ఇంజనీరింగ్ చదివేటప్పుడు విన్న జోక్ ఇది.
యు.ఎస్. లేదా యు.కె. ఎక్కడో – ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రిలీజైందిట. జనాలు విరగబడి చూస్తున్నార్ట. ఒక పిసినారి పెద్దాయన కూడా ఈ టాక్ విని ఆ సినిమా చూద్దామని వెళ్ళాట్ట.
అయితే తను వెళ్ళేసరికే సినిమా మొదలైపోయింది. టికెట్ తీసుకున్నాక థియేటర్ “బాయ్” ఒకబ్బాయి ఆ పెద్దాయన్ని సీట్లో కూర్చోబెట్టడానికి టార్చ్ పట్టుకుని ఆయనతో పాటే వచ్చి ఆయన్ని తన సీట్లో కూర్చోబెట్టాట్ట. ఆ పెద్దాయన ఏదైనా “టిప్” ఇస్తాడేమోనని కాసేపు అక్కడే నిలబడి వెయిట్ చేసాడుట ఆ బాయ్. అయితే ఆ పెద్దాయన -ఇంకా నిలబడి ఉన్నావేంటి అన్నట్టు చిరాగ్గా మొఖం పెట్టి “వాట్ ఎల్స్” అన్నాట్ట. ఆ బాయ్ కి కడుపు మండి..కాస్త వంగి ఆ పెద్దాయన చెవిలో అన్నాట్ట –
“సర్ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ బ్లూ కోట్ వేసునుకి ఒకాయన నిలబడి ఉన్నాడు..చూసారా..”
“ఊ..”
“ఆయనే ఈ సినిమాలో విలన్”..అని చెప్పేసి జారుకున్నాట్ట ఆ బాయ్.
ఆ మధ్య “గుప్త్” సినిమా అప్పుడు ఒక ఫ్రెండ్ మొదట్రోజే చూసి వచ్చి అన్నాడు..”భలే తీశాడ్రా డైరెక్టర్..క్లైమాక్స్ దాకా కాజోలే విలన్ అని అస్సలు గెస్ చేయలేం” ఇంకేం చూస్తాం సినిమాని. తలాష్ ఇవాళ రిలీజ్. ఎలా ఉందో సినిమా అని రివ్యూలు చూసా. ఒకరేమో 4.5 ఒకరేమో 2.5. అయితే ఎవ్వరూ రివ్యూ లో పెద్దగా స్టోరీ రివీల్ చేయకుండా చక్కగానే వ్రాసారు..కానీ పొరపాటున రివ్యూ కింద వ్రాసిన యూజర్ కామెంట్స్ చదివేసా…ఛస్..ఇంక సినిమా చూసేటపుడు థ్రిల్ ఏముంటుంది…
మోహన్ గారూ నాకూ ఓ జోక్ గుర్తొస్తోంది.
రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి కదా…
అలాగే ఏదో ఓ రామాయణం సినిమా మీద ఓ తెలుగు పత్రికలో రివ్యూ రాశారట.
రివ్యూలో పూర్తి కథ చెప్పకూడదన్నది ఒక నియమం కదా…
పాపం ఆ ప్రకారమే ఒకాయన రివ్యూ రాశాడట.
” ఈ సినిమా కథ చాలా గొప్పగా ఉంది. రాముడు సీత పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల అడవికి వెళ్తారు. సీతను రావణుడనే రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. ఇంతకీ రావణుడు సీతను ఎత్తుకెళ్లడానికి కారణం ఏమిటి….? రాముడు సీతను తెచ్చాడా లేదా..? రాముడిపై రావణుడు గెలిచాడా, లేదా..? అన్నది…ఈ చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే” అని రాశాడట. పాపం. ఐనా ఆయన తప్పేముంది. కథలోని సస్పెన్స్ చెప్పకూడదు కదా….
By: చందుతులసి on 2012/12/01
at 9:31 సా.
LOL.. 🙂
By: mohanrazz on 2012/12/03
at 6:41 ఉద.
గుప్త్ సినిమాలో మా కజిన్ నన్ను బ్లాక్ మెయిల్ చేసి చివరకు కాజోల్ అని చెప్పేశాడండి. తలాష్ అలాంటిదయితే రివ్యూలు చూడను.
By: రవి on 2012/12/03
at 8:46 సా.
ee cinema publicity kosam Amir khan kinda meeda paddappude anukunna..idi fat ani.
By: Gopinath Kothamasu on 2012/12/18
at 7:23 సా.
yep..they tried to make another 6th sense…but failed miserably..
By: mohanrazz on 2012/12/18
at 7:33 సా.