వ్రాసినది: mohanrazz | 2012/12/18

హిట్టా ఫట్టా ? చిరంజీవి మాటల్లోనే హింట్: నాయక్

ఆ మధ్య మగధీర ఆడియో ఫంక్షన్ అవగానే ఇలాంటి హెడ్డింగ్ తో ఒక పోస్ట్ వేసాను. లింక్ ఇక్కడ.

ఇక నిన్నటి ఆడియో ఫంక్షన్ లో ఏం మాట్లాడాడు అన్నది చర్చించే ముందు చిరంజీవి మాట్లాడిన ఇటీవలి ఫంక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఆ మధ్య చిరంజీవి పంజా ఆడియో ఫంక్షన్ “స్కిప్” చేసినరోజే ఒక ఫ్రెండ్ తో కాంఫిడెంట్ గా చెప్పా – ఈ సినిమా కూడా షెడ్ కే అని. అదే జరిగింది. కొమరం పులి, పంజా లాంటి ఫంక్షన్ లకి హాజరయి, వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడే అవసరాన్ని చిరంజీవి బాగానే తప్పించుకున్నాడు. అయితే ఆరంజ్ సినిమాకి మాత్రం ఆడియో ఫంక్షన్ కి హాజరై కూడాసినిమా గురించి మాట్లాడకుండా – అప్పటి రోశయ్య ప్రభుత్వం “చిరంజీవి బ్లడ్ బ్యాంక్” కి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం గురించి మాట్లాడేసి ఆడియో బాగుందని హ్యారిస్ జయరాజ్ ని మెచ్చేసుకుని మమ అనిపించాడు.

అయితే రచ్చ ఫంక్షన్ అప్పుడు మళ్ళీ పాజిటివ్ టోన్ లోకి వచ్చాడు. సినిమా కథ ఎక్సలెంట్ అని గానీ సంపత్ నంది కేక అని గానీ అనకుండా..”ఆరంజ్” లో మిస్సయిన కమర్షియల్ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయనీ, ఆ రకంగా ఇది తప్పకుండా అభిమానుల్ని అలరించే సినిమా అవుతుందనీ..హిట్ అవుతుందనీ..అన్నాడు. గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కి వచ్చినపుడు మాత్రం బాగా పొగిడేసాడు..ఖచ్చితంగా ఇది కెవ్వు కేక అనిపించే సూపర్ హిట్ అవుతుందని ఆడియో రోజునే తేల్చేసాడు. ఇక నిన్న నాయక్ ఫంక్షన్ కి చిరంజీవి రాలేదని ముందు చెప్పగానే సినిమా మరో బద్రినాథ్ అయి వుంటుందని ఫిక్స్ అయ్యా. కానీ ఆన్ లైన్ లో వచ్చి మరీ మాట్లాడాడు చిరంజీవి. సినిమా లో చరణ్ డ్యాన్సులు ఇరగదీసాడని అన్నాడు. ఫైట్స్, కామెడీ, పెర్ఫార్మెన్స్ అన్నీ బాగా కుదిరాయనీ అన్నాడు. రచ్చ సూపర్ హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అనీ అన్నాడు.

అయితే చిరంజీవి మాటలని బట్టి అర్థమయ్యింది ఏమిటంటే – ఇది కాస్త రొటీన్ కథాంశమే అయినప్పటికీ “కొంచెం” (మరీ ఎక్కువ కాదు) వైవిధ్యమైన సన్నివేశాలతో, పాటలు, ఫైట్లు, కామెడీ, డైలాగులతో సాగే సినిమా. ఖచ్చితంగా రచ్చ కంటే పెద్ద హిట్ అయ్యే సినిమా. కానీ నేను ఒక పర్టికులర్ మాట చిరంజీవి అంటాడేమోనని వెయిట్ చేసాను. మగధీర అప్పుడు రాజమౌళి ని నంబర్ 1 డైరెక్టర్ అని డిక్లేర్ చేసినట్టు – “వివి వినాయక్ మళ్ళీ తన నంబర్ 1 స్థానాన్ని (లేదా అగ్ర స్థానాన్ని) నిలబెట్టుకుంటాడు” – ఈ తరహా లో ఏదైనా డైలాగ్ అంటాడేమోనని చూసా..కానీ ఆ తరహా ప్రస్తావన తీసుకురాకపోవడం వల్ల ఇది మగధీర స్థాయి సినిమా అయితే ఖచ్చితంగా అవదు అని అర్థమయింది. అయితే చిరంజీవి అనుభవం మేరకు సినిమా జడ్జ్ మెంట్ దాదాపు పెర్ఫెక్ట్ గానే ఉంటుంది కానీ ఒక్కోసారి తన జడ్జ్ మెంట్ కూడా తప్పవచ్చు. ఒక వేళ సీతమ్మ వాకిట్లో సినిమా మరీ కొత్తగా ఉండి జనాలకి సడన్ గా ఫార్ములా సినిమాల మీద చులకన అభిప్రాయం కలిగించే రేంజ్ లో ఉంటే – ఆ ప్రభావం నాయక్ మీద పడవచ్చు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే – హం ఆప్కే హై కౌన్ లాంటి కొన్ని సినిమాలు రిలీజ్ అయినపుడు దేశవ్యాప్తంగా ఇలాంటి “మూడ్ స్వింగ్” జరిగింది. సమర సింహారెడ్డి తరవాత అప్పటికి కొంచెం “క్లాస్” బాట పట్టిన తెలుగు అగ్ర హీరోలు మళ్ళీ మాస్ సినిమాలు చేయాల్సి వచ్చింది. అయితే సీతమ్మవాకిట్లో కి ఇంత మూడ్ స్వింగ్ చేసే కెపాసిటీ ఉందా అన్నది డౌటే..

ఓవరాల్ గా నా అంచనా ప్రకారం -బహుశా – మగధీర > గబ్బర్ సింగ్ > నాయక్ > రచ్చ – ఈ స్థాయి లో ఉండొచ్చేమనని నా డౌట్.

243nayak


స్పందనలు

 1. మోహన్ గారూ,
  ఆ కార్యక్రమంలొ జరిగిన ఒక విషయాన్ని ప్రస్తావించకుండా వదిలెశారు.
  కొణిదెల రాంచరణ్ తెజ ఒక dialogue చెప్పాడు, దాన్ని విశ్లెషించాల్సిన అవసరం ఎంతైనా వుందంటాను.
  **మా నాన్న తర్వాత నేను కాదు…మా బాబాయి**
  డబ్బా కొట్టుకొకపొతే అది సినెమా industry కాదు……
  కాని ఈ dialogue జీర్ణించుకొలెక, చేసేది ఎమీ లేక విజ్ఞులైన మీ స్పందన కొరుతున్నా.

  చిరంజీవి ఏంత మంచి నటుడైనా కొన్ని విషయాల్లొ, ఆయన తీసుకొన్న నిర్ణయాలు అంత ఆదర్శప్రాయమైనవి అని నేను అనుకొను.
  ఓక్క విషయం మాత్రం ఖచితం గా చెప్పదలుచుకున్నా, క్యారెక్టర్ విషయం లొ పవన్ తర్వాతే చిరంజీవి.

 2. your dedication in movie industry amazes me, you are a keen observer and good presenter. Your posts prove the point that if you love doing some thing your results will be lovely.

 3. […] హిట్టా ఫట్టా అనె గెస్ చేస్తూ గతం లో కొన్ని పోస్ట్స్ వేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: