వ్రాసినది: mohanrazz | 2012/11/13

ఈగ సినిమాలో నాకో డౌట్.. :)

దర్శకధీర రాజమౌళి తీసినీ ఈగ సినిమా కి మొదట్రోజునే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మూడున్నర కి తక్కువ (అవుటాఫ్ ఫైవ్) ఎవ్వరూ రేటింగ్ ఇవ్వలేదు.

ఎన్టీయార్, ప్రభాస్, రాం చరణ్ ల కి సూపర్ స్టార్ డం తెచ్చిన రాజమౌళి ఆ తర్వాత సునీల్ ని పెట్టి హిట్టుకొట్టాడు, మర్యాద రామన్న ద్వారా. స్టార్స్ లేకుండా కూడా కేవలం తన దర్శక ప్రతిభతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన రాజమౌళి ని ఎవరైనా “సునీల్ కూడా స్టారే కదయ్యా, అందులోనూ సునీల్ కూడా డ్యాన్సులు ఇరగదీసాడు” అని ఎవరైనా అన్నారో ఏమో అన్నట్టుగా నెక్స్ట్ సినిమా కి గ్రాఫిక్స్ ఈగ ని హీరో గా పెట్టేసాడు. అఫ్ కోర్స్ సమంత, సుదీప్ ఉన్నారనుకోండి. కానీ ఏ మాట కి ఆ మాట చెప్పుకోవాలి- రాజమౌళికి ఎక్కడ ఎమోషన్ ని పైకి తీసుకెళ్ళాలో ఎక్కడ ప్రేక్షకుణ్ణి లీనం చేయాలో ఆ టెక్నిక్ బాగా తెలిసిపోయింది..నాని ఈగ గా పుట్టే సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరే అందుకు నిదర్శనం..

సరే, విషయానికి వద్దాం. నాని ఈగ గా మారి సమంత సాయం తో సుదీప్ మీద పగ తీర్చుకోడానికి ట్రై చేస్తున్నట్టు సుదీప్ కి తెలిసాక, సుదీప్ వచ్చి సమంత ని తీసుకెళతాడు.. ఈగ కూడా సుదీప్ కి దొరికిపోతుంది..అప్పుడు సుదీప్ ఈగ ని టార్చర్ చేస్తుంటే సమంత “ఈగ ని చంపొద్దు” అని సుదీప్ ని ప్రాధేయపడుతూంటుంది. అయినా వినకుండా సుదీప్ సూది తో ఈగ ని గ్రుచ్చి, టార్చర్ చేస్తుంటాడు..సమంత ఏడుస్తూనే ఉంటుంది… నేను సినిమా ని క్యాజువల్ గానే చూస్తున్నా..రంధ్రాన్వేషణ చేయాలనే ఉద్దేశ్యం నిజ్జంగా అస్సలు లేదు నాకు..కానీ చిన్న డౌట్ వచ్చింది నాకు..”అసలు సమంత అంత ఏడవాల్సిన అవసరమేముంది?, ఒకవేళ సుదీప్ ఈగని చంపేసినా, మళ్ళీ గంటలో ఈగ గా పుట్టి మళ్ళీ రావచ్చుగా..మళ్ళీ వచ్చి, సుదీప్ మీద పగ తీర్చుకోడానికి మళ్ళీ ట్రై చేయొచ్చు…..ఒక వేళ మళ్ళీ చంపితే, మళ్ళీ పుట్టి మళ్ళీ ట్రై చేయొచ్చు..సుదీప్ చచ్చిపోయేలోపు అలా పగ తీర్చుకోవచ్చు.., , ఆ మాత్రానికి ఎందుకు అంత టెన్షన్ అవడం.. :)”


స్పందనలు

  1. సినిమా ని సినిమా గానే చూడాలని మంచు విష్ణు గారు సెలవిచ్చారు :))

    • మీ కామెంట్ బాగుంది..కాకపోతే విష్ణు గారరలా చెప్పారని తెలీక నేను సినిమాని టివి లో చూసానే 🙂

  2. తరువాతి జన్మలన్ని ఈగ అవ్వాలని గ్యారంటీ ఎం ఉంది? రాజమౌళి లాజిక్ సరిగ్గానే ఉంది,
    ఎలా అంటె మనిషి చనిపొయాక ఆ తరువాత ఎదొ ఒక రూపం లో ఇంకొక జన్మ ఎత్తుతాడు అనుకుంటే అది తన కధకి తగ్గట్టు ఈగ ని పెట్టుకున్నాడు, ఇది కూడా ఎందుకంటే అసలు ఈగ అనే చిన్న కీటకం మనిషి మీద పగ తీర్చుకొవడం అనేది ఆధారంగా తీసాడు కాబట్టి. సో ఈగ అంటే తరువాతి జన్మ ముందే నిర్ణయం ఐపొయింది, కాబట్టి ముందు జన్మనే ‘నాని’ గా మలుచుకున్నాడు.

  3. మళ్ళీ బ్రతుకుతుందని ఈగకే తెలియదుగా!

