ్లా నటించిన ఒక సినిమా ఉంటుంది “హరికృష్ణన్స్” అని. ఫాజిల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 1998లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఫాజిల్ “ఇండియా టుడే” లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సినిమాకి రెండు క్లైమాక్స్ లు వుంటాయి అని అన్నాడు. నేనింకా ఒకే కథకి రెండు రకాల ముగింపులు ఇచ్చి ఫాజిల్ ఏమైనా టాలెంట్ చూపించాడేమో అనుకుని గుర్తుపెట్టుకుని మరీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక వెతికి మరీ రివ్యూ దొరకపట్టి చూస్తే- “ఈ సినిమా లో మోహన్ లాల్, మమ్మూట్టి ఇద్దరి పేర్లూ హరికృష్ణన్ ఏ. ఇద్దరూ లాయర్సే. జూహీ చావ్లా కి సంబంధించి ఏదో కేస్ లోనుంచి బయటపడేస్తారు. చివరికి జూహీ చావ్లా ఎవరిని పెళ్ళి చేసుకోవాలి? అనేది క్లైమాక్స్. జూహీ చావ్లా టాస్ వేస్తుందట. ఆ టాస్ లో మోహన్ లాల్ ని పెళ్ళి చేసుకోవాలన్నట్టు వస్తుంది. ఇది ఒక క్లైమాక్స్. ఇంకో క్లైమాక్స్ లో మమ్ముట్టిని చేసుకోవాలన్నట్టు వస్తుందిట”. హి హి హి 😀 . ఇవన్నమాట రెండు క్లైమాక్స్ లు. ఉత్తర కేరళనో, దక్షిణ కేరళనో ఒక భాగం అంతా మోహన్ లాల్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ జూహీని తను చేసుకుంటాడు. రెండో భాగం లో మమ్ముట్టి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ మమ్ముట్టి చేసుకుంటాడు. అయితే అప్పట్లో ప్రేక్షకుల్ని మతప్రాతిపదిపకన ఈ సినిమా విడగొట్టిందనే విమర్శ కూడా వచ్చింది. మమ్ముట్టి టాస్ గెలిచినట్టు చూపించిన ఏరియాలన్నీ ముస్లిం జనాభా ఎక్కువున్న ఏరియాలు. మోహన్ లాల్ గెలిచినట్టు చూపించిన ప్రాంతాలన్నీ హిందువులు ఎక్కువున్న ఏరియాలు. ముస్లిములంతా మమ్ముట్టి ఫ్యాన్సనీ, హిందువులంతా మోహన్ లాల్ ఫ్యాన్సనీ దర్శకనిర్మాతలు చూపించడం దారుణమనీ, నిజానికీ రెండు మతాల్లోనూ ఇద్దరికీ ఫ్యాన్స్ ఉన్నారనీ కొంతమంది విమర్శకులు గోల చేసారు.

ఇదండీ మన దక్షిణభారతదేశం లో రెండు క్లైమాక్స్ లు ఉన్న సినిమాల గొడవలు..!


స్పందనలు

  1. కొంపదీసి kirkit (Mumbai Vadapav VS Hyderbadi biriyani) కూడా ఇలాంటి సినిమానేనా?

    • ha ha 😀

      అంటే హైదరాబాద్ లో హైదరాబాద్ వాళ్ళు గెలిచినట్టు, ముంబై లో అక్కడి వాళ్ళు గెలిచినట్టు చూపిస్తారనా.. 🙂 ఏమో మరి?

  2. interesting information..!

  3. “ప్రేమ” అని వెంకటేష్ గారి సినిమా విడుదలైన రొజే చూసి ఆ ట్రాజిక్ ఎండింగ్ ను తిట్టుకున్నాం.తరువాత 2,3 రోజుల్లో అనుకుంట క్లయిమాక్స్ మార్చేసి హిరొయిన్ బ్రతికినట్లు చూపిస్తూ మరో కపీ తీసి వదిలారు.అది బాగా ఆడిందప్పుడు.మీ టపా టైటిల్ కు ఈ విషయం కూడా సరిపోతుందేమో ..

    • అవునా? ప్రేమ సినిమాకి పాజిటివ్ క్లైమాక్సా? నేను తర్వాతెప్పుడో టివి లో చూసానీ సినిమాని. ట్రాజిక్ క్లైమాక్సే ఉంటుంది. ఇలా సినిమా రిలీజయ్యాక జనాలకి నచ్చలేదని క్లైమాక్స్ మార్చిన మరో సినిమా “రౌడీ దర్బార్” అని దాసరి సినిమా. సాయికుమార్, విజయశాంతి ఉంటారీ సినిమాలో.

  4. మీకు తెలీదేమో .. ‘లగాన్’ లండన్‌లో రిలీజ్ చేసినప్పుడూ అదే చేశారు .. అందులో క్లైమాక్స్‌లో బ్రిటిషర్స్ గెలుస్తారు 😀

  5. abrakadarba garu,

    mari apudu emavutundi ?

  6. upendra(my fav star) movie named “Superstar”(2002) had Four Climaxes.
    “http://en.wikipedia.org/wiki/Super_Star_(2002_film)”


Leave a reply to sujata స్పందనను రద్దుచేయి

వర్గాలు