వ్రాసినది: mohanrazz | 2009/10/22

బాణం- ఓ నాలుగు ముక్కలు

baanam1

ఈ సినిమాకి మొదటి హీరో గంధం నాగరాజు- డైలాగ్ రైటర్. కేక పెట్టించాడు కొన్ని డైలాగుల్లో అయితే. రెండో హీరో- మణి శర్మ. ఇంత మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలం లో చూడలేదు. ఇక మూడో హీరో చైతన్య. దర్శకుడు. ఈ సినిమా మీద ఆల్రెడీ చాలా సమీక్షలు, చాలా చర్చలు నడిచాయి, కాబట్టి ఇప్పుడు కొత్తగా పూర్తిగా తీరిగ్గా సమీక్షించే ఓపిక లేదు కానీ – ఓ నాలుగు ముక్కలు.

మన తెలుగు సినిమాల్లో ఆల్రెడీ “పలుమార్లు” చూసిన థ్రెడ్స్:
 
గ్లాడియేటర్, వర్షం లాంటి సినిమాల్లో విలన్ తన తండ్రిని చాటుగా చంపితే, ఈ మధ్య వచ్చిన మగధీర లో అనుచరుల ఎదుటే తండ్రిని చంపేస్తాడు విలన్. బాణం లో నూ విలన్ ఇంట్రడక్షన్ ఇదే. తండ్రి ని చంపేసి-బాబాయి ని తరిమేసి-ఆ కుర్చీ తన సొంతం చేసుకుంటాడు. 

 రెండోది. ఒక అమ్మాయి కి (హీరోయిన్) హీరో ఆశ్రయమిస్తాడు. కొన్ని పరిస్థితుల తర్వాత- హీరోయిన్-హీరో-రౌడీ థ్రెడ్ వర్షం, ఒక్కడు లో, పోకిరి, నేనింతే- మొదలు పెట్టి ఈ మధ్య చాలా సినిమాల్లో వస్తున్న థ్రెడ్ ఇది. 90ల్లో హీరో చెల్లెల్ని చంపేయడం అనే థ్రెడ్ ని అరగదీసినంత గా ఇప్పుడు ఈ హీరో-హీరోయిన్-విలన్ థ్రెడ్ ని చితక్కొట్టేస్తున్నారు.

మూడోది -సినిమా టెంపో మొత్తాన్ని ఒక్కదెబ్బతో నేలమీదకి లాగేసిన క్లైమాక్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్. క్లైమాక్స్ దాకా ఈ సినిమా ని ఒక తరహా లో నడిపి హీరో కి కొన్ని విలువలున్నట్టుగా చూపించి- చివరిలో బాగా రొటీన్ గా విలన్ వ్యాపారాలు దెబ్బతీయడం, విలన్ ని చంపివేయడం – ఈ థ్రెడ్ మరీ మూసలో ఉండటమూ, పైగా అప్పటిదాకా హీరో ప్రవచిస్తూ వచ్చిన విలువలకి వ్యతిరేకంగా ఉండటమూ సినిమాకి పెద్ద మైనస్.

సినిమా లో అసలేమీ లేకపోతే- ఈ మాత్రం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. సినిమా లో కొన్ని ఆసక్తిదాయకమైన థ్రెడ్స్ ఉన్నాయి. ఇవి కొత్తవి అని చెప్పను కానీ- ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో – కొంత ఫ్రెష్ గా ఉన్న అనుభూతినిచ్చాయి-

మొదటిది-హీరో తండ్రి పాత్ర ని ఒక లొంగిపోయిన నక్సలైట్ గా పరిచయం చేసే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. అయితే ఈ పాత్ర కథ కి ఆయువుపట్టుగా నిలవడానికి పెద్దగా ఉపయోగపడకపోయినా ఈ మధ్య కాలం లో వస్తున్న స్టీరియో టైప్ తండ్రి పాత్ర ల లేకుండా చేసి కొంత కొత్త ఫ్లేవర్ ఇచ్చింది సినిమాకి.  

రెండోది- హీరోయిన్ పాత్రని పరిచయం చేసిన తీరు, ఆ పాత్రకి ఉన్న సమస్య- ఆ సమస్య ని కొంచెం కొంచెం గా కాంప్లికేట్ చేసిన విధానం ఫ్రెష్ గా ఉంది.   

మూడోది- సినిమాని 1989 అనే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేం లో చూపించడం, రణ స్థలి అనే ఒక స్పెసిఫిక్ ప్రదేశం లో జరిగినట్టు చూపడం, ఒకట్రెండు డైలాగులు/పాత్రలపేర్లు/సన్నివేశాలు ఆ టైం ఫ్రేం ని/ ప్లేస్ ని జస్టిఫై చేసేలా ఉండటం- కొంత ఫ్రెష్ లుక్ ని ఇచ్చింది.

ఇక నాలుగోది- ఫైట్లు/ ఫైట్ కంపోజిషన్లు పెద్దగా ఏమీ తెరమీద చూపించకపోవడం వల్ల ప్రేక్షకుడికి ‘విసుగు తలెత్తకుండా’ జాగ్రత్త పడ్డారు.

అయితే సినిమాని మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం అంటూ చూపడం లో కూడా పెద్ద ప్రయోజనమేమీ లేదు కథకి- కేవలం “డైరెక్టర్ ఏదో కొంత వెరైటీ ట్రై చేస్తున్నాడు” అన్న ఫీలింగ్ తెప్పించడం తప్ప. 

నిడివి పరంగా చిన్నదే సినిమా. మొదట్లో కొన్ని సన్నివేశాల్లో టెంపో బాగా ఉండి చివరి ఇరవై నిముషాలు మరీ ప్రిడక్టబుల్ గా రొటీన్ గా ఉండటం సినిమాకి అతిపెద్ద మైనస్సైతే- ఫస్టాఫ్ లో ‘ఏం జరుగుతోందసలూ అన్న ఆసక్తి ని ప్రేక్షకుడిలో సక్సెస్ ఫుల్ గా కలగజేయగలగడం- ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్.

 కొంత విభిన్నంగా చూపించడానికి ప్రయత్నించిన మామూలు కమర్షియల్ సినిమానే ఇది. కొంతమంది వ్రాసినట్టు “పాత్ బ్రేకింగ్” మూవీ అయితే ఖచ్చితంగా కాదు. అదే సమయం లో ఒక సారి టైం పాస్ కి చూడదగ్గ కమర్షియల్ సినిమానే. మరి కొన్ని సైట్లలో అలా (కమర్షియల్ ఎలిమెంట్స్ లేని- ఆనెస్ట్ ఫిల్మ్) అని ఎందుకు వ్రాసారంటారా? రాజమౌళి కత్తి ఫైట్లు, పూరీ జగన్నాధ్ ఇడియట్ డైలాగులు మాత్రమే కమర్షియల్ ఎలిమెంట్స్ కాదు- ప్రేక్షకుడి “కొత్త ఫ్లేవర్” ఇచ్చేదేదైనా కమర్షియల్ ఎలిమెంటే అని ఆ రివ్యూ వ్రాసే సమయానికి స్ఫురించకపోవడం వల్ల అనుకుంటాను
                                                                                                                                             -జురాన్


స్పందనలు

  1. నాలుగు ముక్కలు బాగున్నాయి.

  2. సరే, మా గొప్ప నేను చెప్పేసుకోవాలిక్కడ! నాగరాజు ది మా వూరే! మా కాలేజీలోనే లెక్చరర్ గా పని చేస్తున్నారట(నేను చదివేటపుడు నా క్లాస్ మేట్ మాత్రం కాదు) ప్రముఖ్య రచయిత గంధం యాజ్ఞ్యవల్క్య శర్మ గారి అబ్బాయిట.అసలు గమ్యంలోనే కేకేంటి, విజిల్స్ వేయించేశాడుగా నాగరాజు!

    ఇక హీరో! నందమూర్ యువహీరోలందరికంటే బోల్డు అందంగా ఉన్నడు రోహిత్! ఒక పిడకలవేట…..మొన్న ఒక FM రేడియోలో ఒక పాపాయి “నార రోహిత్, నార రోహిత్” అని పదే పదే చెప్తోంటే మా ఫ్రెండ్ కి మండి పోయి “నార రోహిత్ , పీచు రోహిత్ ఏమిటే నీ పిండాకూడు”అని చివాట్లు పెట్టింది ఎదురుగా ఉన్నట్టు ఊ హించుకుని!

    • మీదేఊరో?

      • నరసరావుపేట్ అండీ.. బ్లాగ్ లోకం లో ఇన్ని రోజులనుండి వున్న మీకు మేము చెప్పడమా మళ్ళీ
        మీది విజయనగరం కదా!

        • అభిమాని గారు,
          మాది విజయనగరం కాదండీ! నరసరావు పేట. పేట్ కాదు….:-)

          • సరే “నరసరావు పేట”నే 😀 ..నేను సొమ్య గారిది విజయనగరం అని చెప్పాను అంతే..

      • సౌమ్య గారూ,

        నరసరావు పేటోళ్ళు చాలా మందే ఉన్నారు. అలా మా ఊరిగురిమ్చి తెలియకపోవటం పాపమ్ తెలుసా? 😉

        • బాబోయ్, నరసరావుపేట వాళ్ళ దాడి తట్టుకోలేకపోతున్నాం. ఇదెక్కడి గోలండీ బాబు 🙂
          @గీతాచార్యా
          నరసరావుపేట వాళ్ళు తెలియకపోవడం పాపమా!!!!
          మీరిలా మాట్లాడడం పాపం కాదూ?

          @అభిమాని
          బ్లాగు లోకం లో ఉంటే నరసరావుపేట వాళ్ళ గురించి తెలియలా?
          విజయనగరం వాళ్ళమయితే నరసరావుపేట వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలియాలా లేక అక్కడనుండి వచ్చే రచయితల గురించి తెలియలా? ఇదెక్కడి లాజిక్కబ్బా!!!!

          • అభిమాని, ఊప్స్, సౌమ్య గారి వ్యాఖ్య చూళ్ళేదు నేను!

            సౌమ్య, జస్ట్ జోకండీ! నాగరాజు ది మా వూరు కాబట్టి ఏదో అభిమానం కొద్దీ చెప్పాను కానీ మా వూరు గురించి తెలియాలని రూల్లేదు. చెప్తే బాగుంటుందని నేను గీతాచార్య కల్సి బ్లాగు మొదలెట్టాం!

            • తెలుసండీ, నేను కూడా జోక్ గానే తీసుకున్నాను 😀

          • మనమేమైనా శ్రీకాకుళం నుండి వచ్చామా ప్రవీణ్ శర్మ గురుండి తెలుసుకోవడానికి అయినా అయన అల్ ఆంధ్రా ఫేమస్ కాలే! ఇదీ అలానే 🙂

    • ఈ సినిమాలో డైలాగులు చాలాచోట్ల అర్థవంతంగా ఉన్నాయి. హీరోయిన్ కి ఒక సమస్య వచ్చి, అది తీరుస్తాడనుకున్న తండ్రి కూడా చనిపోయి, తనకంటూ ఎవరు లేరు అన్న భావన కలిగినపుడు- తనతో రమ్మంటూ హీరో చెప్పే డైలాగ్:

      “మనవాళ్ళంటూ ఎవరూ లేనపుడు మనకోసం బ్రతికేదే జీవితం. మీకు జీవించాలని ఉంటే నాతో రండి”

      ఇలా ఆయా సన్నివేశాల్లో పండిన డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి.

      • అంతే కాదు, హీరోయిన్, హీరోని వాళ్ళది ఏ కులం అని అడిగినప్పుడూ, హీరో తండ్రి చెప్పే సమాధానం “300 యేళ్ళ బట్టి అడుగుతున్నారీప్రశ్నని, ఇంకా ఎన్నాళ్ళు అడుగుతారు” లాంటివి కూడా చాలాబాగున్నాయి.

    • మీ గొప్ప సరే! ఆయన మాకు లెక్చరర్, ఆపైన మా నాన్న గారికి స్టూడేంట్. మా నాన్నగారు నోట్స్ డిక్టేట్ చేస్తూ బైటకెళ్తే అప్పుడప్పుడూ నేను కూడా డిక్టేటే వాణ్ణి. He’s an excellent annotator, and brilliant lecturer. Class room teaching లో ఆయన టెక్నిక్ ని నేను ఉపయోగించి చాలా success అయ్యాను.

      అది సరే కానీ, ఎంత అయినా నాకీ సినిమా మాత్రం ఛస్తే నచ్చలేదు. ఏమిటో మరి హీరో పాత్రలో అంతలా ఇంటిగ్రిటీని దెబ్బదీశారు. ప్రధాన పాత్రలో ఇంటిగ్రిటీ లేందే ఎంత బాగున్నా ఏదో… it’s a waste without integrity

  3. agreed!

    • కె.మహేష్ కుమార్ ,

      thought of posting comment in one of your blog posts, unfortunately couldn’t with wordpress id.

      వర్డ్ ప్రెస్ ఐ.డి తో మీ బ్లాగులో కామెంట్స్ పోస్ట్ చేయలేమా సార్ ?

  4. ఈ సినిమా నేను చుడలేదు కాని, దాదాపు అన్ని రివ్యూలు చదివేసాను.
    కాని ఈ సినిమా promos లో చూపించున డైలాగ్సు చాలా బాగున్నాయి. అవి విని నేను బాగా impress అయ్యాను. మీరు చెప్పినట్టు నాగరాజు గారే హీరో అనుకుంటా ఈ సినిమాకి.

  5. మీ ముగింపు వాక్యాలు బాగున్నాయి 🙂

  6. Idiot is far better than this hero’s characterization. Lots of consistency. 🙂

  7. ఈ మధ్య పది నిముషాలు చూసిన తరువాత skip చెయకుండా చూడాలి అనిపించిన సినెమా ఇది.మాటలు నాకు అంత బాగ అనిపించలె గాని చాలా చాల neatగా తీసాడు.


వ్యాఖ్యానించండి

వర్గాలు