ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు తెలుగు సాహితీప్రియులకి సుపరిచితమే ! అల్పమైన పదాల్లో అనల్పమైన భావాల్ని చెప్పే ఆ పదాలని హై-స్కూల్ రోజుల్లో ఓ గురువుగారు పరిచయం చేసారు నాకు. అప్పుడు చదివిన వాటిలో కొన్ని ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయాయి….అలా గుర్తున్నవి ఒకట్రెండు ఇక్కడ-
తెల్లవాడయ్యేది
నల్లవాడయ్యేది
కాటినొకటే బూది
ఓ కూనలమ్మ
కోర్టునెక్కినవాడు
కొండనెక్కినవాడు
వడివడిగ దిగిరాడు
ఓ కూనలమ్మ
ఇలాగే ఇంకొకటి –
చెట్టు ఇంటికి శోభ
బొట్టు పడతికి శోభ
…………….. (ఇక్కడ మూడో లైను నాకు గుర్తుకు రావట్లేదు)
ఓ కూనలమ్మా!
అయితే ఇందులో మాత్రం “బొట్టు పడతికి శోభ” బదులుగా “బెట్టు పడతికి శోభ” అని ఉంటే ఇంకా బాగుండేదని ఆరోజుల్లో నాకనిపించి మా గురువుగారికి చెబితే “వెధవా” అని నవ్వుతూ అన్నాడే తప్పించి బాగుందని కానీ బాగోలేదని కానీ అనలేదు 😀 .
సరే ఎలాగూ కూనలమ్మ పదాలు గుర్తొచ్చాయి కదా…ఒకట్రెండు మన తెలుగు సినీ నేపథ్యం లో మనమూ ట్రై చేద్దామనిపించి….
బాలప్రేమికుల వెతలు
ఫ్యాక్షనిస్టు పగలు
మన కథ ముడిసరుకులు
ఓ కూనలమ్మ
ప్రాస కోసం పాట్లు
నానా అగచాట్లు
తెనుగు పాటకి తూట్లు
ఓ కూనలమ్మ
కొత్త కథలు కరువు
పాత రీమేకుల దరువు
పరాయిభాషల అరువు
ఓ కూనలమ్మ
ఒకే ఒక్క హిట్టు
కోట్లకై దర్శకుడి బెట్టు
అందితే జుట్టు
ఓ కూనలమ్మ
ఒక్క ఐటెం సాంగు
ప్లేస్‌మెంటే రాంగు
బాక్సులు బూమెరాంగు
ఓ కూనలమ్మ
ప్రయత్నం మంచిదే కానీ, అందులో కొన్ని అర్థ రహితంగా ఉన్నాయి. కూనలమ్మ పదాలకీ ఒక చందస్సు వుంది.
అవి –
మొత్తం నాలుగు పాదాలు ( ఆఖరి మకుటంతో కలిపి )
అంత్య ప్రాస తప్పనిసరి.
పాదానికి 10 అక్షరాలు మించి ఉండరాదు.
ఇవన్నీ మీరు రాసిన వాటికి అమలుపరిచి చూస్తే తప్పులు మీకే తెలుస్తాయి.
By: Brahmanandam on 2009/09/28
at 3:13 ఉద.
థ్యాంక్సండీ.. ఈసారి మీరు చెప్పినట్టు ఛందస్సు సహితంగా వ్రాసి మీముందుంటాను….ముందు కేవలం కూనలమ్మ పదాలని పరిచయం చేస్తూ టపా వ్రాద్దామనే మొదలెట్టాను. అయితే సగం పోస్ట్ రాసాక “మనమూ ట్రై చేద్దాం సరదాగా..” అనే ఒక దురద బయలుదేరింది..అలా సరదాకి, అప్పటికప్పుడు వ్రాసినందువల్ల తపులు దొర్లాయి. అయితే కేవలం సరదాకి వ్రాసినవి అన్న ఒక్క కారణం చేతైనా ఈ సారికి క్షమించేసేయగలరు.. 🙂
మిస్సైన అంత్యప్రాసల్ని, పది అక్షరాలు మించినవాటిని లైట్ గా మార్చాను 🙂
By: mohanrazz on 2009/09/28
at 8:53 ఉద.
ఏవో సరదాగా చేసే ఇలాంటి ప్రయత్నాల్లో ఛందస్సులెందుకండీ? 😀
By: గీతాచార్య on 2009/09/28
at 8:35 ఉద.
‘లెస్సు’ (less) పలికినా.. లెస్స పలికితిరి.. 🙂
By: mohanrazz on 2009/09/29
at 1:48 సా.
😉 nice one
By: nelabaludu on 2009/09/28
at 12:37 సా.
మీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడె తెలిసింది. బాగా రాశావు. నాకు నచ్చాయి.
By: sri on 2009/09/28
at 5:20 సా.
ధన్యుణ్ణి 🙂
By: mohanrazz on 2009/09/29
at 1:49 సా.
బాగా రాసావయ్య మోహనా…నీలొ గొప్ప టాలెంట్ వుంది..మా స్నేహితుడు సినిమా తీద్దామనుకుంటున్నాడు..సొ నీతొ టచ్ లో వుంటా బాస్..
By: chandra on 2009/09/28
at 9:25 సా.
sure..అయినా..ఆయనెవరో చెప్పండి- నేనే టచ్ లో ఉంటా 😀
By: mohanrazz on 2009/09/29
at 1:43 సా.
బావుందండి మీ కూనలమ్మ సినిమా పాట. మీరిలా సినిమాల మీద పేరడీ పాటలు రాసి రాసి ఒక పుస్తకమే అచ్చు వేయించేలా ఉన్నారే చూస్తూవుంటే…….ఫ్రీ కాపీ మాకు ఒకటి ఇవ్వండేఁ!!!!
రెండు రోజుల క్రితం TV లో ఠాగూర్ సినిమా వచ్చింది. అందులో చివరి సీను లో చిరు, “ఎచ్చట నా దేశ ప్రజలు భయం లేకుండా ఉంటారో…” అని రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత మొదలెట్టేసరికి నాకు నవ్వాగలేదు సుమండీ….నేను ఎందుకు అలా నవ్వుతున్ననో అర్థం కాక మా ఇంట్లో వాళ్ళు తెల్లమొహాలు వేసారు 😀
By: sowmya on 2009/09/29
at 10:07 ఉద.
పేరడీ పాటలు రాసి రాసి ఒక పుస్తకమే అచ్చు వేయించేలా ఉన్నారే చూస్తూవుంటే…….ఫ్రీ కాపీ మాకు ఒకటి ఇవ్వండేఁ>>
తప్పకుండా..నిజానికి అన్ని కాపీలు ఫ్రీగానే ఇచ్చేలా ప్లాన్ చేస్తా 🙂
By: mohanrazz on 2009/09/29
at 1:44 సా.
మరీ అంత దయార్ద్రహ్రుదయమైతే మేము తట్టుకోలేము…వద్దులెండి, కొన్ని అమ్ముకుని, కొన్ని మాకు ఫ్రీ గా ఇవ్వండి 😀
By: sowmya on 2009/09/29
at 2:43 సా.
బాగుంది. 😀
By: VenkataRamana on 2009/09/29
at 10:34 ఉద.
thx 🙂
By: mohanrazz on 2009/09/29
at 1:48 సా.