  4. సమంత ఏడవకపోతే ఎమోషన్ పండదుగా? ఎమోషన్ పండకపొతే ఆడవాళ్ళూ,ఫ్యామిలీ ఆడియన్సూ సినిమా చూడరుగా.ఆ సినిమానే లాజిక్ కి అందని సినిమా.ఇంక దానిలో మళ్ళీ లాజిక్ ఎక్కడ వెతుకుతాములే.

  5. ఇలాంటిది నాకు మర్యాదరామన్నలో ఒకటొచ్చింది. మళ్ళ సూరి రామును చంపడానికి పైన మాడీ మీద రూముకు తీసుకెళతాడు. ఆ రూములోకి వెళ్ళిన తర్వాత తాళమేసేసి, తాళంచెవిని వంచేస్తాడు.

    తాళం చెవిని వంచేస్తే, రాముని చంపిన తర్వాతైనా బయటికి ఎలా వస్తాడు?

    • తాళం వంచడం తోనే వాడెంతటి బలవంతుడో తెలుస్తోంది, అలాంటి వాడికి తలుపు గొళ్ళెం విరగ్గొట్టడం పెద్ద విషయం కాదు.
      అసలు అక్కడ టార్గెట్ వాడు తర్వాత బయటకి ఎలా వస్తాడు అనేది కాదు :-), హీరో పొరపాటున కూడ బయటకి తప్పించుకు పారిపోకుండా ఉండడానికి.. హీరోని చంపడమే టార్గెట్ తప్ప బయటకి ఎలా రావాలి తాళం వేసి జేబులొ పెట్టుకోవాలా అటక మీద పెట్టాలా అన్నది ఆ పాత్ర ఆలొచిస్తే చూసేవాడికి చికాకుగా ఉంటుంది

  6. మీరు మళ్ళీ వ్రాస్తున్నందుకు thanks. మీ టపాలు చాలా informative with sense of humour. Thanks again.

  7. మళ్లీ పుడతాడని అప్పటికామెకి తెలీదు కదా. కాబట్టి సమంత ఏడవొచ్చు, ఎనిమిదవొచ్చు 🙂 రాజమౌళిని ఇంకో రకంగా కూడా సమర్ధించుకురావచ్చు. సమంత లాంటి సున్నితమైన అమ్మాయి ముందు ఓ జీవిని అలా చిత్రహింసలు పెడుతుంటే తను అలాగే ప్రవర్తిస్తుంది – even if she knew he’ll be back again.

    నాకు వేరే రంధ్రాలు కనపడ్డాయి. చిన్న చిన్నవే; కథకి అడ్డం తగిలేవి కాదు. వాటిలో ఒకటి:

    సుదీప్ కార్ యాక్సిడెంట్ అయ్యాక ఈగ వెళ్లి విండ్‌షీల్డ్ మీద ‘I will kill you’ అని రాస్తుంది. ఎక్కడ? కారు లోపల. ఎలా రాస్తుందయ్యా అంటే – కారు బయట విండి్‌షీల్డ్‌ని కప్పేసిన రంపం పొట్టు లాంటి పదార్ధాన్ని తుడిచివేయటం ద్వారా. ఈగ లోపల కూర్చుని బయటున్న రంపం పొట్టుని తుడిచేయటం ఎలా సాధ్యం? He’s not certainly outside, because we see the shot from Sudeep’s POV, and we see the fly’s back – not his belly.

    Btw, ఈగ గుడ్డులోంచి బయటికొచ్చే సన్నివేశం మరీ cheesy గా రూపొందింది. Looks like they did this in a hurry. అదొక్కటీ తీసేస్తే మిగతా చోట్ల CGI work ప్రశంసనీయంగానే ఉంది.

    • అబ్రకదబ్ర గారు, ఈగ రాసేది కారు బయట కాదు, అదీ రంపం పొట్టు తుడపడం ద్వారా రాయదు. కారు స్కిడ్ అయినపుడు పొగవచ్చి అద్దాలకు లోపల వైపు అంతా మసిపట్టేస్తుంది ఆ మసిని లోపలవైపునుండే తుడపడం ద్వారా రాస్తుంది. తర్వాత వచ్చే సీన్స్ లో ఒకచోట సైక్రియాట్రిస్ట్ అదంతా నీ భ్రమ అని చెప్పినపుడు సుదీప్ యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళి కారు అద్దాన్ని చూస్తాడు అపుడు ఆ మసిని చెరిపి రాసి ఉండడం మనం స్పష్టంగా గమనించవచ్చు. రంపంపొట్టు తుడిపినదైతే అక్కడ కనిపించదు కదా.

      • అక్కడ స్కిడ్డింగ్ ఏమీ జరగలేదు కదా. కారులో పొగొచ్చినట్లు కూడా లేదు …. వస్తే ఈగ సంగతేమో కానీ సుదీప్ ఉక్కిరిబిక్కిరయ్యుండాలి. అలా ఏం చూపించలేదు కదా. అంత కనిపించని పొగనుండి అద్దం ఎలా మసిబారుతుంది? ఒకవేళ మసి థియరీ సరైనదే అనుకుందాం. లోపల మసి తుడిచేసినా, బయట అద్దమ్మీద రంపం పొట్టు అలాగే ఉంది కదా. అందులోంచి వెలుతురు లోపలకి రావటం ఎలా సాధ్యం? 😉

        ఈ కన్నం సంగతి వదిలేద్దాం. ‘జులాయి’లో ఇంతకంటే విచిత్రాలు గమనించాను. బ్యాంక్ రాబరీ చెయ్యటానికి బిట్టూ & కో భీభత్సకరమైన ప్లాన్ వేస్తారు. హాలీవుడ్ సినిమాల స్థాయిలో దాన్ని స్టైలిష్‌గా అమలు కూడా చేస్తారు. ఇంతా చేసి చివరికి వాళ్లా డబ్బెలా బయటికి తీసుకొచ్చారయ్యా అంటే – బయటినుండి పెద్ద రెకింగ్ బాల్‌తో బ్యాంక్ లాకర్ రూం పగలగొట్టి! అంతోటి దానికి ఇంత బిల్డప్ ఎందుకు? ఆ పనేదో డైరెక్టుగా చెయ్యొచ్చు కదా. పది నిమిషాల సినిమా నిడివి దండగ.

        ఇంకా ఇదే సినిమాలో – హీరో, విలన్ ఇద్దరూ అత్యంత తెలివితేటలు గల వాళ్లు. అంత తెలివిగల విలన్ మరి బ్యాంకు దోపిడీకి పోతూ పోతూ దారిలో లిఫ్ట్ అడిగిన గన్నాయిని ఎక్కించుకోవటమేంటో? ఆ ఎక్కిన గన్నాయి .. ‘నేను తెలివిగలవాడిని’ అని అనౌన్సుచేసేటన్ని తెలివితేటలున్న హీరోగారు .. ఎవడికిబడితే వాడికి ‘నేను క్రికెట్ బెట్టింగ్ చెయ్యటానికి వెళ్తున్నానహో’ అని అడ్రస్‌తో సహా టముకు వేసేయటం ఏమిటో?? అవతలోళ్లు మఫ్టీలో ఉన్న పోలీసులు కావచ్చు కదా. ఇలాంటి సిత్రాలు జులాయిలో బోలెడు.

        క్లైమాక్స్‌లో ఇంకో విచిత్రం. ‘ఈ సాయంతం వైజాగ్‌లో తొలి దీపం వెలిగేటప్పటికి నీ చెల్లెలి దీపం ఆరిపోతుంది’ అని విలన్ అంటే ఆ ముక్క పట్టుకుని తన చెల్లెల్ని లైట్ హౌస్ దగ్గర చంపేయబోతున్నారని విశ్లేషిస్తాడు మన హీరో! ‘తొలి దీపం వెలిగేలోపు’ అన్నాడే కానీ ‘తొలిదీపం వెలిగేచోట’ అనలేదు కదా విలన్. సో హీరోగారి తెలివితేటలన్నీ అదృష్టమ్మీదా, కోఇన్సిడెన్సెస్ మీదా ఆధారపడి ఉన్నాయన్న మాట. (తొలిదీపం అంటే లైట్ హౌస్ అనే అనుకుందాం మాటవరసకి. As far as I know, lighthouses operate day and night – flashing light every so and so seconds. There are exeptions: like some automated lighthouses, and some that turned into museums. Let’s assume Vizag lighthouse falls in this category and so Trivikram is right about his ‘first lamp that comes up in Vizag’)

        ఈ గోలంతా ఎందుకంటే .. త్రివిక్రం వంటి తెలివిగల రచయిత పంచ్‌ల మీద, ప్రాసల మీద కన్నా facts మీద దృష్టి పెడితే ఇంతకన్నా మంచి సినిమాలు తీయగలడని.

        But at the end, who cares? త్రివిక్రమే అన్నట్లు: ‘జనాలకి మ్యాజిక్కులతోనే కానీ లాజిక్కులతో పనిలేదు’.

  8. మనకు అత్యంత ఆప్తులు చస్తే, మళ్ళీ పుడతారని తెలిస్తే, వాళ్ళు చిత్రవధ తో చస్తూండటం చూసి, “ఆ ఎలాగూ మళ్ళీ పుడతారు కదా, ఎమోషనల్ గా ఫీల్ అవడం ఎందుకు” అని అనుకోవడం సాధ్యమా??? ఈ pov లో ఆలోచించండి.

  9. asalu eega ga chanipoyina nani malli eega ga ne enduku puttali. malli nani ga putti sudip ni chamesi samantha ni pelli chesuko vachhuga.

    • మిష్టర్ ప్రతాప్ వర్మ అప్పుడు నాని వయస్సు 21 అయితే సమంతా వయస్సు ఏ 41 ఓ అవుతుంది నాయనా…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: