వ్రాసినది: mohanrazz | 2011/11/13

లేడీ డిటెక్టివ్…అమ్మో :-)

ఈటీవీ మొదలైన కొత్తలో మొదలైందనుకుంటా ఈ సీరియల్. సినీ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో టివి సీరియల్..అందులోనూ టైటిల్ లేడీ డిటెక్టివ్ అని విని ప్రతి ఎపిసోడ్ ఒక అన్వేషణ సినిమా లాగా ఉంటుందేమోనని ఎక్స్‌పెక్ట్ చేసా. మొదటి ఎపిసోడ్ చూడగానే మ్యాటర్ అర్థమైంది. ఆ డిటెక్టివ్ గారి బుర్రనుపయోగించడం గట్రా ఏమీ ఉండవు, స్కూటీ వేసుకొని అనుమానితుల్నందరినీ ఫాలో అయి ఆమె అన్నిటినీ కనిపెట్టేస్తుందని. వంశీ మీద అభిమానం తో ఒకట్రెండు ఎపిసోడ్స్ చూసా కానీ చూసిన ప్రతి ఎపిసోడ్ లోనూ గూబ పగలగొట్టడం తో మానేసా. ఆ తర్వాత వంశీ కూడా ఆ సీరియల్ ని డైరెక్ట్ చేయడం మానేశాడు, వేరే ఎవరో డైరెక్ట్ చేసారు.

అయితే ఈ సీరియల్ కి టైటిల్ సాంగ్ ఒకటి వచ్చేది-
లేడీ డిటెక్టివ్,
అమ్మో యమ యాక్టివ్..
….
అటెంటివ్, క్రియేటివ్, సజెస్టివ్..

 

ఎస్పీబీ పాడాడనుకుంటా. వ్రాసిందెవరో తెలీదు (సుమనో కాదో ఐడియా లేదు) . మొదట్లో పాట వింటే బానే ఉందే అనిపించేది. అయితే “సజెస్టివ్” అనే పదానికి అప్పుడు నాకు మీనింగ్ తెలీదు. సజెషన్ అంటే సలహా కాబట్టి, సజెస్టివ్ అంటే సలహాలిచ్చే గుణముండడం అయివుండొచ్చనుకున్నాను. బహుశా గీతరచయిత కూడా అలా అనుకునే వ్రాసాడనుకుంటా ఆ పదాన్ని 😀 . తర్వాతెప్పుడో సజెస్టివ్ మీనింగ్ తెలిసింది. మరి పాట వ్రాసినాయన తెలిసే అలా వ్రాసాడో తెలీక వ్రాసాడో తెలీదు. గీతరచయిత అనేవాడు ఒక ఇంగ్లీష్ పదాన్ని వాడేటపుడు కనీసం ఒకసారి డిక్షనరీ తెరిచి అర్థాన్ని సరిచూసుకోవడానికి కూడా బద్దకిస్తే ఇలాగే జరుగుతుంది. శ్రీ శ్రీ గారి పాట లో వ్యాకరణపరమైన ఒక చిన్న పొరపాటు దొర్లిందంటే అర్థముంది. వేటూరి గారు కొన్ని కారణాల వల్ల నేతాజీ కి సంబంధించిన ఒక విషయం లో పొరబడ్డారంటే అక్కడ అవకాశం ఉంది. కానీ లేడీ డిటెక్టివ్ గీతరచయిత కి డిక్షనరీ తీయడానికి కుదర్లేదంటే అది ఏ రకంగానూ జస్టిఫై చేసుకోదగ్గది కాదు.

 

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఒక్కోసారి ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ ఉత్తర వేసుకునే డ్రస్ లు చూసినపుడు లేడీ డిటెక్టివ్ నిజంగానే సజెస్టివ్ అనిపించేది 😀 .


స్పందనలు

  1. జురాన్ గారు, బాగున్నాయండీ మీ బ్లాగులు.
    రచయితకు తెలిసినా తెలియకపోయినా వంశీ గారికి తెలీదని నేననుకోను. వంశీ గారి హీరోయిన్లలో సజెస్టివె కాని వారెవరు? ఏదో వ్యాసంలో చదివాను(లయతో సంభాషణ అనుకుంటా). హీరోయిన్ మేకప్, కాస్ట్యూంస్ విషయంలో వంశీ గారు చూపిన అటెన్షన్ స్చ్రీన్ మీద బాగా వచ్చిందని. (నిజంగానే దొంగరాముడు అండ్ పార్టీ లో లయ కాస్ట్యూంస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.)
    మీ వ్యాసం విషయానికి వస్తే టైటిల్ సాంగ్లో సజెస్టివ్ ఉండడం సబబేనా? నేనైతే మీతో ఏకీభవిస్తాను.

    • యాక్టివ్, క్రియేటివ్, అటెంటివ్, అని డిటెక్టివ్ కి సంబంధించిన గుణగణాల్ని వర్ణిస్తూ పాట వ్రాయడానికి ప్రయత్నించిన లిరిసిస్ట్ సజెస్టివ్ అనే పదానికి మీనింగ్ తెలిసి వాడి ఉంటాడని నేననుకోడం లేదు. కాకపోతే “ఇంకోరకంగా” ఆ మీనింగ్ కరెక్టై లిరిసిస్ట్ కి అలా కలిసొచ్చిందన్నమాట!

  2. 🙂 పాత రోజులను గుర్తు చేసారు. ఉత్తర వేసుకునే డ్రస్సులు suggestive(సరసమైన) గా నే ఉండేవి. తరువాత, నరేష్ సరసన కొన్నిలో బడ్జెట్ సినిమాలలో కూడా సజెస్టివ్ దుస్తులే వేసుకుంది 🙂

    • నరేష్ తో కలిసి నటించిన సినిమా ఏదో ఉన్నట్టు లీల గా గుర్తొస్తోంది కానీ సినిమా పేరేంటో అస్సలు గుర్తురావట్లేదు.

    • సజెస్టివ్ అంటే నేరస్తులకి సలహా ఇవ్వడం. నేరస్తులు డైరీలు వ్రాసుకోకూడదనీ, వ్రాసినా అవి లాకర్ లో పెట్టి తాళం వేసుకోవాలనీ. ఈ మాత్రం తెలుసుకోవడానికి ఆ సీరియల్ చూడడం అవసరమా?

  3. నేను కూడా ఆ సీరియల్ చూసాను. కొన్ని ఎపిసోడ్ లలో మరీ హాస్యాస్పదంగా డైరీలు చదివి తెలుసుకుని అదొక గొప్ప పరిశోధన అనుకుంటుంది డిటెక్టివ్.

  4. ఆ serial మేమూ చూసేవాళ్ళం. గొప్ప హాస్యాస్పదంగా ఉండేది.
    అయినా ఉత్తర వేసుకున్న బట్టలు “సరసమైనవే” (చవుకబారు) లెండి.
    పాత రోజులు గుర్తు తెచ్చారు….thanks

    • మంచి పదప్రయోగం చేసారు!

      • మిగితా తొక్కలో సీరియల్స్ కంటే ఆ సీరియల్ బెటరే. ఆ సీరియల్ ని ఉత్తమమైన తొక్కలో సీరియల్ అనొచ్చు.

    • ఆడవాళ్ళని ఆకర్షించడానికి ఈ సీరియల్ తీశారు కానీ ఈ సీరియల్ లో ఆడ పాత్రలని ఏమంత గొప్పగా చూపించలేదు. ప్రధాన పాత్ర అయిన డిటెక్టివ్ పాత్రని కూడా గొప్పగా చూపించలేదు.

  5. ఇంకో గొప్ప జోక్ ఏమిటంటే బాబీ, జూబాబీలు అమాయకులు అని తెలిసి కూడా వాళ్ళని అసిస్టెంటులుగా పెట్టుకోవడం.

    • హ హ..బాగా ఫాలో అయినట్టున్నారు 🙂
      అమాయకుల పేరిట వాళ్ళ మీద చేసే కామెడీ కూడా అబ్బో..కేక..

      • దెయ్యం కేసులు డీల్ చెయ్యడానికి కూడా వాళ్ళని పంపించడం ఇంకా పెద్ద జోక్.

        • 😀 అవునా ఈ ఎపిసోడ్ నేను మిస్సైనట్టున్నాను…కేక కామెడీ మిస్సయ్యా నా లైఫ్ లో అయితే! 🙂

          • అది గొప్ప సీరియల్ కాదని తెలిసినా ఏదో కామెడీ కోసం చూసేవాడిని. నేను కూడా కొన్ని ఎపిసోడ్స్ మిస్సయ్యాను. అప్పట్లో నేను స్టూడెంట్ ని కావడం, వేరే పనులు ఉండడం వల్ల.

    • ha ha….ప్రవీణ్ గారికి బాబి, జూబాబి లు గుర్తు ఉన్నారంటే, ఆయన ఎంత‌ serious గా ఆ serial ని follow అయ్యేవారనే విషయం అర్థమవుతోంది.

      • yeah..నాకూ సాక్షి రంగారావు గారి వరకూ గుర్తొచ్చారు కానీ ఆ పాత్రల పేర్లు కూడా గుర్తు రావడమంటే..నిజంగా ఆశ్చర్యపరచిన విషయమే!

      • జూబాబీ పిల్లాడిలా చిల్లర పనులు చేస్తూ ఇది నా వీక్నెస్ అనడం కూడా గుర్తుంది. ఒకసారి రెస్టారెంట్ లో కస్టమర్లు తింటుండగా వాళ్ళ ప్లేట్ల నుంచి ఫుడ్ లాక్కుని తినేసి అది కూడా తన వీక్నెస్ అంటాడు. ఆ కస్టమర్లు బిల్ బాబీ, జూబాబీలకి కట్టమంటారు, అప్పుడు బాబీ బిల్ కట్టలేక పప్పు రుబ్బుతాడు, జూబాబీ పక్కనే కూర్చుని బాబీని వెటకారం చేస్తాడు.

  6. మీరు అమృతం సీరియల్ పైన కూడా రివ్యూ వ్రాస్తే బాగుంటుంది. నేను మొదటి నుంచి చివరి వరకు చూసిన సీరియల్ అది.

    • ప్రవీణ్, అమృతం సీరియల్ ని మొదట్లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చూసా నేను..చాలా బాగుండేది..ఐతే సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేసాడా ఎపిసోడ్స్ ని. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ బోర్ కొట్టడం వల్లా ప్లస్ ఇతర కారణాల వల్లా చూడటం వీలు పడలేదు…

      • అమృతం నాకు మాత్రం బోర్ కొట్టలేదు. విష్ణు వర్ధన్ నటించిన ఎపిసోడ్స్ నాకు బాగా నచ్చాయి.

  7. నేను “ఇది కథ కాదు” అనే సీరియల్ పై పెద్ద రివ్యూ వ్రాసాను. చదవండి: http://sahityaavalokanam.net/?p=308


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: